జీవితకథ -వనజ తాతినేని
నేను పుట్టుకతోనే జీవితమనే
పుస్తకాన్నిఆవిష్కరించాను
పీఠిక రాసే పని ఎలాగు విధాతదే కదా!
ముందుమాట కాలానికి వదిలేశాను
ఇక అందులో మిగిలినవన్నీ శ్వేత పత్రాలే!
ముగింపులోనైనా నా చేతికి పనిబడుతుంది
మంచి-చెడులు, అన్ని నిజాలు
వ్రాయాలనుకున్నాను.
నా జీవిత కథ నేను వ్రాయకుండానే
ముగిసిపోయింది.
వెనుక పేజీ అయినా
వాస్తవికత తో అచ్చవుతుందా !?
ముద్రణాధీశుడు నా గురించి
అతిశయంగా వ్రాసి అచ్చేసుకుని
లాభాల పంట పండించుకున్నాడు.
నిజం నోరు తెరిచేదెప్పుడు!?
నేను పుట్టుకతోనే జీవితమనే
పుస్తకాన్నిఆవిష్కరించాను
పీఠిక రాసే పని ఎలాగు విధాతదే కదా!
ముందుమాట కాలానికి వదిలేశాను
ఇక అందులో మిగిలినవన్నీ శ్వేత పత్రాలే!
తల్లి-తండ్రీ, సహోదరీ
సహోదరులు
బిడ్డలు అంతా వీళ్ళే .. వీళ్ళే లిఖించారు
ముఖచిత్రం మాత్రం మధ్యలో వచ్చిన
భర్త చేతిలోని కుంచెలో ఒదిగిపోయిందిముగింపులోనైనా నా చేతికి పనిబడుతుంది
మంచి-చెడులు, అన్ని నిజాలు
వ్రాయాలనుకున్నాను.
నా జీవిత కథ నేను వ్రాయకుండానే
ముగిసిపోయింది.
వెనుక పేజీ అయినా
వాస్తవికత తో అచ్చవుతుందా !?
ముద్రణాధీశుడు నా గురించి
అతిశయంగా వ్రాసి అచ్చేసుకుని
లాభాల పంట పండించుకున్నాడు.
నిజం నోరు తెరిచేదెప్పుడు!?
7 కామెంట్లు:
'పుట్టుకతోనే జీవితమనే పుస్తకాన్నిఆవిష్కరించాను
పీఠిక రాసే పని ఎలాగు విధాతదే కదా!'
కవిత మొదటి వాక్యాలే చూపుని బంధించి వేశాయి...ఆ సరళి చివరికంటా సాగిపోయింది మంచి కవిత చదివిన అనుభూతి మిగిలిపోయింది.
very nice
ముఖచిత్రం మాత్రం మద్యలో వచ్చిన
భర్త చేతిలోని కుంచెలో ఒదిగిపోయింది ఇలాంటివి చవినప్పుడు భయమేస్తూ ఉంటుంది నాకు. నిజం నోరు తెరిచేదెప్పుడు!? చక్కగా రాసారండీ
నిజం నోరు తెరిచేదెప్పుడు!?
మన జీవితాన్ని మనంకోరుకున్నట్టు జీవించే స్వేచ్ఛ మనకు లభించినప్పుడు.
అది లభిస్తుందా?
అందరికీ లభించదు!
మరెవరికి లభిస్తుంది?
గొర్రెల మందలోనుండి బయటపడే సాహసంచేసినవారికి.
వీరుమాత్రమే కొన్నితమజీవితపుస్తకంలోని కొన్ని శ్వేతపేజీలనైనా వాస్తవీకతతో అచ్చేసుకుంటారు.
మంచి కవిత!
chala bavundi!
kavita antaaraa? kaaadu nijam antaanu vanaja garu. ye vishayamainaa baagaa cheppagalaru.mee blog choosthe yenni vishayaalu telusthaayo! maa yuvataraaniki meelaati vaari anubhavaalu panchaali. nijam
Good one.
కామెంట్‌ను పోస్ట్ చేయండి