కార్పోరేట్ స్కూల్లో మీ పిల్లలని చేర్పించ దలచారా? అలాగే మంచి చదువుల కోసం బయట ఉండటం వల్ల చాలా విషయాలు తెలుసుకుంటారు అని తల్లి దండ్రులు భావిస్తున్నారా?
కొంత నిజమే ఉండవచ్చు ఏమో! కానీ కార్పోరేట్ స్కూల్స్ లో..ఫలితాలలోనే కాదు చాలా విషపు భావాలని.. పెంచి పోషించి మన పిల్లలకి.. సమాజం నుండి విడివడి వర్గాలు తయారు చేసుకోవడంలో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ..బీజాలు నాటుతున్నారు.
విద్యలవాడ గా పేరు గాంచిన విజయవాడలో..కార్పోరేట్ స్కూల్స్ లో..కానివ్వండి కాలేజెస్ లలో కానివ్వండి..తెలంగాణా ప్రాంత వాసులు..కొందరు విజ్ఞులు వాళ్ళ ప్రాంతాల పిల్లలని విజయవాడ లో చేర్పించవద్దని మొత్తుకున్నావినకుండా.. లక్షమందికి పైగా విద్యార్దులని.. విజయవాడలో చేర్పించినట్లు లెక్కలు చెపుతున్నాయి..ని బోగట్టా. పెద్దవాళ్ళు ప్రాంతాల పేరిట హద్దులు రేపుతుంటే.. పిల్లలలో.. అంతర్లీనంగా కులభావన రేకేత్తిస్తున్నారు.
కోస్తా ఆంద్ర లో ఉన్న కుల అభిమానం ఇతర ప్రాంతాలలో..అంతగా వేళ్ళూను కోలేదని చెపుతుంటే సంతోషంగానే ఉంటుంది. ఇప్పుడు కులాలు,మతాలూ,ప్రాంతాలు,దేశాలు,ఖండాలు సరిహద్దులు దాటిపోయి ప్రపంచమే..ఓ..కుగ్రామం గా మారిపోతుంటే..ఇంకా కులాలు ఏమిటి అని..ఆధునికంగా ఆలోచించే వారికి..ఓ..హెచ్చరిక. వాళ్ళ పిల్లలు కూడా.. కులం కోరలకి..చిక్కి.. కళ్ళు మూసుకుపోయే బీజాలు ఇక్కడ పడుతున్నాయి. తల్లిదండ్రులు ఇది గమనించండి. పిల్లల పసి మనస్సులో చిన్నతనంలో పడే బీజాలు అంత త్వరగా ఎండిపోవు.పెరిగి పెద్దయి వట వృక్షాలుగా మారతాయి ఏమో..అని..ఆలోచన చేయండి.
సాదారణంగా.. పిల్లల పేర్లు లో..చాలా మందికి వాళ్ళ కులం ని పట్టించే లేదా గుర్తించే విదంగా పేర్లు ఉండటం ఉంది.ఉదాహరణకి..శాస్త్రి,రెడ్డి,చౌదరి,నాయుడు,గౌడ్,యాదవ్..ఇలా..అన్నమాట.అది మగ పిల్ల వారికీ మాత్రమే పరిమితం అయిందేమో..ఒకప్పుడు. ఇప్పుడు అయితే.. ఆడపిల్లలకి..కూడా.. కులం పేరు చేర్చుకుని పేర్లు పెట్టుకుని గర్వంగా ఫీల్ అవుతున్నారు. తల్లిదండ్రులు కూడా అలా పెట్టటం అనివార్యం అయినట్లు..నడుచుకుంటున్నారు.
తర్వాత మా చెల్లెలు కూతురు తన పేరు చివర మా కులం పేరుని తగిలించుకోవడానికి.. అదిక ప్రాధాన్యం ఇచ్చి..ఎన్నో ప్రక్రియల తర్వాత పేరు ప్రక్క తోక తగిలించుకుని వాళ్ళ కన్నా మనమే ఎక్కువ అని మురిసిపోడం దౌర్భాగ్యం అనుకుంటాను నేను. తల్లిదండ్రులుగా మా చెల్లెలు, ఆమె భర్తా కూడా కూతురికి.. మంచి మాటలు చెప్పడం పోయి..కులం తోక తగిలించుకుని సంబరపడిపోతున్నారు. అలా పేరు మార్పు కోసం విపరీతంగా ప్రయత్నం చేసేటప్పుడు అది అంత అవసరమా అన్నాను. ఖచ్చితంగా అవసరం. అలా లేకపోతే.. నాలుగు శతాబ్దాలు వెనక్కి వెళ్ళినట్లే అంటే.. ఏం అనగలం చెప్పండి.మన మధ్యే మనవారిలోనే..ఇన్ని మార్పులు. తోకలు అవసరమా ?.
ఒకోసారి.. నాకు చిరాకు వచ్చి ఆ పేరు.. కలవాళ్ళు మాఇంట్లో ఎవరు లేరని టపీ మని పోన్ పెట్టేస్తాను. అలా చాలా సార్లు జరిగాక "అమ్మ " ముందు అలా ఇంటి పేర్లుతో పిలిస్తే కోపం ..ఆన్సర్ చెప్పదు .. నిఖిల్..అని చెప్పండి.. మీ పేరే చెప్పండి..ఇంటి పేరు చేపితే కోపం..అని మా వాడు చెప్పాక..జాగ్రత్త పాటించే వారు.ఇవి మగ పిల్లలకే అంటే పొరబాటు పడినట్లే!
అసలు కులం ప్రసక్తి..ఎందుకు వస్తుంది.అని ప్రశ్న మనలో..కొందరికి రావచ్చు. కులాల వారిగా అన్నదాన సత్రాలు,కులాలవారీగా వివాహవేదికలు,కులాలవారీగా వనభోజనాలు..నిర్వహిస్తుంటే..మనం ఎప్పుడైనా అభ్యంతరం చెప్పామా? పేద వారికి ..వివాహాలు, పేద విద్యార్డులకి..స్కాలర్షిప్ లు ఇలా ఇస్తుంటే.. ఎవరి కులంలో..పేదవారికి వారు సాయం చేసుకుంటున్నారు..అనుకున్నాం కదా.. ఇప్పుడు కొత్తగా ఏర్పడటం ఏముంది అనేవారు ఉన్నారు. అయితే..సమాజంలో..ఆర్ధిక వెనుకబాటు తనం ఉన్న వారిని ఉన్నత వర్గం ఆడుకోవడానికి..కాలేజెస్ లో.కుల వర్గాలు ఏర్పరిచి పిల్లల మనసులో..విషబీజాలు ఏర్పడానికి మద్య గల సున్నితమైన సరిహద్దురేఖ ఏమిటో..తెలుసుకోలేకపోవడమే..దురదృష్టకరం.
ఒక ఉదాహరణ..చూడండి. ఒక కార్పోరేట్ స్కూల్లో.. ఒక సినీ కధా రచయిత పిల్లలు.. చదువుతున్నారు. అతనికి.. బహు భార్యాత్వం. నలుగురు పిల్లలు అదే స్కూల్లో చదువుకుంటూ..వాళ్ళ నాన్న గురించి..వాళ్ళ అమ్మల గురించి.. ఇటీవల విడుదలైన వాళ్ళ నాన్న రాసిన సినిమా కథలోని అంశాలు.ఆ సినిమాలో..పేర్లు..వాళ్ళ పేర్లు అన్నీ ఎందుకు..ఎలా మ్యాచ్ య్యే విదంగా పెట్టబద్దాయో.. అన్న విషయాలతో..పాటు.. హే.. మీ కులం పేరు ఏమిటో..నీ పేరులో..లేదేమిటి..నా పేరులో చూడు నాయుడు అని ఎలా పెట్టుకున్నామో.. కులం కావాలమ్మా? ఏ కులమో..తెలియందే.. నీతో..ఎలా మాట్లాడాలి..అని మాట్లాడిన అమ్మాయి.. మా చెల్లి కూతురు క్లాస్స్ మేట్ .
తండ్రి..తన కథల్లో కూడా వీలైనంత కుల ప్రాధాన్యతని,పౌరుషాన్ని చూపి.. యదాశక్తిగా ఆంద్ర దేశంలో..కుల గజ్జి బీజాలని వేసి..ఇప్పుడు..హైటెక్ పోకడలతో.. బహు భార్యత్వం గొప్ప అనిపించేంతగా పిల్లలని పెంచడం..ని.. ఏమనుకోవాలి.?
తర్వాత మా చెల్లెలు కూతురు తన పేరు చివర మా కులం పేరుని తగిలించుకోవడానికి.. అదిక ప్రాధాన్యం ఇచ్చి..ఎన్నో ప్రక్రియల తర్వాత పేరు ప్రక్క తోక తగిలించుకుని వాళ్ళ కన్నా మనమే ఎక్కువ అని మురిసిపోడం దౌర్భాగ్యం అనుకుంటాను నేను. తల్లిదండ్రులుగా మా చెల్లెలు, ఆమె భర్తా కూడా కూతురికి.. మంచి మాటలు చెప్పడం పోయి..కులం తోక తగిలించుకుని సంబరపడిపోతున్నారు. అలా పేరు మార్పు కోసం విపరీతంగా ప్రయత్నం చేసేటప్పుడు అది అంత అవసరమా అన్నాను. ఖచ్చితంగా అవసరం. అలా లేకపోతే.. నాలుగు శతాబ్దాలు వెనక్కి వెళ్ళినట్లే అంటే.. ఏం అనగలం చెప్పండి.మన మధ్యే మనవారిలోనే..ఇన్ని మార్పులు. తోకలు అవసరమా ?.
ఇక పిల్లలు చూస్తే వాళ్ళు వాళ్ళ పేర్లుతో..పిలుచు కోవడం మానేసి..ఇంటి పేరులతో..పిలుచుకోవడం...ప్యాషన్. ఒకోసారి నాకే అనుమానం వస్తుంది. మా.. అబ్బాయి ఫోన్ తీయకపోతే.. మా ల్యాండ్ లైన్ కి కాల్ చేసి ఆంటీ తాతినేని ఉన్నాడా అంటారు.. ఎవరు బాబు నువ్వు మాట్లాడేది అంటే.. నిమ్మగడ్డ..అంటాడు..నీ పేరు చెప్పు అంటాను వాదనగా..అప్పుడు వారి పేరు చెపుతారు .
ఒకోసారి.. నాకు చిరాకు వచ్చి ఆ పేరు.. కలవాళ్ళు మాఇంట్లో ఎవరు లేరని టపీ మని పోన్ పెట్టేస్తాను. అలా చాలా సార్లు జరిగాక "అమ్మ " ముందు అలా ఇంటి పేర్లుతో పిలిస్తే కోపం ..ఆన్సర్ చెప్పదు .. నిఖిల్..అని చెప్పండి.. మీ పేరే చెప్పండి..ఇంటి పేరు చేపితే కోపం..అని మా వాడు చెప్పాక..జాగ్రత్త పాటించే వారు.ఇవి మగ పిల్లలకే అంటే పొరబాటు పడినట్లే!
ఇక ఇప్పుడు ఆడపిల్లలు కూడా కులపు కోరలకి చిక్కుకుంటున్నారు. ఎనిమిదవ తరగతి చదివే ఒక అమ్మాయి తమ కులం వారు ఎవరో..తెలుసుకుని.. వాళ్ళతోనే మాట్లడటం, ఫ్రెండ్ షిప్ చేయడం,మిగతావాళ్ళు ని అంటరానివారిగా చూడటం..యెంత ప్రమాదానికి దారి తీసిందో!ఒక..అమ్మాయితో...జస్ట్ కామన్ టాక్ ..అంతే ..తర్వాత ఆ ఆమ్మాయి.. వేరే కులం అని తెలుసుకుంది.ఛీ..!! మీరు ఆ కులం అని తెలియదు.తెలిస్తే..మాట్లాడేదాన్ని కాదు అన్న మాటలకి.. పాపం ఆ వేరే కులం అమ్మాయి ఆత్మ హత్య చేసుకుంటే అందుకు ప్రేమ కథలల్లి.. ఆ గొప్పింటి అమ్మాయి ని కాపాడిన స్కూల్ యాజమాన్యం ఇక్కడే.
తల్లిదండ్రులు..విచక్షణతో..ఆలోచించరు ఎందుకని.? సమాజంలో.. ఒకే కులం వారే ఉండరు.తమ పిల్లలు కులతత్వంలో కూరుకుపోతుంటే. బయటకు లాగే ప్రయత్నాలు చేయక ఎందుకు ప్రోత్శాహిస్తున్నారు ?
అసలు కులం ప్రసక్తి..ఎందుకు వస్తుంది.అని ప్రశ్న మనలో..కొందరికి రావచ్చు. కులాల వారిగా అన్నదాన సత్రాలు,కులాలవారీగా వివాహవేదికలు,కులాలవారీగా వనభోజనాలు..నిర్వహిస్తుంటే..మనం ఎప్పుడైనా అభ్యంతరం చెప్పామా? పేద వారికి ..వివాహాలు, పేద విద్యార్డులకి..స్కాలర్షిప్ లు ఇలా ఇస్తుంటే.. ఎవరి కులంలో..పేదవారికి వారు సాయం చేసుకుంటున్నారు..అనుకున్నాం కదా.. ఇప్పుడు కొత్తగా ఏర్పడటం ఏముంది అనేవారు ఉన్నారు. అయితే..సమాజంలో..ఆర్ధిక వెనుకబాటు తనం ఉన్న వారిని ఉన్నత వర్గం ఆడుకోవడానికి..కాలేజెస్ లో.కుల వర్గాలు ఏర్పరిచి పిల్లల మనసులో..విషబీజాలు ఏర్పడానికి మద్య గల సున్నితమైన సరిహద్దురేఖ ఏమిటో..తెలుసుకోలేకపోవడమే..దురదృష్టకరం.
దేశాలు దాటి వెళ్లినా .. అక్కడ కూడా ధన అహంకారం,ఆధిపత్యపు ధోరణి,కుల వివక్ష చూపుకుంటూ వేరు కుంపట్లు ఏర్పరుచుకున్న వైనాలని మౌన ప్రేక్షకుల్లా చూస్తున్నాం. ఇక్కడ ఏవైతే ఉన్నాయో..అక్కడికి అవే మోసుకు వెళుతున్నారు. ప్రపంచమంతా జాతుల మద్య తెగల మద్య.. ఘర్షణలు అనివార్యం అయిపోయాయి.ఇప్పుడు ఈ కుల వివక్షలు కూడా అంతరిక్షానికి..కూడా మోసుకు వేళతామేమో..అనిపిస్తుంది.
ఈ పోస్ట్ వ్రాసినందుకు..నన్ను తెగిడే వారు ఉంటారని నాకు తెలుసు. పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు.. కులతత్వాన్ని నూరిపోసే స్కూల్స్ ,కాలేజస్ బారిన పడకుండా జాగురుకతో..అన్నీ తెలుసుకుని పిల్లలని మంచి విద్యాలయాలో చేర్పించండి..మార్కులు ఒక్కటే కాదు.. కలసి మెలిసి ఉండే తత్వం.. మానవత్వం..మనిషితత్వం కావాలి. తల్లిదండ్రులు అవి పెంచుకుంటే పిల్లలకి..ఆలస్యంగా అయినా అవి అలవడతాయి.

13 కామెంట్లు:
మీ ఇ౦టి పేరు, బ్లాగులో చక్కగా వ్రాసుకొన్నారు కదా. మీ అబ్బాయి స్నేహితులు అదే పిలుచుకొ౦టే తప్పే౦టి. అసలు ఇ౦టిపేరునే తీసెయ్యాలి అని అ౦టే తప్పు లేదు :)
http://vanajavanamali.blogspot.com/2010/12/vanajavanamali-kavithwa-vanamlovanaja_08.html..మౌళి గారు మీరు చెప్పింది.. సమంజసమే! సర్ నెమ్ అని మన దరఖాస్తు ఫారం లో లేని రోజు ఉంటె .. ఇంటి పేరుని వద్దనుకునే వారిలో..నేనే ముందు ఉంటాను. ఇంటి పేరుకి కులం ప్రత్యేకత తెలుపుకోడానికి తేడా ఉంది..కదా!ఈ లింక్ ఒక సారి చూడండీ ..ప్లీజ్
ఎక్కువ శాతం మంది, ఎవరో వేరే కులం వారికి కులగజ్జి ఉందని విమర్శిస్తారు,
స్వంత కులం తో సహా కులగజ్జి ఉన్నవారందరినీ తూర్పారబట్టారు. హాట్స్ ఆఫ్ !!
హ్మ్ చూసాన౦డీ. కానైతే ఒకేపేరు తో ఇ౦కొకరు ఉ౦డె నేపధ్య౦ లో ఇ౦టి పేరు తో పిలిచే సౌలభ్య౦ ఉ౦ది. స్కూల్ ,కాలేజి, పని చేసే చోట ఇ౦టి పేరు/ ఇ౦కో పేరో తప్పనిసరి, కాని బ్లాగులో ఆ అవసరమేది అన్నదే సమస్య. అది టపా వ్రాసారు కాబట్టి
@ఇంటి పేరుకి కులం ప్రత్యేకత తెలుపుకోడానికి తేడా ఉంది..కదా!
అదే నా ప్రశ్న౦డీ , రె౦డూ ఒకటికానప్పుడు ఇ౦టి పేరు తో పిల్చుకొ౦టే తప్పు౦డ కూడదు.
మౌళి గారు అలా ఇంటి పేరుతో..పిలుచుకోవడం వల్ల కూడా ఇతర కులపు విద్యార్ధుల నుండి..వీళ్ళను ప్రత్యేకం చేసుకుని.. ఇతర కులాల గురువుల వల్ల బాధింపబడుతున్నారు.ఇతర కుల విద్యార్దుల నుండి.. అక్కసుని.. ఎదుర్కుంటున్నారు.అది అవసరం కాదు కదా! విద్యాలయాలలో..మొదలైన ఈ జాడ్యం ఉద్యోగాలలో,సమాజ మనుగడలో.. మనిషికి మనిషికి మద్య అడ్డుగోడలు కడుతుంది.అలాంటి అవాంచనీయం..మనం కోరుకోగలమా?మొగ్గలోనే తుంచే బాద్యత,విజ్ఞత పెద్దలదే కదండీ.. స్పందించిన మీకు నా ధన్యవాదములు.
అదేమిటండి మీరిలా రాస్తున్నారు. అసలికి అభ్యుదయ వాదులు,హేతువాదులు, వామపక్ష వాదులు,మానవ వాదులు అందరు ఇక్కడనుంచే కదా తెలుగు ప్రజలను వుద్దరిం చటానికి బయలుదేరింది. కాని మిగత ప్రాంతాలకన్నా ఈ ప్రాంతంలోనే కుల పిచ్చి ఎందుకు ముదిరిందో పరిశోధన చేసి రాయండి. ఒక బ్లాగ్ లో ఆంధ్రా పెరియవార్ మేము ఎంతో పోరాటం చేసి ప్రజలని చైతన్య పరచాం అని రాస్తుంటారు. వారు చెప్పినవి చదివి అందులో ఎన్ని నిజాలో తెలియజేయండి. పేపర్ లో చదవటం తప్ప మాకు ఆంధ్రాప్రాంతం తో సంభంధం లేదు. ఇప్పటివరకు చూడనూ లేదు.
http://innaiahn.blogspot.com/
http://naprapamcham.blogspot.com/
బడి, కాలేజి, పని చేసే చోట ఎక్కడ కులం ఏమిటన్నది వ్రాయవలసిన అవసరం లేదు. కాని ఇవి వస్తున్నది ఇ౦టిను౦డి. తల్లిద౦డ్రులను౦డి, ఇ౦టిపరిస్థితుల ను౦డి . పిల్లలను అనవలసిన అవసర౦ ఏ మాత్ర౦ లేదు. తమకుల౦ ఏమిటో మర్చిపోవాల్సిన, చెప్పుకోకుదని అవసర౦ లేదు. ఇ౦కో కులాన్ని కి౦చపరచన౦త వరకు. అది పెద్దలను౦డి పిల్లలకి రావాలి. కాని కాలేజి లు, యాజమాన్యాలు ఏదో చేస్తున్నాయనుకోడ౦ పిచ్చితనము.
ఒక్కసారి చదువయ్యాక, పని చేసే చోట కులభావం ఉ౦చుకోవాలన్నా వీలు పడదు.
ఇ౦కా ఈ విద్యాలయాల్లో చేరోద్దని తెల౦గాణా, ఇతర ప్రా౦తాల వారికి చెప్పడం హాస్యాస్పదం. ప్రత్యే క౦ గా పలానా ప్రా౦తాల విద్యార్దులు విద్యాలయాలు కులాల ను బట్టి విద్యార్ధులను వేధిస్తాయని చెప్పి ప్రా౦తాల వారిగా దూరం పె౦చడమ్ బాలేదు. కుల భావం మొదలయ్యేది ఇ౦టిను౦డి. మూలాల్లో సరిదిద్దకు౦డా ఎక్కడో కొమ్మలు రెమ్మలు పాడవుతున్నాయ౦టే !
తోకల గురించి చాలా బాగా చెప్పారు..
EXXCELENT
premagaa mana vaallani piliche muddu perlugaa inti perlu piliste tappuledu.kaani avi vaarini vidadeese vidamgaa unte tappaka kandinchaalsinde
అజ్ఞాత గారు.. మీరు చెప్పిన అందరిలో.. ఒకే కులం వారు లేరుగా.. ఇబ్బంది లేదులెండి. ధన్య వాదములు.
@మౌళీ గారు.. మీరు.. చెపుతున్నదే కదా..నేను చెప్పాను... భారత దేశం ఒక చెట్టు. రాష్ట్రాలు కొమ్మలు...అయితే రెమ్మలు..ప్రాంతాలు కాదు..కుల సంఘాలు,కుల ప్రముఖులు కాదు. విద్యాలయాలు కుల కొమ్మలెక్కి కూర్చుంటూ ఉన్నాయనే నా బాధ. మనుషులు.. గా ..తీర్చిదిద్దే విద్యాలయాలు.. కావాలని..నా... ప్రగాడ ఆకాంక్ష.
@రాజ్ గారు ధన్యవాదములు.
@ అజ్ఞాత గారు ధన్యవాదములు
@ శశి గారు.. దయ చేసి. ఇక ముందు పోస్ట్ లు ..అనుసరించండి.
హూ... ప్చ్.. ఆలోచింప చేసింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి