27, మే 2013, సోమవారం

గాజు మనసు



గాజు మనసు

పంజరంలో పక్షిలా మనసే కాదు జీవితం కూడా                                                                   
పిడికెడు స్వేచ్చ కోసం అల్లాడి  పోతుంటుంది
 తలుపు తెరిచే చేతికై కళ్ళల్లో ఆశ నింపుకుంటూ
గుండెల్లో మంట లార్చుకుంటూ
సోలి పోతుంది

దిగులు మేఘాలు దురాక్రమణ మధ్య
సారించిన చూపుతో
శోధించే ఆలోచనలతో
అగాధాల అంచులలో
అంతుచిక్కని శూన్యంలో  ఊగిసలాడుతుంది
బరువు మోయడం భరించలేనప్పుడు
దుక్కుల లెక్కలో కురిసి తెరిపిన పడుతుంది 

 బంధ  విముక్తని చేసే చేయే  కాదు
 ఆకతాయిగా  భళ్ళున పగలగొట్టే రాయి కూడా
స్వేచ్ఛని  ప్రసాదిస్తుందనీ
తిరిగి అతుక్కునేందుకు  మనసేమీ
గాజు ముక్క  కాదు కనుక
గాజంత పారదర్శకం కాదు గనుక
వ్రక్కలైన ముక్కల్లొ నుండే
ఓ శిధిల శిల్పం ముందుకు నడచి వస్తుంది
పగలగొట్టబడిన పంజరాన్ని వెక్కిరిస్తుంది

కొన్ని అవాంచనీయ సంఘటనలు
మనసులని, జీవితాలని మార్చేస్తాయి
మార్పుని చూపెడతాయి
 రాళ్ళల్లొ వడ్లగింజలా
జీవితం జీవించి చూపాలి కనుక
అదో  మలుపు కనుక 

(మనసు -మనిషి - జీవితం కి  మధ్య నలుగుతూ ..... ఓ నిర్భయ వాక్యం ) కొందరి అనుభవాలు విన్నాక.. వ్రాసీన స్పందన. వ్రాసినది అంతా కవిత్వం అని నేను చెప్పబొవడం లేదు. ఎవరిని ఒప్పుకొమని అనడం లేదు.:)
.

13 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

వ్యాఖ్యానించడానికి ఏమి లేదు ఇంకా ఇన్నాళ్ళు ఇలా వ్రాస్తావ్... అన్న ప్రశ్నకి సమాధానం....

కొందరి అనుభవాలు విన్నాక.. వ్రాసీన స్పందన. వ్రాసినది అంతా కవిత్వం అని నేను చెప్పబొవడం లేదు. ఎవరిని ఒప్పుకొమని అనడం లేదు

భాస్కర్ కె చెప్పారు...

జీవితాన్ని జీవించి చూపాలి,.ఎందుకంటే అదే జీవితం కనుక,...మంచి మాటలు,.

హితైషి చెప్పారు...

చాలా బావుంది .కొందరి వ్యదార్ధ జీవితాలని, జీవన స్పూర్తిని కవిత్వంలో నింపారు .

ఎవరండీ కవిత్వం కాదన్నవారు ? కత్తితో పొడిచి అరకోడి మెదడుని చీల్చాలి

రోజు వ్రాసే వారే కవుల కులమా?కవిత్వమని స్టాంప్ వేసేవారిది కవిత్వ మతమా? స్పందన అనే చీము,నెత్తురు కల్గి పచ్చద్దాలు తీసేసి చదివితే తెలుస్తుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

nachinadi raayadaaniki vere vaallu eam anukunte mikenduku chaakagaa paaradarshakatanu vivarincharu chakkani kavita

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మంజు గారు ..నిజం గానే నేను వివరణ ఇవాల్సిన అవసరం లేదు. కానీ అజ్ణాతలు వచ్చి ప్రతి సారి నన్ను బాధపెట్టడమే లక్ష్యంగా చెసుకుని వచ్చి నా వ్రాతలపై వ్యాఖ్య పెడుతున్నారు. నకిలీ ముఖాలు వేసుకుని వచ్చినవారికి నిజ స్వరూపమ్ చూపాలంటే భయం. నా వ్రాతలలొ ఏముందో చెప్పడానికి నేను వెనుకంజ వేయాల్సిన పని లేదనే.. వివరణ వ్రాసాను. నా వ్రాతలు మీకు నచ్చినందుకు మీ స్పందనకి ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

the tree భాస్కర్ గారు ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

వైష్ణవి (హితైషి) అప్పుదప్పుడు మీరు భలే స్పందిస్తారే!? :) థాంక్యూ సోమచ్. మీరు చెప్పిన మాటలు కవిత్వం లా ఉన్నాయి.
అలాగే నా పై టార్గెట్ చేసి వ్యాఖ్యానించేవారు ఎక్కువయ్యారు. ముసుగు వెసుకుని వస్తున్నారు. అందుకే వారి వ్యాఖ్యలని ప్రచురించడం లేదు

ప్రేరణ... చెప్పారు...

అధ్భుతంగా చెప్పారు....అభినందనలండి.

శ్యామలీయం చెప్పారు...

మీ‌ కవిత చాలా ఆలోచనాదాయకంగా ఉంది.

ఒక అద్దం‌ పగుల గొట్టి
పకపక లాడే వాళ్ళను
ఒకటి వేయి అయిన అద్దాలు
ఒక లాగే‌ పరిహసిస్తాయి

అద్దం పగిలితే‌ ప్రతిముక్కా అద్దమే
అబధ్ధం పగిలితే మిగిలేది శూన్యమే
రాళ్ళు రువ్వే చేతులకు కాళ్ళొచ్చే ఘట్టం
కళ్ళకు చూపెడుతుంది ప్రతి చిన్న అద్దం

మంచి కవితను అందించినందుకు మరొకసారి అభినందనలు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ప్రేరణ గారు.. మీ స్పందనకి ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్యామలీయం గారు .. మీ ప్రశంసకి ధన్యవాదములు
మీ వివరణాత్మక వ్యాఖ్యకి ధన్యవాదములు.

Meraj Fathima చెప్పారు...

vanajaa.., swachhamgaa undi mee manassulaa. intakante emi cheppagalanu naa nechhaliki.

మానస.. చెప్పారు...

చాలా బాగుంది వనజ గారు...