3, అక్టోబర్ 2011, సోమవారం

జీవితకథ


        జీవితకథ  -వనజ తాతినేని

నేను  పుట్టుకతోనే  జీవితమనే
పుస్తకాన్నిఆవిష్కరించాను
పీఠిక రాసే పని ఎలాగు విధాతదే   కదా!
ముందుమాట కాలానికి వదిలేశాను

ఇక అందులో మిగిలినవన్నీ శ్వేత పత్రాలే!
తల్లి-తండ్రీ, సహోదరీ సహోదరులు
బిడ్డలు అంతా వీళ్ళే .. వీళ్ళే లిఖించారు

ముఖచిత్రం మాత్రం మధ్యలో వచ్చిన
భర్త చేతిలోని  కుంచెలో ఒదిగిపోయింది
ముగింపులోనైనా నా చేతికి పనిబడుతుంది
మంచి-చెడులు, అన్ని  నిజాలు
వ్రాయాలనుకున్నాను.

నా జీవిత కథ నేను వ్రాయకుండానే
ముగిసిపోయింది.
వెనుక పేజీ అయినా
వాస్తవికత తో అచ్చవుతుందా !?

ముద్రణాధీశుడు నా గురించి
అతిశయంగా వ్రాసి అచ్చేసుకుని
లాభాల పంట పండించుకున్నాడు.
నిజం నోరు తెరిచేదెప్పుడు!?  


                                                        

7 కామెంట్‌లు:

జ్యోతిర్మయి చెప్పారు...

'పుట్టుకతోనే జీవితమనే పుస్తకాన్నిఆవిష్కరించాను
పీఠిక రాసే పని ఎలాగు విధాతదే కదా!'

కవిత మొదటి వాక్యాలే చూపుని బంధించి వేశాయి...ఆ సరళి చివరికంటా సాగిపోయింది మంచి కవిత చదివిన అనుభూతి మిగిలిపోయింది.

అజ్ఞాత చెప్పారు...

very nice

రసజ్ఞ చెప్పారు...

ముఖచిత్రం మాత్రం మద్యలో వచ్చిన
భర్త చేతిలోని కుంచెలో ఒదిగిపోయింది ఇలాంటివి చవినప్పుడు భయమేస్తూ ఉంటుంది నాకు. నిజం నోరు తెరిచేదెప్పుడు!? చక్కగా రాసారండీ

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

నిజం నోరు తెరిచేదెప్పుడు!?
మన జీవితాన్ని మనంకోరుకున్నట్టు జీవించే స్వేచ్ఛ మనకు లభించినప్పుడు.
అది లభిస్తుందా?
అందరికీ లభించదు!
మరెవరికి లభిస్తుంది?
గొర్రెల మందలోనుండి బయటపడే సాహసంచేసినవారికి.
వీరుమాత్రమే కొన్నితమజీవితపుస్తకంలోని కొన్ని శ్వేతపేజీలనైనా వాస్తవీకతతో అచ్చేసుకుంటారు.

మంచి కవిత!

సీత చెప్పారు...

chala bavundi!

vishnu చెప్పారు...

kavita antaaraa? kaaadu nijam antaanu vanaja garu. ye vishayamainaa baagaa cheppagalaru.mee blog choosthe yenni vishayaalu telusthaayo! maa yuvataraaniki meelaati vaari anubhavaalu panchaali. nijam

హితైషి చెప్పారు...

Good one.