కాసిని కబుర్లు ..మళ్ళీ ఈ రోజు కబుర్లే!
మా వర్కర్ పెరుమాళ్ మంచి పనిమంతుడు . చాలా కష్ట పడి డిల్లీ,రాజస్థాన్ ,లక్నో ,కలకత్తా లలో కొన్ని సంవత్సరాలు పాటు ఉండి సంప్రదాయమైన చేతి కుట్టు పనిలో చాలా పరిణితి సాధించాడు. తను బాగా పనిచేయడమే కాదు తను సంపాదించిన ప్రావీణ్యం అందరూ సాధించలేరని అహంకారం కూడా.తన తోటి పనివారలని చులకనగా మాట్లాడుతూ ఉంటాడు.
నేను సూచించిన పని ని కూడా చేయకుండా నిర్లక్ష్యం గా ఉంటూ తనకి నచ్చినట్లు ఉంటూ..నేనే లేకపోతే మీ వర్క్ షాప్ ఉండదు అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు .
వాడి విపరీత దోరణి చూసి చూసి వాడిని పీకి పడేసాను ప్రావీణ్యం ఉందికదా అని నోటిని తాటిమట్టలా మారిస్తే ఊరుకుంటానా !? తాడి తన్నే వాడి తల తన్నేవాడు ఉంటాడు అన్నట్టు పెరుమాళ్ దగ్గర పని నేర్చుకున్న ఇంకొకతను బీహారీ వాలా పనికి కుదిరాడు.అతనికన్నా పనితనం,జీవకళ తో.. సజీవ చిత్రాలా అన్నంత గొప్పగా పనితనం ఉంది.
అయినా విద్వత్ ఉన్నవాడు సంప్రదాయ కళలను పునరుద్దించి భావితరాలకు భద్రపరచేవాడు అంత ఆహంకారిగా ఉంటే ఎలా.!? వినయంగా మంచిగా ఉంటే సొమ్ము ఏం పోతుందో ! పెరుమాళ్ పనితనాన్ని ని మెచ్చుకునే వాళ్ళు కూడా చాటుగా అతని నోటి దురుసుని అసహ్యిన్చుకుంటూనే ఉంటారు చాలామంది నోటివెంట ఆ మాట విన్నాను.
నాకు కొన్ని మాటలు గుర్తుకు వచ్చాయి
"కొన్ని మాటలు వీణ పలుకులు "
అవి ఆచరణలో ఇనుప ములుకులు...
కత్తి కంటే కలం గొప్పదన్న మాట
కల్ల కాక పోవచ్చును కాని
కలం బలం తెలియని కరుకు రక్కసికి
కలం నాల్క చిలక పలుకుల్ వినలేని చెవిటికి
నెత్తురు తాగి జీవించే నిర్ధయుడికి
మర్ధనం ఒకటే మహౌషదం
అందుకే తాత్కాలికంగా
పెన్ను జేబులో పెట్టి గన్ను చేత పట్టాను
ఏం చేయను ఎంత శాంతించినా తప్పలేదు
కొన్నిమాటలు వీణ పలుకులు
అవి ఆచరణ లో ఇనుప ములుకులు.
- దాశరధి
ఇంతకీ.. కొన్ని పనులు,కొన్ని మాటలు ఇనుప ములుకులు. వీణ పలుకులు వలె సున్నితంగా కూడా చెప్పవచ్చని తెలిసికూడా చెప్పలేని వారిని.. వెలివేయడం తప్ప (అదేనండీ పెరుమాళ్ కి ఉద్వాసన చెప్పినట్లు) ఏం చేయగలం!?
6 కామెంట్‌లు:
meru chesinde manchi pani vanaja garu nice post
భలేచెప్పారే:-)
పలుకుల్లోని పవర్ ని బహుబాగా చెప్పారు
కొంతమంది ఆత్మ విశ్వాసం పేరుతో అతి విశ్వాసం ప్రదర్శిస్తూ ఉంటారు.
svk Ramesh gaaru.. Thank you very much!
పద్మార్పిత గారు.. భలే అర్ధం చేసుకున్నారు! ధన్యవాదములు.
@ సృజన గారు.. మంచి అయినా..చెడు అయినా మొదటగా గుర్తిన్చాబడేది..మాట ద్వారగానే కదా!
పలుకే బంగారం అని ఊరికే అనలేదు కదా!
ధన్యవాదములు.
@కష్టేఫలే గారు.. అతి విశ్వాసం వారికీ మంచిది కాదేమో! తెలుసుకుంటే బాగుండును.
మీ స్పందనకి ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి