29, ఏప్రిల్ 2013, సోమవారం

వ్రాయకుండా ఉండలేని వ్యసనం

ఛీ ఛీ .. ఏం మనుషులో ...?  మరీ ప్రేమ కి మొహం కి కామం కి తేడా తెలియకుండా బ్రతుకుతున్నారు

అని తిట్టు కుంటున్నాను . అంతలోనే ఊడి  పడింది  నా  స్నేహితురాలు  రమ .

ఏమిటి అన్ని ఛీ లు .. చీత్కారాలు ?  రోజూ అలాంటివి మాములేగా!  అంది

రోజూ ఏమిటి ?

అదే న్యూస్ పేపర్ లో విషయాలు .అంది

న్యూస్ పేపర్ పేరెత్తకు ..నాకు చిరాకు అన్నాను . మరి నీ చిరాకు ఎవరి మీదమ్మా ?

ఎవరి మీద కాదు తల్లీ .. కవిత్వం మీద అన్నాను

కవిత్వానికి ఏమైంది మీ బ్లాగులలో, పేస్ బుక్  లలో బాగానే వర్ధిల్లుతుంది కదా ! అంది .

అందుకే .. నా ఛీ చీలు చీత్కారాలు అని చెప్పాను

ఎందుకో ? మళ్ళీ ప్రశ్న

కవిత్వమా కాకరకాయా ? జనం పైత్యం అంతా వెళ్ళగ్రక్కుతున్నారు నాతొ సహా అన్నాను నాకు కూడా నా మీద కోపమే ! అసలు కవిత్వం రాయకపోతే ఏమిటి నష్టం ? అనుకుంటున్నాను  చెప్పాను

నీకు ఏమిటో అయింది ఆత్మానందస్వామి ఆవహించాడు అంది అనుమానంగా నన్ను చూస్తూ

కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అనుకుంటూ  కాస్త ఆ కళ  అబ్బిన వారిని  అందులో జీవం నింపగల్గిన  వారిని  ప్రోత్సహిస్తే పొయ్యేది  ఏముందిలే .. కాస్త కీ బోర్డ్ అరగడం తప్ప  అని అనుకుంటాను

మంచి కవిత్వం చదివినప్పుడు మాటలురాక స్పందన తెలుప మాటలు రాక మౌనంగా ఉండిపోతాను .ఇంకాస్త  మంచి  కవిత్వం చదివినప్పుడు మరణం అంటూ లేకుండా కవిత్వం చదువుతూనే ఉండాలనుకుంటాను ఇది నా పైత్యం

అలాంటిది నాకు విరక్తి కల్గుతుంది చెప్పాను ఏడుపు ముఖం తో ..

ప్రసూతి వైరాగ్యం లాగా నీకు కవిత్వ వైరాగ్యం బాగానే పట్టుకుందే!? అంది

కవిత్వం కి వస్తువు , అభివ్యక్తం, భాష ,శైలి, రూపం ఇవన్నీ లక్షణాలు

భావ సంపత్తిలో మునిగి తేలిపోతూ అందులో మమేక మయ్యేవాడే కవి

తనలో కలిగే రసానుభూతికి జీవితానుభూతిని అనుభవాన్ని కూడా జత పరచి కవిత్వం వ్రాస్తే దానికి అందం చందం  విశ్వతోముఖత్వం  అయిన కవిత్వం ని  ఆస్వాదించగల్గి నప్పుడే దానికి విలువ పెరుగుతుంది

ఆస్వాదన లేకుండా అసహ్యం కల్గె కవిత్వం వ్రాయడం ఎంత వరకు సమంజసం ? కమిట్మెంట్ ఉండాలి

అలా కాకుండా మనలో కల్గిన వికారాలన్నిటి కి కవిత్వమని పేరు పెట్టి  వక్రీకరించి  వాంతి కల్గించకూడదు

ఏదైనా గుప్పిట మూసి ఉంచితేనే అందం.  కావ్యాలలో ఉన్న అందం ఇప్పటి కవిత్వంకి రాదు లవ్ కి లస్ట్ కి తేడా తెలియని భావ ప్రకటన ని చీత్కరించుకుంటున్నాను అందుకే .. అన్నాను

నీకు చీత్కారం అయితే ఇంకొకరికి ఆనందం కావచ్చు . అలా వ్రాసి మమేకం అయ్యే వాళ్ళ సృష్టిని మార్చలేం నీ దృష్టి నే మార్చుకో తల్లీ  నీకసలే  ఆవేశం ఎక్కువ . ఇప్పుడు వాళ్ళు నీ కళ్ళ ముందు ఉంటే పొడిచి చంపేసే టట్లు ఉన్నావు  కాస్త శాంతించు అని అనునయంగా చెప్పింది

ఒక చల్లని నీళ్ళ బాటిల్ తెచ్చి నా ముందు పెట్టింది గట గట త్రాగేసి కాస్త శాంతపడ్డాను

మన రాతలే, ఇంకా చెప్పాలంటే  మన మాటలే మనకి విలువ తెచ్చి పెడతాయి. గుండెల్లో దైర్యం ఉంది కదా అని బట్టలు విప్పేసుకుని తిరగరు.   మనసైన వాడి పై మనసు ఉంది కదా అని అనువుకాని చోట విప్పేసుకోకూడదు. మోహం ఉంది కదా అని మోహమాట  పడకుండా పచ్చిగా వ్యక్తీకరించ తగదు

అమ్మని అయి ఉంటె నాలుగు పీకేదాన్ని, గురువు ని అయి ఉంటే  మంచిమాటలతో తప్పు తెలియజేసి ఉండేదాన్ని

చెలిని అయ్యి ఉంటె మంద లించే దాన్ని. ఏమి కానందుకు బాధపడుతున్నాను   చెప్పాను విచారంగా

"లోకంలో మంచి చెడు అన్నీ నీకే కావాలి .. నువ్వు మారవు"  అంది  రమ

అవును నాకే కావాలి  కనీసం ఒక మనిషి  అయినా మారాలి.  ఆ మార్పుని  నేను నా కళ్ళారా చూడాలి అది  నా కోరిక .. అని చెప్పాను

ఇంకా ఏమి లేవా .అని అడిగింది

ఎందుకు లేవు ఇలా వ్రాసినందుకు కొందరికి కడుపు మంట ఖాయం . నా మీద దండయాత్ర చేసినా ఆశ్చర్యపోను అన్నాను .

ఈ మద్య పేస్ బుక్ లో ఎవరో బాదపెట్టారు అన్నావు జాగ్రత్త ! అని చెప్పింది

  నేను ఊరుకుంటానా? అప్పుడు నాకు తివిక్రమ్ శ్రీనివాస్ గుర్తొచ్చాడు అన్నాను

ఆయనెందుకు మధ్యలో అంది

చెప్తా విను .. అని

 ఇలా చెప్పాను నన్ను బాధపెట్టినవారికి

"బోల్డ్ గా ఉన్నానని కేరెక్టర్ లూస్ అనుకోకు .. నా జోలికి వస్తే తోక్కిపడేస్తాను , జాగ్రత్త "  అని

వామ్మో ! నీ జోలికి నేను రాను అంది భయంగా రమ

నవ్వేసాను హాయిగా ...

(నేను మాత్రం ఎవరి జోలికి రాలేదండొయ్ ! కవిత్వం అన్నది భ్రష్టు పట్టడం  చూసి కుమిలి కుమిలి కునారిల్లిపోతూ  ఏదో ఇలా వ్రాసుకున్నాను .అంతే నండీ అంతే !!)

వ్రాయలేకుండా ఉండటం ఒక వ్యసనం  కదా !  మంచిదో -చెడ్డదో!?

మన్నించుమా .. పాట  అప్రయత్నంగా గుర్తుకు వచ్చింది  ఈ మేటర్ కి ఆ పాట కి ఏదో లింక్ ఉందని నా మనసు చెపుతుంది మరి  ఆ రెండు హృదయాలకి అర్ధమైతే చాలును . 

26 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

అనవసరం గా మీ జోలికొస్తే ఒక టపాతో కోడతారనమాట!
:)
"అమ్మని అయి ఉంటె నాలుగు పీకేదాన్ని,గురువు ని అయి ఉంటే మంచిమాటలతో తప్పు తెలియజేసి ఉండేదాన్ని

చెలిని అయ్యి ఉంటె మంద లించే దాన్ని. ఏమి కానందుకు బాధపడుతున్నాను" ఈ lines మీ మంచి మనసుకి అద్దం పడుతున్నాయి.

భాస్కర్ కె చెప్పారు...

మీ వేదన మీరు స్పష్టంగా చెప్తారు,మీ టపాలలో గొప్పతనం అదే,.నిజమే ఫేస్ బుక్ లోకెళ్లాక కొంచె పైత్వం పెరుగుతుంది, కవిత్వం కన్నా,..నా వాక్యాలేమైన బాధపెడితే క్షమించండి,..

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

భాస్కర్ గారు మీరు నన్ను ఎప్పుడు ఏమి బాధ పెట్టలేదు .

ఎందుకో ఈ మధ్య కవిత్వం అని చెప్పే కవిత్వాన్ని ఆస్వాదించ లేకపోతున్నాను భాస్కర్ గారు కుప్పలు కుప్పలుగా తెప్పలు తెప్పలుగా ఉండి ఊపిరి ఆడటం లేదు మరి

ఫీల్ కల్గె కవిత్వం వ్రాస్తున్న వారిలో వర్మ గారు, ,మీరు, శ్రీకాంత్ ,skv రమేష్ ఉన్నారు అలాంటి కవిత్వం రావాలని నా ఆశ .

మీ వ్యాఖ్యకి ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల గారు ..నా మనస్తత్వాన్ని భలే అంచనా వేసారే ! నా జోలికి వస్తే అంతే మరి. :)

ఈ ఠపా లో కొన్ని వాక్యాలు మీకు నచ్చినందుకు ధన్యవాదములు

అజ్ఞాత చెప్పారు...

అయ్య బాబోయ్....!!! కవిత రాయబోయి..టపీమని ఆగిపోయా... :)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

kvsv గారు ఎందుకండీ అంత షాక్ !? తప్పకుండా వ్రాయండి వ్రాసేందుకే బ్లాగులున్నాయి చదివేందుకే బ్లాగర్స్ ఉన్నారు. వర్ధిల్ల జేయడానికి గూగుల్ అమ్మ ఉంది . :)

మీ స్పందనకి థాంక్స్ అండీ

అజ్ఞాత చెప్పారు...

"ఎందుకో ఈ మధ్య కవిత్వం అని చెప్పే కవిత్వాన్ని ఆస్వాదించ లేకపోతున్నాను". I too agree with u. Searching for the reason.

అజ్ఞాత చెప్పారు...

అప్పుడప్పుడు ఆవేశంతో ఇలా లోకాన్ని మార్చెయ్యాలనిపిస్తూ ఉంటుంది. అంతా విష్ణు మాయ :)

కాయల నాగేంద్ర చెప్పారు...

పనికిమాలిన కవిత్వానికే ఎక్కువ కామెంట్స్, లైక్ లు. సమాజానికి ఉపయోగపడే రచనలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు . మీ ఆవేదనను చక్కగా వివరించారు వనజ గారు!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టే ఫలే... మాష్టారూ నిజంగా విష్ణు మాయె నంటారా ? నాకు దైర్యం వచ్చింది . అప్పుడప్పుడూ ఇలా ఆవేశాపడతాను. నాతొ సహా నేను కూడా .
ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కాయల నాగేంద్ర గారు .. మీ స్పందనకి ధన్యవాదములు

నేను బ్లాగ్ వ్రాయడం మొదలు పెట్టిన తర్వాత అతి తక్కువ పోస్ట్ లు వ్రాసిన నెల అండీ ఇది . ఏమిటో వ్రాయకుండా ఉండలేను. ఇది ఒక వ్యసనం కూడా :)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అనూ రాధ గారు ..కవిత్వమ్ వ్రాసే వాళ్ళు అందరూ ఆలోచించాలి . కవిత్వాన్ని యెంత బరువు ఉందని తూకపు రాళ్ళతో తూయ లేం. పుటలలో లెక్కించలేం .కానీ చదివినప్పుడు మనసు చెపుతుంది ఏది మంచి కవిత్వమో ! అది అందరూ గమనించాలి. వ్రాయవద్దు అనడం లేదు వ్రాసినదాంట్లో కవిత్వం ఎంత ఉందొ పునః పరిశీలించుకోవాలి అని అంటున్నాను

మీ స్పందనకి ధన్యవాదములు

అజ్ఞాత చెప్పారు...

వనజవనమాలి..గారూ..ఈ టాపిక్ నాది..చాలా కాలం విరామం తర్వాత బ్లాగ్ ల వైపు వచ్చాక...ఏమిటో కవిత్వాలతో జనం వికటాట్టహాసం చేస్తున్నరని పించింది...బ్లాగ్ కూడా ఒక మీడియా...ఒక పర్పస్ ఉండాలి...పూర్తిగా కాకపోయినా..కొన్ని జనానికి ఉపయోగాపడెట్ట యినా ఉండాలి కదా..సరే నేను కాస్త పెర్వర్ట్ అయి ఉంటా అని...సైలెంట్ గా ఉండి పోయా...మీ టపా చూసాక...నే అనుకున్నది...మీరు దైర్యంగా చెప్పారని పించింది...మీరు వ్రాసినదే నాకనిపించింది...మాంసం తిన్నామని దుమ్ములు మెడలో వేస్కోరుకడా!!

అమ్మ ఒడి అన్న బ్లాగ్ ఎప్పుడూ ఇప్పటికీ చూస్తూ ఉంటా..వర్తమాన విషయాల పై సమాజంలో స్పందన అవసరం అని నా అభిప్రాయం..మన జీవితాలను ఇంఫ్లూయెన్స్ చేసే విషయాల పై ఉదాశీనంగా ఉంటూ...కవిత్వాలే రాసుకుంటూ కూర్చోవడం..నా కు నచ్చలేదు...కవిత్వాన్ని కూడా ఉపయోగించ వచ్చుగా జనాల్లో ఆలోచన కలుగ చేయడానికి..

జంక కుండా కుండ బ్రద్దలు కొట్టి నట్టు చెప్పారు..మేం చెప్పా లేక పోయాం...

ఈ కామెంట్ ప్రచురణకు కాదు..మీ దృష్టికి తీసుకు రావడానికి...మాత్రమె...నమస్తే..

అజ్ఞాత చెప్పారు...

@కాయల నాగేంద్ర గారూ..

చక్కని కవితలు వ్రాసే వాళ్ళు ఉన్నారండీ...

మీరన్నట్టు..

సమాజానికి ఉపయోగపడే రచనలను>>
కోరుకుంటున్నాం...

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

kvsv గారు మీ ఇంకో కామెంట్ ని కూడా ప్రుచురించాలని ఉంది అందులో చాలా మంచి విషయం చెప్పారు . మీరు అనుమతి ఇవ్వగలరని ఆశిస్తున్నాను .

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

"అమ్మని అయి ఉంటె నాలుగు పీకేదాన్ని, గురువు ని అయి ఉంటే మంచిమాటలతో తప్పు తెలియజేసి ఉండేదాన్ని"

భలే చెప్పారండీ

శ్యామలీయం చెప్పారు...

మీ‌ టపా బాగుంది. మీ ఆవేదన అర్థమైంది. నేను చెప్పుకోవలసినవి రెండు ముక్కలున్నాయి.

కం. మంచి కవిత్వము వ్రాయుట
మంచి కవిత్వంపుసొంపు మరగుట రెండున్
మంచి విషయములు మరియా
మంచివి యే వనిన మనిషి మనిషికి వేరౌ.

కం. రాముని కొరకై వ్రాసెద
నా మనసుకు తోచినట్లు నా మార్గమునన్
నా మార్గము నచ్చుటయును
మీ మనసులు మెచ్చుటయును మీకు వదలెదన్

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

kvsv గారు మరో మారు మీ వ్యక్యలకి ధన్యవాదములు , చక్కని అభిప్రాయం తెలిపారు . మీ వ్యాఖ్య తో నేను ఏకీభవిస్తున్నాను . థాంక్ యు సో మచ్ అండీ !

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పప్పు శ్రీనివాసరావు గారు మీ ప్రశంసకి మనసారా ధన్యవాదములు .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్యామలీయం గారు మీ స్పందనకి ధన్యవాదములు

పాహి రామ ప్రభో .. నేను ఈ పద్య కవిత్వం గురించి మాట్లాడ బోను మనసా ధన్యవాదములు _/\_

అజ్ఞాత చెప్పారు...

Akavitvam ae kaalamlonoo vastoone untundi,axaraalanu kalushitham chestoone untundi.Idi kavitvam maatram kaadu any chaduvarulu pulla virichinatlu khaccitamugaa cheppagalagaali!

Sharma చెప్పారు...


ఆ నాడు చక్కగా వ్రాయగలగటం వలననే వాటిని కావ్యాలు అన్నారు .
సహజంగా మంచి మార్పుకి మన కవిత్వం నాంది పలకటం ఏ రచయిత అయినా కోరుకుంటాడు .
ఈ క్రింది వాక్యాలలోని మీ కాంక్ష నూటికి నూరు శాతం కరెక్టేనండి.
" అవును నాకే కావాలి కనీసం ఒక మనిషి అయినా మారాలి. ఆ మార్పుని నేను నా కళ్ళారా చూడాలి అది నా కోరిక .. అని చెప్పాను "
ఈ నాడు ఆ కావ్యాలు కనుమరుగవుతున్నాయి . డానికి కారణం వాటిని అర్ధం చేసుకొనే వారు తక్కువయ్యారు . ఈ భావ కవిత్వాన్ని , వచన కవిత్వాన్ని ఆదరించేవాళ్ళు అధికమవటంతో , ఇలా ఇంటర్నెట్ లో ఏ ఖర్చు లేకుండా మన భావావేశాలను అందరికీ పంచగలుగుతున్నారు .

అయితే అది కూడా సభ్య సమాజానికి హాని కలగనంతవరకు కొనసాగించవచ్చు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సూర్య ప్రకాష్ గారు అలా నిర్మొహమాటంగా చెప్పడం ఎందుకనే ఎవరికీ వారు ఉండిపోవడం జరుగుతుంది . భావ స్వేచ్చని అడ్డుకోలెం కదా ! సద్విమర్శ ని స్వీకరించే దిశలో వర్ధమాన కవులు లేరు అదే దురదృష్టం .
మీ స్పందనకి ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శర్మ గారు ఇతరులకి ఇబ్బంది కలగనంతవరకు ... బావుంది మీ మాట . ఒక అమ్మాయి డ్రెస్ సెన్స్ పాటించకపోతే వందమంది అమ్మాయిలకి ఆ డ్రెస్ సెన్స్ ని జనరలైజ్ చేస్తూ ఆడవాళ్ళు హద్దులు మీరి పోతున్నారు అని వ్యాఖ్యా నిన్చినప్పుడు అదే జనరలైజ్ కవిత్వం కి వర్తిస్తుంది కదండీ!

పిచ్చా పాటి రాతలని కవిత్వం క్రింద జమ కట్టకుండా వ్రాసుకుంటే ఇబ్బంది ఏమి లేదు . అదే కవిత్వమనే భ్రమ లో ఉంటె మాత్రం కవిత్వానికి చాలా నష్టం జరుగుతుంది . ఒహొ.. కవిత్వమంటే ఇదా .అని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు అది నష్టం కదా !

భావ స్వేచ్చని ఎవరూ కంట్రోల్ చేయరు ఆ వ్యక్తీకరణ లో సభ్యత ఉండాలి సంస్కారం ఉండాలి ఇవి లేకపోతె తిట్టు కవిత్వం ని వ్రాసుకుని ఆహా ఓహో అంటూ బల్లలు చరుచుకుని చప్పట్లు కొట్టుకుని అశ్లీల కవిత్వాన్ని ఆస్వాదించే దౌర్భాగ్యం మనకి ఉందని ఋజువు పరచుకుందామా !?

ఇప్పుడు కవిత్వం ఆ దిశగా వేలుతుండానే నా ఆవేదన.

మీ స్పందనకి ధన్యవాదములు

ప్రవీణ చెప్పారు...

I totally agree....కవిత రాసి తీరాలి అని కీబోర్డ్ పై టక టక కొట్టేస్తే కవితై పోదు. ఒక భావం ఆవేశంలో నుంచి పొంగుకురావాలి.

SRINIVASA RAO చెప్పారు...

బాగుంది