11, జూన్ 2012, సోమవారం

మిల్తీ హై జిందగీ మై మోహబ్బత్ కభీ కభీ

హాయ్.. ఫ్రెండ్స్ ! ఎవరైనా చెప్పగలరా అని అడిగితే  వచ్చిన స్పందన చాలా సంతోషం కల్గించింది.

నాకు చిన్నప్పటి నుండి వివిధ భారతి ముంబై స్టేషన్ నుండి వినవచ్చే హిందీ పాటలు వినడం చాలా ఇష్టం. అలా నేను చిన్నప్పటినుండి వినే పాట .. నేను పుట్టినప్పుడు వచ్చిన సినిమాలోని పాట "ఆంఖే " చిత్రం లో పాట .. అంటే చాలా చాలా ఇష్టం.

కొన్ని పాటలు వింటూ ఆ సాహిత్యం ని అర్ధం చేసుకుంటుంటే మధురాలు ఊరతాయి.అలాటి కోవ లోకి చెందిన పాట ఈ పాట సాహిత్యం చూడండి ఎంత బాగుందో. ! నిన్న నేను పోస్ట్ చేసిన వ్రాతలు నేను చాలా ఇష్టంగా చెప్పిన పాట సాహిత్యమే ! హిందీ నుండి తెలుగు అనువాదం ని నిన్నటి పోస్ట్ లో అందించాను కదా.. ఆ సాహిత్యమే .. మళ్ళీ ఇక్కడ,

"జీవితంలో ప్రేమ దొరుకుతుంది అప్పుడప్పుడు

హృదయంలో నిండినవారికి ఇవ్వడం జరుగుతుంది అప్పుడప్పుడు

చూపుల ప్రశ్నలకు సిగ్గుపడుతూ మోము చాటు చేయొద్దు.
అదృష్టం అలాటి స్థితిలోకి తీసుకు వెళుతుంది అప్పుడప్పుడు
జీవితంలో ప్రేమ దొరుకుతుంది అప్పుడప్పుడు

వసంతం గవాక్షం రోజు తెరుచుకోదు ఓ..ప్రియతమా ..
ప్రళయం వస్తుంటుంది అప్పుడప్పుడు
జీవితంలో ప్రేమ దొరుకుతుంది అప్పుడప్పుడు

యవ్వనపు దారిలో ఒంటరితనాన్ని  దాటలేవు
మరొకరి అవసరం వస్తుంది అప్పుడప్పుడు
జీవితంలో ప్రేమ దొరుకుతుంది అప్పుడప్పుడు

ఈ జన సందోహంలో కలసి పొతే ఎక్కడా మళ్ళీ ఎవరు దొరకరు
దగ్గర కావడానికి సమయం దొరుకుతుంది అప్పుడప్పుడు
హృదయంలో నిండినవారికి నాయకుడు అయ్యే అవకాశం దొరుకుతుంది అప్పుడప్పుడు
జీవితంలో ప్రేమ దొరుకుతుంది అప్పుడప్పుడు... "

ఇక్కడ పాట వినేయండీ! చాలా చాలా నచ్చేస్తుంది.. అనుకుంటున్నాను.హిందీ సాహిత్యం ఇంగ్లిష్ లో ..
సాహిత్యం: షహీద్ లుధియాన్వి
సంగీతం :రవి

Milatii Hai Zindagii Mein Mohabbat Kabhii-Kabhii
Hotii Hai Dilbaron Kii Inaayat Kabhii-Kabhii
Sharmaa Ke MuNh Na Pher Nazar Ke Savaal Par
Laatii Hai Aise MoD Par Qismat Kabhii-Kabhii
Khulate NahiiN Hani Roz Dariche Bahaar Ke
Aatii Hai Jaan-E-Man Ye Qayaamat Kabhii-Kabhii
Tanahaa Na Kat SakeNge Javaanii Ke Raaste
Pesh Aa_Egii Kisiikii Zaruurat Kabhii-Kabhii
Phir Kho Na Jaane Ham Kahiin Duniyaa Kii BhidD Mein
Milatii Hai Paas Aane Kii Muhalat Kabhii-Kabhii
Hotii Hai DilbaroN Kii Inaayat Kabhii-Kabhii
Milatii Hai ZiNdagii Mein Mohabbat Kabhii Kabhii

8 వ్యాఖ్యలు:

Jai Gottimukkala చెప్పారు...

"Khulate NahiiN Hani Roz Dariche Bahaar Ke"

మీరు తర్జుమా చేసిన "సముద్రం అనే ఒడ్డున రోజు వసంతం ఉండదు" దీనికి సరిపోదు.

"వసంత ద్వారం ఎప్పుడో తప్ప తెరుచుకోదు" అనేది కొంత బెటరు.

నేను కవిని కాను; మీరు ఈ భావాన్ని నాకంటే ఎన్నో రెట్లు బాగా చెప్పగలరు. I am only pointing out the mis-match.

వనజ తాతినేని చెప్పారు...

జై..గొట్టిముక్కల .. మళ్ళీ ఒకసారి అనువాదం సరి చూసుకుంటాను. మీరు చెప్పినదే సరి అయినది కావచ్చు. థాంక్ యు!

జలతారు వెన్నెల చెప్పారు...

is zamaane mein is mohabbat ne
kitne dil tode kitne ghar phoonke
jaane kyon log muhabbat kiyaa karte hain
dil ke badle dard-e-dil liyaa karte hain
jaane kyon log muhabbat kiyaa karte hain

SNKR చెప్పారు...

వహ్వా! వహ్వా!
క్యా బోల్ హై!
క్యా తర్‌జుమా హై!

వుర్దూలో అలా అనాలని విన్నాను, అందుకే అలా అన్నాను. :)
పోతే, మన తెలుగులో... బాగుందండి, నాకు ఇష్టమైన పాట ఇది, బినాకాగీత్ రేడియో సిలోన్‌లో వినేవాడిననుకుంటా.

మాలా కుమార్ చెప్పారు...

అబ్బో ఎక్కడెక్కడి మంచి పాటలు ఏరిపెడుతున్నారండి . ఈ పాట బినాకా గీత్ మాలా లో అనుకుంటా చాలా సార్లు విన్నాను కాని సినిమా పేరు తెలీదు .

Jai Gottimukkala చెప్పారు...

@మాలా కుమార్:
Hindi Song: Milati Hai Zindagi Mein Mohabbat
Movie or Album: Aankhen (1968)
Singer(s): Lata Mangeshkar
Music Director(s): Ravi
Lyricist(s): Sahir Ludhianvi

http://www.hindilyrics.net/lyrics/of-Milati%20Hai%20Zindagi%20Mein%20Mohabbat.html

వనజ తాతినేని చెప్పారు...

జలతారు వెన్నెల గారు..పాట నచ్చినందుకు ధన్యవాదములు.@మాలా కుమార్ గారు.. అబ్బ ఎంత మంచి వారు. పాటని మెచ్చుకున్నందుకు ధన్యవాదములు.
నాకిష్టమైన పాటలు చాలా ఉన్నాయి. నా పాటల పొడి నుండి అప్పుడప్పుడు తీస్తూ ఉంటాను. వినిపెట్టి మెచ్చుకోవాలి:)
SNKR ..గారు బహూత్ షుక్రియా.. థాంక్ యు!ధన్యవాదములు.
జై గారు థాంక్ యు ఒన్స్ అగైన్.
శ్రీ గారు..థాంక్ యు వేరి మచ్. మీ కామెంట్ పొరబాటున డిలీట్ అయిపొయింది సారే..అండీ!
సాహిత్యం సరి చేసినందుకు చాలా చాలా ధన్యవాదములు. ఈ సారి మీ సలహా తీసుకుని అనువాదం పోస్ట్ చేస్తాను. హెల్ప్ చేయాలి మరి.:)
ఒక మాట . నేను హిందీ పెద్దగా నేర్చుకోలేదు. వింటూ నేర్చుకున్నదే! అలాగే హిందీ పాటలు వింటూ ఆ పాటలు అర్ధం చేసుకోవడానికి నేర్చుకున్నది. అందుకని నా ట్రాన్స్ లేట్ లో తప్పులు ఉంటాయి కూడా.
సరి చేసిన మిత్రులందరికీ ధన్యవాదములు.

Jai Gottimukkala చెప్పారు...

"వసంతం గవాక్షం రోజు తెరుచుకోదు"

చాలా బాగా సరిపోయింది.