సెల్ పోన్స్ జీవితాన్ని మార్చివేస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్ధుల జీవితాలని. కమ్యూనికేషన్ కోసం తల్లిదండ్రులు ముచ్చటపడి సెల్ పోన్స్ కొని పిల్లలకి ఇవ్వడం వల్ల వారి చదువు పట్ల శ్రద్ద తగ్గిపోతుంది కాబట్టి
హాస్టల్ లో ఉండి చదువుకునే పిల్లలకి సెల్ పోన్స్ ని ఇవ్వడం ని నిరోధించిన కళాశాల యాజమాన్యం కి తెలియకుండా కూడా విద్యార్దుల దగ్గర సెల్ పోన్స్ ఉంటున్నాయని వినికిడి కూడా ఉంది.
అలాగే విజిటర్స్ దగ్గర నుండి రిక్వెస్ట్ చేసి తీసుకున్న సెల్ పోన్ ల నుండి విద్యార్ధులు తల్లిదండ్రులతో మాట్లాడటం లేదని.. ఎవరు ఎవరికో పోన్ చేసి మాట్లాడుతుంటారు కాబట్టి.. సెల్ పోన్స్ ఇవ్వవద్దని కఠినమైన రూల్స్ పెట్టారు.
సెల్ పోన్ అంటే ఇప్పుడు ఇంటర్నెట్ కూడా.. కదా !
విద్యార్ధులు వద్ద సెల్ పోన్స్ ఉండటం వల్ల అవసరం కి ఉపయోగపడటం కన్న హాని ఎక్కువ కల్గుతున్న సందర్భాలు ఎక్కువ.
ముఖ్యంగా మెసేజెస్ సౌలభ్యంతో.. సవ్వడి లేకుండా చాటింగ్ ఆ తరువాత దమ్ముంటే డేటింగ్ ఇంకొక కోణంలో యాక్సిడెంట్స్ ఎక్కువై పోయాయి. తల్లిదండ్రులు వద్దన్నా పీడించి కొనిపించిన సెల్ పోన్ ఉంటె చాలు రీచార్జ్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు. నాన్ స్టాప్ టాకింగ్ తో.. చదువుని చంకన పెట్టినట్లే!
ఒకప్పుడు ఓడిస్సా రాష్ట్రంలో ఒక గ్రామంలో గ్రామ పెద్దలు ఆడ పిల్లలకి సెల్ పోన్స్ ఇవ్వడంని నిషేదించాలని తీర్మానం చేస్తే .. నాకే విషయం నచ్చక ఆడ-మగ వివక్ష ఎందుకు అని బాధపడిన వారిలో నేను ఒకదాన్ని.
కానీ ఇటీవల వింటున్న ఆడపిల్లల అర్ధాంతర చావులకి కారణభూతం అవుతుందని తెలుస్తుంటే.. సెల్ పోన్స్ ఉండటం కూడా చేటు అవుతుందని.. అనిపిస్తుంది.
విజయవాడ మేరీ స్టెల్లా కాలేజ్లో.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతూ హాస్టల్ లో ఉంటున్న అమ్మాయి.. ఒక సెలవు రోజు తండ్రితో మాట్లాడి ఏ.టి.ఏం కార్డ్ తో.. డబ్బు విత్ డ్రా చేసుకుని.. సాయంత్రం హాస్టల్ కి వెళ్ళలేదు. మరునాడు..మా ప్రక్క వూరి పొలాల మధ్య పంటకాలువలో శవమై ఉంది. వ్యవసాయం చేసుకుంటూ ఉన్న ముగ్గురు ఆడపిల్లలని ఉన్నత విద్యలు చదివిస్తున్న ఆ తల్లి తండ్రుల గుండె మంటకి కారణం సెల్ పోన్ మాత్రమే కారణం అని తెలిసింది. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం,సమాచార విప్లవం పుణ్యమా అని అభివృద్ధి కన్నా వినాశ కరమే ఎక్కువ కనబడుతుంది." పెరుగుట విరుగుట కొరకే " అన్న నానుడి గుర్తుకు వస్తుంది.
ఎనిమిది తొమ్మిది తరగతులు చదువుతున్న వారి దగ్గర కూడా సెల్ పోన్స్ ఉంటున్నాయి. సెల్ పోన్స్ వాడకంని పెద్దలు ఎందుకు ప్రోత్సహిస్తున్నారో తెలియదు. ఎదిగి ఎదగని వయస్సులో పరిపక్వత లేని ఆలోచనల వల్ల సెల్ పోన్ వాడకం ప్రమాదకారి అవుతుంది.
పద్దెనిమిది ఏళ్ళకు ఓటు హక్కు లాగా.. ఇరువది ఒక్క ఏళ్ళకు సెల్ పోన్ కనెక్షన్ ఇచ్చే విధంగా నిబంధన ఉంటె బాగుంటుంది అనుకుంటున్నాను. అండర్ ఏజ్ వారికి డ్రగ్స్,మద్య పానీయం అమ్మడం యెంత నేరమో.. సెల్ పోన్ ఉండటం నేరం గా పరిగణిస్తే బావుండును కదా!
కేవలం సమాచారం తెలియడం కోసమే పోన్ అవసరం అని భావిస్తే.. అతి ముఖ్య మైన పరిమితమైన నెంబర్స్ కి మాత్రమే కాల్ వెళ్ళే విధంగా కార్డ్ సిస్టం ఏర్పాటు చేసి.. పబ్లిక్ టెలి పోన్స్ నుండి అవుట్ గోయింగ్ వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం.. ఆ బిల్ ని తల్లి దండ్రులు చెల్లించడం చేస్తే బావుంటుందేమో..అని అనుకుంటున్నాను.
పిల్లల జీవితాలు బాగుండాలంటే.. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలేమో..! పిల్లలు అడుగుతున్నారని సెల్ పోన్ కొని ఇచ్చే తల్లిదండ్రులు .. సెల్ వారి జీవితాలని హెల్ చేస్తుందని ఒక్క నిమిషం ఆలోచించినా చాలు. కొన్నేళ్ళు వారిని కాపాడుకున్నట్లే.. !
విద్యార్ధి! యాన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్.!!
10 కామెంట్‌లు:
ఏంటండోయ్! ఉండివుండి ఇలా అయిపోయారు. మీరు రాస్తున్నారు కనక బతికిపోయాం. కానివ్వండి, మీరు చెప్పినది విన్నా ఆనందమే :)
"వనజవనమాలి" గారూ..
మంచి విషయం చెప్పారండీ..
లాభం,నష్టం రెండూ కలిసి వుండే వాటిల్లో ఈ సెల్ కూడా ఒకటి..
ఐడియా మంచిదైనా చెడైనా
"యాన్ ఐడియా కెన్ చేంజ్ లైఫ్."
గన్ (ఫోన్) బాగుందండీ...:)
చివరిలో మీ సూచనలు కుడా బాగున్నాయి!
టెక్నాలజీ ని వద్దు అనలేము.కాని విచక్షణ
పెంచాలి.పెద్దలు తమ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారో గమనించుకోవాలి
vanajammaa subhaashitaalanu kaadanagalamaa.:-)
కష్టే ఫలే ..మాస్టారు .. ఏమిటోనండీ .. ఇలా ఆవేశం వెళ్ళ గ్రక్కాలసి వచ్చింది. కొన్ని సంఘటనలను చూసి ఇలా స్పందించాల్సి వస్తుంది. ధన్యవాదములు
రాజీ గారు..థాంక్ యు వేరి మచ్ .
పోటాన్ గారు..:-) థాంక్ యు వెరీ మచ్
శశి గారు.. అవును కదా ! థాంక్ యు వెరీ మచ్
మెరాజ్ ..:) థాంక్ యు వెరీ మచ్
మీరు చెప్పింది అక్షర సత్యం.యువత వీటి వాడకం తో పెడ తోవ పడుతున్నారు.
<>
ఇలాంటి కొన్ని నియంత్రణలు చేయడం మంచి సూచన. మొత్తం సమాజం లో ప్రజల మానసిక చైతన్యం పెంచడం - వ్యవస్తీకృత మార్పుల ద్వారా మాత్రమే ఇలాంటి ఘోరాలు రూపు మాసి పోతాయి. అది ఒక్క రోజులో జరిగేది కాదు కనుక. ప్రాసెస్ లో భాగం గా మీ ఆలోచన - సూచనలు ఆహ్వానించదగ్గవి. ప్రస్తుతం అత్యవసరమైనవి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి