27, ఏప్రిల్ 2013, శనివారం

నీడ



నీడ

ఎటు చూసినా నీడ నీటి సుడుల మధ్య నీడ
నీడన ఏ ఆలోచనా మొక్క మారాకు వెయ్యదే
ఎందుకంత కుంచించు పోతున్నట్లు ఉన్నా
ఆత్మనూన్యత ఊడల్లా విస్తరిస్తుందేమో....
ఈ నీడ  నన్ను వదలేమిటి
కాస్త స్వేచ్చగా మసలనివ్వదేమిటి
పరుగులు తీస్తున్నా వేటాడుతూనే ఉంది
నన్ను కావాలని కోరుకుంటుంది
నా పుట్టుకతో వచ్చిందా ఏమిటి?
నేను లేకుంటే జీవితామంతా శూన్యం గా తోస్తుందంటూ
మాయ మాటలు చెపుతుంది
ఎన్ని మాంత్రిక విద్యలు నేర్చింది !
వదులు నన్ను వదులు  అంటూ గిజుకుంటున్నా
వెంటాడే నీడ, వేటాడే నీడ
ఎంత క్రూరమైనది
నన్ను ప్రాణం లేని శిలని చేసింది
ఇంకో నీడ నన్ను ఆప్యాయంగా
ఆలింగనం చేసుకుంది
లిప్త కాలంలో  లోకం నుండి విడుదల చేసి
పదోన్నతి కల్గిస్తుంది
ఎంత మంచిదీ  ఈ నీడ
నా కన్నా ముందు నడుస్తూ
నన్ను వెంట బెట్టుకుని మరీ  తెసుకువెళుతుంది
బాధలు భయాలు లేని స్వేఛ్చా  లోకంలోకి
నన్ను చేయి పట్టి తీసుకువెళుతుంది
నేను వెళుతున్నా ..
నువ్వు రాకు .. అతి ప్రేమ నటించకు.




15 కామెంట్‌లు:

Sag చెప్పారు...

కాస్త స్వేచ్చగా మసలనివ్వదేమిటి
నా పుట్టుకతో వచ్చిందా ఏమిటి

లిప్త కాలం లోకం నుండి విడుదల చేసి
పదవోన్నతి కల్గిస్తుంది

భావం (కవిత) చాలా బాగుంది .....

అజ్ఞాత చెప్పారు...

వదులు నన్ను వదులు అంటూ గిజుకుంటున్నా
వెంటాడే నీడ వేటాడే నీడ
ఎంత క్రూరమైనది
నన్ను ప్రాణం లేని శిలని చేసింది :)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సా గర్ .. థాంక్ యు భావాన్ని బాగా పట్టేశారు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టే ఫలే మాస్టారూ .. నవ్వేసారు ఎందుకో :)

ధన్యవాదములు

Sharma చెప్పారు...



కడ దాకా తోడుగా ఉండేదే నీడ , అందుకే తోడుని నీడలా వెన్నంటి ఉండాలని
మన పెద్దలు " తోడు నీడ "గా ఉండాలని ఆశీర్వదిస్తారు .

నీడను వదిలిపెట్టలేదన్నమాట . బాగుంది .

జలతారు వెన్నెల చెప్పారు...

ఈ కవితని సరిగ్గా అర్ధం చేసుకోడానికి కొంచెం కష్టపడ్డాను.జీవితంలో "మధ్యలో తోడోచ్చే నీడ", "మృత్యువు నీడ" మీద ఈ కవిత అన్న మాట
వనజగారు కవిత చాలా బాగుందండి.You are so creative...and topics you choose for writing these poems are so unique,and you express yourself so well!

Karthik చెప్పారు...

"ఎటు చూసినా నీడ నీటి సుడుల మధ్య నీడ
నీడన ఏ ఆలోచనా మొక్క మారాకు వెయ్యడే
ఎందుకంత కుంచించు పోతున్నట్లు ఉన్నా
ఆత్మనూన్యత ఊడల్లా విస్తరిస్తుందేమో" ఈ లైన్స్ అయితే చాలా బాగా నచ్చాయి...నీడలో కూడా ఇంత విషయం ఉందని మీ కవిత నుండె తెలుసుకున్నాను....-:)

పల్లా కొండల రావు చెప్పారు...

నీడ అంటేనే మనది. మన తోడిది కదండీ....:)) అందుకే అలా ఉంటుందది.

కాయల నాగేంద్ర చెప్పారు...

నీడను వివిధ కోణాల్లో విశ్లేసించారు. కవిత నిత్య నూతనంగా ఉంది వనజ గారు!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Sharma గారు ఈ నీడ మధ్యలో వచ్చిన నీడ గురించి వ్రాసిన కవిత ఈ నీడ వదలలేదు అంది మర్రి నీడ కాబట్టే కవిత్వంగా చెప్పాల్సి వచ్చింది :)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల గారు ..ఎన్థ బాగా అర్ధం చెసుకున్నారు. కవిత్వం వ్రాయడం ముఖ్యం కాదు . పాఠకుల స్థాయికి అందటం ముఖ్యం . చక్కగా కవితలో అంశాన్ని క్యాచ్ చేసారు . ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఎగసే అలలు ..కార్తీక్ .. కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదములు .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కొండలరావు గారు ... కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...


కాయల నాగేంద్ర గారు .. మీ స్పందనకి ధన్యవాదములు

హితైషి చెప్పారు...

Todu-neeDa lo NeeDa kannaa Mrutyuvu neeDa chaalaa nayam anna sangatini entha hrudhyamgaa cheppaaru. chaalaa baagundi .

keep writing