పత్రికలలో వర్ధమాన రచయితల కథలు,కవితలు,వ్యాసాల ప్రచురణకు సంబంధించి అనేక విమర్శలు వినవస్తూ ఉంటాయి. అవి నిజం కూడా!
నిన్న పేస్ బుక్ లో ఒక ఫ్రెండ్ షేర్ చేసిన కవిత గురించి ఒకరి కామెంట్ " ఈ కవిత చాలా బాగుంది. ఇలాంటి కవితలు నవ్య లాంటి పత్రికలలో, మరికొన్ని పత్రికలలో కనిపించవు ఎందుకని..అని. "
"అదంతా ఓ..రాజకీయం.." అని నా వ్యాఖ్య.
నేను ఎంత విసిగి పోయాను అంటే.. నాలుగైదేళ్లుగా ఎంత సునిశితంగా పరిశీలించిన పిమ్మటనే నేను ఆ వ్యాఖ్య చేసాను. ఈ క్రింది విషయాలు చదివితే కొందరికైనా కొన్ని విషయాలు అవగతమవుతాయి ..అనే ఉద్దేశ్యంతో.. ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.
నిజంగా వర్ధమాన కవులకి రచయితలకి పత్రికలలో స్థానమే లేదన్నది.. నా అభిప్రాయం కూడా.
ఈ బ్లాగ్ ల పుణ్యమా అని అనేక మంది ఎంతో ఉత్సాహంగా వ్రాస్తున్నారు. ఆ రచనలలో ఎంతో పరిపక్వత,నవ్యత కనబడుతూ ఉంటాయి. అందుకు నిర్ధారణ ఏమిటంటే.. ఆ పోస్ట్ లకి లభిస్తున్న హిట్స్..ని తార్కాణంగా తీసుకోవచ్చు. బాగోక పొతే ఎవరు కావాలని అన్ని సార్లు చూడరు కదా!
ఇక పత్రికలో చూస్తే కొంత మంది రచనలకి మాత్రమే స్థానం కేటాయించినట్లు కనబడుతూ ఉంటుంది. ఒక పేరెన్నిక కల్గిన దిన పత్రిక సాహిత్యం కి సంబంధించిన పేజీలో కాని ,ఆదివారం అనుబంధం లో..కానీ..ఎక్కువ ఆ పత్రికలలో పనిచేసే వారి కవితలే దర్శనమిస్తుంటాయి లేదా...పాత తరం కవుల ఉనికి పదే పదే కనబడుతూ ఉంటుంది. ప్రముఖ పత్రికలలో కొత్త వారిని వేళ్ళ మీద లెక్కించవచ్చు. ద్వితీయ శ్రేణి లో ఉన్న పత్రికలలో ఎపుడో ఒకప్పుడు.. ఊపిరి పోసుకుని..అమ్మయ్య! మేము రచయితలం అని తృప్తి పడటం ,లేదా నిరాశ చెందటం వర్ధమాన కవుల పని.
సొంతంగా ఎవరు అచ్చు వేయించుకుని ఉచితంగా పంచగలరు చెప్పండి. ఉచితంగా ఇచ్చినా చదివే నాధుడే కరువయ్యాడు. ఇలాంటి దుస్థితిలో.. రచనలు అచ్చు వేయిన్చుకోవాలన్న దైర్యం ఎవరికీ ఉంటుంది?
వర్ధమాన రచయితలూ ఉత్సాహం కొద్ది వారి కథలు కాని కవితలు కాని పంపించడం జరిగితే.. వాటి అడ్రస్స్ ఉండదు. నెలలు తరబడి వేచి చూసినా.. రచనలు వెనక్కి తిరిగి పంపటం జరగదు. ఒక వేళ ఏ నక్కనో తొక్కి వెళ్ళిన రచన ప్రచురణకి నోచుకుంటే అది ప్రచురణకి అంగీకరించామని ఫలానా తేదీ నాటి పత్రికలో ముద్రణ గా రాబో తుందనే సమాచారం అందించడం,లేదా,,మెసేజ్ పాస్ చేయడం కూడా ఉండదు.
మొన్నీ మధ్య నాకు తెలిసిన ఆవిడ వ్రాసిన కవిత ముందుగా ఆంధ్రభూమి పత్రికలోను,ఆ తర్వాత నవ్య పత్రికలోను ఒకే కవిత ప్రచురితమయ్యాయి. ముందుగా ప్రచురించిన వారు ఏ విధమైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఆమె విసుగు చెంది అదే కవితని.. "నవ్య"కి పంపారు. వారు పోన్ చేసి మరీ చెప్పి ప్రచురించారు. తీరా చూస్తే రెండింటిలోను ఒకే కవిత.ఆవిడ ఏదైనా సమస్య వస్తుందేమో..అని భయపడ్డారు కూడా!
ఇలా జరగడం వల్ల పత్రికల వారు ప్రచురణ హక్కుల విషయంలో ఏదైనా భాద్యత వహించాల్సి వస్తే అందుకు రచయితను ..భాద్యులని చేస్తారేమో! ఇక స్త్రీల కోసమే నడప బడే పత్రికల విషయంలో కూడా మిగతా పత్రికల బాటే..నడుస్తున్నట్లు ఉంటుంది. అంతా కొంతమందే! కొద్ది మందే !! వారు చెప్పిన కోణమే నూరు శాతం నిజం అన్నట్లు ఉంటాయి.
ఇంకా ఇంకా పాత తరం వారికే కొమ్ముకాయడం,మొహమాటాలు. ప్రాంతాభిమానం,దురభిమానం ,బంధుప్రీతి , స్వజనుల కే స్థానం కల్పించడం మాని అన్ని పత్రికల వారు.. వర్ధమాన కవులకి,రచనలకి ఎప్పుడు స్థానం కల్పిస్తారో.. భగవంతుడికే ఎరుక. ఇలా అడిగే దమ్మున్నవాడిని మీ రచనలో లోపాలు ఉన్నాయి. స్టాండర్డ్స్ లేవు అంటారు. వాళ్ళకి నచ్చితే ఏ చెత్త అయినా ప్రచురణకి అర్హత కల్గినట్లే!
అందుకే పత్రికలని వదిలి..బ్లాగుల లోను, ఫేస్ బుక్ లలోను, వెబ్ పత్రికలలోనూ ఎంతో కొంత మంచి కథలు,కవితలు దర్శనం ఇస్తున్నాయి. అక్కడ లభిస్తున్న ఆదరణ కూడా తక్కువేమీ కాదు. ! ఇక్కడ వెదుక్కున్న వారికి వెదుక్కున్నంత కాక పోయినా కొన్ని మంచి రచనలు చదివామనే సంతృప్తి కూడా ఉంటుంది. ఇలాగే పత్రికల వైఖరి కొనసాగితే.. పత్రికలని విసిరి పడేసి.. వెబ్ సాహిత్యం వైపు ఆసక్తి చూపుతారేమో! .. ఆ కాలం వచ్చేసిన సూచనలు ఇప్పటికే కనబడుతున్నాయి కూడా!
ఇకపై పత్రికలకి, పుస్తకానికి కాలం చెల్లిపోతుందేమో !

21 కామెంట్లు:
నిజమే.
నేనూ కవినీ కాను, రచయితనూ కాను బాబోయ్ :)
meerannadi mummatiki nijam...ee madhya veetannitiki todugaa pranteeyatatvam kudaa todayyindi...baagaa cheppaaru....
chaalaa baagaa chepparu vanaja gaaroo!...good post...@sri
వనజా,మీ ఆవేదన అర్దవంతమైనదే.. కానీ ఇలా జరగటం లోక సహజం.
సంపాదకులు అమ్ముడు పోయి ఏళ్ళు గడుస్తుంది. అక్షరం దిక్కులేనిదైంది.
నేకు తెలిసిన ఎందఱో రచయితలు గొప్ప పదవుల్లో ఉండి తమ రచనలు హాబీ గా వేయించుకుంటున్నారు.
స్పందించే మీ వంటి హృదయాల మూగ వేదన ఇది.
Vanaja garuu chala baaga chepparu,endaro ea nirustahapadi manasikangaa badhapadatam nenu chusanu,ee paristi marutundani naku ea matram nammakam ledu ,
chaalaa chalaa baagaa chepparu vanaja gaaru
బ్లాగు మా తల్లికీ కోటిదండాలు ...ఎందుకంటారా ! మనలోని బుజ్జి బుజ్జి రచయితలని , కవులనీ ఉత్సాహపరచి ఇంకా ఇంకా వ్రాయాలనే ప్రోత్సాహం అందిస్తున్నందుకు . పత్రికల్లో పడితే తప్ప రచయిత కాడు అనే అభిప్రాయం మారిపోతుందిలెండి. అభిరుచి వున్నవారంతా ఇక్కడే( ఇక్కడా) వున్నారు కదా!
మీరు పరిశీలించి వ్రాస్తారు కాబట్టి నిజమే ఉంటుంది
miru cheppindi nijame....okappudu pustakalu enta ekkuvagaa chadive vaaro eppudu anta taggipoyindi....nice post vanaja garu
మీరు చెప్పింది నిజమే అండి ,రచయతలకు ఎక్కడా ప్రోత్సాహం లభించట్లేదు ,కాని బ్లాగులు ఉన్నాయి కదా ,గుర్తింపు కి తక్కువ కాదు కాని,
మనం రాసినవి ఎదైఅన పత్రికలో ప్రచురిస్తే అది మనకి కాస్తంత ప్రోత్సాహకరం గ ఉంటుంది ,ఇందులో రాజకీయం అన్నారు కదా ,ఒక్కసారి ఉదాహరిస్తారా?
బాగుంది .బాగా చెప్పారు.
బ్లాగు మా తల్లికీ కోటిదండాలు..లలితగారు బాగా చెప్పారు.
"శరత్ కాలమ్" శరత్ గారు.. ధన్యవాదములు. మీ మాటతో..నా ఈ పోస్ట్ కి బలం చేకూరింది.
@ కష్టేఫలే ..మాస్టారూ.. మీరు కవి కారు రచయితా కారు..హ్యాపీ అండీ! మా లాగా ఏ బాధాలేదు లేదా..స్థిత ప్రజ్ఞత ఏమో!:)
కే క్యూబ్ వర్మ గారు.. మీరు గమనించి ఉంటారు కదా! నా అభిప్రాయంతో ఏకీభవించి నందులకు ధన్యవాదములు.
@ శ్రీ గారు.. ఇతర రాష్ట్రంలో ఉన్నారు. అక్కడ ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడ మాత్రం ఇంతే! మీ స్పందనకి ధన్యవాదములు.
మేరాజ్.. థాంక్ యు సో మచ్!!
@ రోహిణి గారు థాంక్ యు వెరీ మచ్.
@j.s.n.v గారు ధన్యవాదములు.
లలిత గారు.. తిరుగులేని కామెంట్ అండీ ఇది. బ్లాగ్ తల్లికి, మీకు కూడా ధన్యవాదములు. జై బ్లాగ్ గణం .జై జై బ్లాగ్ గణం
@ శశి కళ గారు థాంక్ యు వెరీ మచ్.
@ చెప్పాలంటే ..మంజు గారు.. ధన్యవాదములు.
హర్ష గారు..మీ స్పందనకి ధన్యవాదములు. మీరు అడిగిన ప్రశ్నకి మరొక పోస్ట్ సమాధానం అవుతుంది. మరలా వీలుని బట్టి వివరిస్తాను.
@ రాధిక (నాని ) గారు.. లలిత గారు బాగా చెప్పారు కదా! ఆమె అభిప్రాయం నాకు బాగా నచ్చింది .థాంక్ యు వెరీ మచ్.
వామ్మో, వామ్మో,
జిలేబీ ల మీద ఇన్ని అభాండాలా ! మేము ఒప్పు కోము!
ఒక్క క్లిక్కులో భళా బ్లాగులు, గూగులు సెర్చ్ లో కనబడే మన బ్లాగు గుడారాలు, వాటికి టాం టాం ఇచ్చే అగ్రిగేటర్ లు, ఉండగా ,
వారాంతపు మిక్చరు పొట్లం కాగితా లో పోయె పత్రిక ల కి మన మేల పోవలె! వాటి మానాన వాటిని పోనీయండి ! ఆఖర్న అవి మిటాయి పొట్లం కాగితాలే కదా !
చీర్స్
జిలేబి.
కష్టే ఫలే మాస్టారూ.. మీ బ్లాగ్ లో కామెంట్ పెట్టడానికి అయిదారు రోజులుగా ప్రయత్నించి విసిగి పోయాను . అందుకే ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నాను.
శర్మ కాలక్షేపంకబుర్లు-అందితే జుట్టు లేకపోతే కాళ్ళు.
చాలా బావుంది మాస్టారూ.. తెలియని కథ.
చెప్పిన విషయం ఎవరికైనా,ఎప్పుడైనా వర్తిస్తుంది ఏమో! :)
జిలేబి గారు.. బాగున్నారా!? చాలా రోజుల తర్వాత మీ దర్శనం చాలా సంతోషం. సంతోషంతో.కడుపు నిండి పోయే కామెంట్ ఇచ్చారు. మీరు చెప్పాక నేను కాదనగలనా!? మీ మాటే నా మాట.
నిజమేనండీ.
బ్లాగు లోకం లో ఎవరి పత్రిక వాళ్ళే నడుపుకోవచ్చు, మంచి రచనలకి పాఠకులూ, ప్రోత్సాహమూ ఎప్పుడూ ఉంటుంది.
జిలేబిగారన్నట్లు అవి మిఠాయి పొట్లం కాగితలేగా ఆఖరికి ;)
కామెంట్‌ను పోస్ట్ చేయండి