తెలుగు తల్లి |
మహాంధ్ర జననీ వందనమాంధ్ర మహాజనని |
సుందరతర పౌరాళి కావని
వందనమాంధ్ర మహా జనని
వరగోదావరి కృష్ణ పినాకిని
ఝరీ సహస్రలు తుంగ భద్రలూ
నటియించిన చైతన్యము నీయది
నటియించిన ఉద్దీపము నీయది
వందనమాంధ్ర మహాజనని
సుందరతర పౌరాళి కావని
నన్నయ్య,తిక్కన,త్యాగ్రజులూ
గోపన్నయ.క్షేత్రయ నీ ప్రియ పుత్రులూ
రాజ రాజులూ, రుద్రమాంబలూ
రాయలు నీ పద సేవకు పాత్రులు
వందనమాంధ్ర మహాజననీ
సుందరతర పౌరాళికావని
మేము చిన్నప్పుడు స్కూల్లో గురువులు నేర్పగా నేర్చుకుని ఆలపించిన గీతం.
మరి ఇప్పుడు.. ప్రజల ఆకాంక్షల మేర రాష్ట్రం తప్పనిసరిగా ముక్కలైతే.. నేటి తరం పిల్లలు.. (తెలుగు పై..అపరిమితమైన ప్రేమాభిమానము లతో..) యేమని.. పాడుకోవాలో!
అయినా కవులకి కొదవ ఏముంది?
నిమిషములలో..వ్రాస్తారు బాగానే ఉంటుంది..కానీ మరొక సందేహం.. ముంచుకొస్తుంది..
అఖిలాన్ద్రంలో..నిర్మించి..అభిమానంతో తెలుగుతల్లి పేరు పెట్టుకున్న సెక్రటరేటియేట్ దగ్గరున్న
ప్లై ఓవర్ సైతం..పేరు మార్చుకుని ఏ తల్లిగా కనబడుతుందో..!?
ఉర్దూ..తల్లిగా కనబడుతుందో..అని..సందేహంగా ఉంది.
ఇంకా చరిత్రలోకి..వెళితే..
ఏం పేరు ..దొరుకుతుందో..తల బద్దలు కొట్టుకున్నాఈ మట్టి బుర్రలోకి.. వెలగడం లేదు. అందుకే విదేశాలలో ఆనందంగా పాడుకుంటున్న వారిని..చూసి .. ఇంకా ఆనందం. ఇక్కడ మేము అలా పాడుకున్నామా? ఆడపడుచులు అనికూడా చూడకుండా అక్షింతలు..వేసేరని భయపడి.. మేఘాలపై తేలి..అక్కడ వాలి..హాయిగా గ్రోలి...అందరం చూడాలనుకుని ఇలా తెచ్చాను. మరి మీరు చూడండీ!
3 కామెంట్లు:
వనజ గారూ,
పెద్దవారు మీరెరుగనిది కాదు. సామాజిక జీవనములో మార్పులు సహజం. వాటిని అలా స్వీకరిస్తూ పోవాల్సిందే. మరీ ముఖ్యంగా మన చేతిలోలేని ఇలాంటి విషయాల్లో సర్దుకుపోవటం మినహా అత్యుత్తమ మార్గం నాకగుపించలేదు.
రాష్టం రెండు ముక్కలు ఐతే, ఒక తల్లి తెలంగాణా తెలుగు తల్లి, ఆంద్ర తెలుగు తల్లి హ హ హ
నిజమే తెలుగు భాషను భరతమాతకు కవలలుగా ఉహించడం కొంచెం కష్టం గాను కొంచం సిగ్గు గాను అనిపిస్తుంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి