12, జూన్ 2012, మంగళవారం

నాకు నచ్చిన పుస్తకాలు " ఆత్మ కథలు"

ఏడెనిమిది గంటలు విధ్యుత్ కోత నాకు బోలెడు సంతోషం కల్గిస్తుంది. కారణం పుస్తకాలు చదువుకోవచ్చు. అదే కోత లేకుంటే.. ఏ టీవి,లేదా ఇలా బ్లాగ్ లు చూడటం.

బ్లాగ్లు చదవలేకపోవడం కూడా వెలితిగానే ఉన్నప్పటికీ ఆ వెలితి లేకుండా పూడ్చేది పుస్తక పఠనమే.

నాకు బాగా నచ్చే పుస్తకాలు ఆత్మ కథలు.

"ఆత్మ కథ " అనేది విదేశీ సాహిత్య ప్రక్రియ.

ఆత్మ కథలో ప్రధానంగా ఉండవలసిన జీవ లక్షణం నిజాయితీ కల్గి ఉండటం.నిజ జీవితాల కథలు వాస్తవానికి అద్దంపడుతూ, వ్యక్తిత్వాలను కళ్లముందు ఆవిష్కరిస్తాయి. ఆ విధంగా వాటికి ఆకర్షణ లభిస్తుంది

జాతి పిత మహాత్మా గాంధి వంటి మహోన్నత వ్యక్తులు తమని తాము కించ పరచుకునే విధంగా యదార్ధ విషయాలను బహిర్గతం చేయరు. "సత్య శోధన" పేరిట మన తెలుగులో కూడా లభ్యం అవుతుంది.

ఆత్మ కథలలో.. బాల్యం నుండి ఆత్మ కథ వ్రాసే నాటి వరకు అత్యంత నిజాయితీగా చెప్పడం జరుగుతుంది కాబట్టే ..ఆత్మ కథల ద్వారా.. వ్యక్తుల నడవడిక, బలహీనతలు,వైఫల్యాలు మొదలగునవి తెలుసుకోవచ్చు. వారి అనుభవాలు-జ్ఞాపకాలు..పాఠకులకు పాఠాలు లాంటివే!

మహాత్మా గాంధి, జవహర్లాల్ నెహ్రు ,రచయిత్రి కమలా దాస్, నటుడు దేవానంద్,మహా కవి శ్రీ శ్రీ మొదలైన వారు ఆత్మ కథలు వ్రాశారు. వీరు దారుణమైన నిజాలు వ్రాసి..ఆత్మ కథ అంటే ఏమిటో ఎలా ఉంటుందో రుచి చూపించారు.

చార్లీ చాప్లిన్ ఆత్మ కథ కూడా ..ఎంతొ ప్రసిద్ది చెందినది.

అలాగే మాజీ రాష్ట్రపతి పి జే అబ్దుల్ కలాం వ్రాసిన "వింగ్స్ ఆఫ్ ఫైర్" మన దేశ ప్రజలపై ఎంతటి గొప్ప ముద్రని వేసిందో కదా!

నవయుగ ఆంద్ర వైతాళికులు కందుకూరి వీరేశ లింగం గారిచే తెలుగులో మొట్ట మొదటిగా వెలువడిన ఆత్మ కథా గ్రంధం.

ఇక తెలుగు లో స్త్రీలలో ఆత్మ కథ వ్రాసిన మొదటి వారు..ఏడిదం సత్యవతి గారు.

అలనాడు "నవోదయ" పత్రికలో ధారావాహికంగా ప్రచురింప బడిన శ్రీపాద వారి యదార్ధ కథ."అనుభవాలు-జ్ఞాపకాలూనూ.

సంపాదకులు శ్రీ నీలం వెంకట శేషయ్య గారు అభ్యర్ధించగా శ్రీ పాద వారు సమ్మతించి వారి ఆత్మ కథని అందించారు అట.
అనుభవాలు-జ్ఞాపకాలూనూ ..గ్రంధం ఆనాటి సమాజంలోని వివిధ పోకడలకు ఒక నిలువుటద్దం.అప్పటి జన జీవితానికి అచ్చమైన ప్రతి బింబం.

మరణ సమయానికి ముందు ఆనేకానేక భాదల మధ్య అనుభవాల దొంతరల తొ అనారోగ్యంతో బాధపడుతూ పురిపండా అప్పలస్వామి గారికి వ్రాసిన చివరి లేఖ వీలునామా లాంటిది .చదువరుల కన్నులను చేమరింపజేసే, గుండెలు పిండి చేసే దారుణమైన లేఖతో..ఈ గ్రంధం ముగుస్తుంది .

తెలుగు వారు అందరు చదవ వలసిన గ్రంధం శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి... అనుభవాలు-జ్ఞాపకాలూనూ..

రచయిత్రి ముదిగొండ సుజాతా రెడ్డి,మల్లెమాల సుందర రామిరెడ్డి,సినీ తారలు డాక్టర్ భానుమతి,జమున , గొల్లపూడి మారుతీ రావు గారు,జయసుధ మొదలైన వారు కూడా ఆత్మ కథలు వ్రాశారు.

ఇప్పుడు నా జీవనయానం లో ..కే.వరలక్ష్మి గారు తన ఆత్మ కథ వ్రాస్తున్నారు.

మనం చదివే పుస్తకం మంచి పుస్తకం అయితే గొప్ప జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. మనపై అమిత ప్రభావాన్ని చూపుతుంది.

నాకు సినిమా వాళ్ళు వ్రాసిన ఆత్మ కథల కన్నా రచయితలూ వ్రాసిన ఆత్మ కథలు నచ్చుతాయి. ఆ ఆత్మ కథలలో సామాజిక అంశాలు,అప్పటి కాలమాన పరిస్థితులు..సంప్రదాయం మొదలగు విషయాలు చాలా విపులీకరించి చెపుతుంటారు. ఆ విధంగా మనకి చరిత్ర లో విషయాలు తెలుస్తుంటాయి.

మంచి పుస్తకం మన చేతిలో ఉండటం చాలా అవసరం కూడా అనిపిస్తూ ఉంటుంది కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత.
మీకు నచ్చిన ఆత్మ కథలు ఉంటే చెప్పండి. (తెలుగు) ఈ సారి అవి కొని చదవడానికి ప్రయత్నం చేస్తాను.

6 వ్యాఖ్యలు:

the tree చెప్పారు...

meere konni pusthaakala list isthe bhaagudedemonandi, sanjeevdev gari di okati undalanukonta,

Pantula gopala krishna rao చెప్పారు...

నాకు కూడా ఆత్మ కథలే ఇష్టం. అయితే అవి నిజాయతీ తో వ్రాసినవి అయిఉండాలి.సంజీవ్ దేవ్ గారి జీవిత చరిత్ర తుమ్మ పూడి అనే పేరుతో వచ్చింది. బృహద్గ్రంథం. ఆదిభట్ల నారాయణ దాసు గారి స్వీయచరిత్ర పేరు నా యెరుక.ఇది ఆయన తన ముప్పైయవ యేటి వరకే వ్రాసారు. చిలకమర్తి వారి స్వీయ చరిత్ర కూడా లభ్యమౌతోంది.వెన్నెలకంటి సుబ్బారావుగారు (1786-1839) తన జీవిత చరిత్ర వ్రాసేరట. ఇంకా రాయసం వెంకట శివుడుస వల్లూరి సూర్య నారాయణ రావుగాపు కూడా స్వీయచరిత్రలు వ్రాసుకున్నారట. ఈ చివరి ముగ్గురి స్వీయ చరిత్రలూ నేను చదువ లేదు.

oddula ravisekhar చెప్పారు...

పుస్తకాలు చదవటం స్నేహితులతో మాట్లాడటం కన్నా గొప్పది.ఇంకా అందులో ఆత్మ కథలు కొన్ని మరింత బాగా వుంటాయి.insider అని p.v.narasimhaaraao గారిది తెలుగు లో వచ్చింది.

జలతారువెన్నెల చెప్పారు...

ఎప్పుడు ఆత్మ కథలు చదవలేదు. మీరు suggect చేసిన వాటిలో ఏ ఒక్కటైనా చదువుతాను.

అజ్ఞాత చెప్పారు...

శ్రీపాద వారి అనుభవాలు-జ్ఞాపకాలు ఎన్ని సార్లు చదివానో గుర్తేలేదు. నిజయితీతో రాసిన ఆత్మ కధలు స్ఫూర్తిదాయకాలు.

satya చెప్పారు...

మీరు చెప్పింది అక్షరాలా నిజం . సమాజం కోసం నిజాయితి గా పటు పడిన వారి జీవిత చరిత్రలు చదివితే మనకి కూడా మంచి ఆలోచనలే వస్తాయే .. మనం కూడా జీవితం లో వచ్చే కష్టాలను దర్యం గా ఎదురుకోగాలము . నాకు నచ్చిన ఆత్మ కథ Honor Bharta ratna JRD TATA ... BEYOND THE LAST BLUE MOUNTAIN .. ఇండియన్ ఐర్లిన్స్ స్టార్ట్ చేసారు .. అతని నిజాయితి , అతను ఐర్లిన్స్ ని ప్రైవేట్ చేయద్దని అయన చెసి న పోరాటం .. అతను ఇండియా ని Indusrial గా ఎలా గొప్ప స్టాయికి తెసుకువేల్లడో ... ఈయన చరిత్ర ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ ఎవ్వరికి చెప్పిన చాల ఇన్స్పిరింగ్ గా ఉంటుందని నా వుద్దేశం .. meeru velunte chadavandi ..