9, మే 2023, మంగళవారం

స్వయంసిద్ధ

 ప్రతి స్త్రీ ఒక నిశ్శబ్ద ప్రవాహం. పుట్టింది మొదలు కడతేరే వరకూ.. ఎన్నో బంధాలను తన జీవితంలో కలిపేసుకుని ఎంతో మంది అభిప్రాయాలను  వారి భావ ప్రకటలనూ భరిస్తూ తనకంటూ ఓ అస్థిత్వాన్ని నిలుపుకోలేకుండా గాలివాటు బ్రతుకు కి అలవాటు చేయబడతారు. 

చరిత్రలో ఎన్నో కథలు కాగితాల మీద కనపడవు. ఎందుకంటే, అవి స్త్రీల శరీరాల మీద, మనసు మీద రాయబడతాయి' అంటారు పంజాబ్‌ తొలి మహిళా రచయిత్రి అమృతా ప్రీతం. అది నిజం. 

స్త్రీలు పెదవి విప్పితే వారి కోణంలో నుండి వెలువడే భావప్రకటన చాలా చోట్ల ఈ నాటికి .. నిషిద్దం. 

 అయినప్పటికీ .. స్త్రీలు  ఒంటరిగా  స్థైర్యంగా అకుంఠిత దీక్షతో అనేక అవరోధాలను దాటుకుని యెన్నో విజయాలను సొంతం చేసుకుంటున్నారు. స్యయంసిద్ద గా భాసిల్లుతున్నారు. ఆ స్యయంసిద్ధ ల కథలే.. ఈ నలభై కథలు..  

ఈ కథాసంకలనం తీసుకురావడానికి ముఖ్యకారకులైన భండారు విజయ P. జ్యోతి గారి శ్రమ కృషి అభినందనీయం. ఇవి మునుపు రాసిన కథలు కాదు. ఈ సంకలనం కోసం రాసిన కథలు. నలభైమందిని ఒకే తాటిపైకి తీసుకురావడం పుస్తకరూపంలో రావడం.. వెనుక వీరి కృషిని ఇలా పుస్తక రూపంలో చూడటం అభినందనీయం. 

ఇందులో నేను రాసిన కథ “దీపవృక్షం” కూడా వుంది. మరో ముప్పై తొమ్మిదిమంది కథకులను చదవబోవడం ఆసక్తిగా వుంది. సాహిత్య చరిత్రలో ఇది ఒక రికార్డు కూడా.. రచయితలందరూ.. వారి అనుభవాలు మరియు ఇతరుల అనుభవాల నుండి రాసిన కథలు ఇవి అని సంపాదకులు ఇరువురూ పేర్కొనడం చూస్తే.. ఈ కథల్లో కాల్పనికత తక్కువ కావచ్చు అనిపిస్తుంది. 

 ఈ నెల మే 13 వ తేదిన “స్వయంసిద్ధ” ఆవిష్కరణ .. జరుపుకోబోతుంది. మిత్రులందరూ హాజరవుతారని.. ఆశిస్తూ..

పురుష రచయితలు కూడా ఈ సంకలనాన్ని చదివి సమీక్షిస్తారని.. ఆశిస్తూ.. 





కామెంట్‌లు లేవు: