నేటి బాలలే రేపటి పౌరులు .పిల్లలే జాతి సంపద అంటారు. కానీ ఆ పిల్లలు..చదువుసందేలు లేకుండ్డా అజ్ఞానం అనే చీకటిలో.. పడిపోతుంటే..!?
అప్పుడే బడులు పునః ప్రారంభం అయి..రెండు వారాలు దాటింది .ప్రభుత్వ పాటశాలలో పుస్తకాల కొరత అని ఏటా వింటానే ఉంటాం. పిల్లలకి పుస్తకాలే సమయానికి ఇవ్వన్ని ప్రభుత్వాలు.. పిల్లలకి.మధ్యాహ్న భోజనం సరిగా పెడతారా? ప్రసార సాధనాల్లో.. ప్రకటనలు..ఊదరగొడుతూ..ఉంటాయి.. బాలబాలికలకందరికి.. నిర్భంద విద్య అమలు చేయడం ఏమో కానీ.. ప్రకటనలు వినడానికి ఎంత బాగుంటాయో..!
అమ్మ-నాన్న పనికి..పిల్లలు బడికి.. పనికి వెళితే డబ్బులు వస్తాయి అంటే..బడికి వెళితే జీవితం వస్తుంది.అంటారు..పిల్లలని బడికి పంపడం మన కర్తవ్యం ..అంటారు, నిర్భంద విద్య అంటారు.. ఇన్ని రకాలుగా చెబుతున్నా.. ఈ ప్రజలకి..బుద్ది .లేదేంటి..?పిల్లలని బడికి పంపరు..?
పుస్తకాలు కొనే పని లేదు, రెండు జతల బట్టలు ఇస్తారు.. మద్యాహ్న భోజనం పెడతారట.అయినా పిల్లలని ప్రభుత్వ బడికి పంపారు.. చచ్చే చెడో..కాన్వెంట్లకి పంపుతారు. పధకాలని,అవకాశాలని ఉపయోగించుకోవడం తెలియదు..ఇంగ్లిష్ విద్య మీద అంత మోజా? హాజరు పట్టీలలో ..పిల్లలే.! భోజన పధకం డబ్బులన్నీ.. కాంట్రాక్టర్ల జేబుల్లోకి.. .అని ఆవేదన వ్యక్తం చేసింది..ఓ.. విద్యా వాలంటీర్.
పల్లెటూర్లలో పారశాల విద్య కమిటిలో.. మెంబెర్ గా చేసిన అనుభం తో.. ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.
విద్యా అవకాశాలు పెరిగి ఉండవచ్చు. విద్యాశాతం మాత్రం పెరగడం లేదు. విద్యల వాడ పేరుగాంచిన విజయవాడ లో డ్రాప్ ఔట్స్ ని పట్టించుకునే వారు ఉండరు. అక్షరాల ౨౪౫౦ మంది..పిల్లలు.. గత ఏడాది బడి మానేసారని మొన్నా మధ్య. ముఖ్య మంత్రి గారి పర్యటనలో..వెల్లడించారు. వాస్తవాలు అంతకు రెట్టింపు ఉంటాయి..ఆ పిల్లలంతా మగ పిల్లలైతే.. చేతి పనులలో.. చేర్పించ బడతారు. ఆడ పిల్లలైతే.. ఇండ్లల్లో..పనికి..చేరతారు.
అలా ఒక అమ్మాయి..ఈ రోజు మా పక్కింట్లో పని కి కుదిరింది.. పది ఏళ్ళు ఉంటాయేమో..! విచిత్రం ఏమిటంటే..పని చేయించుకునే ఆమె ఒక బడిలో.లో ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు..ఆమె ఇంట్లో.. ఇలా బడి మాన్పించి.. పనిలో..పెట్టుకోవడం తప్పు కదండీ..అంటే..అబ్బే ..పనికి కాదండీ..నాకు హెల్ప్ చేస్తుంది..నేను చదువు చెబుతాను..అంది.
అమ్మాయిల చదువు విషయంలో తల్లిదండ్రులు..ఎందుకు శ్రద్ద తీసుకోరో!
నాకు ఎప్పుడో చదివిన కధ గుర్తుకు వస్తుంది.. ఆ కధ పేరు "నది మట్లాడిన రోజు." ఓ..పేద పిల్ల "జాను" కి చదువు అంటే..చాలా ఇష్టం .కానీ.. తల్లిదండ్రులు ఆ అమ్మాయిని బడికి..పంపరు.తల్లికి సాయం ఉండాలని.. ఇంట్లోనే ఉంచేస్తారు.
ఇంటి పనులు అయ్యాక జానూ..ఇంటి దగ్గరే ఉన్న నది దగ్గరకి..వెళ్లి కూర్చుంటుంది.. జాను ని నది పలక రిస్తుంది..దిగులుగా ఉన్నవేమిటి..అని అడుగుతుంది.జాను..తనకి చదువు అంటే ఉన్న ఇష్టం గురించి..ఇంట్లో వాళ్ళు బడికి పంపకపోవడం గురించి చెబుతుంది. ఇంట్లో..ఏమంటారో..అని భయపడకుండా నువ్వు దైర్యంగా వెళ్లి బడిలో..కూర్చో ! ..తరవాత సంగతి నేను చూసుకుంటాను అంటుంది..నది..భరోసాగా..
జానూ.అలాగే వెళ్లి కూర్చుని శ్రద్దగా..పాటాలు వింటున్నది గమనించిన టీచర్..జనూ ని గుర్తించి.. ఆమె విషయాలు కనుక్కుని.. జనూ తండ్రితో..మాట్లాడి..బడిలో..చేర్చుతుంది అప్పుడు జనూ సంతోషించి..కృతజ్ఞతతో తన తలలోని పువ్వుని తీసి.. నది నీళ్ళలో....వదులుతుంది. అప్పుడు నది కిల కిల నవ్వుతుంది. ఇది నది మాట్లాడిన రోజు కధ. నది మాట్లాడిందో..లేదో..కానీ..జాను బడికి..వెళుతుంది. . జానూ చదువు కల నిజం అయింది... అలా ..ఆ కధ గుర్తుండిపోయింది.
మనం కూడా..చిన్న మాట సాయం తో.. చిన్న చిన్న సాయం తో.. బడి మానేసిన పిల్లలని బడికి పంపవచ్చు. మన ప్రక్కన విద్యా సుమాలు పూయించడానికి. మన వంతుగా. చిన్న సాయాలు చేద్దాం.సంతోషంగా.. .
నాకు తెలిసిన వాళ్ళింట్లో .. పనికి కుదిరిన..అమ్మాయి పని చేసే టప్పుడు..ఫోటోలు తీసి..పేపర్లో..వేయించాలి అనుకుంటున్నాను. మీకు పరిచయం ఉన్న వాళ్ళ పిల్లలు బడి మానేస్తే.. కొంచెం శ్రద్ద తీసుకుని బడికి.. పంపే ఏర్పాట్లు చేయండి..ప్లీజ్.. పేద పిల్లలు బడి మానేస్తే.. ఎలా ఉంటారో.. నేను వ్రాసిన కవిత లింక్ ఇస్తాను ..చూడండీ.
వనజవనమాలి - "ఆశల సముద్రం"
.
వనజవనమాలి - "ఆశల సముద్రం"
.
2 కామెంట్‌లు:
చాలా బాగుందండి ఈ రోజు పనిచేయడం వల్ల రోజు గడిచిపోతుందనే ఆలోచనే తప్ప పిల్లల భవిష్యత్తును చేతులతో నాశనం చేస్తున్నాము అని తెలుసుకోలేని వాళ్ళు . రిజర్వేషన్లు, స్కాలర్షిప్లు తరువాత ముందు వాళ్ళు బడిలోకి అడుగు పెట్టాలి కదా ?
నది మాట్లాడిన రోజు కథ బాగుంది .నేను కూడా ఒక విషయంలో ఒక నదికి క్రుతజ్నున్ని
నది మాట్లాడిన కధ చాలా బాగుందండి....
కాకపోతే పిల్లల చదువుల విషయములో వాళ్ళ తల్లిదండ్రులకు ఉండాలండి ఏ శ్రద్దైనా...
ఎందుకంటే మనము ఇప్పుడు వాళ్ళను బడిలో జాయిన్ చేస్తాము....
బాగున్నంతసేపు బడికి వెళ్ళనిచ్చి మరల మాన్పిస్తారండి తల్లిదండ్రులు.....
నిజానికి వాళ్ళను చదివించాలని వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటే చాలండి.... ఇక ఏమి అవసరము లేదు....
ఫీజులు కట్టలేకపోతున్నాము అంటుంటారు కాని,,,, నిజానికి ఎటువంటి ఫీజులు వసూలు చేయని ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వేరే అలోచన ఎందుకు?
ప్రభుత్వ పాఠశాలలను తక్కువ చేసి చూడనక్కరల్లేదు.... చదవలనే తపన ఉండాలి కాని......
నేను పోయిన సంవత్సరం మా ఊరిలో బడి మానేసిన ఇద్దరు పిల్లలను తీసుకెళ్ళి నాకు తెలిసిన కాన్వెంటులో డబ్బులు కట్టి జాయిన్ చేసాను....
తర్వాత వాళ్ళ గురించి మర్చిపోయాను..... మధ్యలో ఒకసారి సరాదాగా వెళ్ళితే నేను జాయిన్ చేసిన పిల్లలు కనిపించలేదు.... ఏమని అడిగితే వాళ్ళు సరిగా కాన్వెంటుకు రావడము లేదని చెప్పారు...... తల్లిదండ్రులను అడిగితే సరిగా రెస్పాన్స్ కాలేదు.... పోని వాళ్ళకి డబ్బులుకి ఇబ్బందా అంటే....
ఇంటికి టి.వి. లాంటి సౌకర్యాలకు కొదవ లేదు.... ఐ మీన్ వాళ్ళకు టి.వి.ఉండడం తప్పనడం లేదు...... మనకు ఖచ్చితంగా కావలసినవాటికి డబ్బులు లేవనుకోవడం...... నిజానికి అక్కరల్లేనిదానికి డబ్బులు లేకపోయినా ఎక్కడైనా సర్దుబాటు చేసుకోవడం......
వాళ్ళకు పిల్లల చదువు నిత్యవసరము అనిపించిన రోజునే ఇటువంటి డ్రాప్ ఆవుట్స్ తగ్గుతాయి....
కామెంట్‌ను పోస్ట్ చేయండి