25, మే 2013, శనివారం

అడగని వాడు అశ్వం

ఈ రోజు ఉదయాన్నే ఒకరితో నిర్మొహమాటం గా మాట్లాడేసాను . తర్వాత ఇంకాస్త సున్నితంగా విషయాన్ని చెప్పి ఉండాల్సింది ఏమో ! పాపం అనవసరంగా ఆమెని బాధపెట్టాను అనుకున్నాను .

నేను మాట్లాడింది నా కొడుకు స్నేహితుడి తల్లితొ.. ఆవిడ నాతో చాలా స్నేహంగా ఉంటారు . అందుకే కొంచెం ఇబ్బంది పడ్డాను. తర్వాత అనిపించింది నేను వంద శాతం సబబుగానే మాట్లాడాను అని

నా కొడుకు స్నేహితుని తల్లి పేరు "పద్మ" ఆమె ఈ రోజు కాల్ చేసి ఒక మంచి విషయం చెప్పారు . ఒక ఒంటరి మహిళ ఒంటి చేత్తో కుటుంబ భారాన్ని  మోసి తన పిల్లలిద్దరిని  బాగా చదివించి ప్రయోజకులని చేసారు అని . అందుకు ఆమెని అభినందించాల్సిందే అని చెప్పాను. ఆమె కొడుకు US లో ఉన్నాడు అతనికి వివాహం చేయదలచారు . నా ఎరుకలో ఉన్న ఒక అమ్మాయి గురించి చెప్పాను . కట్నం ఎంత ఇస్తారు అని అడిగారు
కట్నం ఏమిటండి / అమ్మాయి అబ్బాయితో సమంగా చదివింది జాబ్ కూడా చేస్తుంది ఈడు-జోడు కుటుంబం మంచి-చెడు ఇవి కదా  చూసుకోవాల్సింది అని  అన్నాను . నిజమే అనుకోండి . అసలు కట్నం ఏమి ఇస్తారు అంటే చెప్పాలికదా అన్నారు పద్మ గారు.  సారీ అండీ ! నేను అసలు ఈ విషయం గురించి అయితే నేను మాట్లాడను అలా అడగటం అంటే నా దృష్టి లో చాలా తప్పు వ్యవహారం . అన్నాను . అసలు తల్లిదండ్రులు అమ్మాయికి ఏమి ఇస్తారో తెలుసుకుంటే తప్పేమీ లేదు కదా అన్నారు ఎంత ఇచ్చినా అమ్మాయి ఏమి అమెరిక కి పట్టుకుని వెళ్ళదు  కదండీ అని .. ఆ విషయం గురించి నేను అడగను కట్నం విషయం మాట్లాడటమే నాకు నచ్చదు అని చెప్పేసాను తర్వాత ఫీల్ అయ్యాను పద్మ గారు మనసులో అయినా అనుకునే ఉంటారు .. రేపు ఈమె వాళ్ళ అబ్బాయికి కట్నం అడ గరా..? అని

నిజంగా నాకు అలాంటి ఆలోచనే లేదు  చక్కని అమ్మాయి  విద్యావంతురాలు అయి ఉండి కష్ట సుఖాలు తెలిసిన అమ్మాయి కే  ప్రాధాన్యత ఇవ్వాలని మా కుటుంబమంతా కోరుకుంటున్నాం. అమ్మాయి చేత  ఉద్యోగం చేయించాలనే ఉద్దేశ్యం కూడా లేదు .. ఇదే చెపుతున్నాను కూడా .

వరకట్నం అంటే అదో రకం విముఖత నాకు .  వరకట్నం అనే విషయంలో జరిగిన పరిణామాల వల్ల నా తలరాతే మారిపోయిన కఠిన వాస్తవాన్ని నేను ఎప్పటికి మరువలేను కూడా.

ఇప్పుడు తక్కువయ్యాయి ఏమోకాని  ఎనబయ్యో దశకంలో అదొక తీవ్రమయిన దశ.  అంతగా కాకపోయినా ఎంతో కొంత అయినా ఆడపిల్లలు ఇప్పటికి బలి అవుతూనే ఉన్నారు ఉన్నత విద్యావంతులై ఉండి  కూడా స్త్రీ ధనం ని ఆశించడం "వెన్నుముక"  లేని తనమే అవుతుంది అయినా ఈ రోజుల్లో అమ్మాయిలూ ఏమి తెలివితక్కువ వారు కాదు వారికి అన్ని హక్కులు తెలుసు. ఏ మాత్రం అవకాశం ఉన్నా వాటాలు పంచుకుని మరీ వెళుతున్నారు

ఇప్పటి తరం వారికి చదువులు,అందం చందం ,ఉద్యోగం, వెనుక పెద్దలు సంపాదించిన ఆస్తి అన్నీ కావాలి వారి ఉన్నతి కోసం అహోరాత్రాలు శ్రమించిన తల్లిదండ్రులు వద్దు అనేలా ఉన్నారు
అలాంటి బిడ్డల కోసం వరకట్నం ని ఆశించి మరొక తల్లిదండ్రులని బాధ పెట్టడం కూడదని నా ఉద్దేశ్యం

కట్నం అడిగినవాడు గాడిద అంటారు అది విరుద్దమైన పోలిక . గాడిద ఎంత బరువుని మోస్తుందో కదా!  సంసార భారాన్ని ఇద్దరు కలసి మోసుకోవాలి   మోయలేని బరువు మోసే బాధ ఆడపిల్ల తల్లిదండ్రులకి ఇవ్వవద్దని నా ఆలోచన. కాబోయే ఆచరణ కూడా.

"కట్నం అడగని వాడు అశ్వం " అని మనమూ ఓ .. స్టేట్మెంట్ ని ఖరారు చేసేద్దాం బావుంది  అంటారా?

11 వ్యాఖ్యలు:

nagarani yerra చెప్పారు...

టైటిల్ బాగుంది .
అన్నీ నిజాలే . ధైర్యంగా చెప్పారు .

అజ్ఞాత చెప్పారు...

కొన్ని కొన్ని విషయాలు చెప్పేలా చెబితేనే అందం లెండి. అయ్యో సున్నితంగా చెప్పలేకపోయాననే బాధ మనసులోంచి తుడిచేయండీ!

అజ్ఞాత చెప్పారు...

appatlo katnam tho paatu kirosin koodaa ammayi tarapu vaallu ivvalsi vacchedi...asahyam veyadaa?emistaaroo ani adagataaniki..pellikoduku emayinaa pasuvaa ammayiki konivvadaniki?

oddula ravisekhar చెప్పారు...

మీ అభిప్రాయాలు చాలా బాగున్నాయి అంతకు మించి పట్టుదలతో ఆచరిస్తామనటం మరింత బాగుంది.

Narsimha చెప్పారు...

అడిగినా పశువే...అడగకున్నా పశువే అంటే ఎలా అండీ..!! :) బాగా జవాబిచ్చారు గానీ ...మంచి సంబందం అయితే చేతులారా పొగొట్టుకున్నట్లు అవుతుంది కనుక కాస్త స్మూత్ గా డీల్ చేసి అబ్బాయి తరపు "మంచి" ఉంటే సంబంధం సెట్ చేయండి....ఎంతైనా చదువుకున్న వారు కనుక అర్థం చేసుకొవచ్చు!

వనజవనమాలి చెప్పారు...

Narasimha గారు అలాగలాగె! :) థాంక్యూ సో మచ్.

వనజవనమాలి చెప్పారు...

NagaraaNi eraa గారు థాంక్యూ సో మచ్!

వనజవనమాలి చెప్పారు...

కష్టేఫలే మాస్టారూ.. :) మళ్ళీ అడిగారండీ. ఈ సారి అలాగే చెప్పాను మరి.

వనజవనమాలి చెప్పారు...

kvsv గారు ఇలాగే అడగాలండీ! మీ వ్యఖ్యకి ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

ఒద్దుల రవిశేఖర్ గారు మీ వ్యాఖ్యకి ధన్యవాదములు.

అజ్ఞాత చెప్పారు...

"ఒక ఒంటరి మహిళ ఒంటి చేత్తో కుటుంబ భారాన్ని మోసి తన పిల్లలిద్దరిని బాగా చదివించి ప్రయోజకులని చేసారు"

అలాంటి ఆవిడ కూడ కట్నం అడగడం ఆశ్చర్యమే.