25, నవంబర్ 2018, ఆదివారం

అదే నీవు

నవంబర్ 24.


ఎనిమిదేళ్లు, నువ్వొక చోట నేనొక చోట. ఇన్నేళ్ల తర్వాత  వొకే  గూటిలో మనం.


నాకింకా చిన్న పిల్లాడివే. అమ్మా !  నాకేం చేసి పెడతావ్ అని పొద్దున్నే అడుగుతావు, రాత్రి బాగా పొద్దుపోయాక నా గదికి వచ్చి గాడ్జెట్  పట్టుకుని వుంటే మృదువుగా కోప్పడి దుప్పటి కప్పి మంచినీళ్ల బాటిల్ ప్రక్కన బెట్టి గుడ్నైట్ చెప్పి వెళతావ్.


అమ్మకి కావాల్సినవన్నీ అమర్చి పెట్టాలని తాపత్రయ పడతావ్, అంతలోనే   బాలుడిలా  అల్లరి చేస్తావ్.


మూడు పదుల వయసొచ్చినా పసి మనసే నీది.


అంతరంగం సముద్రమంతలోతు, ప్రపంచాన్ని చదివిన ఆలోచనలు, నువ్వు నువ్వుగా ఉంటూ అందరికీ నీకేమి తెలియదు అనుకున్నట్లు వుండే సాధారణంగా కనబడే  మంచి అబ్బాయివి. సింపుల్ మేన్ వి.


ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ..

చైతన్యవంతమైన జీవన గమనం తో.. 

స్ఫూర్తి కరమైన మార్గంలో నడుస్తూ..

సుఖసంతోషాలతో..ఆయురారోగ్యములతో.. పుత్ర పౌత్రాభివృద్దితో

యశస్విభవ గా దేదీప్యమానంగా వెలుగొందాలని ..

మనసారా దీవిస్తూ..

భగవంతుని కరుణా కటాక్షములు అన్నింటా లభించాలని కోరుకుంటూ...

హృదయపూర్వక శుభాకాంక్షలు ..

నిండు మనస్సు తో.. ఆశ్శీస్సులు .. అందిస్తూ..  ప్రేమతో ..

                                                                                              అమ్మ.   







2 కామెంట్‌లు:

భారతి చెప్పారు...

నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ...
జన్మదిన శుభాకాంక్షలు నిఖిల్ చంద్రా.

వనజగారు మీ ఇరువరి నడుమ ప్రేమాభిమానాలు సదా ఇలానే నిలిచి ఉండాలని ఆశిస్తున్నాను (ఒకరోజు ఆలస్యంగా చెప్తున్నా)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ధన్యవాదాలు భారతి గారూ.