18, అక్టోబర్ 2025, శనివారం

ఈ రోజు గాలిలో స్వరం విన్నాను

 ఈరోజు గాలిలో నీ స్వరం విన్నాను.

I Heard Your Voice In The Wind Today 

ఆంగ్ల కవితకు స్వేచ్ఛానువాదం.


ఈరోజు గాలిలో నీ స్వరం విన్నాను, 

నీ ముఖాన్ని చూడటానికి గిర్రున తిరిగాను;

నిశ్శబ్దంగా నేనా స్థానంలో నిలబడినప్పుడు 

నిట్టూర్పు గాలి నన్ను తాకింది.

ఈరోజు సూర్యుడి  నులి వెచ్చని కాంతిలో

నీ స్పర్శను అనుభవించాను.

నీ ఆలింగనం కోసం నేను కళ్ళు మూసుకున్నాను. 

నా ఆత్మ పైకి తేలుతున్నట్లు అనిపించింది.

వర్షాన్ని చూస్తున్నప్పుడు కిటికీ అద్దంలో  నీ కళ్ళు చూశాను;

వర్షపు చుక్క పడినప్పుడల్లా అది నిశ్శబ్దంగా

నీ పేరునే ఉచ్చరించినట్లు అనిపించింది.

ఈరోజు నిన్ను  నేను హృదయానికి దగ్గరగా తీసుకున్నాను, 

అది నాకు పూర్తి అనుభూతిని కలిగించింది;

నువ్వు మరణించి ఉండవచ్చు. 

కానీ, నువ్వు నను  వీడిపోలేదు, 

నువ్వు ఎల్లప్పుడూ నాలో ఒక భాగంగా వుంటావు

సూర్యుడు ప్రకాశిస్తున్నంత కాలమూ 

గాలి వీస్తుంది వాన కురుస్తుంది...

నువ్వు నాలో యెప్పటికీ జీవిస్తావు 

ఎందుకంటే, నా హృదయానికి తెలిసింది అదొక్కటే!


ఆంగ్ల మూలం: Unknown

స్వేచ్ఛానువాదం: వనజ తాతినేని.

మరణించిన వారు తల్లి కావచ్చు, భర్త/భార్య, స్నేహితుడు ఎవరైనా కావచ్చు. 

వారిని హృదయంతో స్మరించడం.. feel your heart. 

కామెంట్‌లు లేవు: