శిక్షకి శిక్ష రక్షణ శిక్ష
పూలు, ఒళ్ళు ముళ్ళు ఎన్నాళ్ళీ పోలికలు
వార్తలు కథనాలు కవిత్వాలు నిరసనలు
మళ్ళీ మాములేనా ?
నిత్యం ఇంతేనా?
కాషాయం ధరించి విశృంకలత్వం రాజ్యమేలుతుంది
విలువలెల్ల వలువ లూడి తెల్లబోవగా
ధర్మ చక్రం సాక్షిగా జాతి సింహాలు తలదించుకుంటున్నాయి
పచ్చందనంగా కాపాడాల్సిన ఆడపడుచుల ఆక్రందనల వెల్లువతో
ఈ అవని అగ్ని గోళంగా మారుతుంది
ఈ జాతికి సిగ్గు చీము నెత్తురు లేదని
ఈ జాతి పతాక కూడా కాపాడలేదని
చేతకాని తనాన్ని చూసి తల్లి సిగ్గుతో తలదాచుకుంది
ఏమిచ్చి కన్నాం .. ఏమిచ్చి పోషించాము ?
మా రక్త మాంసాల ని ప్రాణంగా మార్చుకున్న కీచక సంతతి లారా
మానవత్వ మనే పతాకని మోయడానికి ఎన్నని కోల్పోతాం ?
మానమా ,మర్యాదా ,మన్ననా ? .
ఎన్ని పాతకాలని జమచేసుకుంటున్నారు
ఎన్ని ఘాతకాలకి ఒడి గడుతున్నారు
చట్టాలు న్యాయ స్థానాలు
దిష్టి బొమ్మలుగా నిలిచిపోయాయేమో
ఆయుధాలు చెప్పట్టండి
చిట్టి తల్లులని ఆడ పడుచులని
కాపాడుకోవడానికి
తెగ నరకండి
అత్యాచారానికి పాలబడ్డ
మృగ మర్మాంగాన్ని కోసి పడేయండి
జీవన్మృతిని చేయండి
శిక్షకి శిక్ష ఇది .. రక్షణ శిక్ష ఇది
5 కామెంట్‌లు:
పసి పిల్ల మీద, ఆడవారి మీద అత్యాచారాలు చేసేవారు మనుషులు కారు, మృగాలు.వారికి శిక్షలు,చట్టాలు అన్నవి వర్తించవు.అవి మనుషులకు కాని మృగాలకు కావు.అలాంటప్పుడు తిరగబడి అతి క్రూరంగా శిక్ష విధించటమ్మన్నది ఇప్పుడు చెయ్యకపోతే,ఇలాంటి మృగాలు ఇంకా ఎక్కువైపోతారు.
చాలా అద్భుతం గా రాసారు వనజ గారు!! మీకు అభినందనలు!
చాలా బాగా రాసారు వనజ గారు! ఈ మానవ మృగాలకు ఇదే సరైన శిక్ష!!
మృగాలెలాగా మృగాలే, మృగాల్ని దారిలో పెట్టవలసినవారేం చేస్తున్నారన్నదే ప్రశ్న.
అందుకే మన పూర్వీకులు సాత్వికాహారమైన శాకాహారానికే ప్రాధాన్యత నిచ్చారు .
రజోగుణాన్ని , తమోగుణాన్ని పెంపొందించే ఆహారాలను విసర్జించమన్నారు .
మన మనఃప్రవృత్తి మనం తీసుకొనే ఆహారం మీదనే ఆధారపడి వుంటుందన్నది
అక్షర సత్యం , ఆచరణ యోగ్యం కూడా .
' బెండగింజ నాటితే దొండ ములుస్తుందా 'అన్నట్లు , మన ప్రవృత్తి మనం
తీసుకునే ఆహారం మీదనే ఉపయోగపడ్తుంది .
కనుక ఆ దిశగా చట్టాలను పుట్టించి చక్కగా అమలుజరిపితే , ఈ మృగాళ్ళు
కనుమరుగైపోతారు భవిష్యత్తులో .
చాలా చాలా బాగా తెలియచేశారు చిత్రంతో సహా .
కడుపు తరుక్కు పోయే సంఘటనలు.మీ ఆక్రోశం అందరిదీ .జాతి యావత్తూ తిరగ బడాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి