16, జూన్ 2012, శనివారం

ఆకాశాన సగం మనం..

ఆకాశాన సగం మనం..
వినడానికి ఎంత బాగుందో..
ఎన్నెన్ని ఇనప కచ్చడాలు దాటాం..
నిత్యం సమరం చేస్తూనే ఉన్నాం..

ఉనికిని నిలబెట్టుకోవడానికి
మనుగడ సాగించడానికి ..
ఆధార
పీఠం కోల్పోకుండా ఉండటానికి ..

మనవాళ్ళే
.. మనవాళ్ళే..
మనని అనుమానపు దృక్కులతో ..
వెంటాడి
వేటాడిన క్షణాలు..
మనలని
మానసికంగా చంపేస్తాయి .
కూపస్థ
మండూకాల్లా .. బ్రతకమని
అనరు
కానీ.. హస్తిమ శకాంతర భేదంతో 
ఉండాలని
కోరుకుంటారు.
ఇంకానా ..... ఇంకానా.. అనుకోకండి ..
అరఘడియ
ఆలస్యం అయిందంటే ..
మన
మీద ప్రేమ కన్నా..,
మన
భద్రత మీద భయం కన్నా..
ఇరుగుపొరుగు
ఏమనుకుంటారో అని భయం ..
ఎదిగేది ఎక్కడ.. ఎదగనిచ్చేది ఎక్కడ..?
శరణార్ధ శిభిరాల్లోనే నయం..
చింతనలోనైన..స్వేచ్చగా మనగల్గుతారు


అవసరాల బానిసత్వ కొట్టంలో..
జీతం
రాళ్ళ పాలిచ్చే పసురాళ్ళం మనం..
జీవితపు
రంగస్థలం మీద
మనది
కాని జీవితంలో నటిస్తున్న
నట
ఊర్వశి' లం మనం.
విజ్ఞానపు
పూలతో అలంకరించుకున్న
వసంత
భామినులం ..మనం..
వ్యక్తిత్వపు
పరిమళాలు ,సమర్ధతా నైపుణ్యాలు ఉన్న
పట్టమహిషు 
 "లం మనం..
అయినా
మనకన్నా. బోనుసాయి మొక్కలే నయం ..
గర్వంగా పదుగురికి ప్రదర్శిస్తారు. .

మనువు
ఒక లోహపు గది..
తనువు
ఒక మోహపు నది..
నిత్యం
మనసు మల్లెలా
నలుగుతూనే
ఉంటుంది .
.. ఆలోచనా విధానంలోను
మనగల్గలేని
మనం..
ఎప్పటకి చరణదాసిలా..
మిగిలిపోతే
బాగుండునట ..
పురాణాల్లో లా కాకుండా
చరిత్రలో
శోకపర్వాలు , వనవాస ఘట్టాలు లేని
మనకొక
అధ్యాయాలు మిగుల్చుకుంటూ..
భవితలో
.. మన లాటి మనం
లేకుండా
మరింత చైతన్యశీలురుగా .
ఎదిగే
దిశలో మనలో
మనం
. మనం మనం...

6 వ్యాఖ్యలు:

భాస్కర్ కె చెప్పారు...

chaalaa chakkaga raasaarandi,
aa aavedana andhariki artham aithe chaalaa samasyalu poyinatle.

ఫోటాన్ చెప్పారు...

>>>మనవాళ్ళే .. మనవాళ్ళే..
మనని అనుమానపు దృక్కులతో ..
వెంటాడి వేటాడిన క్షణాలు..
మనలని మానసికంగా చంపేస్తాయి .<<<

నిజం...
చాలా బాగుంది వనజ గారు

సృజన చెప్పారు...

మనకోసం మనం మనంమనం...ఎంతబాగా చెప్పారండి!

పల్లా కొండల రావు చెప్పారు...

పోరాడితే పోయేదేమీలేదు బానిస సంకెల్లు తప్ప !
సంఘటితం గా పరిమాణాత్మకంగా పోరాడితే క్రమక్రమంగా మెరుగుదల లభిస్తుంది.
భావజాల రంగం లో కూడా బ్లాగుల ద్వారా మీరు చేస్తున్న పోరాటం మరింత మెరుగు పడాలని కోరుతూ ... మంచి పోస్టు వ్రాసినందుకు అభినందనలు వనజ గారూ !

నిరంతరమూ వసంతములే.... చెప్పారు...

బాగా చెప్పారు వనజా గారు...వుందిలే మంచి కాలం ముందు ముందునా!

వనజ తాతినేని చెప్పారు...

the tree gaaru..
@ POtaan ..gaaru
@srujana gaaru..
@pallaa kondalarao gaaru..
@Nirantaramu vasantam Suresh gaaru

Thanks to all.