2, జూన్ 2012, శనివారం

వారు వారే "విహంగ" లో..

2004 సంవత్సరం దసరా మహోత్సవాల తరుణం. దసరా అంటే.. విజయవాడ లో అంతా సందడే!.
ఆరోజు నేను కొండపల్లి To కంకిపాడు 150 బస్ కొండపల్లి లో ఎక్కి ప్రయాణం చేస్తున్నాను. దుర్గమ్మ సన్నిది మూడు కిలోమీటర్ల దూరం నుండే ట్రాఫిక్ జామ్ మొదలైయింది.ట్రాఫిక్ మళ్ళింపు ఉన్నా కూడా కిక్కిరిసిన ఆ జనసందోహాల మధ్య నెమ్మదిగా ముందుకు వెళుతున్న బస్.

బస్ ఎక్కిన దగ్గరనుండి నిలబడే ప్రయాణం చేస్తున్నాను. లేడీస్ కి కేటాయించిన సీట్లలో పురుషులు హాయిగా కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. అలా నిలబడి ఉన్నాకూడా ..ఏదో ఇబ్బంది కల్గుతున్న ఫీలింగ్. నా వెనుక పురుషులు ముందు ముందుకి తోసుకుని వచ్చేస్తున్నారు. నేను ముందుకి జరిగి పోయాను. ఒకానొక దశలో బస్ దిగి పోయి ఆటో ఎక్కి వెళ్ళిపోవాలని అనిపించింది. కానీ అందుకు వీలుకాని పరిస్థితి.

బస్ ఇంకా ముందుకు ప్రయాణించి దుర్గమ్మ గుడి ముఖ ద్వారం వద్దకు వచ్చింది.అక్కడ చాలా మంది దిగి పోయారు. బస్ కొంచెం ఫ్రీ అయింది. రధం దగ్గరికి రాగానే.. హటాత్తుగా ఒక మహిళ ప్రక్క సీట్ లో కూర్చుని ఉన్న పురుషుడి మొహం పై చెప్పుతీసుకుని పట్ పట్ మని కొట్టింది. "ఆరే ఎందుకమ్మా అతనిని కొడుతున్నావు?మీరు భార్యాభర్తలు అయితే ఇంటి దగ్గర కొట్టుకోండి.. బస్ లో ఏమిటి ఈ నూసేన్స్ !అడిగాడు ఒక అతను.

ఆమె ఇలా చెప్పింది."అతను నా భర్త కాదు. బస్ లో కూర్చుని ప్రయా ణించేవాడు బుద్దిగా ప్రయాణించాలి.ఆడవాళ్ళ ఒంటిపై చెయ్యేస్తే ఊరుకుంటామా? ఎంత సేపని చూస్తాం. ? ఊరుకున్తున్నారు కదా అని రెచ్చిపోతున్నాడు. ఇలాటి కుక్కలకి చెప్పు దెబ్బలే శిక్ష. వయసు రాగానే సరా!?..బుద్ది కూడా సరిగా ఉండాలి. "అని కాళికలా కోపంతో మాట్లాడింది.

బస్ లో ఉన్న అందరికి ఆశ్చర్యం,ప్రశంస గా చూసారు. కొంతమంది స్త్రీలు భయపడ్డారు. ఏం చేస్తాం బుద్దిలేని వెధవలు.. వాళ్ళింట్లో వాళ్ళ అమ్మ, అక్క చెల్లెళ్ళ ఒంటిమీద ఇలాగే చేతులు వేస్తారా?అని తిట్టుకుంటున్నారు. బస్సు మార్కెట్ లోకి రాగానే..బస్ ఆగకుండానే ఆ మహిళ పట్ల అమర్యాదగా ప్రవర్తించిన అతను దిగటానికి ప్రయత్నించాడు. వెంటనే ఆమె అతని షర్ట్ పట్టుకుని ఆపేసి కండక్టర్ గారు! ..బస్ ని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి పోనివ్వండి అని చెప్పింది. వెంటనే డ్రైవర్ కూడా సహకరించి బస్ ని పోలీస్ స్టేషన్ దగ్గరకి తీసుకు వెళ్ళాడు. అక్కడ అతనిని దించి కొన్ని పేపర్స్ మీద సాక్షి సంతకాలు పెట్టిన తర్వాత కాని ఆమె బస్ ని కదలనివ్వలేదు.నేను అయితే ఆమె ధైర్యం ని మెచ్చుకున్నాను.

నేను ఇంటికి వచ్చిన తర్వాత ..మా వారికి జరిగిన విషయం చెప్పాను. ఈ విషయంనే.. ఓ కథ గానో, కథానిక గానో వ్రాయి. ఇంకా కొంతమందికి ఇలాటివి దైర్యంగా ఎదుర్కునే దైర్యం వస్తుంది అన్నారు.
నేను కథ,కథానిక కాకుండా .. చాలా ఆవేశంగా ఆ రోజే కవిత వ్రాసేసాను .

ఆ కవితని రాష్ట్ర స్థాయి కవిత్వం పోటీలలో నా కవితగా ప్రజెంట్ చేస్తూ ఉన్నప్పుడు.. నాలో కల్గిన ఆవేశం చదివిన విధానం చూసి..సభలో ఆతిధులుగా కూర్చున్న మగవారు వాళ్ళ ప్రక్కన స్త్రీ మూర్తులు ఉంటే కనుక అక్కడి నుండి లేచి వెళ్లి దూరంగా కూర్చున్నారని సభలో చలోక్తులు విరిశాయి.

ప్రైజ్ ఇవ్వడానికి అర్హత కల్గిన కవిత అయినప్పటికీ.. ఆ కవిత తిట్టు కవితంలా ఉందని,అలాటి కవితలని ప్రోత్స హిస్తే కవయిత్రులు ఇంకా అలాటి కవితలే వ్రాస్తారని జడ్జీలు చర్చించుకుని..(పురుష జడ్జీలు) నా కవిత
ని అలా వెనక్కి నెట్టేశారు.

ఆ తరువాత నేను కొన్ని పత్రికలకి ఆ కవితని ప్రచురణార్ధం పరిశీలనకి పంపాను. చాలా కవితలు అయితే ప్రచురింప బడ్డాయి కాని ఈ కవిత మాత్రం ప్రచురణకి నోచుకోలేదు.
ఈ కవిత విషయంలో నాకు చాలా నిరాశ కల్గింది.

Some people suffer from due to the miss behavior of man.to land my support to such women I am writing this poetry.

ఆ కవిత ఏమిటంటే ..ఈ కవిత "వారు వారే" జూన్ నెల "విహంగ" వెబ్ పత్రికలో ప్రచురిత మైంది.

ఆ కవితని చదవండి.మీ అభిప్రాయం చెప్పండి.వారు వారే

ఇంట్లో ప్రదర్శించిన దానితో తృప్తి చెందక 

మిగుల్చుకున్న వికృతపు చొక్కా తొడుక్కుని

చెప్పులో కాలు పెడుతూనే చుట్టుపక్కల గోడలని దాటి 

మరీ వెతుక్కునే ఆకలి చూపులు

అంతటితో ఆగవు సరికదా

అందరూ వారి కోసమే ఆరేసుకుని

ఉంటారనుకున్నట్లు

రోడ్డుపై పరికింతలు

వరుసలలోనూ  సందోహాల మధ్యనూ

అవకాశం దొరికితే వంటరితనంలోనూ  

శరీరాల తాకిడికై వెంపర్లాటలు 

జేబుదొంగలు కూడా సిగ్గు పడే వీరి లాఘవం 

నడుము వంపులని సృశిస్తూనో 

గుప్తంగాలు రాపిడిచేస్తూనో 

పైపైన పలికే “సారీ” లతో

పోనీలే ! పాపం పొరబాటు అన్నాడుగా అనుకున్నా

ఒక్క క్షణం అయోమయం తర్వాత

నిజాన్ని గుర్తించి  ఏది అబద్ధపు ముసుగో

ఎవరు మేకవన్నె వ్యాఘ్రమో తెలిసి

అమ్మో! ఈసారి అయినా జాగ్రత్త పడాలనుకుంటాం

వయసు ఉడిగేదాకా

పర స్త్రీ అనాటమీ లో

అమ్మ అనాటమీ చూడలేని

అనాగరిక సంతతి వారిది

అరుచిల అనాటమీలో

ఏదీ  రుచించని 

వికృత అభిరుచి వారిది

వారు వారే ఎన్నటికిమారని వారు వారే 


(ద్వేష వ్యక్తికరణ రూపాన్ని కాదు ద్వేషించే కారణం చూడాలి)  


(ఈ కవితలో కనిపించే ద్వేషం కేవలం నా ఒక్క దానిది మాత్రమే కాదు. ఎందరో ఆడ కూతుర్లు పైకి వెల్లడించుకోలేక నిత్యం మృగాల చూపులను, వారి వికృత చేష్ట లను భరించవలసి రావడం అవమానకరం,ఆవేదనా భరితం. ఇది స్త్రీలందరి సమస్య. అందుకే వాడిగా వ్రాయవలసి వచ్చింది.అలాంటి వారు మారతారనే ఆశతో..ఈ కవిత )15 వ్యాఖ్యలు:

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

కవిత వెనుక కథ బాగుందండి. ఆవేశం నిండిందనీ, నెగటివ్ టోన్ లో ఉందనీ ఈ కవితకు ప్రైజ్ రాకపోవడం బాధాకరం!

http://vihanga.com/?p=4242

విహంగలో వచ్చేందుకే కవిత ఇన్నాళ్ళు వేచిందేమో :)

హితైషి చెప్పారు...

కవిత లో వాస్తవం కనిపించింది.చాలా బాగా వ్రాశారు.కవిత వెనుక కథలోని ఆమె లా ధైర్యంగా అలాటి వారికి శాస్తి చేస్తే మరొక సారి అలాటి పనులు చేయరు. ఆడవాళ్ళు ఇలాటి వారితో చచ్చిపోతున్నారు. Thank you Madam.& congrats!

వనజ తాతినేని చెప్పారు...

అవినేని భాస్కర్ గారు.."వారు వారే" నచ్చినందుకు ధన్యవాదములు.మీ స్పందన చాలా సంతోషకరం. థాంక్ యు !!

@ వైష్ణవి మీకు కవిత నచ్చినందుకు మీ స్పందనకి.. మనఃపూర్వక ధన్యవాదములు.

Jai Gottimukkala చెప్పారు...

Hats off to the unknown brave woman.

జలతారు వెన్నెల చెప్పారు...

వనజ గారు, కవిత బాగుందండి. కవిత రాయడానికి కారణమయిన ఆ bold woman is really great! చాలమంది చూసి బాధపడతారు కాని, అంత ధైర్యం గా ఇలాంటి చర్య చేపట్టటం హర్షనీయం. తరువాత మిమ్మల్ని ప్రొత్చహించి మీ శ్రీ వారికి కూడా మెచుకోవాల్సిందే!

భాస్కర్ కె చెప్పారు...

vaaru kuda maaralani korukuntunnamanndi,
kavitha bhagundi.

Meraj Fathima చెప్పారు...

వనజ గారూ , ఆవేశం ఉన్నప్పుడే రాయాలి . ఆ తర్వాత ఆ విషయం మరుగున పడిపోయి రాయాలి అనిపించదు. అచ్చుకు నోచుకోవాలంటే హంగులు ఉండాలి , కాని అవేమి లేక కేవలం అర్ధం ఉన్న రచనలే కలకాలం నిలుస్తాయి .

శ్రీ చెప్పారు...

మీ కవిత చదివాను...
"నాది సద్విమర్శ "అనుకునే... నాలుగు వాక్యాలు వ్రాస్తున్నాను.
మీ కవితలో మొత్తం మగ జాతినంతటినీ దూషించినట్లుంది...
బహుశా అదే పరిశీలకుల దృష్టికి వెళ్లి ఉంటుంది...
సమజంలోనే చాలామంది మంచివారు కూడా ఉన్నారు (ఆడ/మగ)
మీ కవిత మొదలు నుంచి చివరి దాకా మగ జాతి మొత్తాన్ని దుయ్యపట్టినట్లు వ్రాశారు...
అది సరి కాదు అనుకుంటున్నాను...
మీరు పదేపదే కవితని చదివితే మీకే స్పష్టంగా తెలుస్తుందేమో...
నేను మగవాదినాని ఈ అభిప్రాయం అనుకొనేరు...
నాకు అనిపించినా భావాన్ని మీముందు ఉంచాను...
మీరు చెప్పిన సంఘటన లాంటివి ఎదురైతే .. అలా ప్రవర్తించే వారందరికీ ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే...
@శ్రీ

వనజ తాతినేని చెప్పారు...

జై గొట్టిముక్కల ..గారు మీరు చెప్పినట్లే అందరు మెచ్చుకోవాల్సినది.. అసభ్యంగా ప్రవర్తించిన అతని పై దైర్యంగా కంప్లైంట్ చేసి ..తక్షణ స్పందనని తెలిపిన ఆమెని.
ఆ స్పందనతోనే ..ఈ కవిత వ్రాసాను.
మరి కొందరు ఆమెలా ఎప్పుడు దైర్యం తెచ్చుకోగలరు !? ధన్యవాదములు.
@జలతారు వెన్నెల గారు.. ఆమెలా శిక్షించే అంత,కల్గిన ఇబ్బంది బయటకి చెప్పుకునే అంత ధైర్యం గా మహిళలు ఉండాలని కోరుకుందాం. మీ స్పందనకి సదా నా ధన్యవాదములు.
@ The tree భాస్కర్ గారు.. మీ స్పందనకి ధన్యవ్వాదములు. ఆమెని తప్పకుండా మెచ్చుకుందాం.
@meraj fhatima గారు.. ఆవేశం ఉన్నప్పుడే వ్రాయగలం.. నిజం.
ఇక అచ్చులో కొన్ని కవితలు ఎప్పటికి కనబడవు. అంతేనేమో! ఇంతకీ నేను బాగా వ్రాసాను అంటారా!?
మీ స్పందనకి ధన్యవాదములు.

వనజ తాతినేని చెప్పారు...

శ్రీనివాస్ గారు.. మీ వ్యాఖ్యకి నా ధన్యవాదములు. మీరు సద్విమర్శగా చెప్పిన విషయం అవగతమైనది. కాని నేను వారి గురించే చెప్పాను. పురుషులందరినీ దుయ్యబట్టలేదండీ!
అందుకే ఆఖరిలో "
వారు.. వారే.. ఎన్నటికి..మారని వారు వారే..

అని రీపీటేడ్..గా బలంగా చెప్పాను.

థాంక్ యు సో మచ్.

హేమంత చౌదరి చెప్పారు...

హేట్స్ఆఫ్.

ఆవేశంగా వ్రాసినా అన్నీ నిజాలు వ్రాసారు. కొంతమంది ఎంత మిస్ బిహేవ్ చేస్తారో.ఆఖరికి బస్ కండక్టర్ తో సహా.తేళ్ళు జెర్రులు ప్రాకినట్లు ఉంటుంది.ఎక్కడికని పారిపోగలం?

అందుకే కరాటే లాంటివి నేర్చుకుని ఉండాలి. లేకపొతే సేఫ్టీ పిన్ చాలు వాళ్ళని నిరోదించడానికి.
ఇది మా అమ్మాయిల అభిప్రాయం.క్రూయాల్ మెంటాలిటి అనుకోకండి. మరి మా బాధ ఎవరికీ చెప్పుకోవాలి? వారు మారాలంటే లేడీస్ ఇలా ఉండాల్సిందే .

వనజమ్మా ! చాలా మంచి కవిత వ్రాశావు. థాంక్స్ ఎ లాట్.

హేమంత

సామాన్య చెప్పారు...

వనజ గారు మీ కవిత చాలా బాగుంది .చాలా అవసరమైన కవిత .మిమ్మల్ని ఆ దిశగా ప్రోత్సహించిన అశోక్ గారికి ధన్యవాదాలు.

వనజ తాతినేని చెప్పారు...

సామాన్య గారు.. బాగున్నారా!? "వారు వారే"కవిత నచ్చినందుకు చాలా సంతోషం థాంక్ యు వేరి మచ్.

hemalatha putla చెప్పారు...

ఇంత కథ ఉందా! థాంక్స్ టు అశోక్ గారు.

వనజ తాతినేని చెప్పారు...

హేమలత పుట్ల..గారు.. వారు వారే కవిత వెనుక కథ .. చూసారు కదా! మీ స్పందనకి ధన్యవాదములు.
థాంక్ యు..