8, మే 2013, బుధవారం

ముసుగెందుకు ?

నాగరికత నేర్చిన నడకలు ఇవి . నగ్న సత్యం ఇది .






ముళ్ళ కొమ్మల మధ్యన మగువ . చిత్రించి చూపే కెమెరా కన్నుయొక్క  దృష్టి పథాన్ని దాటి పోలేని మనుగడలో
అవకాశాలకై అర్రులు జాచె కొందరి దిగజారుడు తనానికి అన్నెం పున్నెం తెలియని అభాగ్యులు  బలవుతుండటం అన్యాయం. అశ్లీలతని ప్రోత్శాహించినంతకాలం మన మధ్య ఏమైనా జరగవచ్చు
మీడియాకి నియంత్రణ అవసరం అనిపిస్తుంటుంది


" మెదదు  అంతా.. మన్నేనా!? 
హృదయం అంతా.. బండేనా !?. 
అయినా శరీరం అంతా..
స్వరజతులే ఉండాలా!? 
మీటితే ఎప్పుడు పడితే అప్పుడు.. 
అలరిస్తూనే ఉండాలా!?
మద్యంలాగా.. మగువ కూడా.
తయారు చేసుకున్న వస్తువా!?

(నా కవిత్వంలో ఒక భాగం )

ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే మన మధ్య ఎలాంటి వికృతాలు ఉండవు . ముసుగులేసుకుని బ్రతకనవసరం లేదు .

ఎక్కడ నిజం ఉంటుందో .అక్కడ  నిర్భయం ఉంటుంది.  ఎక్కడ సంస్కారం ఉంటుందో అక్కడ  అర్ధం చేసుకునే తత్త్వం ఉంటుంది.  ఎక్కడ నిబద్దత ఉంటుందో అక్కడ ఆలస్యంగా అయినా అమృత ఫలాలు లభిస్తాయి ఇది నాకు మా గురుతుల్యులు నేర్పిన పాఠం. 

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Where the mind is without fear and the head is held high, where knowledge is free........let my country awake.
Tagore.
Still even today I pray the same

Sharma చెప్పారు...


అందమంతా ఆడవాళ్ళలో నింపటం వలన మగవాళ్ళు ఆ అందం కొఱకు వెంపర్లాడటం అతి సహజం కావచ్చు .కానీ
అర్ధం కానిదేమిటంటే అందంగా లేకుండా మందమే ప్రధానంగా అగపడే ఈ మగవాడి వలలో ఈ ఆడవాళ్ళు ఎలా చిక్కుకుంటున్నారా ? అని .

ఒక్క చేయి చాచగానే చప్పట్లకి ఆస్కారం లేదు ,
మరో చేయి ఆ చాచిన చేతిని చరిస్తే చప్పట్లకి ఆస్కారం ఏర్పడినట్లే .

దీన్ని బట్టి ఆడవాళ్ళ , మగవాళ్ళ అందరి ఆలోచనా సరళి మారాల్సిందే . అపుడే అందమైన ప్రపంచం పంచన మనమందరం మనుగడ సాగించగల్గుతాం.

పల్లా కొండల రావు చెప్పారు...

ప్రతీదానిని సరుకుగా మార్చే ఈ వ్యవస్థలో ఈ అవస్థలు తప్పవు. వ్య్వస్థలో మార్పు కోసం ప్రార్ధనలు చాలవు. సంఘటిత పోరాటాలు చేయాలి.