4, జూన్ 2012, సోమవారం

జాజిమల్లి సాహిత్యం

నిన్నటి "సత్యమేవ జయతే " కార్యక్రమం లో ప్రేమ వివాహాలు చేసుకుని పెద్దల అహంకారాలకి,ఆస్తుల- అంతస్తుల హోదాలకి, మత తారతమ్యాలకి, పెద్దల పంచాయితీలకి బలి అయి పోయిన వాస్తవ గాధలని కన్నీళ్ళ మధ్య చూసాం.

"ప్రేమ సత్యం
ప్రేమ నిత్యం
ప్రేమ పవిత్రం "

మాటలతో అంగీకరించకపోయినా సరే
ప్రేమ అంటే ఆకర్షణ లు కాదు
ప్రేమ అంటే కాలక్షేపపు సమయాలు కాదు
ప్రేమ అంటే మొహం కాదు.

ప్రేమ అంటే ఇరువురి మనసుల మధ్య అంతర్లీనంగా ప్రవహించే జీవ నది.
జీవ నదిలో ..ఒకే తెప్ప పై.. జీవన యానం మొదలిడాలి.

మన బ్లాగ్ లోనే చూడండీ! అందరూ ఎపుడో ఒకప్పుడు ప్రేమ కవిత్వం వ్రాసే వారే! వ్రాస్తున్న వారే!
ఎందుకంటే మనసెప్పుడూ నవ యవ్వనంతో తొణికిసలాడుతూ ఉంటుంది కాబట్టి.

ప్రేమలో పడిన ఒక యువకుడి అంతరంగం ఏమిటో ఇక్కడ ఈ పాటలో చూడండి:)
అంతగా ప్రాచుర్యంలో లేని ఈపాట నాకు బాగా నచ్చిన పాట.
మల్లికార్జున్ గళం ..లో పాట నాకు చాలా ఇష్టం కూడా

అందుకే ..నాకు నచ్చిన పాట సాహిత్యం ని ,ఆడియోని ఇక్కడ జతపరుస్తున్నాను.
చూసేయండి,వినేయండి.

ఎక్కడ పడితే అక్కడే నువ్వు కనబడుతూ ఉంటే
రెక్కలు విప్పిన చప్పుడై మది తడబతుతూ ఉంటే

ఎక్కడ పడితే అక్కడే నువ్వు కనబడుతూ ఉంటే
రెక్కలు విప్పిన చప్పుడై మది తడబతుతూ ఉంటే
కంటికి ఎదురుగా ఎవరున్నా నీ రూపాన్నే చూస్తున్నా
ఒంటిగా ఎక్కడ నిలుచున్నా నీ తలపులలో నేనున్నా
వలపులు వలదని మనసే అంటున్నా
కన్ను మిన్నై నిన్నే చూడా లంటుందే
నిన్ను నాలో నాలోనే దాచాలను కుంటుందే

ఎక్కడ పడితే అక్కడే నువ్వు కనబడుతూ ఉంటే

రెక్కలు విప్పిన చప్పుడై మది తడబతుతూ ఉంటే

పుస్తకాలు చదివానే ప్రేమ చరితలెన్నో విన్నాను
ప్రేఅమ జంటలను కలిసానే ,ఈ ప్రేమ మహిమలేంటో అడిగానే
ప్రేమంటే సముద్రం అన్నారు ఒకరు
ప్రేమంటే అమృతం అన్నారింకొకరు
ఆ లోతుకి దూకాలనిపించే
ఆ తీపిని చూడాలనిపించే
ముప్పులు తప్పక తప్పవనిపించే
కన్ను మిన్నై నిన్నే చూడా లంటుందే
నిన్ను నాలో నాలోనే దాచాలను కుంటుందే

ఎక్కడ పడితే అక్కడే నువ్వు కనబడుతూ ఉంటే
రెక్కలు విప్పిన చప్పుడై మది తడబతుతూ ఉంటే

అనుభవజ్ఞు లని కలిసానే
నా గుండె బాధనతా చెప్పానే
సైకాలజిస్తులని కలిసానే
ఉత్తరాలు కూడా రాసాలే

నీ మనసుకి మార్గం ధ్యానం అన్నారొకరు
నీ వయసుకి భారం తప్పదు అన్నారింకొకరు
అను నిత్యం ధ్యానం చేస్తున్నా
ఎద మోయని భారం మోస్తున్నా
తిప్పలు తప్పక తప్పవని తెలిసి

కన్ను మిన్నై నిన్నే చూడా లంటుందే
నిన్ను నాలో నాలోనే దాచాలను కుంటుందే

ఎక్కడ పడితే అక్కడే నువ్వు కనబడుతూ ఉంటే
రెక్కలు విప్పిన చప్పుడై మది తడబతుతూ ఉంటే
ఈ పాటకి సాహిత్యం భేరి ఉమా మహేష్.అందించారు.
గళం ..మల్లికార్జున్.
చిత్రం : జాజిమల్లి

వీడియో లింక్ ఇక్కడ


ఆడియో " లింక్ ఇక్కడ..


4 వ్యాఖ్యలు:

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

chaalaa baagundi.manchi saahithyam.

జలతారు వెన్నెల చెప్పారు...

సత్యమేవ జయతే మొదలయ్యాక కొంచెం నచ్చని ఎపిసొడ్ ఇదేనేమో నాకు.
పాట బాగుంది వనజ గారు

కాయల నాగేంద్ర చెప్పారు...

మంచి సాహిత్యమున్న పాటను వినిపించారు. "ప్రేమ సత్యం...ప్రేమ నిత్యం...ప్రేమ పవిత్రం" ప్రేమ గురించి చక్కగా విశ్లేషించారు. ధన్యవాదాలు వనజ గారు!

శశి కళ చెప్పారు...

మంచి పాట గుర్తు చేసారు