4, ఆగస్టు 2011, గురువారం

దణ్ణాలండి

ఇప్పుడే..నా స్నేహితురాలు "రమ" ఇంటికి.. చాలా రోజుల  తర్వాత వెళ్ళివచ్చాను.

నేను  వెళ్లగానే  మా ''రమ"  పెంపుడు కొడుకు "బుజ్జి పండు" తన ఆనందాన్ని"భౌ ..భౌ" ల రూపంలో చెబుతూ..గుండ్రంగా గిర్రున తిరుగుతూ.. 

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ..సూర్యునిచుట్టూతిరుగును..రీతిలో..ఒక ఐదు నిమిషాల పాటు.. ఆ విన్యాసంతో..నన్ను గుక్క తిప్పుకోకుండా..ఐ మీన్  కదలకుండా.. నిలబెట్టి తర్వాత కుర్చీ చూపెట్టి కూచోపెట్టి.. రెండు చేతు లతో..(అంటే తన ముందర కాళ్ళతో) నా  మోకాళ్ళకి.. తర్వాత నా పాదాలకి  వరుస  దణ్ణాలు పెట్టి.. ప్రేమ  ఒలికించి..నన్ను ఆనందపరవశాన ఊగిస్తుండగా.. నాకు ఒక సందేహం వచ్చింది.

" ఏంటిరా  బుజ్జి పండూ!" నా పై ఇంత ప్రేమ ఒలికిస్తున్నావ్? ఇన్ని  దణ్ణాలు   పెడుతున్నావు...నా కుర్చీ లాగేస్తావా ఏమిటీ? అన్నాను సరదాగా.. ముఖ్య మంత్రులు మారిన వైనాలు గుర్తుకు వచ్చి. మారినప్పుడల్లా అనుకున్నదే అయిందని భాదపడుతూ ..  దణ్ణాలు పెట్టినట్లు ..గుర్తుకు వచ్చి.. 

ఔరా!ఎంత మాట ? .. అవన్నీ..బుజ్జి పండు వల్ల కాదు.. ఆ స్థాయికి..ఇంకా ఎదగలేదు తల్లీ! అంది ..వాడి తల్లి... కానీ తల్లి..నా నెచ్చెలి..  

"ఏమిటి విశేషాలు "అన్నాను.."నువ్వు రావడం లేదు..రక రకాల ప్రకటనలు..పేరడీలు లేక ఏడుస్తున్నాయి.నాకేమో..నవ్వులు పూయక ఏడుస్తున్నాను." అంది. 

నవ్వులు పూయక పోతే ఏమి.. "సంపెంగలు పూస్తున్నాయి,జాజులు పూస్తున్నాయి.. సుమ పరిమళాలు ఆస్వాదిస్తూ..అన్నాను.(నిజం గానే..రమ వాళ్ల తోటలో..రక రకాల చెట్లు.పూలు,కాయలు,ఫలాలు..ఎంత బావుంటుందో.. అలా తోట పెంచాలని నా కోరిక కూడాను) రోజు.... ఇలా రాకూడదూ.. బోర్ కొట్టి చస్తున్నాను అంది.

 నేను వెళితే.. అన్నీ.. "ప'' గుణింతాల తోనే కాలక్షేపం. అంటే.. ప్రకటనలు,పాప,పాట,పుస్తకం, పువ్వులు..ఇవే..ప్రాధాన్యం అన్నమాట. 

టి.వి.లో వచ్చే ప్రకటనలకి..పేరడీలు కట్టి జోక్స్ పేల్చడం,పాటలు పాడుకోవడం (నేను పాడను పాటల పరిచయాలు చెపుతాను అంతే!నేను పాడితే.. వినే వాళ్ల ఖర్మ కి..వాళ్ళు  పడి పోతే.. మల్లిక్ గారి  పరుగో పరుగు కార్టూన్ చూసి నవ్వుకున్న లెవల్లో.. నవ్వడం తో..పాటు లేచి పరుగులు కూడా తీస్తారు అన్నమాట .అందుకే ప్రయోగం కూడా చేయను.) పిల్లలతో..ఆడుకోవడం,పుస్తకాలు గురించి..చర్చించుకోవడం ఉంటుంది.  మా అందరికి బహు  ఇష్టమైన వ్యాపకం అది . ఈ మధ్య వెళ్ళడం లేదు.

"నల్లపూస వై పోయావు.".అంది.. రమ'
"అవును"...అన్నాను.  

మా మాటలు వింటుంటే "బుజ్జి పండు'" గాడికి కోపం వచ్చినట్టు ఉంది.నన్ను పట్టించుకోరు ఏమిటి..అని నా పైకి..ఎగిరెగిరి నమస్కారాలు పెడుతున్నాడు. సరే వాడిని..కాస్త  ప్రేమగా సవరదీసి శాంతింపజేసినాక  వాడిని  ఇంటి లోపలపడేసి టి.వి. ఆన్ చేసి వచ్చింది. చక్కగా టి.వి.కార్యక్రమాలు చూస్తూ  ఉన్నాడు  బుజ్జిపండు.

వాడికి  దణ్ణాలు పెట్టడం బాగా అలవాటు చేసావు. బాగా పెడుతున్నాడు.  కానీ మనం  దణ్ణాలు పెట్టాలంటే భయం వేస్తుందే? అన్నాను. 

ఆహా ..ఎక్కడి కో వెళుతున్నావ్?   చెప్పు చెప్పు అంది.

" ఏం లేదు తల్లీ..! గుడికి వెళితే.. గుడిలో..దేవుడికి..నమస్కారం  ఎలా పెట్టాలో..తెలియని వారికి.. తెలిసిన వారు నమస్కారం పెట్టడం నేర్పిస్తుంటారు. అలా వాడికి కూడా  నువ్వు నేర్పాలి అన్నాను.  

అది కూడా ఉందన్నమాట అంది.

 ఓ.. బేషుగ్గా ఉంది అన్నాను.

నిజంగా.. ఈ కాలం పిల్లలకి.. నమస్కారం ఎలా పెట్టాలో తెలియదు అంటుండగానే.. దీప్తి వచ్చింది.( రమ వాళ్ల  ప్రక్కింటి అమ్మాయి) నిజంగా నే నాకు తెలియదు..ఆంటీ.! ప్లీజ్ . చెప్పరా ? అడిగింది. 

సరే.. నేను వినేవాళ్ళు దొరికారు కదా అని చెప్పడం మొదలెట్టాను. నిజంగా నాకు అంతగా తెలియదు. ఎప్పుడో.."భక్తి' టి.వి లో..ధర్మ సందేహాలు లో.. చెపుతుంటే..విన్నాను. అదే చెప్పడం మొదలెట్టాను. 




మన సమవయస్కులకి..హృదయం ప్రక్కగా చేతులు  ఉంచి  నమస్కారం చెయ్యాలట. ఇక రెండు. మనకన్నా పెద్దవారికి.. గురువులకి..ముఖ మద్యమంకి.. (నాసిక భాగం వద్దకు చేర్చి ) రెండు చేతులు..జోడించి నమస్కారం చేయాలట. 



ఇక భగవంతునికి అయితే..రెండు చేతులు తల పైకి నిలువుగా పైకి చేర్చి..నమస్కారం చేయాలట. అది కాకుండా సాష్టాంగ నమస్కారం..భగవంతునికి పురుషులు ఎలా చేయాలో..స్త్రీలు ఎలా చేయాలో.. పెద్దలకి..ఎలా పాద నమస్కారం చెయ్యాలో..చెప్పాను.  



పనిలో పనిగా.. మా రమ అడిగిన సందేహం ఏమిటంటే..గుడిలో.. పూజారికి.. పాద  నమస్కారం చేయకూదదట కదా అంది. 

అవును..అని అంటారు.ఎందుకంటే .. గుడిలో..మనం భగవంతునికి తప్ప ఎవరికి..నమస్కరించ కూడదు. ..అట. 

ఒకవేళ మనం  కానీ ఎవరైనా కానీ నమస్కరిస్తే.. ఆ నమస్కారం స్వీకరించిన  వారు  "భగవదార్పణం'" అని  అనాలట.అంటే ఈ నమస్కారం భగవంతునికే చెందాలని..చెప్పడం అన్నమాట అని చెప్పాను..దీప్తితో. 

అయ్యా బాబోయ్..ఇన్ని ఉంటాయా ? అంది ఆశ్చర్యంగా.

.అవును మరి..అని .. వీటి అన్నిటికన్నా "హాయ్'" అనేయడం తేలిక కదా అన్నాను.. నవ్వుతూ..  

మరి..ఆ పిల్ల అలానే పలకరిస్తుంది నన్ను. 

అయినా.. ఈ కాలం  పిల్లలకి.. పెద్దవాళ్ళని గౌరవించడం తెలుసా !? అన్నాను.. 

తెలియదు ఆంటీ !మా సిలబస్ లో..లేదుగా అంది అల్లరిగా.. 

నవ్వుకుని.. అవన్నీ.. అక్కడ ఉండవమ్మా.. ఇక్కడ ఉంటాయి  అన్నాను  వాళ్ల ఇల్లు చూపిస్తూ...





ఎవరు నేర్పుతారు.. ?  కౌన్ జాబ్ జాయేంగీ?అంది. 

ఇంకేం..ఆన్సర్ ఉంది..పెద్ద వారి దగ్గర.  కాసేపు మౌనం. ఆ మౌనాన్ని చేధిస్తూ.. రమ.. పిల్టర్ కాఫీ పరిమళం. అవి తాగేస్తూ.. మళ్ళీ..దణ్ణాలు కబుర్లే! 
జగన్ గారు ఆ పెద్దాయన పోయాక పాపం చేతులు దిన్చిందే లేదు. మోచేతి ఎముక అరిగి పోయి ఉంటుంది.అతని  దణ్ణాలు అందుకుని అందుకుని ..రాష్ట్రం  మొత్తం కరిగి కన్నీరు అయిపోయింది కానీ..  ఇటాలియన్ అమ్మ కరగలేదు.  ముఖ్య మంత్రిని చేయలేదు.

మొత్తానికి..  దణ్ణాలు ఆ ఫలించి  కడప జనానీకం ఓట్ల వర్షం కురిపించింట్లు.. ఇంకో మూడేళ్ళ తర్వాత ఆంద్ర ప్రదేశ్ (క్షమించాలి అవిభక్త  ఆంధ్రప్రదేశం అన్న మాట. అది  కాకపోతే సీమ ఆంధ్ర అన్నమాట .నాకైతే ..తెల్లరేటప్పటికి..తెలంగాణా ఇచ్చినా ఆనందమే!) మొత్తం జగన్.. గారికి.. ఓట్ల వర్షం కురిపిస్తే బాగుండును. ఈ మూడేళ్ళలో ఇంకా చాలా దణ్ణాలు పెడతారు కదా..అన్నాను. 

అవును మరి అప్పుడు వీధి వీధిలో ఉన్న వై.ఎస్.ఆర్ గారి విగ్రహాలు ఆనంద భాష్ఫాలు  కారుస్తారు. ఆయన ఆనందం చూసి వరుణుడు కరిగి ఒక్క సీమలోనే విస్తృతంగా  వర్షమై కురిసి .. వై.ఎస్.ఆర్ శంకుస్థాపన చేసి చేసి ఆగిపోయిన ప్రాజెక్ట్లు లు  క్రింద పొలాలకి..నీళ్ళు అయినా సంవృద్ది గా ఇస్తాడు.. అన్నాను. .. 
ఇంకా చెప్పాలంటే ఇంటి ఇంటిలోనూ  దేవుడి పొటోలు ప్రక్కనే..ఉంచి పూజలందుకుంటున్న వై.ఎస్.ఆర్.. కొడుకు పెట్టిన పార్టీకి ఓట్లు వేసిన వారిని.. మతాల బేధం లేకుండా.. ఆయన దేవుడితో చెప్పి..దీవెనలు ఇప్పిస్తాడు అన్నాను. 

అమ్మో..దణ్ణాలు కి ఇంత కథ ఉందా? నేను మా బుజ్జి పండు గాడికి..చాలా రకాల దణ్ణాలు నేర్పాలి..అంది.రమ.  

నేర్పితే నేర్పావు కానీ..నువ్వు మర్యాదగా వేసి కూర్చోపెట్టిన  కుర్చీ క్రింద జేరి.. నాకు  దణ్ణాలు పెట్టినట్లు పెట్టి  కుర్చీ..లాగేయమని చెప్పక .. అసలే.. నడుం నొప్పి.. పోద్దస్తమాను..సిస్టం ముందు కూర్చుని.అన్నాను. 

అయితే..మా మీద శీతకన్ను వేసింది ఇందుకన్న మాట..అంది రహస్యం కనిపెట్టి... మరి? అన్నాను. ఇంతలో.. ఇంటి నుండి పోన్.. దాని పీక నొక్కో..నొక్కకుండా  లేదా..ఇంట్లోనే   పెట్టి రాకూడదూ.. అంది. అప్పుడే  వెళతానంటే కల్గిన ..బాధనంతా.. ముఖం లో .. ప్రకటిస్తూ.. .. 

అరగంటే.. అని చెప్పి వచ్చాను.. ఇక నన్ను ఒదిలేయి  తల్లి.. నీకు ..  వేయి దణ్ణాలు  పెడతాను.. అన్నాను. 

ఇప్పుడు వదిలేస్తున్నాను. ఈ సారి నాలుగురెట్లు..సమయమన్నా ఉండాలని.. వేయి దణ్ణాలు  తో.. వేడుకుంటున్నాను..అంది..నాటకీయంగా.. 

తధాస్తూ  ..అన్నాను..అభయ హస్తం చూపిస్తూ.. నమ్మిందో లేదో..కానీ.. కానీ..నన్ను వదిలింది.. కాసిని పూలని కానుకగా ఇస్తూ.. ఇలా నా సాయంత్రం గడిచిపోయింది.

దణ్ణాలు ...తల్లీ..! ఈ  దణ్ణాలు గోల ఏమిటి? మమ్మల్ని ఒదులు.. అంటారా.. ? 

మీకు..నా బ్లాగ్ దర్శించినందులకు  దణ్ణాలండి.  "దండం దశ గుణ భవేత్" అని తప్పులుంటే మన్నించండి...దండించండి ..కూడా.. అని కోరుకుంటూ..  

ఈ... దణ్ణాలు.. మాత్రం టైపు చేయలేక తెగ ఇబ్బంది పడ్డానండి. మరి అంత తేలికా ఏమిటీ.. దణ్ణాలు  పెట్టడం అంటే అనకండి. వచ్చిన వారు.. మెచ్చేవారు.కాస్త ..నవ్వుకోండి.. ఏదో..సరదాగా... సరదాగా కాసేపు ..అంతే.!  

                 

3 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

చాలా చక్కగా చెప్పారండి. సంస్కృతంలో ‘నమస్’ అంటే ‘వినయం, భక్తితో కూడిన ప్రణామం’ అని అర్థం. ‘తే’ అంటే ‘మీకు’ అని అర్థం. కాబట్టి ‘నమస్తే’ అంటే, ‘మీకు భక్తితో కూడిన ప్రణామం’ అని అర్థం. అందుకే పెద్దలను చూసినపుడు గౌరవ భావంతో నమస్కరిస్తుంటాం.అసలు తనంతట తానే సర్వశుభాలను కలిగించే ప్రయత్నం నమస్కారం. అభిషేకానికి ఉపయోగించే రుద్రసూక్తంతో ‘నమక’ అనే వాకములున్నాయి. ఈ అనువాకములతో శివుడు అనేక పేర్లతో, అనేక సార్లు ‘నమో నమః’ అని ప్రార్ధించబడతాడు. శివుని పంచాక్షరి, నారాయణుని అష్టాక్షరి మంత్రాలు రెండూ’నమః’శబ్దంతో మొదలవుతాయి. అందుకే పరమేశ్వరుడిని నమస్కార ప్రియునిగా అభివర్ణిస్తుంటారు.

rajiv raghav చెప్పారు...

ఎంత బాగా చెప్పారు... నాకు ఇప్పటికి కూడా ఎవరైనా ఇంటికి వచ్చిన అతిధులను నాకు పరిచయం చేస్తే నమస్కారము ద్వారానే పరిచయం చేసుకుంటాను.. నాకు మా అమ్మమ్మ గారు చిన్నప్పటి నుండి అలా నేర్పించారు... కాని నేడు చాలా మందికి అలా చేయాలని ఉన్నప్పటికి అందరు చులకనగా చూస్తారేమోననే భావనతో జంకుతున్నారు... కాని అలా నమస్కారము చేయడంతోనే వారికి ఇవ్వవలసినన గౌరవం ఇచ్చినట్టుగా భావించవచ్చును.... ఒకసారి సినిమా నటుడు ఆర్.నారాయణమూర్తి గారు మా ఇంటికి వచ్చినప్పుడు పరిచయాలలో నమస్కారించినప్పుడు, ఆయన సరదాగా మా వాళ్ళతో అన్నారట,, మీ వాడు నమస్కారములు బాగా పెడుతున్నాడు.. రాజకీయాలలో పైకి రాగలడెమో అని.....
ఆయినప్పటికి మీరు అంత వేగంగా విభిన్న ఆర్టికల్స్ ఎలా తయారుచేయగలుగుతున్నారండి... మేము ఒక అర్టికల్ తయారుచేసుకొనేలోగానే మీరు సుమారుగా మూడు అర్టికల్స్ తక్కువ కాకుండా పోస్ట్స్ చేస్తున్నారు..... చాలా గ్రేట్ అండి మీరు.....

కొత్తావకాయ చెప్పారు...

బాగుందండీ. చక్కగా బొమ్మలతో వివరించి చెప్పారు. సాష్టాంగ నమస్కారాల సంగతి కూడా బొమ్మలు పెట్టేస్తే ఇంకా బాగుండేది. "దండం దశగుణం భవేత్" ప్రాస కి సరిపోయింది కానీ అర్ధం ఈ టపాకి సరిపోదేమో చూడండి.
దండం వెలికి తీయగల దశగుణాల కోసమే దండన. మీలా దండాలు పెట్టే మంచివాళ్ళకి కాదేమో!