బాల్యం బాగుంటాదని ఎవరన్నారు
ఎంత చేదుగుంటతో
మా పిల్లకాయలని అడిగితే ఎరుకవుతాది
మా కాడ నుండి మీకావాల్సిన బాల్యాన్ని
అరువు తీసుకుంటారా ఎవరయినా
అమ్మిని నేను చెపుతుండా
అట్టాగే ... అబ్బయ్య నడిగి తే ఇట్టా అంటాడు
ఓ సారి మాపాలి చూడండి
కసువూడ్చి.. కళ్ళా పిజల్లి
ఎనుకగన్న పిల్లకి
మరో తల్లినై సాకుతూనే ఉంటా ..
అంట్ల గిన్నెలు తోముతూ
కూడుకూర వండుతూ
చదువుసందెలు లేక
బండచాకిరి చేసిన..
అమ్మ అయ్యకి..బండ నయ్యారంటిరి.
పైసలకాస పడి..
కసుకాయని కోసి పండబెడితే..
ఆలిని అయ్యానో..
పైసల బేరంలో..లొల్లి నయ్యానో..
ఆశలే కాదు బతుకుకి రోసేసిన ఆడపిల్లని..
పశువుల కొట్లంకడ
మట్టి తట్టలేత్తే కడ
టకరాలు మోసే కాడ,,
మెరక చేను కాడ
మడి దున్నే కాడో
బల్లలు తుడిచే కాడో
ఈడ ఆడని కాదు..
ఏదైనా ఎక్కడైనా..
మా ఉనికి..ఉండనే..ఉంటాది..
అయ్య చెయ్యట్టుకుని ..
బడికిపోవాలనో
ఆసామి కొడుకులా..
అచ్చరాలు దిద్దుకోవాలని ఆశ.
నా..ఈ ఊసులన్ని
పైకి చెప్పినా చెప్ప లేకున్నా..
నేను బర్రె తోకట్టుకుని..
చెరువు నీళ్ళల్లో.. ఈదుతూనే..ఉండాల.
ఆశల సముద్రపు..నీళ్ళల్లో.. ఈదలేనని.
బాబ్బాబు... మా బాల్యాన్ని తీసుకోండి కాస్త
ఒడ్డున పడ్డ చేప పిల్లలా గిల గిల కొట్టుకుంటున్న
మా బాల్యాన్ని దొంగల్లా ఎత్తుకుని పొండి.
మీ నాజూకైన లోకంలోకి గిరాటేయండి
ఇది నా తొలి కవిత దాదాపు పదిహేను ఏళ్ళ క్రితం (యదాతథం గా )
5 కామెంట్లు:
మీరు .పదిహేను సంవత్సరాల .కిరతం .వారసిననా ఇప్పటికీ పరిస్థితుల్లో ఏమీ మారుప లేదు . చాలా బాగా రాసారు . సమస్య ఇపపటికీ సజీవంగానే ఉంది .ఇంకెనానళళకు మారుతుందో?
తల్లి తండ్రులలో మార్పురావాలి.
"మా కాడ నుండి మీకావాల్సిన బాల్యం ని అరువు తీసుకుంటారా ఎవరయినా..?
మా బాల్యాన్ని దొంగల్లా ఎత్తుకుని పొండి!"
ప్చ్....touching lines!
తొలి కవిత అయినా నిజాన్ని చక్కని పదాలలో హృద్యంగా చెప్పారు
Very Nice Vanaja garu.
Extra-ordinary gaa undi .
కామెంట్‌ను పోస్ట్ చేయండి