స్త్రీ లు సహేతుకంగా ఆలోచిస్తూ భావ ప్రకటన చేస్తున్నప్పుడు ..
ప్రశ్నించినప్పుడు మరింత తాకిడికి గురవుతారు.
విష నాలుకల జ్వాలలు మరింత పెట్రేగుతాయి.
అందరినీ స్వైరిణి లను చేసేస్తారు. వారి జన్మస్థానం కూడా సిగ్గుపడే లా..
అలాంటి సమయాల్లోనే స్త్రీ లకు మరింత నిబ్బరం కావాలి.
“ఇల్లాలి అసహనం” అనే కథ రాసినందుకు..
“తన్హాయి” నవలను సమీక్షించినందుకు..
“ఐ యాం ఆల్వేస్ ఎ లూజర్ “
అనే కవిత రాసినందుకు..
నాకు .. స్వైరిణి అనే బిరుదు ఇస్తారంట.
వారికి మళ్ళీ పేరు రాసుకునే ధైర్యం లేదు.
(2016 లో చేసారు ఈ వ్యాఖ్యలు. నేను 2015 నుండే బ్లాగ్ లో కామెంట్ ఆప్షన్ తీసేసాను.)
వీరి అవగాహనల వెనుక చదువుల వెనుక కాస్త ఉగ్గుపాలతో సంస్కారం నేర్పిన తల్లిని గుర్తుతెచ్చుకుంటే చాలు కదా!
ఎందుకో గింజుకుంటుంది మనసు.
దారిన వెళుతూ యెవరో యెవరినో తిడుతున్నా కూడా నేను ఆ తిట్టుకు భయపడతాను. ఆడదానిగా పుట్టినందుకు సిగ్గుపడతాను.
ఇది ఇక్కడెందుకు రాసాను అంటే.. అన్నవాళ్ళు.. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ లిస్ట్ లో వారు వుంటారు వున్నారు కాబట్టి.
చూసి ఉపేక్షించడం.. నా స్వభావానికి విరుద్దం.
వారికి చెప్పేది ఏమిటంటే..
మీరు ముమ్మాటికి మానసిక రోగులు. ఆ రోగంతోనే కునారిల్లిపోతారు. అంతే!
అభిప్రాయం సూటిగా స్పష్టంగా వుండాలి. చర్చ అర్ధవంతంగా వుండాలి. మనకు నచ్చని వాళ్ళపై కారుకూతలు కూయడం కాదు. ఇలా కూసే జాబితాలో వీళ్ళలో స్త్రీ లు కూడా వున్నారు. నా అనుకూలురు వారిని సంస్కారహీనంగా మాట్లాడితే!?
తట్టుకోగలరా !?
వ్యక్తులకు మానసిక సంస్కారం వుంటే నిత్యజీవితంలో సంస్కారంగా మెలుగుతారు. వారి రాతల్లో సంస్కారం మిగులుతుంది. మీ తర్వాత మీ ఉనికిని చాటేది మీ పనులు మరియు మీ రాతలే!
ఇక్కడ వ్యాఖ్యా ఘాతాలు తగుల్తాయి.. జర భద్రం అండీ.. అని ఇనుపతొడుగులు తొడుక్కొని రండి అని స్త్రీ రచయితలను హెచ్చరించదలిచాననుకుంటే పొరబడినట్లే! ఇలాంటి వాటిని లక్ష్యపెట్టని నేను అన్నా మరికొందరు సాహసిక స్త్రీలు అన్నా నాకు చాలా యిష్టం.
చాలామంది రచయితలు (స్త్రీలు) ఆత్మ కథలు రాసుకుంటున్నారు.
ధైర్యే సాహసే… రచయితలు అనిపించింది.
అందరూ అనుకునేటట్టు ఆంక్షలు లేవు కదా అనుకుంటే సంతోషమేసింది. ఇది మంచి పరిణామమే! మీరు ఇలాంటివి కూడా రాసుకోండి. చరిత్ర లో రికార్డు అయి వుంటాయి.
ఇందుమూలంగా..
ఆనందం బ్లాగ్ అనూరాధ గారికి
హరి కాలం బ్లాగ్ హరి గారికి.. ధన్యవాదాలు.. 🙏🙏
ఇప్పటికీ పై మూడు రాతలకు కట్టుబడివుంటాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి