23, అక్టోబర్ 2011, ఆదివారం

నా హృదయమా !

ఏమిటీ నీకు ఈ పాటల పిచ్చి.? .పొద్దస్తమాను వింటావు.. మళ్ళీ వాటి గురించే రాస్తానంటావు? పాట మెడలో వేసుకుని ఊరేగు అంటుంటే..నిజంగా మెడలో  వేసుకుని కూడా ఊరేగుతున్నాను. నా ఉదయపు నడకలో. కాకపొతే అప్పుడు దేవరాగం విత్  భారతి చెప్పే భక్తి విశేషాలు,స్థల పురాణాలు,భక్తి పాటలు అన్నమాట.   

పాట గురించి నేను మాట్లాడ కుండా   ఉండటం చాలా కష్టం. ఎందుకంటె.. పాట లక్షణం ప్రవాహం. పాటని మనం బంధించగలమా? 
పాటని నేను తింటాను,తాగుతాను, శ్వాసిస్తాను.పాట ఒడిలో నిదురిస్తాను. పాట తోనే మేల్కొంటాను కూడా.నేను పాటని అమితంగా ప్రేమిస్తాను.అందుకే నా బ్లాగ్ లో సగానికి పైగా పాటలు ఉంటాయి. ఈ నాటి  పాట ఇదుగోండి...
 ఇక్కడ నాలాటి వారు కొందరు ఉంటారు  కదా వారు వింటారని..ఈపాట అంత ప్రసిద్ది ఏం కాదు.కానీ చాలా బాగుంటుంది     

చిరంజీవి ,రాదిక నటించిన చిత్రాలలో విభిన్నంగా  ఉండే చిత్రాలలో "ప్రియ " చిత్రం ఒకటి. నాకు ఈ చిత్రం కన్నా ఒకే ఒక పాట అమితంగా నచ్చుతుంది. మనసు కవి పాట ఇది.
ప్రేమ వైపల్యంలో ఉన్న ఇద్దరి ప్రేమికుల మానసిక సంఘర్షణ తో కూడిన ఈ పాట..మనసు తెర తీసి తీయనట్లు  మనిషి తో దోబూచులాడుకుంటా.. ఒకరినొకరు  ఓదార్చు కుంటున్నట్లు  ఉంటుంది. ఈ పాట సాహిత్యం ఆత్రేయ గారు. చక్రవర్తి గారి సంగీతం కలసి మనసు పై ఒక మేలిమి ముద్ర వేసి వినమంటూ ఉంటుంది.నాకు చాలా ఇష్టమైన పాట ఇది.   

నా హృదయమా !
నా హృదయ ఉదయ రాగమా !
మాయని తీయని మధురగీతి పాడుమా (మాయని)

అందమై మకరందమై 
మందమంద మలయా నిలయ గంధమై 
మదనుని విరివిల్లుల అరవిందమై 
ఎల తేటి యెదమీటు ఆనంద మై (ఎల)
పులకరించు కుసుమమా (నా హృదయమా) 

ఆటవై సయ్యాట వై , చిలిపి వలపులాడేటి చెర లాటవై  
తలపుల తళ తరలోక శ్వాస వై 
పరువాల సరదాల బూచాట వై (పరువాల)
కరిగి పోవు స్వప్నమా (కరిగి ) (నా హృదయమా) 

వాణి వై వర వీణవై బృదావన సమ్మోహన వేణువై 
పద కవితా మృదు భాషల భాణి వై అనురాగాల రాగాల నెరజాణ వై (అను ) 
గానమైన మౌనమా (గానమైన ) 

జాలివై, చిరు గాలివై సిరి మల్లెల చిరుజల్లుల వేళ వై 
కనుసన్నల చెలి వెన్నెల జాలువై 
జోజోల ఉయ్యాల జంపాల వై (జో జోల ) 
సేద తీర్చు నేస్తమా? (సేద) 

నా హృదయమా !
నా హృదయ ఉదయ రాగమా !
మాయని తీయని మధురగీతి పాడుమా (మాయని)
ఈ గీతాన్ని వింటారా? ఇదిగో.. ఇక్కడ  నా  హృదయమా.. చూడండీ !! 






4 కామెంట్‌లు:

తెలుగు పాటలు చెప్పారు...

మంచి పాటను పరిచయం చేశారు దన్యవాదములు వనజవనమాలి గారు

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

మనసుకవి పాట, చిరు నటించినది. ఎలా మిస్సయ్యానబ్బ? ఇదివరకు వినలేదు ఈ పాట!
పరిచయం చేసినందుకు ధన్యవదములు :)


పాట గురించి నేను మాట్లాడ కుండా ఉండటం చాలా కష్టం.
పాటలు వినని వారికి చెవులున్నా లేనట్టే! పాటలు విని ఆస్వాదిస్తూ వాటిగురించి మాట్లాడకుండా ఎలా ఉండాలి? మూగవారికి తప్ప మిగిలినవారికి ఆ వీలు లేదు.


ఎందుకంటె.. పాట లక్షణం ప్రవాహం. పాటని మనం బంధించగలమా?

హృదయంలో బంధించాలని మనం ఎంత ప్రయత్నించినా చెయ్యలేం. వడివడిగా హృదయకొలను నింపి, ఎక్కడా ఆగక సాగే ప్రవాహం అది :)

పాటని నేను తింటాను,తాగుతాను, శ్వాసిస్తాను.పాట ఒడిలో నిదురిస్తాను. పాట తోనే మేల్కొంటాను కూడా.
నిత్యం పాటలమయం జీవితం.

నేను పాటని అమితంగా ప్రేమిస్తాను.
జీవితాన్ని ఎవరు ప్రేమించరు చెప్పండి?

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

భాస్కర్ గారు ధన్యవాదములు. నిజంగా..పాట గురించి నేను మాట్లాడకుండా ఉండలేను. ఒకోసారి నేను జనసమూహంలో ఉన్నా కానీ వెంటనే ఒంతరితనం కల్పించుకుని పాట వినడానికి ప్రయతిన్స్తాను.మనుషుల సాంగత్యం కన్నా భావ సాంగత్యం ని నేను కోరుకుంటాను. పాటని పాటగా వినడం కన్నా ఆ సాహిత్యపు విలువలని అర్ధం చేసుకుని జీవితాలకి అన్వనయించుకోగల్గితే కొంతైనా బాగుంటుందని అనుకుంటాను. ఈ పాటలో లలిత లలిత భావనల పదసొపానాలు తో ..గిరి శిఖరంపై పాటని కూర్చుడబెట్టారు ..మన"సు" కవి.ఈ పాటకి అందుకే నీరాజనం.

మనుషుల కన్నా మనుషులు సృష్టించిన సాహిత్యం .సంగీతమే మనసులని సేదతీరుస్తాయి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Balu..meeku ee paata nacchinanduku Thank you veru much.