24, జూన్ 2026, బుధవారం

O Ploughman


*O Ploughman | హాలికుడా*


You keep farming, like an addiction  

Enduring droughts and floods  

Cursing the scant power supply  

Your hope, every sowing season,  

Is like a sprout that bursts through, cracking the earth.  


Crop loans, like sores on an ox,  

Offer no helping hand, no support.  

With crop insurances that sting like chilli powder,  

You melt the strength from your muscles,  

Shedding sweat that’s become second nature.  


Monsoons, fake seeds,  

Leaders’ promises like seawater,  

Project constructions like mirages -  

Even as they play hide and seek with you,  

With unshakable faith,  

For six seasons you keep vigil, lamps in your eyes,  

And harvest.  


You fill the middlemen’s granaries,  

Fill your home with mounds of sorrow,  

And turn your back on your own kin.  

You, the backbone of the nation,  

Your existence itself is precarious.  


Even when your heart runs dry  

Seeing the crop withered to the root,  

Even when your heart shatters  

Seeing the cracked, barren field,  

Because you trusted the earth,  

You keep living - like a walking corpse.  


You became a fish trapped  

In the real estate illusion’s net,  

A net that can even price a mother.  

When SEZ furnaces lit fires in your chest,  

You writhed in agony,  

Like Mother Earth in Karna’s fist.  


Under the rule of blind Dhritarashtras  

Who offer no compensation,  

You became Emperor Shibi.  

You became a small farmer  

Who leases land just to cultivate.  


No matter how many hardships, you must live on  

To keep everyone else alive.  

As witness to the Green Revolution,  

Your own life, unable to turn green,  

Finally hangs from the noose,  

Heaping mounds of grief.  


O Ploughman! O Lover of the Nation!  

A thousand salutes to you.  


Original Poem in Telugu “Haalikudaa” by Vanaja Tatineni.

English Translation: 24 June 2026.

హాలికుడా

సేద్యం చేస్తూనే ఉన్నావు ఒక వ్యసనంలా 

అనావృష్టి..అతివృష్టి లను తట్టుకుంటూ

అరకొర ఇచ్చే విద్యుత్ సరఫరాని తిట్టుకుంటూ

ప్రతి ఏరువాకకి నీఆశ

పెటీల్మని చీల్చుకుని వచ్చిన మొలక లాటిది

చేదోడు వాదోడు కాలేని ఎద్దు పుండు లాంటి పంట రుణాలు

కారం జల్లినట్లు ఉండే పంటల భీమాల సాక్షిగా

నీ కండల్లోని సారాన్నికరిగిస్తూ

అలవాటైన స్వేదాన్నిచిందిస్తూ 

రుతుపవనాలు నకిలీ విత్తనాలు

సముద్రపు నీళ్ళ లాటి నేతల వాగ్దానాలు

ఎండమావిలాంటి ప్రాజెక్ట్ నిర్మాణాలు 

దోబూచులాడుకుంటున్నా

మొక్కవోని విశ్వాసంతో

ఆరుగాలం కళ్ళల్లో వత్తులు వేసుకుని పండించి

దళారీల గాదెలు నింపి

నీ..ఇంట దుఖ రాసులు నింపి

నీ వారికి.. వెన్ను చూపించే

దేశానికి వెన్నుముకవి నీ ఉనికి పదిలం

మొదలంటా ఎండిన పైరుని చూసి గుండె తడి ఆరిపోయినా

నేర్రులువారిన పంటపొలం చూసి గుండె వ్రక్కలైనా

భూమిని నమ్ముకున్నావు కనుక

జీవశ్చవంలా బ్రతుకుతూనే ఉంటావు  

అమ్మకైనా వెల కట్టగల

రియల్ మాయాజాలపు వలలో చేపవైనావు 

సెజ్ కుంపట్లు నీ గుండెల్లోమంటలు రేపితే 

కర్ణుని పిడికిట్లోని

భూమాత కన్నా విలవిలలాడినావు

పరిహారం అందించని దృత రాష్ట్రుల పాలనలో

శిబి చక్రవర్తివైనావు 

గుత్తకైనా సాగు చేసుకునే

చిన్న కమతగాడివయ్యావు

ఎన్ని కష్టాలైన నీవు బ్రతుకుతూనే ఉండాలి

అందరిని బ్రతికిన్చేందుకు

హరిత విప్లవం సాక్షిగా

హరితం కాలేని నీ బ్రతుకు

ఆఖరికి ఉరికొయ్యకి వేలాడుతుంది

దుఃఖరాశులు నింపుతూ

హాలికుడా! జాతి ప్రేమికుడా

నీకు వేనవేల వందనాలు. 


06/05/2013.

23, జూన్ 2026, మంగళవారం

వజ్రాల వైరం

 వజ్రాల వైరం    


నువ్వు తూర్పు గాలివైతే 

నేను పడమటి మబ్బుని  

నువ్వు నమ్మిన నిజం 

నాకు అబద్ధం అవుతుంది  

ఒకే గదిలో ఉన్నా మధ్య ఎడారి దూరం  

మాటలు మంచులా కురిసినా 

తడవని నేల మనం  


నువ్వు పుస్తకం చదివితే 

నేను పాట వింటాను. 

ఒకే పాటను నువ్వు విషాదం అంటావు,

నేను వేదాంతం అంటాను


నువ్వు నేలవైతే నేను నింగిని  

ఒకే ప్రపంచంలో ఉన్నా  

ఎప్పటికీ తాకలేం.  

నువ్వు కట్టిన కలల ఇంటికి  

నా ఊహలు గుమ్మాలు కావు


ఇద్దరం రెండు వజ్రాలం  

రెండూ విలువైనవే, మెరిసేవే  

కానీ పొదగగలం, అతికించలేం.  

పక్కపక్కన పెడితే  

ఒకదాని కాంతి 

ఇంకోదానికి నీడ అవుతుంది.  

రాపిడిలో మెరుపు కాదు

నిప్పు రవ్వలే రాలతాయి.  


మరి.. రెండు గుండెలు!? 

కొన్ని స్నేహాలు బంధాలు 

కలిసి వుండటానికి కాదు 

విడిపోవడానికి కలుస్తాయి 

గాలిలో దీపాల్లా కొట్టుకుంటాయి 

ఆరిపోతాయి


23 June 2026   10:40 am


22, జూన్ 2026, సోమవారం

Life is beautiful






 లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ - వనజ తాతినేని. 


తీర్చి దిద్దినట్లు వుండే కనుబొమ్మలు అర్దచంద్రాకారంలోకి 

కుంచించుకుపోతుంటాయి

వయసు తరుగుతున్నందుకు సాక్షిగా.


రెండు దశాబ్దాలుగా తెరకు అలవాటైన విశాల నేత్రాలు 

అలసి రెప్పలను మడతవేస్తాయి. 


వైభవం కోల్పోయిన ఫాలభాగం చిన్న స్టిక్కర్ తో 

సరిపెట్టుకుంటుంది.


కాంతులీనే కేశసంపద రంగు రూపు మార్చుకుని సౌందర్యాన్ని సగం మింగేస్తాయి.

వయసు పెరుగుతుందని అద్దంలో చూసుకున్న ప్రతిసారీ గుర్తు చేస్తూ.


విటమిన్ లోపం వల్ల తళతళలాడే పలు వరుస క్రమం తప్పి 

వంకర టింకర చిరునవ్వును దాచుకుంటాయి.


హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వల్ల అవాంచిత రోమాల తొలగింపులో 

బెల్లం ముక్కలాంటి గడ్డం నల్లగా నిగనిగలాడుతుంది. 


శంఖంలాంటి కంఠానికి పెట్టని నగలా వుండే చారలు 

ముడతలుగా స్థిరపడిపోతాయి. 


నీ గోధుమ రంగు ఛాయ నలుపు క్రమంలో జారుతూ 

నిస్తేజంగా మారుతుంటుంది.


ఖరీదైన చీరలు మాటున రింగ్ నెక్  బ్లౌజ్ మాటున 

బాడీ ఫిట్నెస్ బాల్యాని వెతుక్కుని పారిపోతుంది. 


టాల్కెం పౌడరు కూడా స్వీకరించలేని నీ శరీర సున్నితత్వం

బ్యూటీ కేర్ స్కిన్ కేర్  అంటే ఏమిటని ప్రశ్నించే నీ తత్వం 

ఆర్థో డాంటిస్ట్ ని కూడా కలవడానికి ఇష్టపడని విముఖత్వం 

ఇదే ఇప్పటి నీ అలంకారం. 

 

నలబై ఏళ్ళ క్రితం నిన్ను నా ఫస్ట్ క్రష్ అని చెప్పుకున్న అతను 

హఠాత్తుగా ఎదురైన నిన్ను చూసి ఆ అందమంతా ఏమైపోయింది 

అంటాడు ఆశ్చర్యంగానూ జాలిగానూ.


నువ్వు పగలబడి నవ్వుతావ్ అప్పుడు. లోలోపల కొద్దిగా దిగులు పడతావ్.

జీవితం కాటేయకపోతే అలాగే వుండేదాన్నేమో అనుకుంటావు కూడా.


అయినా సరే…

నువ్వు ఆత్మవిశ్వాసం అనే అందంతో  ఆకర్షణీయంగా వుంటావ్

ఎవరికి తలొంచని తలెగరేసే  పొగరుతో మెరిసిపోతావ్, 

ఇంకో రెండేళ్ళకు ఆరవ దశాబ్ధంలోకి అడుగుపెట్టబోయే నీకు

అందానికి నిర్వచనం ఏమిటో బాగా తెలుసు. 

ఈస్తటిక్ సెన్స్ అంటే ఏమిటో కూడా తెలుసు. 

అందుకే నీకు నువ్వు అందంగా గర్వంగా వుంటావ్

ఎవరేమి అనుకుంటే నాకెందుకు!? 


Did you Know!  I am Very beautiful. 

Life is Beautiful Life is Beautiful. 


 (Manifesto for Women Over Forty)


21 June 2026. 10:20 pm. 




21, జూన్ 2026, ఆదివారం

A Journey on Water

 A Journey on Water*


When I think of the distance travelled, fear grips me,  

As if someone shoved me from behind, without a glance back.  

Without knowing what I want, or what I must give to others,  

Looking at the time that has melted away, sorrow drowns me.


How wonderful it would be,  

If mistakes were letters written on a slate,  

Easy to wipe away.  

How wonderful it would be,  

If broken promises stood as warnings,  

Etched forever in stone.


How wonderful it would be,  

If the milestones along the path  

Reminded me of the distance shrinking.  

And how much more wonderful,  

If the entire road I walked on vanished,  

Leaving me back at my very first step.


Ask your heart,  

Filled with the silence of hope,  

Ask your own sigh,  

What of the journey you still must make...


If silence is a war,  

And if slipping into it is an eternal renewal,  

If some truth, however unclear,  

Still remains unseen by you,  

Then it means this:  

*Your journey has not even begun yet.*  

It means there are no footprints left  

Of your walk upon the water.  

It means yet another life's journey  

Has been placed before you.


Original poem in Telugu “Neeti pai Prayaanam” 


By Vanaja Tatineni 

Translation: 21 June 2026. 


నీటిపై ప్రయాణం   -వనజ తాతినేని. 


ప్రయాణీంచిన  దూరాన్ని తలచుకుంటే  భయమేస్తుంది

ఎవరో నెట్టేసినట్లు వెనుతిరిగి చూడకుండా

నాకేం కావాలో, ఇతరులకేం ఇవ్వాలో తెలియకుండానే

కరిగిన  కాలాన్ని చూస్తే దిగులు ముంచుకొస్తుంది


తప్పిదాలు పలక మీద వ్రాసిన అక్షరాలయితే

ఎంత బావుండును

చేసిన వాగ్దానాలు శిలాక్షరాలుగా నిలిచి

హెచ్చరించినా బావుండును


దారిపొడవునా నిలిచిన మైలురాళ్ళు

తరిగే దూరాన్ని గుర్తు చేసినా బావుండును

నడచినదారంతా  మటు మాయమై

తొలి అడుగులో  నిలిపితే మరీ బావుండును


ఆశా నిహతి నింపుకున్న

నీ గుండెని అడిగి చూడు...

నీ నిట్టూర్పు నడిగి చూడు

చేయాల్సిన ప్రయాణం సంగతేమిటో...


నిశ్శబ్దం ఒక యుద్ధమయితే

అందులోకి జారిపోవడం నిత్యనూతనమయితే

అస్ఫష్టంగానయినా గోచరించని సత్యమేదో

ఇంకా మిగిలి ఉంటుందంటే

నీ ప్రయాణం ఇంకా మొదలెట్టలేదన్నమాటే !

నీటిపై నడిచొచ్చిన  గురుతులేవి లేనట్లన్నమాటే

నీకింకో జీవిత ప్రయాణాన్ని ముందుంచినట్లే!


21/06/2016.