ఐశ్వర్యంలో ఆభరణం చదువు.!
దారిద్ర్యంలో ఆశయం చదువు..!!
ఈ కొటేషన్ ఎక్కడ చదివానో గుర్తులేదు.. కానీ బాగా నచ్చి.. ఓ మందపాటి కార్డ్ పై స్కెచ్ పెన్ తో వ్రాసి మా హాల్లో వ్రేలాడదీసాను. మా ఇంటికి వచ్చినవారు అందరూ.. ఆ కోట్స్ ని వ్రాసుకుని వెళ్ళేవారు.
అలాగే ఇంకొక విషయం కూడా అలాగే వ్రేలాడదీసాను. (యండమూరి రచన లో చదివి)
నిరంతర గెలుపు నిజమైన గెలుపు కాదు
గెలుపు కోసం పోరాటం ఓటమి కాదు.
పారిపోతే గెలుపు రాదు..
నిరర్ధక విజయాలు ఎన్ని అయితేనేం?
నిజమైన విజయం కోసం తాత్కాలికంగా ఓడిపోతూనే ఉండాలి. గెలుపొండాలి.
లక్ష్యం గొప్పది అయితే ఆత్మ విశ్వాసం ఆయుధమవుతుంది.
జీవన పథంలో అలసినప్పుడల్లా... ఈ స్పూర్తికర వ్యాక్యాలు చూసుకుంటూ .. నన్ను నేను రీచార్జ్ చేసుకుంటూ ఉండేదాన్ని.
ప్రతి మానవుడు జీవితమంతా సక్సెస్ వైపే ప్రయాణం చేయాలనుకుంటా డట. అపజయాలని అసలు తట్టుకునే శక్తి కొందరిలో ఉండదు.
ప్రతి విషయానికి అసహనం,అసంతృప్తి.తగిన శ్రమ లేకుండానే..కోరుకున్నవన్నీ ఒళ్ళో వాటంతట అవే వచ్చి పడతాయని..కలలు కంటూ ఉంటారు.
మనం చరిత్రని తిరగేస్తే అనేక మంది విజయ గాధల వెనుక అనేక అపజయాలు ఉన్నట్లు తెలుస్తుంది.
ఒక వ్యక్తి కాని,సంస్థ కాని,దేశం కాని అభివృద్ధి పథంలోకి రావాలంటే చాలా కష్ట పడాలి. కష్ట పడకుండా ఏది ఆయాచితంగా రాదు. వచ్చిన దేది కూడా మనది కాదు. అలాగే అదృష్టం అని అంటూ ఉంటారు. అదృష్టం కన్నా ముందు సాధించాలి ఆనే కోరిక,పట్టుదల,క్రమశిక్షణ ఇవేమీ లేకుండా అదృష్టం తన్నుకు రాదు.
అదృష్టం అంటే 10 % శాతం అనుకూల పరిస్థితులు రావడం..90 % కఠోర శ్రమ..అనుకుంటాను.
ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే ఈ రోజు.. కెరీర్ గైడెన్స్ బుక్స్ చదివాను.అందులో.. కొన్ని అంశాలు బాగా నచ్చాయి. ఆ అంశాలని మనం చేసుకుంటూనే ఇలా అనుకున్నాను.
గతంలో మనకి లభించిన అపజయాల నుండి పాఠాలు నేర్చుకుని..వర్తమానాన్ని ఎంజాయ్ చేస్తూ..భవిష్యత్ కోసం ప్లానింగ్ జరగాలి.వర్తమానం లో బ్రతకడం ఎంత అవసరమో.. గతం లో చేసిన తప్పులని తెలుసుకుని ఆ తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవడం అవసరం.
The art of wise living is to be present in the present as a present.
చాలా మంచి విషయం కదా! మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తూ.. ఈ షేరింగ్..
15 కామెంట్లు:
సాగరమంత
శ్రమే కాదా విజయం కోరుకునేది
స్వాతిముత్యమంత
ఓరిమిని కూడా.
*******
వనజ గారు మీ పోస్ట్ చాల inspiring గా ఉందండీ
గతం లో చేసిన తప్పులని తెలుసుకుని ఆ తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవడం అవసరం.
చాలా మంచి విషయాలు వ్రాశారు వనజ గారు
బాగుంది వనజ గారూ ! ప్రతి అపజయమూ ఓ పాఠమే. నీకూ , ఎదుటివారికీ కూడా !
Inspirational
inspirational
గుడ్.. చాలా బాగా చెప్పారు. కొటేషన్స్ చదివితే ఎంతో ప్రేరణ లభిస్తుంది.
విజయానికి తొలిమెట్టు అపజయమే!శ్రమ పడితే అదృష్టం అదే వరిస్తుంది.నిత్యం పారాయణం చేయవలసిన శిలాక్షరాలను మాకు ప్రెజంట్ చేసారు.
స్ఫూర్తినిచ్చే వాక్యాలు ఎన్నటికీ వాడని అక్షర సుమ మాలలే...
మీరు వ్రాసింది నిజమే...
అభినందనలు వనజ గారూ!...@శ్రీ
మంచి సూక్తులను గుర్తుచేస్తూ, అందరికీ ఉపయేగపడే విషయాలను చెప్పారు.
వనజా, స్పూర్తినిచ్చే వాక్యాలు ఎదురుగా కనిపిస్తుంటే కొంతైనా ఆచరణ యోగ్యంగా ఉంటుంది.
మంచి ప్రయత్నం.
చూస్తూ చదవగా చదవగా కొన్నైనా బుర్రలోకి ఎక్కించుకుని ఆచరిస్తామేమో నాలాంటివాళ్ళం:-) మంచి పోస్ట్!
స్పూర్తి వంత మయిన పోస్ట్.
skvramesh gaaru
@Shashi kala gaaru
@Palla kondalarao gaaru
@radhe gaaru
@raj gaaru..
@C.Umadevi gaaru..
@Sree gaaru
@kayala nagendra gaaru
@Meraj fathima..gaaru
@Padmarpita gaaru
@Oddula ravishekhar gaaru..
All of you Thanks for comment.
చాలా ఇన్స్పైరింగ్ గా వుంది ,,కొటేషన్ మాత్రమె కాదు మీరలా రాసి తగిలించుకోవడం కూడా .
సామాన్య గారు.. బాగున్నారా!? నాకు ఎంత సంతోషం వేసిందో..తెలుసా!?
నా బ్లాగ్ ని చాలా చాలా సమయం వెచ్చించి.. ఓపికగా చదివి.. ఇన్ని కామెంట్స్ ఇచ్చినందుకు ఎంత సంతోషమో! ఇలాటి సంతోష సమయాలు చాలా తక్కువ నాకు.
అసలే హ్యాపీ మూడ్ లో ఉన్నాను. నిఖిల్ (బాబు ) బాగున్నాడు.. అలాగే మీ కామెంట్స్ చూసి కూడా థ్రిల్ అయ్యాను.
మూడు రోజుల నుండి నెట్ కనెక్షన్ ప్రాబ్లం గా ఉంది.. ఇప్పుడే సరిచేసారు.
థాంక్ యు థాంక్ యు వేరి మచ్.. సామాన్య గారు. మీ శక్తివంతమైన రచన కోసం ఎదురు చూస్తూ..
ఎల్లప్పుడు అభిమానించే ..
వనజ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి