14, అక్టోబర్ 2025, మంగళవారం

నిశికన్య

మినీ కవితలు …  

వివాహబంధం ఒక నాటకం 

 వేదికపై ఇద్దరూ సహజ నటులే

రంగులన్నీ వెలిసిపోయాక 

 మూయడానికి తెరలెందుకు 

 పలకడానికి భరతవాక్యమెందుకు!? 

      *************

కిటీకీ లేని గదిలో వెలుగులు నింపాలని

కాస్తంత వెన్నెలను తుంచి తెద్దామనుకుంటే

చందమామే చేతుల్లోకి వచ్చేసాడు.

                     తెచ్చి గదిలో వేలాడదీసాను

ఇప్పుడా గది  అమావాస్య యెరుగని 

రాత్రులతో విరాజిల్లుతుంది. 

నిశికన్య బావురుమంది. 

కామెంట్‌లు లేవు: