రోజూ కనబడే నక్షత్రాల లోనే
రోజు కనబడని కొత్తదనం చూచి
రోజూ పొందని ఆనందానుభూతి
పొందటం అంటేనే కవిత్వం
అని ఒక కవి మాటలు ..
కవిత్వం అమృతం వంటిదని తెలిస్తే రాక్షసులు దేవతలతో తగాదా పడి ఉండేవారు కాదని మానవులతో మైత్రి నడిపి కవితామృ తానని సేవిం చే వారని ఇంకొక కవి ఛలోక్తి .
నాకు కవిత్వమంటే చాలా చాలా ఇష్టం .
అందుకేనేమో ..నాకొక చక్కని అవకాశం లభించింది "లమ్ కాన్ సిరీస్ -5 లో కవిసంగమం వేదిక పై కవిత్వం చదివి వినిపించే అవకాశం లభించింది .
పేస్ బుక్ గ్రూప్ లలో "కవిసంగమం " తెలుగు కవిత్వానికి ఎంతో ఆలంబనగా ఉంది . వర్ధమాన కవులకి ఒక వేదికగా నిలిచి కవిత్వాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. "కవిత్వం కావాలి కవిత్వం" అంటూ నిజమైన కవిత్వానికి చిరునామా కావాలని "కవిసంగమం " కృ షి చేస్తుంది .
రేపు సాయంత్రం 11-05-2013 శనివారం సాయంత్రం 06:00 కి బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1 లామ్ కాన్ వేదికగా జరిగే కవిసంగమం లో నేను ఒక కవిగా (కవయిత్రి) పాల్గోనబోతున్నాను
మిత్రులందరికి ఇదే ఆహ్వానం . కవిత్వాన్ని ఆస్వాదించడానికి మనమందరం ఒక వేదిక పై కలుసుకుందాం రండి
హైదరాబాద్ లో ఉన్న మిత్రులందరికీ ఆహ్వానం . అవకాశం ఉన్నంతవరకు రాగల్గిన మిత్రులందరికీ మనఃపూర్వక ఆహ్వానం పలుకుతూ ..
వనజ తాతినేని
16 కామెంట్లు:
అభినందనలు కవిసంగమం కవయిత్రి గారు :)
మిత్రులందరికి ఆహ్వానం అనేసి, మళ్ళీ హైదరాబాద్‌లో ఉన్న మిత్రులన్నారు.
అలిగామండి మేము (మేము అంటే మీరు, ఇంకెవరు అని అడగద్దు..నన్ను నేను గౌరవించుకుంటాననమాట!)
మాకోసం youtube video post చెయ్యడం మరువకండి.
ముందస్తు శుభాకాంక్షలు వనజ వనమాలి గారూ .
వనజ గారు హార్దిక అభినందనలు . మీరు మంచి కవిత్వం రాస్తారు . ఆ కవిత్వం మరింతగా ప్రజలలోకి వెళ్ళటం అవసరం .
జలతారు వెన్నెల గారు ..హ్రుదయపూర్వక ధన్యవాదములు.
మీరు మాతృదేశం లొ ఉంటే తప్పక హాజరయ్యేవారని తెలుసు. ఈ సారి మీరు వచ్చినప్పుడు ఒక కవితావేదిక నిర్వహిద్దాం మీరు నేను మాత్రమే శ్రొత,వీక్షకులు కూదాను. :) మీరు అడిగినది తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాను . థాంక్యూ.
నాగరాణి ఎర్రా గారు.. హృదయపూర్వక ధన్యవాదములు
సామాన్య గారు .. మీ హౄదయ పూర్వక అభినందనలకి మనసారా ధన్యవాదములు.
శుభాభినందనలు వనజగారూ...
మా అందరి ప్రతినిధి మీరు... మీరు అక్కడ ఉంటే మమ్మల్ని మేం చూసుకున్నట్లు ఉంటుంది.. ఓ రకంగా మనందరికీ దక్కిన గౌరవంలా ఫీలవుతున్నా...
వీడియో కోసం, ఫొటోల కోసం ఎదురుచూస్తుంటాము... :)
అభినందనలండి,.కార్యక్రమం విజయవంతంగా జరగాలని కోరుకుంటుూ,...
అభినందనలు వనజా వనమాలి గారు.
అభినందనలు వనజవనమాలి గారు .
అభినందన.
హృదయపూర్వక అభినందనలు వనజ గారు!
సంతోషం వేసిందండి , కానీ రాలేకపోతున్నాను ,నేను ప్రస్తుతం హైదరాబాద్ లో లేనందున , మా చిరంజీవి వద్దకు ( అమెరికాకు ) వచ్చి ఉన్నందువలన .
All the very best Vanaja Vanamali garu.
వచ్చే టపాలో మీ కవిత కోసం ఎదురుచూస్తూ ఉంటాను. All the best.
కవి సంగమం గురించి విన్నాను.మంచి కార్యక్రమం.మీకు అభినందనలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి