13, మే 2013, సోమవారం

నచ్చని ప్రయాణం

హాయ్ ఫ్రెండ్స్ ! చాలా రోజుల తర్వాత బ్లాగ్ వ్రాయాలని మనఃస్పూర్తిగా ఇష్టం కల్గింది

రోజులు చాలా త్వర  త్వరగా  దొర్లిపోతున్నాయి. చాలా రోజులు పనుల ఒత్తిడిలో నన్ను నేను మరచిపోయాను .
ఆవకాయ పచ్చళ్ళు పట్టడం, పెళ్ళిళ్ళ సీజన్ మూలంగా వృత్తి పరమైన ఒత్తిడి తో బ్లాగ్ వైపు తొంగి చూసే అవకాశమే రాలేదు.

మహిళ లకి బ్లాగ్ నిర్వహణ అంటే మాటలు కాదని ఇప్పుడు నిరూపణ అయింది అయినా సరే .. పనుల ఒత్తిడిని ప్రక్కన పెట్టి "కవి సంగమం " లో పాల్గొనాలని అత్యుత్సాహంతో వెళ్లాను. హిమాయత్ నగర్ లో ఫ్రెండ్ ఇంటిలో మకాం . స్నానం టిఫిన్ అయిన తర్వాత తి.తి.దే .. వారి కళ్యాణ మండపం ప్రక్కనే ఉన్న "స్వామి" వారిని దర్శించుకుని .. బయటకి వచ్చి షాపింగ్ చేయాలనుకుంటే హైదరాబాద్ లో షాప్ లే తెరవలేదు ..ఎమిటి  ఇలా అంటే ఇక్కడ అంతే ! పదకొండు గంటలకి కాని షాపులు తెరవరు అని చెప్పింది సరే .. సుల్తాన్ బజార్ కో,అబిడ్స్ కో షాప్పింగ్ వెళదాం పద అంటూ బయలుదేరదీసాను. లిబర్టీ బస్సు స్టాప్ లో పావు గంట నిలబడినా అటు వైపు  వెళ్ళే బస్ రాలేదు . సరే అటువైపు వద్దు చార్మినార్ వైపు వెళదాం పద అంటూ ..చార్మినార్ వైపు వెళ్ళే బస్ ఎక్కాము. మేము వెళ్లేసరికి ఒక్కో షాప్ తెరుస్తూ ఉన్నారు హైదరాబాద్ "గాజులు" ప్రసిద్ది కనుక ముందు లాడ్ బజార్లో గాజుల కోసం తిరగడం మొదలు పెట్టాము .  మీనాకరి గాజులు అంటే   నాకు చాలా ఆసక్తి. జైపూర్ లో ఆ గాజులు బాగా దొరుకుతాయి. హైదరాబాద్ లో కూడా దొరుకుతాయి కాని అన్ని వెరైటీ లు  దొరకవు అని తెలుసు అయినా ఎక్కడో ఆశ దొరకక పోతాయా .అని  వెదకడం మొదలు పెట్టాము ఒక పట్టాన నాకు గాజులు నచ్చావు ,నచ్చిన గాజులేమో ధర చూస్తే కళ్ళు తిరిగే ధరలు చెపుతున్నారు. బాగా నచ్చిన గాజులు చూస్తే చిన్న సైజో,పెద్ద సైజో దొరుకుతాయి కాని కావాల్సిన సైజ్ దొరకలేదు. ఎలాగోలా ఒక మూడు రకాల గాజులు కొనుక్కుని బయట పడ్డాము. వస్తూ వస్తూ చార్మినార్ ని ఇలా కెమెరా లో బందించుకున్నాను. నువ్వు గాజుల షాప్ లలో కూడా పిక్స్ తీస్తావేమో అనుకున్నాను . ఆ ధ్యాస లేదు నీకు అంది నా ఫ్రెండ్ . అప్పుడు గుర్తుకు వచ్చింది అయ్యో ! ఎన్ని రకాల గాజులని ఫొటోస్ లో తీసి పని .. చక్కగా బ్లాగ్ లోపెట్టి అందరికి చూపే పని అనుకున్నాను. ఏమిటో .. సమయానికి సరిగా గుర్తుండి చావడం లేదు అని తిట్టుకున్నాను కూడా


    

"కవి సంగమం " లో పాల్గొని  తెల్లవారుతూనే కాళ్ళకి చక్రాలు గట్టుకుని ఇంటికి బయలుదేరాను ఎండలు మండిపోతుంటే పగలు ప్రయాణం ఏమిటి ? రాత్రికి వెళ్ళ వచ్చు కదా ! ఈ ఒక్క పూటా ఉండు .అని నా ఫ్రెండ్   బ్రతిమలాడినా వినకుండా నన్ను ట్రైన్ ఎక్కించు నేను వెళ్ళిపోతాను అని పట్టుబట్టాను. ఇక తనేం చెప్పినా నేను విననని అర్ధం అయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి తీసుకు  వచ్చి  ఒ..పావు గంట క్యూలో నిలబడి టికెట్ తెచ్చి ఇచ్చింది.  "ఇంటర్ సిటీ " ఎక్కాలనుకుని వెయిట్ చే స్తూ  . నిలబడ్డాం.  మనుషులు నిలబడటానికే  చోటులేదు ఇంకెక్కడా సీట్ దొరుకుతుంది ? రిజర్వేషన్ బోగీలోకి ఎక్కేసి టి .సి వచ్చినప్పుడు టికెట్ వ్రాయించుకో ! అలా నిలబడి ఎక్కడ వెళతావు అని నా ఫ్రెండ్ గోల. పరవాలేదులే ! ఎంత నాలుగు గంటలసేపే కదా ! సీట్ దొరుకుతుంది లే! అని దీమా గా చెప్పాను .సీట్ దొరకడం కాదు కదా ..  మనం ఎంత ఒత్తిగిల్లి నిలబడ్డా సరే మనుషులని ఒరుసుకుంటూ తిరిగే వ్యక్తులు,  చిరు తిండ్లు అమ్ముకుని తిరిగే వారి మధ్య అటు తొలగి దారి  ఇస్తూ ఇటు తిరిగి  నిలబడుతూ నరక ప్రాయమైన ప్రయాణం చేసాను నిలబడిన మనుషుల మధ్యనే కాస్త వాళ్ళని అవతలకి నెట్టి చతికిల బడే కొందరు అలా కూర్చో గల్గె దైర్యం లేని నాలాంటి కొందరు.  చెమట స్నానాలతో  చిరాకు  పడుతూ కూలింగ్ వాటర్ బాటిల్స్ బాటిల్స్ క్రొద్ది తాగేసి ఎలాగోలా "మధిర " దగ్గర మాత్రం నాకు కూర్చోవడానికి తీరికగా సీట్  దొరికింది అమ్మయ్య .అంటూ నిట్టూర్చి ... ఎలాగోలా 2;30 కి అల్లా ఇంట్లో పడ్దాను

అప్పటికి కాని నాకు ప్రాణం లేచి వచ్చినట్లు అయింది నేను లేకపోతే ..నా వర్కర్స్ అందరూ ఎలా వర్క్ చేస్తారో అన్న దిగులు నా కస్టమర్స్ కి అలాంటి అసంతృప్తి కల్గుతుందో .. అన్న అనుమానం నన్ను ఎక్కడా నిలువనీయదు నా పర్యవేక్షణలో అంతా మాములుగా జరుగుతుంటే అది చాలు అనుకునే .. అతి చిన్న ఆశా జీవిని నేను.

 పై పై మెరుగులు, పెదాలపై అతికించుకున్న నవ్వులు, చూసి చూడనట్లు వెళ్ళిపోయే వారు .. పలకరిస్తే పరువేం బోతుందో లేదా వాళ్ళని మనం పలకరించేది ఏమిటిలే అనుకున్న వాళ్ళు  (వాళ్ళే ఫెస్బూక్ ఫ్రెండ్స్ ఇక్కడ వాల్స్ పై అతి ప్రేమ ఒలకబొస్తారు ) ఇవన్నీ చూసి విరక్తి కల్గింది.ఎవరికీ వారే మేమే గొప్ప లా భ్రమపడి బతుకుతున్నట్టు అనిపించింది

నిజం చెప్పొద్దూ .. హైదరాబాద్ నగరం ,  లాడ్ బజారులో గాజులు కొనుక్కోవడం, కొంత మంది మిత్రులని కలవడం కవి సంగమం, నాకు ఎలాంటి ఆనందాన్ని ఇవ్వలేకపోయాయి .  ఎందుకో నేను చెప్పలేను .  ఈ ప్రయాణం నాకు అసలు నచ్చలేదు. షేర్ చేయదగిన గొప్ప విషయాలు కూడా లేవు అక్కడ. అంతా  లీలా వినోదం. అంతే !

వీటన్నింటి మధ్య .".చార్మినార్ " ఒక్కటే నాకు నచ్చింది . అంతే!

(మనసు చెప్పినదే చేస్తాను, వ్రాస్తాను )

10 వ్యాఖ్యలు:

Anil Atluri చెప్పారు...

విజయవాడలోని మీ సాహిత్య సభల అనుభవాలు ఏం చెప్పినవి?

వనజవనమాలి చెప్పారు...

ఇక్కడ సభలు కూడా ఒకోసారి విసుగు కల్గిస్తాయి . నిర్వహించేవారి నిర్మొహమాటం చాలా అవసరం. అలా వ్యవహరించలేనప్పుడు సభ లో వీక్షకులకి విసుగు కల్గుతుంది
ఒక సభలో "సిరివెన్నెల" గారు ఒక గంట మాట్లాడితే యెస్.పి. బాలు గారే విసుక్కున్నారు

ఎంత సేపు మాట్లాడాం అన్నది కాదండి ..ఎంత విషయం శ్రోత దృష్టికి అందిందో అన్నది ముఖ్యం కదా!

chinni v చెప్పారు...

హ్మ్మ్ అలానే వుంటాయి .ప్రయాణం లో మనకంటూ రిజర్వేషన్ లేకపోతె ఈ సీసన్ లో నరకమే .నాకు అనుభవమె ఇలాటివి .

Sharma చెప్పారు...


మీ నచ్చని ప్రయాణం తెలియచెప్తుందేమిటంటే , రిజర్వేషన్లు కులాలకి , మతాలకే కాదు ప్రతి విషయంలో చాలా అవసరమని.
ఇక చార్మినార్ ఒక్కటే నచ్చిందన్నారు . అది ఒక అతివ (భాగమతి)కోరిక మేరకు కట్టించింది , అంతే కాకుండా ఆ పేరులోనే ఉంది "చార్మ్"ఇనార్ అని.

వనజవనమాలి చెప్పారు...

అవునండీ..చిన్నివి గారు. అనుభవమైనది:)

వనజవనమాలి చెప్పారు...

శర్మ గారు వివిధ కారణాల వల్ల నాకు అసలు అక్కడ ఉండటమే నచ్చలేదు. నచ్చక పోవడం లోనే ఇబ్బంది అని తెలిసి కూడా వెంటనే తిరుగుప్రయాణం. చార్మినార్ చాలా నచ్చింది అండి. దాని ముందు మనుషులు ఏ పాటి అనిపించింది . మీ స్పందనకి ధన్యవాదములు.

కాయల నాగేంద్ర చెప్పారు...

మీరు చెప్పింది నిజం వనజ గారు. తెలుగు రచయితల మహాసభలకోసం విజయవాడలో మూడురోజులు ఉన్నాను.విసుగు అనిపించలేదు. ఇక్కడ (హైదరాబాద్)
సాహితీ సభలంటే భయం. అందుకే వెళ్ళడానికి సాహసించను.

RAJ A చెప్పారు...

సభల నిర్వహణ కూసింత కఠినముగా ఉంటే - వక్తలకి నిర్ణీత సమయము ఇస్తే - అంతా బాగుంటుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

miku anipinchinde raayandi vanaja garu manasu maatale baavuntaayi nijaayiti gaa

శశి కళ చెప్పారు...

ayyo .....chala manchi vishayalu vrastaavu anukunnanu,kavitvsm baagaa chadivava akka ?