27, డిసెంబర్ 2010, సోమవారం

బంగారుకొండ ..ఈ అమ్మకి నువ్వు అండ

Posted by Picasa మా..ఇంటి దీపం..నా కంటి వెలుగు.. లైటింగ్ & ఎలైటింగ్..తాతినేని ఫ్యామిలీ..
నిఖిల్ చంద్ర తాతినేని.

విద్యార్ధి..యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరి (అ . సం .రా )

అమ్మ మనసులోని.. ప్రేమకి..రెట్టింపు.. ప్రేమని.. ఇచ్చే.. నా..కలల దీపమా!వాస్తవ రూపమా!!

నిండు నూరేళ్ళు.. ఆయురారోగ్యములతో .. సుఖ సతోషంలతో..విద్యావివేక సంపన్నుడవై.. యశస్విభవ వై..చల్లగా.. వర్ధిల్లాలని..ఆశిస్తూ..భగవత్ కృప కటాక్షంతో..

నీ.. మాతృ దేశంకి..వన్నె తెచ్చే.. తేజమై..ఎదగాలని..ఆకాంక్షిస్తూ..

ప్రేమతో.. దీవెనలతో.. మీ.. అమ్మ.

ప్రణయమా!


Posted by Picasa
ప్రణయమా! మరుమల్లెపూల తోటలో.. ఘుమ ఘుమ .. పాట..గుర్తోస్తుందండీ. !

నువ్వు.. మరీ చిన్న .. పిల్లవి అయిపోతున్నావు.. అని..అంటారు.. నా.. సన్నిహితులు..
పాట వినడానికి.. భావాన్ని.. ఆస్వాదించడానికి.. వయస్సుతో .. సంబంధం..లేదు కదా..!?

"లవ్ హేస్ నో..సీజన్.. నాట్.. ఈవెన్.. రీజన్.".కాలంతో పని లేనిదీ.. కారణంతో .. పని లేనిదీ.. ఒక్క ప్రేమ.. మాత్రమే..

పాట.. సాహిత్యం.. వేటూరి.. అని అనుకోవద్దు.మనకి లబించే.. వివరాలు అలాగే.. ఉంటాయి..
కానీ.. ఆ పాటని.. చంద్రబోస్.. వ్రాశారు. ఈ చిత్రంలో.. అన్నిపాటలు.. మంచి పాటలే.. బొంబాయిప్రియుడు.. చిత్రం లోని.. ఈ..పాట.. నాకు.. చాలా.. చాలా.. ఇష్టమైన పాట.

సాహిత్యపరంగా.. చంద్రబోస్ ని.. వేటూరి గారితో సమాన స్థాయిలో నిలిపింది.. అంత్య ప్రాస తో.. వారి.. శైలిని.. పట్టి ఇచ్చేస్తుంది..

చంద్రబోస్ కి.. తొలి నాళ్ళల్లో.. మంచి గుర్తింపు.. ఇచ్చింది.. మళ్ళీ.. చెపుతున్నాను.. ఇది చంద్రబోస్ పాట... చంద్రబోస్ గారిని స్వయంగా అడిగి.. నిర్ధారించుకున్న విషయం ఇది.

ఎమ్ .ఎమ్. కీరవాణి.. స్వర కల్పనలో.. స్వయంగా.. చిత్ర తో.. కలసి పాడిన పాట.. ప్రేమలో.. పడిన వారికి.. మనసు.. చేసే.. గారడీలని.. అద్భుతంగా.. వ్యక్తీకరించిన.. పాట.. మీరే.. చూడండి ఈ.. సాహిత్యం..ఇక చిత్ర గారి గళం లోని.. ఒంపులు..సొంపులు..చెప్పనలవి కాదు..విని..తేలి ఆడాల్సిన పాట. .

ప్రణయమా.. మరుమల్లెపూల తోటలో.. ఘుమ ఘుమ..
పరువమా.. సరసాల వీణ పాటలో.. సరిగమ.. మోయలేని భావమా..
రాయలేని కావ్యమా.! నండూరి వారి గేయమా! (ప్ర)

అవునన్నా.. కాదన్న.. మనసే వినక..
మురిపిస్తా వేల న్యాయమా.!
రేయనక.. పగలనక.. తలపుల వెనుక...
తరిమేస్తావేల.. న్యాయమా..!
నిన్న లేని.. చోద్యమా .. నిన్ను.. ఆప సాధ్యమా..?

గుండె చాటు.. గానమా..
గొంతు.. దాటు.. మౌనమా..
ఎదలోని.. ఇంద్రజాలమా! (ప్ర)

పూలనక ముళ్ళనక..
వలచిన క్షణమే.. విహరిస్తావేల.. హృదయమా..
రేపనక.. మాపనక ఆ.. మరు క్షణమే..
విసిగిస్తావేల.. విరహమా..!
లవ్లీ.. ఇంత వింత.. సత్యమా..!?
ఎంతకైనా సిద్దమా.. అంతు లేని ఆత్రమా..!
అందులోన అందమా..
కోటి కలల నేత్రమా..
కొంటె వలపు గోత్రమా.. శృంగార సుప్రభాతమా..! (ప్ర )

ఎంత బాగుంది.. అందుకే.. వినేయండి..వీడియో ..చూసేయండీ ..





నినాలనుకుంటే.. ఇదిగో ఇక్కడే వింటూ ప్రణయంలోని ఘుమ ఘుమ.. లు.. మీలో.. మీరే.. ఆఘ్రాణిచండి..మరి..


26, డిసెంబర్ 2010, ఆదివారం

షెహనాయి

Posted by Picasa తన షెహనాయి వాయిద్యంతో నిత్యం..కాశీ విశ్వేశురుడిని మేలుకొలిపే ఆ మధుర స్వరం స్వర ఝరీ ప్రవాహమై.. బిస్స్మిల్లా ఖాన్ షెహనాయి తెలుగు పాటలో వింటే ఎలా ఉంటుంది! అవ్యక్తమైన భావంతో హృదయం రస డోలికలలో తేలియాడుతుంది.. ఆ పాట గురించి నేను చెప్పబోతున్నాను. తన షెహనాయి వాయిద్యంతో నిత్యం కాశీ విశ్వేశురుడిని మేలుకొలిపే ఆ మధుర స్వరంస్వర ఝరీ ప్రవాహమై ఈ పుణ్యభూమిని దాటి మరీ విశ్వమంతా స్వర విహారం చేసింది. తలుచుకుంటేనే ఘనమైన భావన.ఉత్తుంగ తరంగమై నన్ను తడిపేస్తుంది. సంగీతం సర్వజన సమ్మోహితం. భాషతో పనిలేకుండా హృదయ భాషతో జగత్తుని చుట్టి వస్తుంది. ఈ షెహనాయి అలాగే చుట్టేసి లోకాన్ని తన వైపు లాగేసింది.. ఉస్తాద్ బిస్స్మిల్లా ఖాన్ అంటే తెలియని వారు ఉండరేమో! ఎన్ని పెళ్లి పందిళ్ళలో స్వరం సాక్షిగా ఎందరో స్త్రీ-పురుషులని ఒకటి చేసింది. ఒక ఘనత, అదృష్టం మాత్రం జీ.కే. వెంకటేష్ గారికి దక్కింది. బిస్స్మిల్లాఖాన్ గారి షెహనాయి మన తెలుగు సినిమా సన్నాయి అప్పన్న చిత్రంలో వినే అదృష్టం కల్గింది.. సన్నాయి రాగానికి ఈ చిన్నారి నాట్యానికి పాటలో వినవచ్చు. బిస్స్మిల్లా ఖాన్ గారు ఎన్నో హిందీ చిత్రాలలో వారి స్వరాన్ని అందించారు. ఇక్కడ ఆ పాటని వినండి. ఇనుస్త్రుమేంట్ మ్యూజిక్ ని ముంబై వి.బి.ఎస్. అప్పుడప్పుడు స్వరసుధ లో వినిపిస్తుంది. జాతికి గర్వ కారణమైన ఆ ఉస్తాద్.. మన మనసులని రాగరంజితం చేసి వారసత్వ సంపదగా ఆ సంగీతాన్ని మనకి మిగిల్చి వెళ్లారు. అక్కడ పరమేశ్వరుడిని నిత్యం తన మదుర స్వరంతో అర్పిస్తూ ఉండి ఉంటారు. పూర్వ జన్మలో పరమేశ్వరుడికి తేనియతో అభిషేకం చేస్తే మంచి సంగీత జ్ఞానం లభిస్తుందట. చెరుకు రసంతో అభిషేకిస్తే మంచి స్వరం లబిస్తుందట. మా నానమ్మ చెప్పేది. ఇప్పుడు నేను అదే రీతిన చేస్తుంటా ఆశతో.. ఈ రోజు పొద్దు పొద్దుటే ఆ స్వరం నాలో మెదిలి ఇలా నాతో ఈ పాటని పంచే పనికి ఉసికొల్పింది ఈ పాట సాహిత్యం ఇవ్వలేను. ఎందుకంటే నా కంప్యూటర్ పరిజ్ఞానం గురుముఖ విద్య కాదు. స్వయంగా కుస్తీలు పట్టి నేర్చుకుంటున్నాను. ఇంగ్లీష్ కూడా రాదు పాటని జత చేసే పరిజ్ఞానం పెంపొందించుకుని అప్పుడు జత పరుస్తాను. సన్నాయి అప్పన్న చిత్రంలో ఈ పాటని వినండి. స్వర్గీయ బిస్మిల్లాఖాన్ కి స్వర నీరాజనాన్ని హృదయ చెమరింత్లతో చెప్పడం మరువ వద్దు. హృదయాన్ని తుత్తినియలు చేసే సంగీతమా నీ ఒడి అమ్మ ఒడి కన్నా. చల్లన మాతృభాష కన్నా తీయన. గుండెని పిండేసే మధుర భావన. నిత్యం నీలో కరగనీ కరిగి కరిగి ఈ నదీనదాల్లో ప్రవహించననీ మళ్ళీ జన్మ ఉంటే ఈ నేలపైనే జన్మించనీయి! ఇది ఆ ఉస్తాద్ మనసులోని భావన. ఈ పాటని వారికి స్వరనీరాజనం తో అర్పించి మనసారా ప్రణమిల్లుదాం. .