కార్తీకమాసం .. ఏకాదశి తిది .. ఈ కార్తీకం లో నేను శివాలయం కి వెళ్ళడం ఇవాళే తొలి రోజు. ఈ సంవత్సరం తెల్లవారుఝామునే పుణ్య స్నానం, దీపారాధన కోసం దేవాలయానికి వెళ్ళే ఓపిక లేక వెళ్ళడం మానుకున్నాను.
సరే ఈ సాయంత్రం స్వామి కరుణతో..ప్రదోష కాలంలో మహా దేవుని సందర్శించుకుని.. నక్షత్ర మాల పూజ లో పాల్గొని దీపార్చన కావించి..
రేపు మా "చంద్రుని" పుట్టిన రోజు కదా! ఏకాదశ రుద్రాభిషేకం గురించి మాట్లాడాలి అని పూజారి గారి కోసం ఎదురుచూసాను. రుద్రాభిషేకం,నక్షత్ర మాల పూజ కేటాయింపు విషయం గురించి వివరాలు కోసం అడిగితే "అరె మీరు చెప్పలేదు కదా! అందుకే వేరేవారికి అవకాశం కల్పించాం" అని చెప్పారు పూజారి గారు.
మీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు .అందుకే తేదీ కేటాయింపు వివరాలు అన్నీ చెపుతూ.. మీకు మెయిల్ పంపాను. అని చెపితే ..మెయిల్ బాక్స్ చూడలేదని చెప్పారు ఆయన. సేల్పోన్ కి దొరకక ,మెయిల్ బాక్స్ చూసుకోక, స్వయంగా కలవాలని వెళితే ఆయన దొరకక .. అందరు బాగోగులు చూసే దేవుని కన్నా పూజారి గారే బిజీగా ఉన్నారు. నేను, నా బోటి వాళ్ళు పూజారులని అలా బిజీ చేస్తారు కదా!..:)
సరే.. ఆ శివయ్య కృప అలా ఉంది అనుకుని సర్దుకున్నాను. ఇంటికి వచ్చాను.
హరుని దర్శనం అయింది హరి దర్శనం కి కూడా వెళితే బాగుండును అనిపించింది. మా కాలనీ లో ఉన్న "రామాలయం" కి వెళ్ళాను. (రామాలయంలో సమసంఖ్యలో ప్రదక్షిణ లు చేయాలని మా ఫ్రెండ్ చెప్పింది.)
రెండు ప్రదక్షిణలు గావించుకుని హారతి ఇస్తారని వేచి చూస్తున్నాం.
అంతలో.. పూజారి గారి సేల్పోన్ రింగ్ అయింది.. "తొలిసారి మిమ్ముల్ని చూసింది మొదలు" .. పాట రింగ్ టోన్ .. పూజారి గారు పూజ ఆపి పోన్ తీసి మాట్లాడారు.మళ్ళీ పూజ .మళ్ళీ పోన్ మ్రోగడం. నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది. పూజారి గారికి చాలా ఇష్టమైన పాట కాబోలు. ఎవరు పోన్ చేసినా సరే "తొలిసారి మిమ్ముల్నిచూసింది మొదలు"అంటూ.. ఆయనకీ తోలి ప్రేమలని గుర్తు చేస్తున్నట్లు ఉంది .. మంత్రాలు పఠించే పూజారి గారిని మంత్రించే రింగ్ టోన్ ఇది అనుకున్నా..
భూసురులు ..అంటే భూమి మీద నడయాడే దేవతలు .. చేసే పనిలో నిమగ్నం కావడం కంటే ఇతర విషయాలపై దృష్టి.. దేవాలయ పరిసరాలు,దైవ సన్నిది మాట మరచి కూడా పోన్ లో సంభాషణలు..
చికాకు అణుచుకుని.. తీర్ధం తీసుకుని వచ్చేసాం. వచ్చే దారిలో "సాయిబాబా"గుడి..
ఈ గుడిలోకి వెళ్లాం. అష్టోత్తరం చదువుతుండగానే ఈ పూజారి గారి పోన్ రింగ్ అయింది.పూజ ఆపి ఓ,,అయిదు నిమిషాలు మాట్లాడారు.
నాకు చాలా చిరాకు వేసింది. మొబైల్ తీసుకుని వెళ్ళకుండా ప్రశాంతత కోసం గుడికి వెళ్ళానా.. అక్కడా పోన్ ల గోలే! సేల్పోన్ టాక్ లు వినడానికే వెళ్ళినట్లు గా.. ఇవి దేవాలయాలా..సెల్లాలయాలా?
అబ్బబ్బ! ఏం గోలండీ!!స్వర్గం నరకం ఎక్కడో లేవు.. మనం సృష్టించుకున్నవే! మనం ఇతరులని ఇబ్బంది పెట్టేందుకు ఉన్నవే! అంతే సుమీ!!

4 కామెంట్లు:
:) mari andaru cell phone lu vaadutune vuntaru kadaa...nice post vanaja garu.Mi chandrudi ki mundugaane cheppeyandi naa puttinaroju subhaakankshalu photo dark ga vundi clear ga vunna photo pettandi...-:)
cell phone gurinchi nenu koodaa okati vraaseyaali vanaja gaaroo!...:-)
baagundi mee post...@sri
చెప్పాలంటే మంజు గారు .. మీ వ్యాఖ్యకి ధన్యవాదములు. "నిఖిల్ " మీ విషెస్ ఇప్పుడే అందించాను కూడా..
@ శ్రీ గారు.. :) సెల్ ఫోన్ చిత్రాలు గురించి త్వరగా వ్రాసేయండి..ఆసక్తిగా ఉంది. మీ వ్యాఖ్యకి ధన్యవాదములు.
మీ చంద్రుడికి జన్మదిన శుభాకాంక్షలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి