30, జూన్ 2012, శనివారం

లవ్ ఫర్ ఎవెర్


ఒకనాడు ......

వలపు సంద్రంలో మునిగాక
తలపుల చిత్తడి ఆరేదెక్కడ
నేను నీ వశమై,పరవశమై
వేడుకోళ్ళుకి కరిగి వీడుకోలు చెరిగి
కాలాలు తరిగి ... ప్రే మికులుకి ఇవి నిత్య నూతనమేమో !

వేరొకనాడు..

స్మృతిపథంలో...
హృదయ లయ తప్పిన క్షణం
మనసులు ముడివేసుకున్న తరుణం
ఎడబాటు లో వేసారి యెద కృంగిన వైనం
నిట్టూర్పుల వేదన లో గ్రహించిన మోసం
ఆశలు అన్నీ దోచుకుని వెళ్ళిన ద్రోహం
వెల్లువై ముంచెత్తే జ్ఞాపకాలలో తడిసి పోతూ..

ఎల్లప్పుడూ..

ప్రేమైక జీవన నాదం
ఆనాటిది, యీ నాటిది, యే నాటిదీ
ప్రేమ మాత్రం పురాతన మైనది !

10 వ్యాఖ్యలు:

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

హృదయ లయ తప్పిన క్షణం
మనసులు ముడివేసుకున్న తరుణం
ఎడబాటు లో వేసారి ఎద కృంగిన వైనం
నిట్టూర్పుల వేదన లో గ్రహించిన మోసం
ఆశలు అన్నీ దోచుకుని వెళ్ళిన ద్రోహం
వెల్లువై ముంచెత్తే జ్ఞాపకాలలో తడిసి పోతూ...


చాలా బాగుంది వనజ గారు

భాస్కర్ కె చెప్పారు...

chakkaga, chikkaga ala, ala allukupoyarandi, padalanu,
good one, keep writing.

అజ్ఞాత చెప్పారు...

good

Meraj Fathima చెప్పారు...

వనజగారూ, చాలా చక్కగా చెప్పారు, బాగుంది.

హితైషి చెప్పారు...

virugudu leni visham ani kudaa anavachchemo...gaa PREMA nu. meeremantaro mari. nachchindhi chaalaa mi "fr ever"

శ్రీ చెప్పారు...

చాలా బాగుంది వనజ గారూ!
చక్కని పదాల అల్లికతో ఆసాంతం
హృద్యంగా సాగింది ప్రేమ కవిత...
ఎంచుకున్న చిత్రం కూడా బాగుంది..
@శ్రీ

సీత చెప్పారు...

love for ever........
ప్రేమ మధురం ..అదిచ్చే అనుభూతీ మధురమే .....

చాలా బాగా ఉంది వనజ గారు ....:) :)

రాజ్ కుమార్ చెప్పారు...

బాగుందండీ..

Sai చెప్పారు...

చాలా చాలా బాగుంది అండీ...

జలతారు వెన్నెల చెప్పారు...

kavita baagundi vanaja gaaru!