30, జులై 2011, శనివారం
గురు బ్రహ్మలా! వీరు కుల బ్రహ్మలు..
28, జులై 2011, గురువారం
పేస్ బుక్ లో ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ గారు.
25, జులై 2011, సోమవారం
బాపు బొమ్మగా వాణీశ్రీ
23, జులై 2011, శనివారం
అసుర సంధ్య వేళ

ఇక పాట వినేయండీ!! అసుర సంధ్య వేళ ఉసురు తగల నీకు స్వామి
ఒక అజ్ఞాత మిత్రునికి కృతజ్ఞతలు. తప్పులు గానేను అందించిన సాహిత్యాన్ని సవరించించి నందులకు. మరీ మరీ కృతజ్ఞతలు..తో..ఈ పోస్ట్
22, జులై 2011, శుక్రవారం
దాశరధి ప్రస్థానం -ఓ వెలుతురు బాకు
దాశరధి గారి మొదటి కవితా సంపుటి "అగ్నిధార"
ఆధునికాంధ్ర సాహితీ చరిత్రలో.. దాశరధి గారిది ఒక ప్రత్యేక అధ్యాయం.ఆయన తెలంగాణలో పుట్టడం మూలంగా..భారత స్వాతంత్ర్య పోరాటంలో..ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేకపోయిందని.. చెపుతారు.దాశరధి అటు భారతావని మొత్తం స్వాతంత్ర్య సమర శంఖం పూరిస్తుంటే.. తెలంగాణం లో..ఆ ప్రాంత విముక్తి కొరకు పోరాడవలసి వచ్చినదంటే ..నిజాం పరపీడన వల్ల ప్రజలు ఎన్ని ఇక్కట్ల పాల్బడ్డారో !
దాశరధి తెలుగు దేశంలో ఒక భాగమైన తెలంగాణా స్వాతంత్రోద్యమానికి శంఖం పూరించారు. ఆ ఉద్యమంలో పాల్గొని ఎన్నో కష్ట నష్టములకి గురి అయ్యారు. జైల్లోను,ఉద్యమంలోను.. బాధతో..కవితావేశంలో.. ఆయన వేలువరించిన ఎన్నో కవితా ఖండికలను..మనం దృష్టిలోకి..తీసుకున్నా అందులో..ప్రధానమైనది.."అగ్నిధార"
నిజం పాలనలో విసిగి పోయిన తెలంగాణా ప్రజల ఆవేశం,ఆకాంక్షలన్నీ..దాశరధి కవిత్వంలో..ప్రతిబింబించాయి..రజాకార్ల దుండగాలతో ..ఆస్తుల దోపిడీలతో..గృహదహనాలతో ,స్త్రీల మాన అపహరణ లతో.. మారణ దారుణ కాండ కి అట్టుడికి పోయిన కాలంలో.. దాశరధి ఆగ్రహావేశంతో..
ఓ..నిజాం పిశాచమా!కానరాడు
తర తరాల స్వప్నాల సుందర ఫలమ్ము
ఆయన ప్రభావంతో..ఎందరో..ఉద్యమంలోకి దుమికి పనిచేసారు.
హృదయం వినా నా దగ్గర ఏ వస్తువు లభించదు -ఉదయం వినా నా కంటికి ఏ వస్తువు రుచించదు
గతాన్ని కాదనలేను ,వర్తమానం వద్దనబోను ,భవిష్యత్ ఒదులుకోను ..కలం నా కంట మాల .. నా పేరు ప్రజా కోటి -నా వూరు ప్రజా వాటి ..అంటారు.
20, జులై 2011, బుధవారం
వేయివేణువులు మ్రోగేవేళ..
వేయి వేణువు మ్రోగేవేళ
హాయి వెల్లువై పొంగేవేళ
రాసక్రీడలో చేరేవేళ
రాదమ్మని లాలించేవేళ
నను పాలించగ నడచివచ్చితివా..
మొరనాలింపగా తరలి వచ్చితివా..గోపాలా..(నను)
అరచెదిరిన తిలకంతో అదిగదిగో రాధమ్మ
అరజారిన పయ్యదతో అదిగదిగో గోపెమ్మ
ఎరుపెక్కిన కన్నులతో ఇదిగిదిగో సత్యభామ
పొద పొదలో ఎద ఎదలో
నీ కొరకై వెదుకుతు ఉండగ (నను)
కంసుని చెరసాలలొ ఖైదీగా పుట్టావు
కాంతల కౌగిళ్ళలో ఖైదీగా పెరిగావు
కరకురాతి గుళ్ళలో ఖైదీగా నిలిచావు
ఈ భక్తుని గుండె లో ఖైదీగా ఉండాలని (నను)
ఎంత చక్కని పాట. నాకైతే ఎంతో ఇష్టమైన పాట.
వనమాలి పాటేదైనా అందునా..వేణువు ఎన్నిమార్లు విన్నా తనివితీరదు.
"మామ" స్వరకల్పనలో వేణువు రాతిలో కూడా రాగాలు పలికిస్తుంది.
ఇక సాహిత్యం విషయంకి వస్తే ఆయన రాముడి పేరుని ఇంటి పేరులో, కృష్ణుడిని తన పేరులోనూ సమన్వయపరచుకున్న దాశరధి కృష్ణమాచార్యులు.దాశరథి గా ప్రతీక.
ఇంతటి భక్తిరసంలో..ముంచెత్తుతూ ఆ సాహిత్యపు సొంపులు చూడండీ!!మధురాతిమధురం. సాహిత్యంలో వారి ముద్రని మరోసారి చెప్పుకుందాం.
ఆ వనమాలికి భక్తులన్న అలవిమాలిన అనురాగం. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం తాండవిస్తుంది. అందుకేనేమో..అసలే దక్షిణ నాయకుడు. అష్ట భార్యలున్నవాడు. ఆ పై పదహారువేల గోపెమ్మలు. అయినా ఆయన అందరిని సంతోషంగా ఉంచగల్గాడు. ఎందుకంటే నిజంగా ఆయన రెపల్లె లోనో, బృందావనిలోనో ఉండడు.ఆయన నివాసం భక్తుల హృదయాలు. పిలవగానే వడి వడిగా పరుగు పరుగున వాలిపోతాడు. వారిని పాలిస్తాడు,మొరలాలకిస్తాడు. తనని ఆరాదించే భక్తులకి హృదయంలో బందీగా ఉంటాడు. అది వనమాలి భక్తులకి..ఇచ్చిన వరం. అదే సంగతిని..బహు సుందరంగా వ్రాసారు కవి. నిజంగా.. ఆ నల్లనయ్య ఆ సాహిత్యానికి, ఆ..మధుర గానానికి..పరుగు పరుగున రాకపోడా అనేంత గొప్పగా ఉంది సాహిత్యం.
వేణువు ఒకటి మ్రోగితేనే మది ఊగుతుంది,తూగుతుంది. అలాటి వేయి వేణువులు మ్రోగేవేళ ఎంతగానో ప్రేమించే రాధమ్మని చేరి రాసక్రీడలో..మునిగే వేళ ఆపదలో ఉన్న భక్తుడు పిలవగానే.. ఉన్నపళాన ఆ నల్లన్నయ్య పరుగు పరుగున భక్తుల కడకు వచ్చెస్తే..
ఆయనంతే! భక్తులని యెప్పుడూ పాలించడానికి, లాలించడానికి
కనికరించడానికి సిద్దంగా ఉండగలడు . కానీ ఆయన దేవేరి లకు కోపం తెప్పించదూ? మంచి సమయము..భార్యని వదిలేసి వెళ్ళిపోతే? ఇక వారి అవస్తలు ..ఇలా..ఉంటాయని చెప్పడం ఒక శృంగార కావ్యం కూడా! రసమయ జగత్తులో ఉండగా ఆ నల్లనయ్య ఆమెని విడిచి వెళ్ళగా మోహంతో..శయ్య పై ఆ రాధమ్మ పొరిలి పొరిలి సగం చెరిగిన కుంకుమతో ఊర్పులు విడుస్తుందని..
ఆ గోపెమ్మ ఏమో..కోరికతో సగం జారిన పయ్యదతో..కలియచుడుతుందని, ఇక సత్యభామ తనని వొదలి వెళ్ళాడన్న కోపం తోనూ, వాంఛ వల్ల ఎర్రగా మారిన కన్నులతో పొద పొదలోన ఆచూకీ కోసం ఎద ఎద లోను వెదుకుతూ ఉంటే..నన్ను పాలించగా నువ్వు వచ్చావా గోపాలా!? అని ఆయనని ఆర్ద్రంగా ,ముకుళిత మైన మనసుతో కీర్తిస్తున్నాడు..ఆ భక్తుడు.
చెరసాలలో ఖైదీగా పుట్టి ఇంతుల కౌగిళ్ళలో ఖైదీగా పెరిగి (అందరూ ఆయనని ప్రేమించే వారే కదా?) కరకు అయిన నల్ల రాతి గుళ్ళలో ఖైదీగా మారినా (ఆయనని రాతి గుళ్ళల్లో మనమే ఖైదీగా మార్చాము. ఆయన నిజంగా భక్తుల హృదయాలలో ఉంటాడని చెబుతారు.) ఈ భక్తుని గుండెలో ఖైదీ కావాలని కోరుకుంటాడు. ఎంత ఆశ! చూడండీ! అది అపారమైన భక్తికి చిహ్నం.
ఎంత చక్కని భావం. ఎన్ని సార్లు విన్నా..మళ్ళీ వినాలనిపించే పాట.ఈ చిత్రంలో శోభన్ బాబు గారు కృష్ణుడుగా ఎంత సుందర రూపమో! ఎ.ఎన్నార్ ఆహార్యం అంత చక్కనిదే! అందుకే పదికాలాలు నిలిచే పాట ఇది.
మీరు చూసి విని ఆస్వాదనలో మునిగి తేలాలని బుద్ధిమంతుడు చిత్రంలో.. ఈ పాట పరిచయం చేసాను.
వేయి వేణువులు మ్రోగే వేళ ..
12, జులై 2011, మంగళవారం
కొన్ని వాస్తవాలు - జీర్ణించుకోలేనివి
ఆడపిల్లలకు మొబైల్ ఫోన్లు నిషేధం
ఒకపక్క ఆధునిక కాలం పరుగులు తీస్తుంటే,మరోపక్క కుల సంప్రదాయాలు మనుషుల్ని వెనక్కినెట్టడానికి యత్నిస్తున్నాయి. ఒరిస్సాలో పైకలి ఖండయత్ అనే కులం ఒకటి ఉంది. ఆ కుల పెద్దలు ఈ మధ్య ఒక ఫర్మాన జారీచేశారు. దాని ప్రకారం ఆ కులానికి చెందిన పెళ్లికాని యువతులు ఎవరూ మొబైల్ ఫోన్లు వాడరాదు. ఈ ఆంక్షలు ఎందుకంటే మొబైల్ ఫోన్ ఉంటే పిల్లలు ప్రేమ అనో, ఇంకొకటనో ,ఇతరులతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పి మొబైల్ ఫోన్స్ పెళ్లికాని పిల్లలు వాడరాదని నిషేధించామని ఆ కుల సంఘం నేతలు చెబుతున్నారు. ఈ విషయమై ఆ కులంలో ఉన్న తల్లిదండ్రులందరికి కూడా విజ్ఞప్తి కూడా పంపారట.పెళ్లికాని పిల్లలు అర్జెంటుగా మొబైల్ ఫోన్ వాడవలసిన అవసరం లేదని కులపెద్దలు భావించారని కుల సంఘం నేత సోమనాద్ నాయక్ చెప్పారు. అనేక విద్యా సంస్థలు మొబైల్ ఫోన్స్ ను తమ ఆవరణలో వాడడాన్ని నిషేదించినప్పుడు తాము కూడా ఈ పనిచేస్తే తప్పేముందని ఆయన ప్రశ్నిస్తున్నారు.ఒడిషాలోని గంజాం జిల్లాలో పైకలి కుటుంబాలు పదివేల వరకు ఉంటాయి.అయితే తమ ఫత్వాను ఉల్లంఘించేవారికి ఎలాంటి శిక్షలు వేయాలన్నది ఇంకా నిర్ణయించలేదు.ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేస్తున్నామని ఇంకా శిక్షల గురించి ఆలోచించలేదని చెబుతున్నారు. విశేషం ఏమిటంటే ఈ కులం లో పిల్లలంతా పదో తరగతి వరకైనా చదువుకోవాలని కూడా ఈ కుల సఃగం కోరుతోంది.మరి చదువును ప్రోత్సహిస్తూ, అభ్యుదయంలో ఉన్నారనుకోవాలో, లేక మొబైల్ వాడకంపై నిషేదం పెట్టి తిరోగమనంలో ఉన్నారనుకోవాలో!ఈ ప్రమాణాల తంతులో అసలు సత్యం తేలకపోతే వాతల కోర్టుకు వెళతారేమో!
11, జులై 2011, సోమవారం
ప్రకటనల హోరు ..అందమైన రంగుల ప్యాకింగ్ వల
అధి ఒకప్పుడు. ఇప్పుడు ఆవిడ వార్నియర్ అనే షామ్పు వాడుతుంది . సరసంలో యెప్పుడైనా జడ నా మెడకి చుట్టుకుందా !? నా మెడకి ఉరి అవుతుందని భయం అన్నాడు.
జుట్టుకొసలు పట్టి అమాంతం లారీని లాగుతుంటే భయం వేయదా చెప్పండి మరి.?
పాపం అమాయకుడు అనుకున్నాడతని స్నేహితుడు.
మామయ్య గారు! మీ అమ్మాయి రొజు వంట మాడ్చి మసి చేస్తుంది.అందం తప్ప ఏమి లేని మీ అమ్మాయి నాకొద్దు తీసుకుపోండి అన్నాడు అల్లుడు కోపంగా..
బాబ్బాబు..చచ్చి నీకడుపున పుడతాను జీవితాంతం సరిపడ ఓడోనిల్ ఖర్చు భరించుకుంటాను కాదనకు .బాబు అని బతిమలాడుకుంటున్నాడు మామగారు.
ఆడపిల్ల్లకి పని పాట రాకపోయినా ఇప్పుడు యెంత సౌలభ్యమో కదా?
ప్రత్యాన్మయాలు వెతుక్కోనక్కర లేకుండా..మార్కెట్ లో మన కోసం బొలెడు యేర్పాట్లని చేసేసి పెట్టెసిన వారికి..ఎప్పటికి రుణపడి ఉంటాము కదా!
ఒక లైవ్ ప్రోగ్రాం లో.. ఒక బ్యూటిషియన్ ని ఒక కాలర్ అడుగుతుంది.ఇలా.."మేడం!నేను ఒక సోప్ వాడుతున్నాను. ప్రపంచం అంతా మీ చుట్టు అంటారు కానీ మా పక్కింటి ముసలాయన కూడా నా వైపు కన్నేత్తి చూడటం లేదు.ఏం చేయాలి చెప్పండి.? అంటుంది.
ఉద్యోగానికి వెళ్ళే ఓ ఆధునిక అమ్మ ఓ.. కొబ్బరి నూనె ఉంటే చాలు అంతా తనే చూసుకుంటుంది అంటుంది.ఇక పిల్లలకి సంరక్షణ కోసం అమ్మలు అవసరం లేదు అన్నమాట.కొన్ని వస్తువులు ఉంటే చాలు.
ఓ పరిమళం సొకితే చాలు.ఓ అమ్మాయి వెంట అబ్బాయిలు..పదికి తక్కువ కాకుండా వెంట బడతారు. కస్తూరి మౄగం వెంట ఆడ జింకలు పడినట్లు.వావి వరుస లేకుండా ఉచ్చనీచాలు మరచి పరుగుతీయడంని మనం కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాం.
ఇప్పుడు తేలిసి ఉంటుంది..నేను ఏం చెపుతున్నానో.
వార్తలు తర్వాత నేను ఎక్కువగా చూసేది..నన్ను ఆకర్షించేవి.. ప్రకటనలే!
ప్రకటనలని నేను చాలా ..శ్రద్దగా చూస్థూఉంటాను.కొన్ని ప్రకటనలు..చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
మనం నిత్యం చూస్తున్న వ్యాపార ప్రకటనల్లొ ఉన్న అసత్య ప్రేలాపనలని చూడండీ!
వినియోగదారుణ్ణి అందమైన అసంబద్దమైన ప్రకటనల వలవేసి మోసగించడం అనేది.. వ్యాపార సంస్థలకి వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. ప్రకటనల మాయాజాలంలో వినియోగదారుడు నిత్యం మోసపోతూనే ఉన్నాడు.
రూపాయి విలువ చేసే షాంపు సాచే కి..సరాసరి కోట్ల రూపాయలు ప్రకటనలకి వెచ్చించి అమ్మకాలు పెంచుకుని నాణ్యతా ప్రమాణాలు తగ్గించి..అందులొ లాభాలు దండుకుంటున్నారు.
ఏ వస్తువుకైన గుండు సూది మొదలుకుని విమాన సంస్థ వరకు అన్నింటికి ప్రచారం అవసరం అయిన రొజులు ఇవి.
వ్యాపర ప్రకటన్ల లో కూడా సౄజనాత్మకత ఉన్న ప్రకటనలు ఉన్నాయి. మరీ అతిశయోక్తంగా ఉన్న ప్రకటనలు చూస్తే విసుగు పుట్టి అసలు ఆ వస్తువులె కొనడం మానేస్తారని తెలియక ఒకరిని చూసి ఇంకొకరు హోరాహోరీగ చానల్స్ పుణ్యమా అని చూసే కళ్ళకి కనికట్టు కడుతున్నారు.
ఒక ప్రకటన ప్రభావం వీక్షకులపై చాలా ప్రభావం చూపుతుంది.షాపింగ్ కి వెల్లినప్పుడు అవసరం ఉన్నా లేకపొయినా అనాలోచితంగా..కొనుక్కుని ఆనక తీరిగ్గా కూర్చుని..దిగులు పడే సందర్భాలు ఉంటాయి.చాలా సైలెంట్గా కొన్ని ప్రకటనలు మనపై ప్రభావం చూపదం వల్ల.. మనం ఆ బ్రాండ్ తప్ప ఇంకేది కొనడానికి ఇష్టపుట్టనంతగా .. నియంత్రించబడతాము.
కొన్ని సెకనల కాలంలో.. ప్రకటనలు వాటి పని అవి చేసుకుని వెళ్ళిపొతాయి.ఓకొసారి ఏది కొనాలో తెలియని అయోమయంతో సతమతమవుతు ఉంటాము.
హెల్థ్ కేర్ పేరిట,శరీర సంరక్షణ పెరిట మద్య తరగతి ప్రజల జీవన విదానం పై.. ప్రభావం చూపుతూ..ఆర్దికంగా కుదేలు చేస్తున్నాయి.వస్తువుల ధర పెంచాలనుకున్నప్పుడల్లా.. ఒక ఉచిత బహుమతిని అంటగట్టి వస్తువు రేటు పెంచేసి తర్వాత వస్తువు రేటుని పిక్స్డ్ చేసి వినియోదారులని. నిలువునా ముంచేయడం మోసగించడం వ్యాపార సంస్తలు చెస్తున్న పని. యెవరి వల్ల అయితే సంస్తలు మనుగడ సాగిస్తున్నాయో ఆ వినియోగదారుణ్ణి మోసగించడానికి..క్షణ క్షణం ఆలోచిస్తూ ఉంటాయి సంస్థలు. వ్యాపార ప్రకటనలలో సౄజనాత్మకత ఉంటే చాలదు వస్తువు నాణ్యత,విశ్వసనీయత కూడ అవసరం అప్పుడే ప్రకటన ధీర్ఘ కాలం ప్రభావం ఉంటుందనేది జగమెరిగిన సత్యం.
అందమైన రంగుల ప్యాకింగ్ వల లో చిక్కుకున్న వినియోగదారులు నిత్యావసర వస్తువుల కొనుగోలులో..ధరల పెరుగుదలలో తడిచి బతుకు భారమై అత్తెసరు జీవనం సాగుస్తుంటే వందల కొట్ల లాభాలతో..బహుళ అంతస్తుల భవనాలలో నివసిస్తూ ప్రపంచ ధనవంతుల జాబితాలొ చేరి మనకు గర్వకారణం అవుతున్నారు.
ప్రకటనల కోసం ఇప్పుడు అన్ని చోట్లు అనుకూలమే! నాలుగు రోడ్ల కూడలి మొదలుకుని.విమానంల సీట్ల పైన కూడా ప్రకటనల మయమే!
ప్రతిది ఎగ్జిబిషనైజ్ ఐపోయింది.వస్తువినియోగంలో వస్తువ్యామోహంలో అనుబందాలు కూడా పలచనబడిపోతున్నాయి.మెటీరీలిస్టులుగా మారిపోతున్నారు. వస్తు వ్యామోహంలొ..ఇంట్లో అనవసరమైన చెత్త కూడా పేరుకుపోతుంది.
కాలక్షేపపు షాపింగ్ చేసే వారికైతే పర్లేదు కానీ..సామాన్య ప్రజానికం కి..ప్రకటనల ప్రభావం వల్ల చాలా నష్టం.ఒకటికి పదిసార్లు ఆలొచి0చుకుని నాణ్యత చూసుకుని కొనుక్కోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది. మనశ్శాంతి మిగులుతుంది.
ఇప్పుడైతే మొబైల్ కి మించిన ప్రకటనా స్థలం లేదు వివిద వ్యాపర సంస్థలకి మన నంబర్లని అమ్ముకుని సొమ్ము చేసుకొవడం దగ్గర నుండి మన సహన్న్ని పరిక్షిస్తూ నిత్యం ఎన్నో ప్రకటనలు. తల తీసుకు వెళ్ళి రోట్లో పెట్టినట్లే!
ఏమంటారు? మీరు ప్రకటనల మోజులొ పడకండి. మీ అనుభవాలు పంచుకోండి.
ఆన్ లైన్ షాపింగ్ల లోను.. చాలా మోసాలు.ఇక చానల్స్ లోనైతే గంటల తరబడి ప్రకటనల మయం.బలహీనతల మీద సొమ్ము చేసుకుంటూ. జాతి రాళ్ళు,దిష్టి యంత్రాలు, సురక్షా కవచాలు,ఆయుర్వేద మందులు..కావేవి ప్రకటనలకి అనర్హం. ఇలాటి వాటి బారిన పడకుండా ప్రకటనలని చూసి నవ్వుకుందాం. సరేనా?
10, జులై 2011, ఆదివారం
తాతలు నేతులు మా మూతులు వాసన
నేటి యువత జీవనవిధానం చాలా వేగవంతమైనది.విలాసవంతమైనది ప్రమాదకరమైనది. కొంచమైనా మానసికవికాసం లేక చదువుల ఒత్తిడిలో పడి వాళ్ళు కోరుకున్న దాని కోసమో తల్లిదండ్రులుకివ్వాల్సిన దాని కోసమో విపరీతంగా కష్టపడేవారు ఒకరకమయితే ఇక రెండవవర్గం వారు అటు చదువుసంధ్యలు లేక కుటుంబపరమైన బాధ్యతలు లేక వౄత్తివ్యాపారాలు నిర్వహించే శక్తిసామర్ద్యాలు కొరవై బద్దకస్తుల్లా సోమరితనంగా తయారవుతున్నారు.
పూర్వం వ్యవసాయదారుల కుటుంబాలలొ నలుగురైదుగురు పిల్లలుంటే ఒకరిద్దరిని చదివించి మిగతావారిని వృత్తిలో ఉంచేవారు.మునుపటి తరంలోనే కులవృత్తులకి ఉద్వాసన చెప్పాక ఇక ఇప్పటి తరంలో కులంపేరు చెప్పుకోవడం ఒకింత గొప్పఅయినాక కుల వృత్తులని చేపట్టడం నామోషి అయినాక ఎవరు ఎవరో ఎవరికి తెలియనవసరంలేదు.
ఒకప్పుడు పదెకరాల పొలంఉన్న రైతు ఎంతో కష్టపడితే కానీ సంసారం ఈదడం సాధ్యమయ్యేది. ఇప్పుడు అందులొ పదోవంతు ఉంటే చాలు..హయిగా..దర్జాగా బతికేస్తున్నారు. భూముల ధరలకి రెక్కలొచ్చాక నగరాల చుట్టు ఉన్న చిన్నఫాటి రైతుల పరిస్తితి కూడా యెంతో బాగుంది. ఒక పది సెంట్లు అమ్ముకోవడం ఆడబ్బు అయిపోయేదాకా విలాసవంతంగా బ్రతికేయడం ఆ డబ్బు అయ్యేలోపు మిగిలున్నభూమి నాలుగురెట్ల ధర పలకడం.. మళ్ళీ అమ్ముకుని తినడం పరిపాటి అయిపోయింది.పనీపాటా లేక చోటా మోటా రాజకీయ నాయకులుగా యెదగడం అదిఇధి కాకపోతే రియల్ ఎస్టెట్ బిజినెస్ అనిచెప్పుకోవడం పరిపాటి అయిపోయింది.
పూర్వీకులు సంపాదించిన ఆస్తులని అమ్ముకుంటూ సొమరితనంతో,జల్సాగా విలాసవంతంగా బ్రతకడానికి అలవాటుపడ్డ "లంఫెన్" వర్గపు యువత ఉండటం సర్వ సాదారణం అయిపొయింధి.నగరీకరణవల్ల వచ్చిన ముప్పు ఇది.నాకైతే ఇలాటి యువతని చూస్తున్నామేమిటని చాలా బాధ కల్గుతుంది.
ఒక వైపు డాలర్ల వైపు పరుగులు తీస్తున్న యువత,ఇంకొకవైపు పనిపాటా లేక సొమరితనంతో, విలాసవంతంగా బ్రతికే యువత, ఇంకొకవైపు నిరక్షరాస్యతతో పేదరికంలొ నలిగిపొతున్న యువత వీరందరిమధ్య దేశభవితా నీ భవిత ఎటువైపు?
"తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండీ" అనే యువత మన ముందు ఉంటారేమో!
9, జులై 2011, శనివారం
కలలు కనేందుకు.. కరిగి పోయేందుకు..

తెల్లారింది.. లేగండో..సిరివెన్నెల సాహిత్యం,గళం
తెల్లారింది లేగండో ..
పాట సాహిత్యం :
తెల్లారింది.. లేగండో .. కొక్కొరో కో..
మంచాలింక దిగండో..కొక్కొరో కో..
పాములాంటి చీకటి పడగ దించి పోయింది
భయం లేదు ఒయం లేదు నిదుర ముసుగు తీయండి.
చావులాటి సీకటి చూరు దాటి పోయింది
.భయం లేదు ఒయం లేదు చాపలు చుట్టేయండి.
ముడుసుకున్న రెక్కలిప్పి పిట్ట చెట్టు ఇడిసింది
మూసుకున్న రెక్క లిరిసి చూపులెగారనీయండి... (తెల్లారింది)
చురుకు తగ్గిపోయింది చందురుడి కంటికి
చులకనై పోయింది లోకం చీకటికి (చు)
కునుకు వచ్చి తూలిందా చల్లబడ్డ దీపం
ఎనక రెచ్చిపోయింది అల్లుకున్న పాపం
మసకబారి పోయిందా చూసే కన్ను
ముసురుకో దాకా మైకం మన్ను మిన్ను
కాలం కట్టిన గంతలు తీసి
కాంతులు ఎల్లువ గంతులు వేసి..(తెల్లారింది)
ఎక్కిరించు రేయిని చూసి ఎర్రబడ్డ ఆకాశం
ఎక్కుపెట్టి చూసిందా సూరీడు చూపుల బాణం
కాలి బూదిధైపోదా కమ్ముకున్న నీడ
ఊపిరితో నిలబడుతుంద చిక్కని పాపాల నీడ
చెమట బొట్టు చమురుగా సూరెడుని వెలిగిద్దాం
వెలుగు చెట్టు కొమ్మల్లో అగ్గి పూలు పూయిద్దాం(చెమట)
వేకువ చెట్టుల కత్తులు దూసి
రేతిరి మంచును ముద్దలు చేసి (తెల్లారింది)
ఇది సిరివెన్నెల సాహిత్యం,గళం..రెండూ.. కలిపి..ఒక పాట.
కళ్ళు లేని వారికే కాదు..కళ్ళు ఉన్నవారికి.. కూడా.. ఓ..వెలుగుపూల బాట.
కళ్ళు chiత్రానికి..ఈ..పాట ను వ్రాసారు. జానపద గీతం లా అనిపిస్తుంది. ఎస్.పి.బాలసుబ్ర మణ్యం గారు..ఈ చిత్రానికి..సంగీతం అందించారు.1988 లో..ఈ చిత్రం వచ్చింది.
సిరివెన్నెల గురించి తెలియడానికి ఈ పాట సాహిత్యం ఒక్కటి చాలు.అంతకు ముందు సిరివెన్నెల గురించి తెలిసిన వారికి ఇప్పుడు వారిపై.. ఈ పాట విన్నాక మరింత అభిమానం పెరుగుతుంధి సాహిత్యపరంగా ఈ పాట చాలా గొప్ప పాట సాహిత్యం వింటూ లిరిక్స్ వ్రాసుకున్నాను.వివరణమరొకసారి.
6, జులై 2011, బుధవారం
నది వంటి పరుగు కదా.. మానవ జీవన ప్రయాణం
నట రాజ పూజ చేసి ఇక్కడ పాట వినండి. వింటూ.. ఇది చూడండీ!
నది వంటి పరుగు కధ మానవ జీవన ప్రయాణం .. సుద్దాల అశోక్ తేజ..గారు అందించిన సాహిత్యం..యెంత గొప్పగా ఉందో..
ఈ..పాట వింటూ ఉంటె.. ఒడలు.. ఎంత ఉద్విగ్నతకు..గురి అయిందో.. చెప్పలేను.. సాహిత్యం,సంగీతం సమపాళ్ళలో ఉండి.. శంకరమహదేవన్ గళంలో.. ఎంతో.. సరళంగా..అందంగా ఒదిగిపోయింది..
నాట్యం ఒక యోగం..నిజంగా.. అది అందరికి రాదు ఆ భాగ్యం లభించడం..యోగం కదా!. అలాటి యోగ్య మైన అభినవ నాట్యం తో....నటరాజ పూజ చేయడం అటువంటిదే ..మనిషి జీవితంని పోల్చడం.. యెంత ఉత్కృష్ట భావం.. అంకిత భావం తో మనిషి చేసే పని.. భగవంతుని పూజించడం లాంటిదని చెప్పడం కూడా అందుకే కాబోలు.
కడ కడలి దాక ఎడ తెగక సాగు (కడ)
ఇంత అర్ధం ఎంత సొంపుగా..మన మాతృ బాష లో ఒదిగి పోయిందో కదా.. !?
శైశవము నుండి శవమయ్యేదాక, శివమయ్యే దాక
కన్నీటి పుష్ఫములతోను (నట)
4, జులై 2011, సోమవారం
మా ఇంటి వెలుగు
![]() |
| నిఖిల్ చంద్ర తాతినేని |
నీ ముందు ఉన్న వాళ్ళ లగేజ్..చెక్ చేసేలోపే.. నాకు పోన్ చేసి..అమ్మా! ఎక్కడ ఉన్నావమ్మా! నాకు కనబడు అమ్మా..పిచ్చివాడికి లా లగేజ్ నా చేతికి ఇచ్చి.. వదిలేసావ్..!.నాకు.. లోపల ఏమిటోగా ఉంది..ఇటు వైపు వచ్చి చూడు నేను కనబడతాను..అంటూ.. నువ్వు మాట్లాడిన తీరుకి.. అప్పుడే..నా గుండె..సముద్రమే అయింది.
నేను.. ఆ విపరీతమైన ఒత్తిడిలో..నుండి బయటపడుతూ.. నిన్ను..దృష్టికి అందేలా చూసుకుంటూ.. నీకు సమాంతరంగా వచ్చి నిలబడి నిన్ను చూసినప్పుడు.. మన మద్య ఉన్న అద్దాల అరలు..నిన్ను నన్ను..విడదీసే ఇనపకచ్చడాలు అనిపించాయి..బంగారం. నీకు..నేను కనబడ్డాక అరగంట తర్వాత.. నీ లగేజ్ చెకింగ్ అయ్యాక.. మళ్ళీ వెనక్కి వచ్చి.. నాకు జాగ్రత్తలు చెపుతూ.. ఉన్న నిన్ను చూసి..నేను స్తిమితపడ్డాను.పర్వాలేదు.. అలవాటు అవుతున్నాడు.. అనుకున్నాను.
ఇరవైరెండేళ్ళ పాటు..నీ తో పాటు..ఉండి నిన్ను నడిపించిన "అమ్మ" చేతిని..వదిలి నువ్వు ఖండాంతరాలు దాటి వెళుతుంటే.. నిన్నే చూస్తూ ఉండిపోయాను..బంగారం
కాసేపటిలో..ఓ..లోహవిహంగం ..నిన్ను..మా నుండి విడదీస్తుంది.రెక్కలు ఇచ్చి..నిన్ను..బతుకు..గమ్యం వెతుక్కోమని..పంపిస్తున్నాం అనుకున్నాను.
వెళ్ళినట్లే వెళ్లి.. సడన్గా వెనక్కి తిరిగి..సేక్యూరిటిని..అమాంతం దాటి.. ఐరన్ బారికేడ్ లు దాటి పరిగెత్తుకుంటూ..వచ్చి నన్ను గట్టిగా హత్తుకుని..అమ్మా! ఐ లవ్ యు..మా..! అంటూ..నా తలమీద చెయ్యేసి.. జాగ్రత్తమ్మా.. హ్యాపీ గా ఉండు..అని.. నాకేం పర్వాలేదు నేను బాగానే ఉంటాను..అని నాకు భరోసా ఇచ్చి.. నా చేతిని పట్టుకుని.. లొపలకి..వెళుతుంటే..సెక్యూరిటి మాన్..ముచ్చటగా నిన్నేచూస్తూ ఉండటం..నా..చేతిలోనించి నీ చేయి విడవటానికి..సమయం తీసుకోవడం..మీ నాన్నగారు.. అలాగే కించిత్ ఈర్ష్యగా..చూసి నవ్వుకోవడం.. నాకు.. ఆ గురుతులు..ఎంతో..పదిలం ..బంగారం.
పదకొండు నెలలు.. ఎలా గడచాయో తెలియదు. అక్కడ నీ వెతలు.. అనుభవాలు.అన్నీ విని.. ఒక నెల క్రితం.. నిన్ను వీడియోకాల్ లో..చూసినప్పుడు.. గంట సేపు..పొరిలి పొరిలి వచ్చిన నా దుఖం చూసి..ఇప్పుడు నువ్వు వస్తున్నావు అని..నాకు తెలుసు.ఎవరు వ్రాయ గలరు.. తల్లి కి బిడ్డకి ఉన్న అనుబంధం గురించి..









