26, జూన్ 2012, మంగళవారం

బిడ్డ ముచ్చట్లు

నిన్న ఉదయం ..మా అబ్బాయి కి కాల్ చేసాను. (మిస్సుడ్) రెండు మూడు సార్లు అలా కాల్ చేస్తే కానీ .. కాల్ చేయలేదు.

ఏం
.. నాన్నా! ఎలా ఉన్నావు..?అని యోగ క్షేమాలు అన్నీ అడిగిన తర్వాత..

చిన్నీ
..! వారం పైనే అయింది నువ్వు కాల్ చేసి. ఫ్రెండ్స్ కి పేస్ బుక్ లో లైక్ లు,కామెంట్స్ పెట్టె సమయంలో....రెండు నిమిషాలు కేటాయించి "అమ్మకి కాల్ చేయ వచ్చును కదా!" చాలా స్మూత్ గా అడిగాను.

"అబ్బా.. అలా మాటలతో.. చివాట్లు పెట్టకమ్మా! కొత్త ప్లేస్ కదా..బిజీగా ఉన్నాను." అని చెప్పాడు.

అమ్మ
-నాన్న కూడా బిజీగానే ఉంటారు. పిల్లలని మాట్లాడించ కుండా ఉండగలరా!
అంటూనే.. చిన్నప్పుడే నయం వారం వారం ఒక ఉత్తరం వ్రాసేవాడివి అని చెప్పాను.

సరే ఉత్తరాలు అలా ఉండేవి. మా అబ్బాయికి అప్పుడు అయిదు సంవత్సరాలు. మేము నెల్లూరు దగ్గర ఉండేవాళ్ళం.
మా అబ్బాయి మా చెల్లి దగ్గర విజయవాడ లో ఉండి చదువుకునేవాడు.

అప్పుడు
అలా ఉన్న అబ్బాయి ఇప్పుడు ఇలా ఉండటం కొత్తేమి కాదు లోకానికి విరుద్దం కాదుకాని...
ఎందుకో.. అలా గుర్తుకు వచ్చింది.

బిడ్డలు
దూరంగా ఉన్నప్పుడు వారి చిలిపి చేష్టలు, సరదా మాటలు.. తలచుకోవడం ....తీయని అనుభూతి.
మాటలు, చేష్టలు మధురాతి మధురం. తన చిన్నప్పటి విషయాలు నేను చెపుతూ ఉంటే.. ఇంకా చెప్పు ,ఇంకా చెప్పు ..అంటూ.. పదే పదే చెప్పించుకుని నవ్వుకోవడం తనకి ఇష్టం.

ఇప్పుడు
నీకు చెప్పడం ఏమిటీ!? తర్వాత మీ పిల్లలకి కూడా కథలు కథలుగా వర్ణించి చెప్పనూ.. అంటూ దీర్ఘం తీసి మరి చెపుతాను.

అయితే
ఇప్పుడే నీ బ్లాగ్ లో వ్రాసేయి.. విషయాలు.. ఈ విషయాలు నీ బ్లాగ్ చూసి మరి తెలుసుకుంటారు అని అడిగాడు.

అలా అన్నాక కాదనగలనా!?

ఒక
సరదా విషయం.

ఒకసారి
.. మా అబ్బాయిని ..కోపంగా "దున్నపోతు" అని తిట్టాను.

అప్పుడు
ఏం మాట్లాడలేదు కానీ.. కాసేపు ఆగిన తర్వాత ..'అంబా ,అంబా..అంటూ పిలవడం మొదలెట్టాడు.

ఏమిటి
.. పిలుపులు అసహ్యంగా..అన్నాను నేను.

మరి
నువ్వేగా..ఇందాక "దున్నపోతు" అన్నావు. మరి నేను ..అంబా..అంబా అనేకదా పిలవాలి ..అని చెప్పాడు.

నేను
ఒకటే నవ్వు. అమ్మో.. పిల్లాడి దగ్గర ఇలా నోరు పారేసుకోకూడదు అని లెంపలు వేసుకున్నాను.

ఇంకో
సరదా విషయం.

ఒకసారి
తన పిక్స్ ఆన్లైన్ లో పంపాడు. పిక్స్ చూస్తూ.. ఉన్నాను.

ఎలా
ఉన్నాయి అమ్మా..పిక్స్ అని అడిగాడు.

ప్రకృతి
దృశ్యాలని కెమెరాలో బంధించడం తనకి చాలా ఇష్టం. ప్రకృతి దృశ్యాల కన్నా.. మా అబ్బాయి ఫొటోస్ నే నేను చూసుకుంటున్నాను.

మళ్ళీ
అడిగాడు.. పిక్స్ ఎలా ఉన్నాయమ్మా! అని .

నేను
చాలా బాగున్నాయి అని చెప్పి కాకి పిల్ల కాకికి ముద్దు..అన్నాను.

నాతో
..చాట్ చేస్తూనే..కాసేపటి తర్వాత "చెప్పు కాకి ..ఇంకేమిటి విషయాలు? "అని అడిగాడు.

మళ్ళీ
ఒకటే నవ్వులు.

ఇలాటి
విషయాలు చాలా ఉండేవి.
మా అబ్బాయి ఉంటే ..ఇల్లంతా చైతన్యమే!

అప్పుడప్పుడు
..కొంచెం డల్.. అంతే!

ఎందుకో
.. రోజు.. చాలా బాగా అబ్బాయి గుర్తుకువస్తున్నాడు.

2009
లో అనుకోకుండా వరదలు సంభవించినప్పుడు.. వరద తాకిడికి గురైన ప్రాంతాల ప్రజల ఇబ్బందులు విని
మేము సహాయం చేయాలనుకున్నాం. కారు తీసుకుని మా బాబు నేను, ఇంకొక ఇద్దరం కలసి వెళ్ళాము. మా వంతుగా
రెండు క్వింటాల్ బియ్యం.. డెబ్బయి జతల బట్టలు క్రొత్తవి కొని.. కృష్ణా తీర ప్రాంతంలో కొల్లూరుకి సమీపంలో లంక ప్రాంతంలో వరదకి గురయిన గ్రామాన్ని ఎన్నుకుని అక్కడ వరద భాదితులకి మా చేతనైన సాయం చేసాం.

సమయంలో ..కొందరికి మాత్రమే సాయం అందటం చూసి.. మిగతా అందరికి కూడా హెల్ప్ చేస్తే బాగుండేది కదా అమ్మా..అంటూ తను తెగ ఫీల్ అయ్యాడు.

అలాగే
"రాజోలి' ప్రాతం లో వారికి తన పుట్టిన రోజు సందర్భంగా నగదు సాయం పంపించాము.

జెమిని
మ్యూజిక్ ద్వారా..(జయతి ప్రోగ్రాం వెన్నెల ద్వారా) మూడు వేల సాయం అందించాను.

ఇంకా
మన వంతు సాయం చేయాలమ్మా.. ఆనే నా బిడ్డకి భగవంతుడు.. శక్తి ఇస్తాడని నా నమ్మిక.

ఇబ్బందుల
లో ఉన్న వారికి తన వంతు సాయం చేయాలనుకునే సుతి మెత్తని హృదయం కల..మా ఇంటి దీపం.. మా అబ్బాయి గురించి కొన్ని ముచ్చట్లు ఇవి.

తన
సుతిమెత్తని హృదయం వల్ల అపాత్ర దానం చేసి తను ఎక్కడ ఇబ్బంది పడతాడేమో అని .. అమ్మ దిగులు.


చిన్నప్పుడు నాకు ..వ్రాసిన ఉత్తరాలు. తన వయసు అప్పుడు అయిదేళ్ళు అప్పటి ఫోటో నే..క్రింది ఫోటో.




17 కామెంట్‌లు:

పల్లా కొండల రావు చెప్పారు...

మీ అబ్బాయి ముచ్చట్లు - సహాయం చేసే గుణం బాగున్నాయి. చిన్నప్పటి విషయాలు గుర్తుకుతెచ్చుకుంటే మనసు కొత్త ఉత్సాహం వైపుకు తీసుకెళుతుంది. డిప్రెషన్ దూరం అవుతుంది. ఉత్తరాలు దాచిపెట్టి మీ ప్రేమ చూపారన్నమాట. ఫోటోలు - లెటర్లు బాగున్నాయి.

జ్యోతిర్మయి చెప్పారు...

మీ అబ్బాయికి అన్నీ మీ పోలికలే వచ్చాయండీ వనజగారూ...

అజ్ఞాత చెప్పారు...

దృష్టి కొత్త తరం మీదకి పోయింది. అస్తు.

Sai చెప్పారు...

చాలా బాగున్నాయి వనజగారు మీ అబ్బాయి చిలిపిచేష్టలు...
అప్పటి ఉత్తరాలు ఇంకా జాగ్రత్తగా ఉంచారంటే మీ బాబు అంటే మీకెంత ప్రేమ తెలుస్తుంది..

హితైషి చెప్పారు...

అబ్బాయి పై గుబులు అయిందా వనజ గారు.
ఎక్కడున్నా అబ్బాయి సూపర్ ఉంటాడు. దిగులు వద్దు. వచ్చేయండి వచ్చేయండి మామూలు మూడ్లోకి.
ఓ హిందీ సాంగ్ పెడతానని నాకు మాట ఇచ్చారు. మరచారా?

మాలా కుమార్ చెప్పారు...

పిల్లల చిన్నప్పటి ముచ్చట్లే మధురస్మృతులు . మీ బాబు కబుర్లు బాగున్నాయి . మీ బాబు కు సహాయం చేసే శక్తి ఆ భగవంతుడు తప్పక ఇస్తాడు .

Unknown చెప్పారు...

బాగున్నాయండీ అబ్బాయి పెద్దయినా దాచిన చిన్న నాటి ఉత్తరాలూ, తియ్యని జ్ఞాపకాలూ...

Meraj Fathima చెప్పారు...

mee kanti velugu nindu noorellu haayigaa undaali. meerilaage eppudoo tana muchhatlu maato panchukovaali madam.

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

పిల్లల ఫొటోస్ చూసుకున్నా వారి మాటలు గుర్తు చేసుకున్నా తల్లి దండ్రుల కడుపు నిండిపోతుంది.ఈ పోస్ట్ చక్కని ఆలోచన.

భాస్కర్ కె చెప్పారు...

mee babu ki best of luck,
chakkaga raasaaru mee anubhuthulni.

సీత చెప్పారు...

వనజ గారు ,
మీ పోస్ట్ మీ అబ్బాయి మీద మీకున్న అమ్మ ప్రేమ కి అద్దం పడుతోంది.
చాలా బాగుంది

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

kondala rao gaaru.. Thank you very much!!
@ Jyothiramayi gaaru..:) Thank you very much!!
@KashtEphalE gaaru.. thank you very much!!

Sai..gaaru Thank you veru much.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Vaishnavi Thank you very much!!

mee korika twaralo.. teerutundi.

@ Maala kumaar Thank you very much. maa abbaayiki mee asshessulu tappaka phalisthaayi.

@ Chinni aasha gaaru Thank you very much!!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Meraj Fhatima gaaru.. Thank you very much!

@Oddula ravi shekhar gaaru..Thank you very much!!

@ the tree gaaru.. Thank you very much.

@ Seetha gaaru Thank you very much!!

Raj చెప్పారు...

మీ అబ్బాయిగారి చిన్ననాటి ముచ్చట్లని మాతో పంచుకున్నందులకు చాలా సంతోషముగా ఉంది. మీ అబ్బాయి చిన్నప్పుడు వ్రాసిన ఉత్తరాలు భలేగా దాచి ఉంచారు. ఆ ముద్దు ముద్దు మాటలూ, గుండ్రని అక్షరాలూ చూసి, చాలా ముచ్చటేసింది.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజ్ గారు..ధన్యవాదములు.

జలతారు వెన్నెల చెప్పారు...

teeyani mee jnaapakaalanni maato panchukunnaaru. May God bless Nikhil!