31, డిసెంబర్ 2011, శనివారం

సోలార్ కాంతులలో.. మా ఇల్లు



హాయ్..ఫ్రెండ్స్..బాగున్నారా!? నాకు కొంచెం అనారోగ్యం వల్ల ఇటు వైపు తొంగి చూడటం లేదు.
అలాగే పని ఒత్తిడి కూడా..

2011 కి వీడ్కోలు చెప్పటానికి సిద్ద పడ్డాం కదా!

కేలండర్ మారిపోతుంది. పేజీలు మాసిపోయి నెలల పుటలు వెనక్కి తిరిగి మనని ముందుకు తోస్తున్నాయి..ఆశ మరో సంవత్సరం లోకి మనని నెడుతుంది..

ఏమిటో..ఏదో చేయాలన్న తపన మాత్రం కాస్త నెరవేరి..మరి కాస్త నెరవేరక ..మబ్బు చాటు చందమామలా..దోబూచులాడింది.

అవసరం నెట్టిందో ఏమో.! లేదా కాస్త అవగాహన పెరిగిందో.. కానీ.. జ్ఞానం వైపు అడుగులు వేస్తున్నట్లు నేను..సహజ సిద్ద ఇంధన వనరులు వైపు దృష్టి పెట్టాను వెదకడం మొదలెట్టాను. రోజుకి ఏడు గంటల కరంటు కోతతో.. మా పనులకి చాలా కష్టం,నష్టం కూడా.. ఇన్వెర్టర్ వద్దనుకుని సొలార్ లైటింగ్ వైపు ఆసక్తితో.. ఇంటర్నెట్ సాయంతో..సమాచారాన్ని సేకరించాను. వారిని ఫోన్ లో కాంటాక్ట్ చెయ్యకుండానే లోకలే కదా..ఈజీగా కనుక్కోవచ్చు అని బయలుదేరి ..ఓ..గంట వెతుక్కుని ఎలాగోలా అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్లాను. ఎక్కడంటారా..!?

మా విజయవాడలోనే.. ! ఇతర దేశాలకి సోలార్ ఉత్పత్తులని ఎగుమతి చేసే "శ్రేష్టి మార్కెటింగ్ " వారిని సంప్రదించాను.
వారి ఉత్పత్తులని చూసి..నాకు కావాల్సిన సోలార్ లైటింగ్ సిస్టం ఎంపిక చేసుకుని వచ్చాను. శ్రేష్టి మార్కెటింగ్ వారు ..ఇంటికి వచ్చి సోలార్ సిస్టం ని ఏర్పాటు చేసి వెళ్ళారు.సోలార్ కాంతులలో.. మా ఇల్లు ధగ ధగ మెరుస్తూ..ఉంది.







ప్రకృతి నుండి సహజంగా లభించే వాటిని మనం ఉపగోగించుకోవడం మూలంగా.. విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చుని ,సమయాన్ని, సామాజిక వనరులని కూడా ఆదా చేయడంతో పాటు..మనకి కూడా విద్యుత్ బిల్లుల వడ్డింపు కూడా తగ్గుతుంది కదా!
ఇప్పుడు మా ఇంట్లో మూడు ..సోలార్ హోం లైటింగ్ సిస్టం ఏర్పరచుకుని ... ఆ కాంతిలో.. మా పనులు చేసుకో గల్గుతున్నాము. తర్వాత ఇంటి పూర్తి అవసరాలకి సరిపడా విద్యుత్ ని సూర్య రశ్మి ద్వారా పనిచేసేబాటరీ సాయం తో..ఏర్పాటు చేసుకోవాలన్న ఆసక్తి ఉంది.
ఒక్కో క సోలార్ లైట్ కి.. 4 ,200 రూపాయలు ఖర్చు అయినది. ఆన్ లైన్ ద్వారా ..ఇంకొక మూడువందల రూపాయలు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.





8 కామెంట్‌లు:

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

!!వనజ వనమాలి !! గారు మంచి విషయం చెప్పారు ధన్యవాదములు..

Praveen Mandangi చెప్పారు...

http://teluguwebmedia.in మీకు నూతన సంవత్సర స్వాగతం పలుకుతోంది.
-- ప్రవీణ్ శర్మ

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

కాంతులు వెదజల్లడానికి ఆదిత్యునికి,పవనుడు కూడా తోడయితే ఇంకా బాగుంటుంది కదా!solar+wind power కాస్త ధర ఎక్కువయినా ఇంకా బాగుంటుంది.

sarma చెప్పారు...

we are using solar lights since last six years

సుభ/subha చెప్పారు...

మంచి విషయం చెప్పారండీ.ధన్యవాదాలు..
నూతన సంవత్సర శుభాకాంక్షలండీ..

జయ చెప్పారు...

So nice. మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

సామాన్య చెప్పారు...

వనజ గారూ మీ సోలార్ లైటింగ్ ఇప్పుడెలా వుంది ?నాక్కూడా దీని పట్ల చాలా ఆసక్తి .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సామాన్య గారు.. సోలార్ లైట్ల పని తీరు చాలా బాగుంది. మా వర్క్ షాప్ లో లైట్స్ బాగున్నాయి. ఇంట్లో లైట్ కొంచెం ఇబ్బంది పెట్టింది కాని. ఇప్పుడు బాగా పని చేస్తుంది.
మా సొంత ఇంటి నిర్మాణం అప్పుడు.. ఇంటి మొత్తం కి సోలార్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. కేంద్ర ప్రభుత్వం నుండి సబ్సిడీ కూడా వస్తుంది..అని తెలిసింది. వివరాలు సేకరించాను. మీరు ప్రయత్నించండి అని అందరికి చెపుతున్నాను.ఈ కరంట్ కోతతో విసిగి ప్రత్యాన్మయం వెదుక్కుంటున్నారు. మంచి పరిణామం కదండీ. థాంక్ యు!