24, అక్టోబర్ 2025, శుక్రవారం

చిన్న కవితలు

 



జీవం నింపిన మట్టిని  వదిలేసి 

ఆకశపుటంచుల వైపు చూస్తున్నాను

దిగంతాన్ని కొలవాలని. 

అదెక్కడా కానరాలేదు 

నీ ప్రేమ వలె. 

*************

వాన జ్ఞాపకాన్ని విరిబాల బరువుగా మోస్తుంది. 

జ్ఞాపకాలు ఎందుకూ మళ్ళీ ఇప్పుడే వస్తానుగా అంటుంది వాన. 

ఇది వింటున్న రైతు బెంగటిల్లాడు.

కామెంట్‌లు లేవు: