20, జనవరి 2012, శుక్రవారం

కథా జగత్ - కథా విశ్లేషణ -2

కథా విశ్లేషణకి   నేను ఎంచుకున్న కథ     ఎర  - స్వాతి శ్రీపాద   

కథలో ఆరుగురి ఆడపిల్లలని   పుత్ర వ్యామోహం తో విచక్షణా రహితం కనడం తో పాటు ఆడపిల్లలకి చదువు ఎందుకు దండుగ అనే వివక్ష మధ్య అత్తెసరు చదువు చదివిస్తూ.. ఆ చదువు చెప్పించడం ని ఒక ఎరగా వేసే తల్లిదండ్రులని వాళ్ళలో ఉండే స్వార్ద పరతత్వాన్ని దూది ఏకినట్లు ఏకి పారేశారు రచయిత్రి.

కథలో.. పేరు ఉదహరించక పోయినప్పటికీ స్వీయ కథగా చెప్పుకున్న "స్వీటి" అంతరంగం నుండి వెలువడిన భావ సంద్రమే ఈ "ఎర "  కథ. 

’ఈ ఆడముండల్ని చెప్పుకిందతేళ్ళలా నలిపివేసి అణిచివుంచాలని అందరికంటే చిన్నవాడయిన కొడుక్కి నూరిపోసే ఆయనకు విశాలదృక్పధమా? ..


అని ..ఓ..తండ్రి విష సంస్కృతి ని ఎరిగి చిన్న తనం నుండే.. లోకం పోకడల్ని అర్ధం చేసుకుంటూ..

ఎరని చూపి చేపని వేటాడం అన్నదానిని  మనుషుల నైజానికి అన్వనీయింప జేసుకుంటూ లోకం పోకడని పూర్తిగా ఆకళింపు చేసుకున్న పరిపక్వత   చిహ్నంగా తోస్తూ.. 

స్వీటి .పటిక బెల్లం ముక్క పెడతాను.. చెవి కమ్మ ఎక్కడ దాచావో..చెప్పమని అడిగిన తీరులోనే బీదరికాన్ని అపహాస్యం చేసిన లోకం తీరు పై అసహ్యం కల్గిన స్వీటి అక్కలిద్దరికి అబ్బని చదువు లా చదవకుండా..బాగా చదివి ఉద్యోగం,,డబ్బు సంపాదించడం ..మంచి పరిణామం .

బయట వాళ్ళే  కాదు మన ఇంట్లో వాళ్ళు కూడా ఆడవాళ్ళని అనుమానించడం అనే విషయాన్ని.. 

"నీ జీతం ఇంతేనా? కాస్త దాచుకున్నావా"లాంటి  ప్రశ్నల దగ్గర ఆరంభించి," అవునూ ఈ నెల ఇంకా  బయట చేరలేదేమిటి ? ఆఫీస్ పేరుచెప్పి ఎక్కడైనా దొమ్మరి తిరుగుళ్ళు నే॑ర్చావా?" 


అంటూ తల్లి ఆనుమానించ డాన్ని  భాదతో వ్యక్తీకరించడం ..లో.. ఆడవారిని నైతిక   విలువల  పేరుతొ.. తమ ఇంటి వాళ్ళే అనుమానించడం అనే మానసిక హింసని హృద్యీకరించిన తీరు నాకు బాగా నచ్చింది. ఇలాటి వాస్తవాలు చెప్పుకోవడం అవసరం కూడా. అలాగే ప్రేమ పేరుతొ.. ఎర వేసి..సమాధానం ఆలస్య మయ్యేటప్పటికే   అసలు స్వరూపాన్ని బయట పెడుతూ.. .. 

" ఏదో పెద్ద నిప్పులాంటిదాననని అనుకుంటూన్నావేమో ...నువ్వెంత నిప్పులాంటి దానవో నాకు తెలుసు..."

అనే అసహ్యకర మాటలు అనిపించుకునే వెగటు మనుషులనుండి పారి పోయి..  జీవిత భాగ స్వామ్యి   ఎంపికలో.. ఆమె  ఎన్నో పరీక్షలు నెగ్గాక..లభించాడన్న ఉత్తముడితో జీవితం పంచుకునే ముందు.. 

 ఈ జీవితం ఈ సుఖాలు పిల్లలు సంసారమనే ఎరకు నన్ను నేను తగిలించుకుని ఏళ్ళుగా కొట్టుమిట్టాడుతున్న నేను ఒడ్డున పడి గిలగిలలాడుతున్న చేపనే... 
   


 అని ఆత్మ పరిశీలనతో  మెలిగే స్వీటి.. వైవాహిక జీవితం ఇచ్చిన అసంతృప్తి  భర్త మరణం తర్వాత..ఆమె ఎదుర్కొన్న  సంఘటనలు  ఇప్పటి కాలంలో పరిస్థితులకి అద్దం  పట్టాయి. 

 ఆ ఈతి బాధల్లోమరొకటి జీవచ్చవంలా మిగిలున్న అతని తల్లి ...ఎంత కోపం వచ్చినా ... అతనే లేకపోయాక నాకేంటి అని విదిలించుకోజూసినా ఏమూలో వున్న జాలో మరింకేమిటో గాని విసుక్కున్నా కసురుకున్నా మళ్ళీ ఆవిడని చూడగానే జాలి వేస్తుంది. తా దూరకంతలేదు మెడకో డోలన్నట్టూంది ఆవిడ

భర్త మరణం తర్వాత కూడా స్త్రీ పై పడిన భాద్యతలో.. ఆమెని ఆమె నిరూపించుకుంది. 

స్నేహం పేరుతొ  మనుషులలో   ఉన్న మరో రూపాన్ని మాటేసి నయవంచనతో మంచి స్నేహం అని నమ్మ బలికిస్తూనే ఒంటరి స్త్రీలని టార్గెట్ చేసుకుని.. వారితో తమ పబ్బం గడుపుకోవాలనే ఆలోచన ఉన్న వారి గురించి చెపుతూ.. 

అవకాశం దొరకనప్పుడు స్త్రీలతో తమకున్న పరిచయాలకి యధాశక్తి కథలల్లి  అతినీచంగా..స్రీలపై ఎలాటి   ఆరోపణలు చేస్తారో..చెపుతూ 

వాడికి వాడి ఎరకి మరి కొందరు స్త్రీలు చిక్కకుండా..  ఇలాటి వాస్తవాలు (అనే కథ)ని లోకం పైకి  ఎరగా విసరడమే!  
అంటూ..ఈ కథ 

ఇంటాబయటా..మహిళల ప్రగతికి - దుస్థితికి..అద్దం పట్టాయి. అనవసరమైన స్నేహాల పట్ల చిన్న పాటి ఆత్మీయతకి కరిగిపోవడం పట్ల జాగురుకత వహించమని ఉద్భోధ చేసినట్లు ఉంది.

1 కామెంట్‌:

Praveen Mandangi చెప్పారు...

మా కుటుంబంలో పరిస్థితి కొంచెం వేరు. అప్పట్లో కుటుంబ నియంత్రణ గురించి తెలియకపోవడం వల్ల మా అమ్మమ్మ గారికి ఆరుగురు పిల్లలు పుట్టారు. వాళ్ళలో ఐదుగురు ఆడపిల్లలు. మా తాతయ్య రాజకీయ నాయకుడు కావడం వల్ల వ్యక్తిగత గొప్పతనం (personal prestige) కోసం ఆడ పిల్లలని చదివించాడు కానీ ఆడ పిల్లలు స్కూల్ నుంచి ఇంటొకొచ్చిన తరువాత గడప దాటి బయటకి వెళ్ళనిచ్చేవాడు కాదు. డబ్బున్న కుటుంబానికి చెందిన ఆడ పిల్లలు వీధిలో తిరిగితే గౌరవంగా ఉండదు అని చెప్పేవాడు. మా అమ్మగారు ఆంధ్రా యూనివర్సిటీలో చదివినా ఆవిడకి స్త్రీ-పురుష సంబంధాల విషయంలో చాలా మూఢ నమ్మకాలు ఉండడానికి కారణం మా తాతయ్య పెంచిన పెంపకమే.