హృదయానికి దగ్గర దారి
రాజప్రాసాదం పై చంద్రుడు వడివడిగా ఊరేగుతున్నాడు.
కోటగోడలపై నుండి అంతఃపురం లోని 27గురు రాచకన్యలు
కోట గుమ్మాలకు ఆనుకుని ఘడియలు లెక్కెట్టుకుంటున్నారు.
జంట చకోర పక్షులు వెన్నెలను తాగుతూ విహరిస్తూ ఉన్నాయి
మతిస్థిమితం కోల్పోయిన విరహిణిలు కొందరు
లాంతరు చేత ధరించి పతిని వెతుక్కుంటూ బయలుదేరితే
మరికొందరు బాట వెంబడి కాపుగాసారు
ఎవరికివారు తమ కౌగిలిలో బంధించాలని.
రోహిణి మాత్రం తన ప్రేమనంతా వెన్నెలగా జేసి
పతి కార్యంలో తాను పాలు పంచుకుని శరత్పూర్ణిమని
మరింత శోభాయమానంగా మార్చింది.
పతి హృదయానికి దగ్గర దారి కనిపెట్టి.
తత్పూర్వ సూర్యోదయమే
పతి ఇష్టసఖి చెట్టాపట్టాలేసుకుని
నిశీధి గృహానికి తరలిపోయారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి