15, మే 2013, బుధవారం

అత్యాశ




ఉదృత మైన ఆలోచనల  అలలు
తాకాయి .. నా మనసు తీరాన్ని
 ఏవేవో అస్పష్ట భావనలు
మోస్తూ  మోస్తూ నేను అలసి పోతాను
అక్షరీకణలొను  సొమ్మసిల్లి పోతాను
పొద్దంతా .. అదే పని
రేయి అంతా ఇంకో రకం సడి
కవితాలాలస జడి అనుకుంటా  
బాహ్య అంతః సంఘర్షణల మధ్య
నేనొక ఒంటరి యోధురాలిని  .

నన్ను నేను వ్యక్తీకరించుకోలేనప్పుడు
వేరొక చోట   స్పష్టతని చేజిక్కించుకోవడం లో
 విఫలం అయినప్పుడు
నాకు నేనే అర్ధం కానప్పుడూ 
ఓ  అస్పష్ట కవిత్వాన్ని అవుతాను .
మళ్ళీ మళ్ళీ   చదువుకుంటూ
మరల మనిషినవుతాను
మరో రోజు మొదలైన చోట
కవి నవుదామని అత్యాశతో

  (కవి సంగమం లో .. నా పరిచయం ఇలా చేసుకోవాలనుకున్నాను .సమయాభావం  వల్ల  నా పైత్యానికి తాళం పడింది ) :)


8 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

"నన్ను నేను వ్యక్తీకరించుకోలేనప్పుడు
వేరొక చోట స్పష్టతని చేజిక్కించుకోవడం లో
విఫలం అయినప్పుడు
నాకు నేనే అర్ధం కానప్పుడూ
ఓ అస్పష్ట కవిత్వాన్ని అవుతాను . "

అద్భుతం గా అనిపించాయి నాకు ఈ లైన్స్!

మోహన చెప్పారు...

మీ పోస్టులు చాలా బాగున్నాయండి.

మోహన చెప్పారు...

మీ పోస్టులు చాలా బాగున్నాయండి.

అజ్ఞాత చెప్పారు...

కవితా లాలసతో సొమ్మసిల్లి తననితాను వ్యక్తీకరించుకోలేనప్పుడు తపనపడి తననితాను పునర్మూల్యాంకనం చేసుకోవడానికి కవయిత్రి పడే తాపత్రయం అక్షరమ్ అక్షరమ్ లో అణువణువునా కనిపిస్తుంది.

భాస్కర్ కె చెప్పారు...

పరిచయంలో వైవిధ్యతను ప్రదర్శించారు,.బాగుంది,..మీ వీడియోలు అప్లోడ్ చేశారా,..

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల గారు థాంక్యూ సో మచ్.

@మోహన గారు ధన్యవాదములు

@ఎ.సూర్య ప్రకాష్ గారు మీ స్పందనకి మరీ మరె ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

భాస్కర్ గారు .. నాకు ఆ విషయాలు ఏవి తెలియదండి. కనీసమ్ ఫోటొస్ కూదా ఉన్నట్లు లేదు. నిర్వాహకులని అడిగి తెలుసుకోవాలి.

మీ స్పందనకి ధన్యవాదములు

అజ్ఞాత చెప్పారు...

చదివి ఆనందించడం తప్ప...? మనసారా అభినందిస్తున్నాను మీ అభిరుచిని.