ఒక చెవిలో.. పోన్ పెట్టుకుని హడావిడిగా ..అమ్మా..అమ్మా.. అని  పిలుస్తూ  వచ్చాడు మా  అబ్బాయి . (ఒక చెవిలో కాకుంటే   రెండు చెవులలో పోన్.. పెట్టుకుని మాట్లాడతారా అని ...సందేహపడకండి. ఒకోసారి నాలుగు నంబర్స్ తో..కూడా  మాట్లాడే..కాలం ఇది) 
నేను ఏమిటి.నాన్నా..అన్నాను..
నాకు ఒక పేపర్ కావాలి. అందులో..ఒక ఇంపార్టెంట్ న్యూస్ చూడాలి. వెతికి ఇద్దువు రా..అన్నాడు.
అలమరలో..ఉంటాయి.. నువ్వే వెదుక్కో! నా తల ఖాళీగా లేదు అన్నాను. నిజంగా తలే ఖాళీగా లేదు.నెట్ లో..తల పెట్టాను కదా..
నా.. మాటకి నవ్వుకుని... అవతలి గదిలోకి వెళ్లి..కాసేపటికి.. మళ్ళీ కేకలు..ఈ సారి కొంపలు మునిగిపోయినట్లు..రేంజ్ లో అన్నమాట.
హడలిపోయి..పరిగెత్తాను.(నడకే లెండి)
ఏమిటిది..? తలతో..సంజ్ఞ తో..అడిగాడు.. నేను అలాగే ..సంజ్ఞతో.. "!?" .. అడిగాను. అలమర వైపు తల చూపించి"??" అడిగాడు..
ఆటు చూసాను...మీరు చూద్దురు గాని ..ఇదిగో..ఇలా...
చూసారు  కదా ఇదిగో..ఇలా కనబడ్డాయి...అన్నమాట.
ఏమిటి ఇది? ఒక సారి.. ఫ్లాష్ బేక్..కి..వెళ్ళండి వనజ గారు..అన్నాడు. వెంటనే నాకు అర్ధం అయిపోయింది.
ఒకసారి మా అబ్బాయి  ఇంజినీరింగ్  ఫైనల్ ఇయర్ లో ఉండగా.. డిఫెన్స్ మినిస్ట్రీ తరపున ఆర్మీ లో పొస్ట్స్ ఫిలప్ కోసం..కాంపస్ సెలక్షన్స్ జరుగుతున్నాయి.నేను వెళతాను అన్నాడు.సరే! అన్నాను. 
వెళ్ళే ముందు మన డిఫెన్స్ మినిస్టెర్ ఎవరు అమ్మా అని అడిగాడు. నాకు కొపం వచ్చింది.కోపం రాదా..ఏమిటీ? 
ఇంజినీరింగ్ చదివే పిల్లవాడు.. అలా మరీ దేశ  జ్ఞానం లేకుండా అవమానంగా చదువు కొనసాగిస్తుంటే తట్టుకోలేకపోయాను. ఈ కాలం పిల్లలే అంత. సబ్జక్త్ తప్ప ఏమి  తెలుసుకోనవసరం లేదనుకుంటారు.
 పైగా మా ఇంట్లో....రెండు  దినపత్రికలు.. తెలుగు..మాకు.ఇంగ్లీష్ పేపర్  మా వాడి కోసం ప్రత్యేకం. ఆ పేపెర్  ఎప్పుడు  చదివినట్లు నేను చూడనే  లేదు..ఎప్పుడైనా..నేనే ..ఏ  యౌంగ్ వరల్డో తిరగవేసి బొర్లేసి చదివేదాన్ని.(మనకంత ఇంగ్లీష్  రాదులెండి)
నేను మావాడు అడిగిన ప్రశ్నకి.. జవాబు తెలియదు..అన్నాను. అపనమ్మకంగా చూసాడు. ఎందుకంటే.. నేను వంటలు మాడి మసి బొగ్గైపోతున్నా.. పేపెర్  విడిచి  రాను. పైగా..అందరికన్నా నేనే ముందు చదివేసి..రుబ్బి రుబ్బి పడేస్తాను కనుక.1977 నుండి.. పేపర్  చదవడం  అలవాటు. స్వయం పేపర్ వచ్చాక..నచ్చిన వ్యాసాలు,విషయాలు..కట్  చేసుకుని దాచుకుని మళ్ళీ మళ్ళీ చదువుకునే  అలవాటు మా పెదనాన్నగారి  నుండి అరువు తెచ్చుకున్నాను.(ఇప్పుడు అరువు  ఇచ్చేసాలెండి).. 
ఆ విషయమే నేను చెప్పబోయే విషయం..అన్నమాట. నేను మా అబ్బాయి అడిగిన దానికి..తెలిసినా సమాధానం తెలియదని  చెప్పడం తో ..కోపంగా కేంపస్ సెలక్షన్స్ కి..వెళ్ళాడు.  అక్కడ ఆ సెలక్షన్స్ అనివార్య కారణాల వల్ల జరగలేదు.ఒక వేళ జరిగి ఉంటే..ఆ..ప్రశ్నే అడిగి ఉంటే..ఏమవును..పరువు? చాలా భాధ కల్గి ఆ రోజు తిట్టాను.  
మా కాలంలో..పక్కింటి వాళ్ళ పేపర్ కొసం గోతి కాడ గుంటనక్కలా.. కాసుకు కూర్చుని..ఏంత ఆసక్తిగా ఎన్ని  విషయాలు తెలుసుకున్నామో..కథలు కథలు గా వర్ణించి చెప్పాను.ఇక ఆపు మహాతల్లో! అని దందం పెట్టెదాకా..అన్నమాట. అప్పటి నుండి కాస్తంత..ప్రపంచ విషయాలు తెలుసుకోవడం  మోదలెట్టాడు..లెండి. 
ఇప్పుడు..నాకు అన్యోపదేశంగా ఆ విషయం గుర్తుచేస్తున్నాడు.అని అర్ధమై..
అయితే ఏటట ..అన్నాను. ఆ సిస్టం తీసుకునివెళ్ళి డస్ట్ బిన్ లో..పడేస్తాను.పీడాపోద్ది అన్నాడు. ఆ..పని చేయి. తిండి నిదర లేకుండా..దాని ముందు కూర్చుని లేవదు..అంది మా అత్తమ్మ సందు దొరికింది కదా అనుకుని.
ఆ..ఏమున్నాయి పేపర్ లో..విషయాలు.. అంతా బోర్.. అన్నాను. రాజకీయ నాయకుల ఊసరవెల్లి..తనాలు..ఒకరినొకరు తిట్టుకోవడం మళ్ళీ కలవడం.. కొట్టుకొవడం..పేపర్ అన్నా న్యూస్ చానల్ అన్నా.. సీరియల్స్ లా మొహం మొత్తిపొయింది.అర్దం కాని కవిత్వంలా వాటిని పక్కన పడేశాలే..అన్నాను.
అయినా గూగుల్ వార్తలు ఉండగా..ఇవి ఎందుకు దండగ..రేపటి నుండి పేపర్ మానేద్దాం..అన్నాను
మూడేళ్ళనుండీ  ఒకే  రకమైన వాదనలు..చావులు,ఓదార్పులు,దణ్ణాలు,..చూడ లేక చస్తున్నాను అన్నాను.
అయిన అన్నానన్నాను అనుకోకు కానీ..కానీ.. సాగదీసి మరీ చెపుతూ.. న్యూస్ పేపర్ లో వార్తలు..కొంతమంది విలేఖరులు సేకరించి.. అక్కడా ఇక్కడ జరిగినవి రాస్తూ  ఉంటారు. పది పదునైదు మంది చూసొచ్చి.చెప్పింది రాసింది చదివేకంటె..మా బ్లొగొరోళ్ళు....ఎంచక్కా  విన్నవి కన్నవి,చదివి రాస్తుంటే ..రాసుకుంటుంటే వాటిని చదివేదెవరు? కళ్ళు పోతాయిరా ..చదవకుంటే ..పాపం కదా..!? అన్నాను సరదాగా   మీకు ఈ మధ్య  తెగ తెలివితేటలు,సెన్సాఫ్ హ్యూమర్ పెరిగిందే..హమ్మా..మా..అమ్మా..!అన్నాడు నా కొడుకు.
మరి ఏమనుకున్నావు,నన్నేమనుకున్నావ్? పిచ్చిదాన్ని అనుకున్నావా?   పేపర్ పిచ్చిదాన్ని అనుకున్నావా? అంటూ ..కొనసాగించబోయాను. 
నిఖిల్..వాళ్ళ అమ్మవనుకుంటున్నారు..అన్నాడు..తెలివిగా..  ఎందుకంటే అంతకు  ముందు నేను చేసే పని..అంటే నెట్ లొ..తలదూర్చడం ..అప్పటి సంగతి..ఒకప్పటి సంగతి..గుర్తుచేసుకుంటూ..పూర్తి చేసాడు. పేరడీ  పాటని. 
న్యూస్ పేపర్ వాళ్ళ కన్నా మా బ్లొగొరోళ్ళు మిన్న అంటున్నాను  కదా.. సరదాగా (సీరియస్ గా కాదు)
నిజానికి..వార్తా పత్రికలూ లేకుంటే..మనం చాలా వెనుకబడి ఉంటాం కూడా.. సరదాగా అంటున్నాను సీరియస్ గా కాదు ప్లీజ్..(మన్నించాలి)
జై.. బ్లొగొరోళ్ళు.జై..అగ్రిగ్రేటొర్స్. జై..ఇంటెర్నెట్ అన్నాను ఇదిగో..ఇదే నీతో వచ్చిన చిక్కు.. కొంచెం మెచ్చుకుంటే.. యెవరేస్ట్  యేక్కేస్తావు.. పడిపోతావ్..జాగ్రత్త అమ్మా.. అన్నాడు రహస్యం కనిపెట్టి మరీను.
ఏమిటో మాయ..నువ్వు చెప్పేది నిజమే..బంగారం అన్నాను కొంచెం నేలమీదకి  కళ్ళతో క్రిందికి చూస్తూ.. కాళ్ళు ఆనించి జాగ్రత్తగా..చూసుకుంటూ.. 


5 కామెంట్లు:
హలో వనజవనమాలి గారు నేను కూడా మీకు కొత్తగా అంటుకున్నాను.
చాలా బాగా రాసారు
అక్షర దోషాలు చూడగలరు
న్యూస్ పేపర్ వాళ్ళ కన్నా మా బ్లొగొరోళ్ళు మిన్న.
.............
ఎలా మిన్ననో చెప్పండి
పైడినాయుడు గారు.. ధన్యవాదములు. మన వెబ్ పలక మీద.. అక్షర దోషాలు ఎంత జాగ్రత్తగా టైపు చేసినా వస్తుంటాయి.సరిచేసుకోవటానికి..సమయము దొరకొక, సరిపోక.. తప్పులు దొర్లుతుంటాయి. తప్పక సరిచేసుకుంటాను. ధన్యవాదములు.
మురళి గారు.. నాకన్నా మీరు బాగా విశ్లేషించగలరు. పేపర్ సర్వజానానీకం తప్పక చదువుతారు...తప్పక పోయినా కూడా.
కానీ బ్లాగర్ల స్థాయిలో..బ్లాగ్లు లలో..ఉన్న పోస్ట్ లలో .. మంచిగున్నవి చదవాలని.. నా ఉద్దేశ్యం అండీ.. మీ బ్లాగ్ లో..చాలా మంచి గా అనిపించిన పోస్ట్‌లు..చాలా ..ఉన్నాయి. అందుకే అలా అన్నాను. ధన్యవాదములు మురళీ గారు
mee blog ,vishayaalu bagunnnayi
కొన్ని కొన్ని వార్తలని బ్రేక్ చేయడంలో టీవీ చానళ్ళ కన్నా బ్లాగులు ముందుండడం ఈమధ్య నేను గమనించిన సంగతి.. కేవలం పేపర్ వార్తలనే మళ్ళీ బ్లాగుల్లో ఇస్తున్నవీ ఉన్నాయనుకోండి..
కామెంట్‌ను పోస్ట్ చేయండి