4, ఆగస్టు 2012, శనివారం

ఒక కథ గురించి... నా స్పందన




ఈ మధ్య ఆదివారం ఆంద్ర జ్యోతి ఆదివారం సంచికలో "కలాపి" కథ చదివాను. (జూలై 29)

అంతకు ముందు సంచికలో మన బ్లాగర్ (నీలాంబరి) శారద గారు వ్రాసిన "అందవిహీన "కథ ఒక ఉన్నత వ్యక్తిత్వాన్ని చాటితే..ఈ కథ స్త్రీ లో ఉన్న చపలత్వం ని చూపింది.

ఆ కథలో "కలాపి " ఆనే స్త్రీ గురించి చెప్పడమే ఈ కథ.

ఆ స్త్రీ అందమైనది. ఆ అందం వల్ల ఆకర్షితులైన ఎంతొ మందిలో కేవలం ఎనిమిది పురుషులు ఆమెని వివాహమాడారు. చిత్రంగా.. ఆమె భర్తలగా ఉన్న అందరు ఆమె కోరగానే విడాకులు ఇచ్చేసారు. ఎక్కడా ఎలాటి అభ్యంతరాలు లేకుండా ఆమె ఎనిమిదిమందిని వివాహమాడారు. డబ్బుతో లభించిన సర్వ సుఖాలని అనుభవించిన తర్వాత కూడా ఆమెకి తగిన సంతృప్తి , శాంతి లభించలేదని చెబుతుంది ఎప్పుడూ అన్వేషణ. ఏ మగవాడి దగ్గర తనకి కావలసినది ఏది దొరకలేదు అని చెపుతుంది. రోగ గ్రస్తమైన శరీరంతో.. మరణం కోసం ఎదురుచూస్తూ.. ఉంటుంది.

మనకి మనమే శాశ్వతం, ఐ యాం వాట్ ఐ యాం అంకుంటూ..తనకంటూ మిగిలింది అనుభవాలు మాత్రమే అని చెపుతుంది.

తనకి అనేక వివాహాలు ద్వారా లభించిన నగలు,కానుకలు ని సొమ్ముగా మార్చి శ్రీలంక దేశంలో యుద్దగాయాలతో బాధ పడుతున్న,లైంగిక హింసకి గురి అయిన వాళ్ళు,అనాధ శిశువులకి పునరావాసం కోసం ఖర్చు చేస్తున్నాని చెపుతుంది.

తనకన్నా పది పన్నెండు ఏళ్ల చిన్నదైన "లడ్డు" ఆనే స్నేహితురాలికి తన విషయాలన్నిటిని చెపుతూ.. తన మరణం తర్వాత ఆమెని ఆ బాధ్యతలు చూసుకొమ్మని చెపుతుంది.

అంతే కాకుండా.. జీవన ప్రయాణం లో జరిగిన వివాహాలతో సంబంధం లేకుండా తనకి స్నేహితుడిగా నిలిచిన ఓ..వ్యక్తిని పరిచయం చేస్తుంది. అతను ఆమె స్నేహితురాలు "లడ్డు" కి అన్నయ్య.

ఆఖరికి "లడ్డు" మెడపై "కలాపి" పుట్టుమచ్చ లాగా మిగిలిపోతుంది.

అందమైన స్త్రీ తన అందం తో..పురుషులని ఆకర్షించి ఎనిమిది మందిని వివాహమాడటం.. స్త్రీలలో మితిమీరిన స్వేచ్చకి అద్దం పడుతుందా? అలా అతి స్వేచ్చగా ఉండటాన్ని  ఈ కథ సమర్ధించి నట్లు అయిందా?

చలం రాజేశ్వరిని సృష్టిస్తే ..ఇప్పటికి సంప్రదాయవాదులు గగ్గోలు పెడుతున్నారు.

ఆఖరికి ఈ కథలో కలాపి..తన సంపదనంతా.. యుద్దగాయాలతో బాధపడేవారికి, లైంగిక హింసకి గురి అయిన వాళ్లకి చెందేటట్లు చేయడం చిత్రంగా లేదూ!

కథ అయినా సరే ..కలాపి లోని అతి స్వేచ్చ..ఇంకా చెప్పాలంటే విశృంఖలత్వం (లస్ట్) నాకు నచ్చలేదు. ఆఖరికి ఈ కథలో సందేశం యేమిటో కూడా నాకు అర్ధం అయి కానట్టు ఉంది.

"తన్హాయి" ని విపరీతంగా ద్వేషించిన వాళ్లకి ఈ కథ చదివితే ఏమనిపిస్తుందో!

ఈ కథలో  రచయిత్రి శైలి మాత్రం నాకు బాగా నచ్చింది. కలాపి వర్ణన అద్భుతంగా ఉంది.

బహుశా ..ఈ కథని ఆ శైలి మాత్రమే చదివించింది. వివాహంలో యేమి లేదు అని తెలుసుకోవడానికి  ఒక్క వివాహం చాలు, ఎనిమిది వివాహాలు అవసరం లేదు కదా .. అనిపిస్తుంది (అనిపించింది కూడా )

మీరు చదవండి..! ఏమనిపిస్తుందో ..మీరు చెప్పండి.

కలాపి కథ.. ఈ లింక్లో చదవండి.

7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మీతో నేను ఏకీభవిస్తున్నా

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

naaku yemi ardam kaalee

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

స్త్ర్రీ పరంగా చెప్పినా -
స్త్రీ పురుష సామాన్య పరంగా అన్వయించుకో వచ్చు .
అనిర్వచనీయమైన-కలాపి-అందాన్ని వర్ణించిన తీరు అనితర సాథ్యం .
కలాపి అనే పేరు పెట్టడం లోనే ఉంది ఆ గడుసు దనం .
అందంతో-వస్త్రాలతో-నగలతో ఈ శరీరాన్ని భూషించేది చివరికి శ్మశాన మృత్తికలో కలపటానికే - అనే సత్యం కూడా ఆమెకు తెలుసు .
ఐనా, శరీరం మీద - కోరికల మీదా తృష్ణ మనిషిని పతనావస్థకు చేరుస్తుందనేది మరోసారి రచయిత చెప్పదలచు కొన్న వాస్తవం కావొచ్చు .
కథాగమనంలో - ప్రసక్తానుప్రసక్తంగా - కథకురాలు కనబరచిన కౌశలం అబ్బుర పరుస్తూ ఉంది .
ఆసాంతం గుక్కతిప్పుకోకుండా చదివించిన - ఒక మంచి సందేశాత్మకమైన కథను రచించిన- కథకురాలికీ , అందించిన మీకూ అభినందనలు .
----- సుజన-సృజన

Meraj Fathima చెప్పారు...

వనజ గారూ, స్త్రీ విపరీత ధోరణి అనేది
ఓ విదమైన మానసిక రోగం అది జీవితం కాలి పోయిన తర్వాత వాస్తవం స్పురణకు వస్తుంది. జీవితం అంటే ఇంతేనా అనే వేదాంత దోరణిలో, ఆకరి క్షణాలలో ఏదో చేయాలని తపిస్తారు. కానీ చెలం గారి మైదానం లో స్త్రీ పాత్ర ప్రేమ జాడ్యంతో మగవాడికి దాసోహం అంటుంది. చివరివరకూ కూడా మీరాని, అమీర్నీ తప్పు పట్టని ప్రేమ మూర్తి రాజేశ్వరి. ఏదో కొత్తదనం వెతకటానికి స్త్రీ దిగజారదు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

""లడ్డు" మెడపై "కలాపి" పుట్టుమచ్చ లాగా మిగిలిపోతుంది."

తనకన్నా చిన్నదైనా "లడ్డు" అనే స్నేహితురాలికి తన జీవితం గురించి చెప్పటం,తన బాధ్యతలను అప్పగించటం స్నేహం గొప్పదనాన్ని తెలియచేస్తుందేమోనండీ..
మంచి కధను పరిచయం చేశారు..

Happy FriendShip Day..

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

మీకు స్నేహితుల రోజు శుభాకాంక్షలు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టేఫలె గారు..ధన్యవాదములు.
@ప్రిన్స్ గారు కథ ని మరొక సారి చదవండి. అర్ధం అవుతుంది
@వెంకట రాజారావు గారు.. కథ లో అద్భుతమైన వర్ణన ఉంది. ఆ వర్ణన నాకు నచ్చింది.
@మేరేజ్ ఫాతిమా గారు.. మీ వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తున్నాను. థాంక్ యు!
@ రాజీ గారు..స్నేహం కోణంలో ఈ కథ మీకు నచ్చినదుకు సంతోషం థాంక్ యు!
@రవిశేఖర్ గారు ధన్యవాదములు. మీకు కూడా మైత్రి దినోత్సవ శుభాకాంక్షలు.