ఈ పాట వినడం, చూడటం చాలా హృద్యంగా ఉంటుంది కొన్ని యుగళ గీతాలలో చిత్రీకరణ చాలా చాలా బావుంటుంది. అందమైన దృశ్యాల తో చిత్రీకరించిన పాట ఎంత బావుందో..చూడండీ!!
80 వ దశకంలో రేడియోలో మారుమ్రోగిన పాట
కటకటాల రుద్రయ్య చిత్రంలో ఈ పాట నాకు చాలా ఇష్టం. వీణ నాది తీగ నీది.. అనే సాహిత్యమే కాని వీణ పాట కాదు. :)
ఇక సాహిత్యం విషయానికి వస్తే ఒకసారి వినగానే గుర్తుంది పోయే సాహిత్యం.
సాహిత్యం వేటూరి గారు. మొదటి చరణంలో "తొలి చూపు రాపాడగానే" అన్నది కొద్దిగా వెరైటీ గా ఉంటుంది. మొదట్లో నాకు అర్ధమయ్యేది కాదు రాపిడికి పర్యాయంగా రాపాడగానే అని రాసినట్లు ఉన్నారు. ఆ పదం మినహా పాట సాహిత్యం అంతా అరటి పండు ఒలిచి పెట్టినట్లు ఉంటుంది.
సంగీతం :జే.వి .రాఘవులు.
గాయనీ గాయకులు : ఎస్ .పి .బాలసుబ్రహ్మణ్యం ,పి .సుశీల.
పాట సాహిత్యం:
వీణ నాది తీగ నీది తీగ చాటు రాగముంది
తీగ చాటు రాగముంది
పువ్వు నాది,పూత నీది,ఆకు చాటు అందముంది ||వీణ నాది ||
తొలిపొద్దు ముద్దాడగానే
ఎరుపెక్కే తూరుపు దిక్కు
తొలి చూపు రాపాడగానే
వలపొక్కటే వయసు దిక్కు
వరదల్లె వాటేసి,మనసల్లే మాటేసి,వయసల్లే కాటేస్తే చిక్కు
తీపి ముద్దిచ్చి తీర్చాలి మొక్కు ||వీణనాది ||
మబ్బుల్లో మెరుపల్లే కాదు
వలపు వాన కురిసి వెలిసిపోదు
మనసంటే మాటలు కాదు
అది మాట ఇస్తే మరచిపోదు
బ్రతుకల్లే జతగూడి,వలపల్లే ఒనగూడి, ఒడిలోనే గుడికట్టే దిక్కు,
నా గుడి దీపమై నాకు దక్కు ||వీణ నాది ||

ఆడియో వినేయండీ! వీడియో చూసేయండి!!
8 కామెంట్‌లు:
naku istam i paata chaalaa baavuntundi.thank u vanaja garu
మంచి సాహిత్యం, చక్కటి సంగీతం, హృదయాన్ని మీటే గానం. మంచి పాటను వినిపించినందుకు అభినందనలు వనజ గారు!
Manju gaaru Thanks!!
నేను తరచుగా అంటే కనీసం నెలకోసారి అయినా వినే పాటల్లో ఇది ఒకటి.. ఇంకా మేఘసందేశం లోని "నిన్నటి దాకా" అను పాట, సితార లోని "వెన్నెల్లో గోదారి అందం", అన్వేషన్ లోని, మౌన రాగం లోని పాటలు చాలా ఇష్టం.ముఖ్యంగా "వీణ లోన" పాటకు ముందు వచ్చే ఆలాపన సుశీల గారు ఎంత బాగా పాడేరో మైమర్చి వింటాను..
నేను పొరపాటుగా మీరు చెప్పిన పాటకు కాకుండా వేరే పాటకు రాసాను.. "వీణ" అనగానే నా కిష్టమైన ఆ పాట ను గురించి రాసాను... తరవాత నా పాటను మనసారా విందామని చూస్తే తీరా ఇలాగయ్యింది..యుగళ గీతం అని చదివినప్పుడు కొంచెం సందేహం వచ్చింది కాని.. పూర్తిగా చదవకుండానే ..
వోలేటి గారు.. మొత్తానికి మిమ్మల్ని తిక మక చేసానన్నమాట.
ఏదైనా వీణ పాట కాకుండా.. వీణ అంటూ సాహిత్యం ఉన్న పాట వినిపించేసాను అన్నమాట. :)
ఇంతకీ ఈ పాట నచ్చిందా..అండీ! శ్రద్ద తీసుకుని మరలా వ్యాఖ్య చేసినందుకు ధన్యవాదములు.
కాయల నాగేంద్ర గారు.. పాట నచ్చినందుకు మీ స్పందనకి ధన్యవాదములు.
excellent songgggggggg
కామెంట్‌ను పోస్ట్ చేయండి