లేడి - జనారణ్యం
పొద్దస్తమాను కూనని వెంటేసుకుని తిరుగుతూ మైదానాల వెంట పచ్చిక బయళ్ళ లో లేలేత చివుళ్ళని తింటూనే.. ఏ ఆపద ఏ వైపు నుండి ముంచుకు వస్తుందో గమనిస్తూనే చెంగు చెంగున ఎగురుతూ అత్యుత్సాహంతో తల్లిని వదిలి ఎడంగా వెళుతున్న బిడ్డని మందలించి ఆ ప్రమాదాల ఆచూకి ఎలా ఉంటుందో అరణ్యంలో ఎలా మసలాలో బిడ్డ కూనకి వివరిస్తూ వుంది లేడి.

పొద్దుగుంకే సరికి ఒక చోట సురక్షితమైన పొద చూసుకుని .. బిడ్డని కడుపులో పొదువుకుని.. కాస్త సేద తీరింది తల్లి లేడి.
ఆసలే అల్లరి కూన తల్లి ప్రక్కనే ఒదిగి పడుకుని ఉండకుండా తన చిట్టి బుర్రలో తట్టిన ఆలోచనల్ని అన్నింటిని మాటల రూపంలోకి మార్చి మనిషి భాషలో తల్లి లేడిని ప్రశ్నించ సాగింది.
"అమ్మా! నాన్న ఎక్కడ? "అంది. ఇన్నాళ్ళుగా అడగని ప్రశ్న అకస్మాత్ గా అడిగేసరికి తల్లి లేడి సమాధానం చెప్పడానికి కొంచెం తడబడింది.
ఇప్పుడు మీ నాన్న సంగతి యెందుకు? నీ పుట్టుకకి ముందు నన్ను వలచి నా చుట్టూ తిరిగి.. తనకి కావాల్సింది తను తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత నువ్వు పుట్టావు. ఎక్కడైనా కనబడినా చూసి చూడనట్లు వెళ్ళిపోతాడు. ఆతను నీకు నాన్న కావచ్చు.కానీ..మన కానలో పుట్టే బిడ్డలకి తండ్రి అంటూ యేమి గుర్తింపు ఉండదు. తల్లి చాటు బిడ్డగా ఎదిగి తర్వాత తన దారి తను చూసుకోవడమే ! అని చెప్పింది.
ఆ మాట నచ్చలేదు లేడి కూనకి. "నేను నాన్నని చూడాల్సిందే ."పట్టు బట్టింది.
రేపు ఎకడైనా కనబడతాడేమో..చూద్దాంలే! పడుకో..అని అప్పటికి ఊరుకో బెట్టింది.
తెల్లవారింది. ఆరుబయలుకి చేరి పచ్చని పచ్చిక కాస్తంత తినగానే తండ్రి సంగతి అడగడం మొదలెట్టింది. అబ్బా ! మళ్ళా మొదలెట్టావా నీ నస భరించలేక చస్తున్నా అని విసుక్కుంది తల్లి లేడి.
మన జంతు జాతిలోనే ఇలా నాన్న ఎవరో వెతుక్కోవడం ఉంది. మనం నీళ్ళు తాగడానికి వెళ్ళినప్పుడు.. నదికి ఆవల ఒడ్డున ఉన్న ప్రపంచం యెంత బాగుందో ! అమ్మ -నాన్న అన్నయ్య -చెల్లి,అక్క -తమ్ముడు అంటూ పిలుచుకుంటూ ఆనందంగా ఉంటారు. అక్కడ ఆ పిల్లల నాన్న చూడు. పిల్లలకి తాయిలాలు యెన్ని కొనిపెడుతున్నాడో! నాకు నాన్న వుంటే..ఇలా బయట తిరుగుతూ పచ్చికను మంచి రుచికరమైన ఆకులను వెదుకుతూ తిరగాల్సిన బాధ ఉండేది కాదు. చక్కగా అన్నీ తెచ్చిపెట్టేవాడు అని విచారం వెలిబుచ్చింది పిల్ల లేడి.
ఓహో.. ఈ పిల్ల ఈ జనారణ్యంలో ఉన్న వాళ్ళతో తనని పోల్చుకుంటుందన్నమాట అని తల్లి లేడికి అర్ధమైంది.
లేడి కూనకి బతుకు పాఠం చెప్పాలనుకోకుండా స్వయంగా కళ్ళతో చూపాలనుకుంది.
బిడ్డతో యిలా చెప్పింది. ‘’మానవ జాతిని చూసి మురిసి పోతున్నావ్ కదూ! అటువైపు వెళదాం నాతో రా.. ఆ లోకం ఎలా ఉంటుందో నీ కళ్ళతో నువ్వే చూద్దువు గాని’’ అంది.
కొత్త లోకాన్ని చూడబోతున్న ఆనందంలో.. లేడికూన ఆ పచ్చికలో పొర్లి పొర్లి ఆడింది.పరుగులు తీసింది. ఆ ఆనందాన్ని చూస్తూనే.. తను మాత్రం జాగ్రత్తగా ఉంటూ కళ్ళలో వత్తులు పెట్టుకుని పిల్ల లేడికి పహారా కాసింది తల్లి లేడి.
చీకటి పడింది.నిదానంగా నదిని దాటి ఈవల ఒడ్డుకి వచ్చారు తల్లి బిడ్డ.
జనారణ్యంలో అడుగు పెట్టారు. జనులకి కనపడకుండా ఓ సురక్షిత స్థలంలో కూనతో మకాం పెట్టింది.
ఒక పురుషుడు ఆ దారి వెంట వస్తున్నాడు. వెనుక నుండి ఓ కుర్రవాడు..నాన్నా ..నాన్నా అంటూ వెంటపడ్డాడు.
లేడి కూన ఆసక్తిగా చూస్తుంది. "ఒరేయ్.. నువ్వు నా వెంట యెందుకు వచ్చావ్?..ఇంటికి వెళ్ళు" గదమాయించాడు తండ్రి.
"నువ్వురా నాన్నా వెళదాం" అన్నాడు గారంగా..
"నేనిప్పుడు రాను ..నువ్వు వెళ్ళు" విసుక్కున్నాడు తండ్రి .
"ఏం కాదు నువ్వు వస్తేనే నేను వెళతాను" అని మొండికేసాడు కుర్రవాడు.
"చెపుతుంటే నీక్కాదు" అంటూ చింత బరిక విరిచి కుర్రవాడిని నాలుగు దెబ్బలు వేసాడు.
వాడు ఏడుస్తూ ఇంటి దారి పట్టాడు.
"ఛీ..పెళ్ళాం,పిల్లలు బాధ్యతలూ అన్నీ కొండ చిలువలా కాళ్ళకు చుట్టుకుంటాయి. ఇంత సుఖం లేదూ సంతోషం లేదూ " అనుకుంటూ ఆ ఇంటికి దారితీశాడు.
‘’అదేమిటి..వాళ్ళ ఇంటికి వెళ్ళ కుండా వేరే ఇంటికి వచ్చాడు’’అని అడిగింది లేడి కూన తల్లిని.
"ఉష్..మాట్లాడకుండా చూడు"..అని సంజ్ఞ చెంది తల్లి.
ఆ పురుషుడు వెళ్ళిన ఇంటిలో ఉన్న స్త్రీ పిడతంత ముఖాన్ని చేటంత చేసుకుని నవ్వుకుంటూ యితనిని లోనికి ఆహ్వానించింది. అడుగడుగునా నవ్వుల హారాలేసి లోనికి తీసుకునివెళ్ళి.. ముద్దు ముచ్చటగా అతిధి మర్యాదలూ సేవలు చేసింది. ఇద్దరూ తిన్నారు, మదు రసాలు తాగారు. నడి మంచాన్నే అరణ్యపు బయలు చేసుకుని ఆనందంగా విహరించారు. అలా కొన్ని గంటలు గడిచాక ఆతను వెళతాను అన్నట్లు లేచాడు. ఆమె అప్పుడేనా అన్నట్లు చూసింది.
ఆమెకి జేబులోనుండి చేతికి వచ్చినది తీసి ఇచ్చాడు. ఆమె అతను వెళ్ళిపోతున్న దిగులుని మరచి ఆనందంగా డబ్బువంక చూసుకుంటుంది.
"మళ్ళీ వస్తాను.ఎక్కడికి వెళ్ళకు, ఎవరిని రానీయకు" అంటూ అనుమానంగా చూసుకుంటూ తప్పదు అనుకున్నట్లు కదిలాడు.
ఆసక్తిగా అతని వెనుకనే లేడి బయలుదేరింది కూనా రెండు మెల్లిగా చప్పుడు చేయకుండా అడుగులు వేస్తూ తల్లి వెంట కదిలింది.
ఆతను ఇంటికి వెళుతూనే మూసి ఉన్న తలుపుల్ని ఒక్క తన్ను తన్నాడు. తలుపులు పెద్ద శబ్దంతో తెరుచుకున్నాయి. ఆ శబ్దానికి చుట్టూ పక్కల ఇళ్ళ వాళ్ళు లేచారు. ఆ ఇంట్లో పిల్లలు లేచారు. తల్లిని భయంతో చుట్టుకున్నారు.
‘’ఏమే! నా మీద కాపలాకి పిల్లలని ఉసిగొల్పావా ? అయినా నా ఇష్టమే! నేను తిరుగుతాను,తాగుతాను. నా ఇష్టం వచ్చిన వాళ్ళతో వుంటాను. అడగడానికి నువ్వెరివే నన్ను అడగడానికి ? నీ బాబుగాడు యిచ్చినది యేమన్నా ఖర్చు పెడుతున్నానా? నోరు మూసుకుని చెప్పు క్రింద తేలులా పడివుండు" అంటూ ఆమెని జుట్టుపట్టుకుని ఈడ్చి కొట్టసాగాడు. ఆమె ఆ తిట్లు,దెబ్బలు భరిస్తూనే పిల్లలకి ఆ దెబ్బలు ఎక్కడ తగులుతాయో అన్నట్లు పొదువుకుంది.
అతని బలం అంతా ఆమె మీద ప్రదర్శించాక అలుపు వచ్చి పరుపు మంచం ఎక్కి గురకలు తీసి నిదుర పోయాడు. అప్పటి దాక ఆమె యెక్కి యెక్కి యేడుస్తూనే పిల్లలని చెరోప్రక్కన పడుకోబెట్టుకుని మీ నాన్నకు వున్నట్టుండి యేదో పిచ్చి లేసింది, భయపడొద్దు" అంటూ వెన్ను నిమురుతూ నిద్రపుచ్చింది.
ఇదంతా చూస్తున్న లేడి కూన ..’’ఛీ..ఛీ.. యిలాంటి నాన్న అసలు యెవరికీ వద్దు. నాకసలే వద్దు..
ఇంకో చోటుకి వెళాదం పదమ్మా " అంటూ తనే ముందుకు అడుగులు వేసింది.
నడిచి నడిచి తెల్లారేసరికి ఇంకో ఊరు చేరుకున్నారు. అప్పటికి తెల్లవారబోతుంది..
ఒకరి ఇంట్లో నుండి ..అమ్మాయ్.. తెల్లగా తెల్లవారి పోతుంది.లేవాలి ..ఇంటి పని వంట పని ఎవరు చేస్తారు? ఎప్పటికి అయ్యెను..అని.. నిద్ర మంచం పైనుండే కేకలు పెట్టడం వినబడింది. పాపం..ఆ అమ్మాయి లేచి పడుతూ..లేస్తూ..ఇంటి పనులు అన్నీ త్వర త్వరగా చేసి.. తల్లి పెట్టే తిండి కోసం ఎదురు చూస్తుంది.
కొడుకు చక్కగా బారెడు పొద్దెక్కాక లేచి బద్దకంగా తయారై ఓ పెద్ద గ్లాసుడు పాలు తాగి నేతిలో ముంచిన ఇడ్డెనలు తిని సంచీ తగిలించుకుని బడికి వెళ్ళాడు. ఇంట్లో వున్న ఆమ్మాయి ఆశగా అడిగింది." అమ్మా నేనూ అన్నయ్యలా బడికి పోతాను" అని.
‘నువ్వు బడికి పొతే.. చిన్నాడిని ఎవరు చూసుకుంటారు ? అయినా చదివి ఊళ్లేలా,ఉద్యోగాలు చెయ్యాలా? నిన్ను చదివిచ్చి బోలెడన్ని కట్నకానుకలు ఇచ్చి పెళ్లి గిల్లి చేయలేం. చదువు వద్దు గిదువు వద్దు. ఇంకోసారి ఈ మాట అడిగితే వొళ్ళు చీరేస్తాను "అని అంది.
ఆ అమ్మాయి ఏడుస్తూనే మూలనున్న చీపురు కట్ట తీసుకుని బర బరా ఊడుస్తూనే "దేవుడా! నన్నెందుకు ఆడపిల్లగా పుట్టించావ్ నీ జిమ్మడ " అని అమ్మ-నాన్నలని తిట్టలేక కనబడని దేవుడిని తిట్టింది.
ఇదంతా చూస్తున్న లేడి కూన తల్లిని అడిగింది..’’ఆడ-మగ తేడా యేమిటీ. ఇద్దరూ ఒకటి కాదా’’ అడిగింది.

‘’మన రాజ్యంలో యిద్దరూ వొకటే, యిక్కడ మాత్రం కాదు" అంది.
"ఎందుకు కాదు? " అని చిరాకు పడింది కూన. తల్లి లేడి మాట్లాడుతూ “నువ్వింకా యిక్కడ చాలా చూడాలి. ప్రశ్నలు వేయకూడదు, చూస్తూ అర్ధం చేసుకోవాలి” అంది అనునయంగా.
"ఇక్కడ నాకు నచ్చలేదు.. వెళ్ళిపోదాము పద" విసుగ్గా ముఖం పెట్టింది.
“మనమిప్పుడు ఇక్కడినుండి వెళ్ళడం ప్రమాదం. చీకటి అయ్యే వరకు వుండాల్సిందే” అంటూ.. ఒక పొదలోకి చేరి బయటకి చూస్తూ నిలబడ్డాయి.
తల్లి లేడి అనుకున్న ప్రమాదం రానే వచ్చింది..
దారిన వెళుతున్న వొక మనిషి వీటిని చూసి “లేడి లేడి.. రెండున్నాయి యిక్కడ” అని అరిచాడు.

“చూసావా... ఇపుడు మనుషులందరూ గూడి మనను బంధించి చంపి కాల్చి తినేస్తారు. పులి సింహం నుండైనా తప్పించుకోవడం సాధ్యమౌను కానీ వీరి నుండి తప్పించుకోవడం మన వల్ల కాదు.శక్తినంతా కూడదీసుకుని అడవిలోకి పారిపోదాం. నువ్వు అనుకున్నంత మంచిలోకం కాదిది. పోదాం పద” అంది. తల్లి లేడి. కూన లేడి బుద్దిగా తల్లిని అనుసరించింది చెంగు చెంగున.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి