13, మార్చి 2012, మంగళవారం

ఐటం సాంగ్స్ - అశ్లీల సాహిత్యం

ఒకప్పుడు మసక మసక చీకట్లో మల్లెతోట వెనకాల  మాపటేల కలుసుకో.. మనసైనది దొరుకుతుంది ..దొరుకుతుంది..ఆ పాటలో ఒక అర్ధం ఉంది..వింటుంటే ఉత్సాహంగా  ఉండేది .

అలాగే చిత్ర కథలో భాగంగా జానపదగీత శైలిలో ఒక పాట ఉంటే అది ఎంతగా  అలరించేదో చెప్పనవసరం లేదు. "ఆకులు పోకలు ఇవ్వద్దు..నా నోరు ఎర్రగ చేయొద్దు.. ఆశలు నాలో నాలో రేపొద్దు " పాట కానివ్వండి... "మావా..మావా.. ఏమే ఏమే భామా..  పట్టు కుంటే కందిపోవు.."  అనే పాట ..ఇలా ఆ తరహా   పాటల హవా చెల్లిపోయి.. క్లబ్ డాన్సు పాటలు..అవీ మొహం మొత్తి.. హీరోయినే  క్లబ్ డాన్సర్ లాగా   మూరెడు ముక్కలు చుట్టుకుని వాళ్ళ స్థానాన్ని ఆక్రమించుకుని.. నీ కావాల్సింది..నా దగ్గర ఉంది,ఆకుందా వక్కిస్తా..సున్నంతో పోక్కిస్తా.. తరహా పాటలు రాజ్యం యేలి.. అయిదా రేళ్ళు  బాగానే మురిపించాయి.  తర్వాత దాదాపు పదేళ్లుగా  ఐటం సాంగ్స్.

ఐటం సాంగ్ అంటే ..అమ్మో.. అశ్లీల సాహిత్యం .. వినడానికే   భయం వేస్తుంటే..  ఎఫ్ ఎమ్ ల పుణ్యమా అని.. ,చిన్ని తెర మీద వెగటు వేసే డాన్సు ప్రోగ్రాం ల పుణ్యమా అని    ఊదరగొట్టిన పాటలు విన్న మూడేళ్ళ పిల్ల కూడా ఐటం సాంగ్ నేర్చుకుని పాడుతుంటే.. అర్ధం తెలిసిన పెద్ద వాళ్ళు  పరుగులెత్తి ఆ పిల్లల నోర్లు మూయాల్సిన పరిస్థితి.

అసలు ఐటం సాంగ్స్ లో నటించే పేరొందిన తారలకి అసలు సిగ్గే లేదు. కాసుల కోసం రెండు కర్చీఫ్ ల్లాంటి పొదుపైన బట్టలతో.. వళ్ళు ఆరేసుకుంటుంటే.. మనం సినిమా చూడటం లేదుగా.. మనపిల్లలని చూడనీయకుండా కాస్త జాగ్రత్త పడాలి అనుకున్నా..కుదిరి చావదు. ట్రైల్స్ లో ముందుగా చూపేది ఆ ఐటం సాంగ్ లే ..కదా! ఆ పాటలకి సాహిత్యం అందించే రచయితలకి అవకాశం దొరకడమే తరువాయి..దర్శక,నిర్మాత,నటున్ని మెప్పించే రీతిలో..అశ్లీల సాహిత్యం ని ఒలికిన్చేయడమే!

నేను గత నాలుగు మూడేళ్లగా   గమనించింది ఏమిటంటే.. పూరి జగన్నాథ్ ప్రతి చిత్రంలోనూ.. ఒక ఐటం సాంగ్ అశ్లీల సాహిత్యం తో  గుప్పించి జనాల మీదకు వదలడం అలవాటు అయిపొయింది.
ఆ పాటలు వింటూ తిట్టుకోవడం లేకపోతే..వినకుండా కట్టి పడేసుకోవడం...  ఇది ఎలాగు నాలాంటి వినలేని వాళ్ళు చేసే పని. కానీ ..సినిమాలని చూసి..అందులోని ద్వందార్ధ మాటలు, వెగటైన హాస్యం, అశ్లీల దృశ్యాలు మాటేమిటీ!?

ఇప్పుడు వచ్చిన "బిజినెస్ మెన్" లో ఈ పాట చూడండీ!
గీత రచన : భాస్కర భట్ల
ఆయనకీ అవకాశం దొరికింది కదా అనుకుని.. ఈ తరం అమ్మాయిల ఆలోచన క్యాచ్ చేసాను అనుకుని.. ఈ పాట వ్రాసి.. పూరి జగన్నాథ్ ని మెప్పించి ఉండవచ్చు.

ఈ పాట సాహిత్యం గమనిస్తే.. స్త్రీల మనోభావాలని   కించ పరచే విధంగా  ఉన్నాయి .ఎలాంటి  భర్త కావాలో..లేదా సహచరుడు కావాలో అమ్మాయిలకి వెల్లడించే స్వేచ్చ ఉండ వచ్చు. పరిణితి  ఉందనుకోవచ్చు. కానీ.. అందరి వైపునా వకల్తా పుచ్చుకుని మాత్రం.. భాస్కరభట్ల వ్రాయడం.. అది పాటగా ఊరేగడం.. ఒక సారి ఆ పాట చూడండి..!?  అమ్మాయిల ఆలోచనలు ఇలా ఉన్నాయని ఒక పాట రూపంలో చెపుతుంటే.. ఆడ పిల్లలు అమాయకులు అంటారు ఏమిటీ.. ?అని  ఒకరు   నన్నుఅడిగారు.  ఆనక  అదేపనిగా మ్రోగించి ఆ పాటని హిట్ కూడా   చేసేసారు.


ఒక చరణంలో ఇలా ఉంది..

"పొద్దునే   లేపేసి .. మడి  కట్టు   కట్టేసి ..పూజ  గదిలో  కుర్చోబెట్టే  వాడు  మాకొద్దు ...
బికిని  యేసి  బీచ్  లో   వదిలేసే  వాడు  కావాలి"

ఇంత పచ్చిగా  స్త్రీల ఇష్టాల  స్థాయి దిగజార్చే హక్కు వీరికి ఎవరు ఇచ్చారు?  పోనీ అలాటి వర్గాన్ని వీళ్ళు దృష్టిలోకి తీసుకుంటే..   ఆ చిత్రం ని వారు మాత్రమె చూడరు. ఆ సినిమా చూసి..ఆ సాహిత్యాన్ని గమనించి యెంత మంది బహిరంగంగా ఆ పాట పాడుతూ..  తమ పరిసరాలలోని ఆడవాళ్ళని చులకన  చేస్తున్నారు అన్నది చూస్తే గాని తెలియదు..అది  యెంత అవమానకరంగా ఉంటుందో..పాట రాసిన వాళ్లకి ,తీసిన వాళ్లకి ,సిగ్గు ఎగ్గు లేకుండా నటించినవారికి తెలుస్తుందా?

చలన చిత్ర సీమలో గీత రచయితలు అందరు..దాదాపు  పురుషులే! ఆడవారి మనోభావాలని వారు అనుభవించి.. పరకాయ ప్రవేశం చేసి వారి మనస్పందనలు కనుగొని వ్రాసారా అనిపించేరీతిలో వ్రాసిన పాటలు ఎన్నెన్నో..
నెల తప్పేనమ్మ.. నెలత ఎన్నాళ్ళకి నెలవంక పుడతాడు కొన్నాళ్ళకి.. అనే పాటలో .. డా :సి.నా.రె.. స్త్రీల భావనల్ని యెంత చక్కగా వ్యక్తీకరించారో.. అలాగే.. శ్రీవారి కి ప్రేమ లేఖ చిత్రంలో.. మనసా తుళ్ళి పడకే .. ఇలాటి పాటలు చాలా స్త్రీల భావనలకి అద్దం  పట్టేటట్లు   వ్రాసారు.

ఇదేమి ఖర్మమో..సమాజానికి ఏదో ఒక సందేశాన్ని ఇవ్వడం ఎలాగు ఆశించడం లేదు..నానాటికి  ఈ దిగజార్చడం మితిమీరి పోతుంది.

భాస్కరభట్ల గారు.. మీ ఎరుకలో.. ఎవరైనా మీరు ఈ పాటలో రాసిననట్లు  వారు తారసపడి..మీకు వారి ఆలోచనలు ఇలా ఉన్నాయనివ్యక్తీకరించారా ?   కనీసం మీ ఇంటి ఆడవాల్లకైనా   ఆ స్వేచ్చ ఇచ్చి మనసులో భావాలు ఇలా ఉన్నాయని  చెప్పించగలరా !? అది మీరు హర్షించి,అంగీకరించి..పబ్లిక్ గా   వ్యక్తీకరించడం చాలా గొప్ప  విషయం అనుకుంటాను.  సాహిత్యం ప్రయోజనం ఇతరులని రంజింపజేయడం,ఆలోచింపజేయడం.. మరి మీరు అలాగే భావించి ఈ పాట రాసారా? మీకు భారతీయ స్త్రీ సమాజం మొత్తం మీరు ఉదహరించిన రీతిలో బాడ్ బోయ్స్ ని ఇష్టపడుతుందా!? కాస్త తెలుసుకుని చెప్పండి?

పూరి జగన్నాథ్ గారు.. మీరు జగన్నాదుడిలా.. కమర్షియల్ సినిమా రథ చక్రాలపై..నడవండి. ఎవరికి అభ్యంతరం లేదు. ఒక వేళ ఆ చిత్రం అపజయం పాలు అయితే.. నిర్మాతకి మాత్రమే  నష్టం. మీరు దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలలోని ఐటం సాంగ్స్ సాహిత్యం, బూతు డైలాగులు,అపహాస్యం చేష్టలు.. ముందు మీ ఇంట్లో స్త్రీలకి నచ్చుతాయేమో..వాళ్ళు ఆమోద ముద్ర వేస్తారేమో చూడండి.అప్పుడు.. ఈ సమాజం పైకి మీ వికృతమైన ఆలోచనలు విసరండి. ఎందుకండి.. స్త్రీలపై అంత చిన్న చూపు. ? సమాజానికి  వినోదం తో పాటు విలువలు,వలువలు ..కావాలి. అన్ని విప్పేసాక ,ఒగ్గేసాక..మిగలడానికి ఏముంది...!? కేవలం మగవారిని రంజింపజేయడమే మీ కళాత్మక దృష్టి కావచ్చు.  స్త్రీలకి కనీసం కాస్త గౌరవాన్ని ఉంచి,ఇచ్చి సినిమాలు తీయండి అని మనవి.

బ్లాగ్ మిత్రు ల్లారా! వీలయితే.. "ప్రజా సాహితి " మర్చి సంచికలో ."బిజినెస్ మెన్ " పై సినిమా సమీక్ష చూడండి. 21 &  22 పేజీలలో.

ఇక నేను ఇంతగా చీత్కరించుకున్న ఈ  పాట సాహిత్యం ..చూడండి.

శ్రీ  రాముడు  లాంటి  గుణవంతుడు ..సౌమ్యుడు ..ఏక  పత్ని  వ్రతుడు  మాకక్కర్లేదు ..
కసుక్కున  బుగ్గ  గిల్లేసి ..చీర  కొంగు  లాగేసి ..నడుం  మీద  పంటి   గాటు  పెట్టె  చిలిపి  కృష్ణుడే  కావాలి ..

వుయ్   లవ్ ...వుయ్  లవ్ ..వుయ్   లవ్ ..
బాడ్  బోయ్స్ ..బాడ్  బోయ్స్ ..బాడ్  బోయ్స్స్ ....

వుయ్ లవ్   బాడ్  బోయస్స్స్స్ ...ఉయ్య్యయ్య్య్యి
వుయ్  వన్నా  వన్నా  బాడ్  బోయ్స్ ...ఉయ్య్యయ్యి

వుయ్  లవ్  బాడ్  బోయస్స్స్స్
వుయ్   వన్నా  బాడ్  బోయ్స్ .
మామ్మడ   గిచ్చి       ఈడ    గిచ్చి ..పిచేక్కించే   పెనిమిటే  కావాలీ ........
వుయ్  లవ్  బాడ్  బోయ్స్ 
వుయ్  వన్నా    వన్నా  బాడ్  బోయ్స్ .

పొద్దునే   లేపేసి .. మడి  కట్టు   కట్టేసి ..పూజ  గదిలో  కుర్చోబెట్టే  వాడు  మాకొద్దు ...
బికిని  యేసి  బీచ్  లో   వదిలేసే  వాడు  కావాలి
వంటలు  వార్పులు  వద్దని  చెప్పలే ..
ఐ  మాక్స్   లు ..పబ్   లు  తిప్పేస్తున్దాలే ..
హేయ్యి ....అ  నుదుటిన  బొట్టేట్టు ..వాకిట్లో  ముగ్గెట్టు ..అని  ఆర్డర్లేసి  అరిచేవాడు ..మంచోడైన  సారీ  మాకొద్దే ..
వుయ్  లవ్  బాడ్  బోయ్స్  ......

వుయ్ లవ్ ..లవ్  బాడ్  బోయ్స్ ...
ఒరే   రే   ... బబ్బ్లీ    ..మేరే  బిజిలి ..
అరె  బల్బ్ లు  పేలతాయి  షాక్  లు    తగిలి ..
ఒరే  రే ...బబ్బ్లీ ..మేరే  ఇమిలి ..
పులిహరే  చేస్కొనిలీ....

పప్పు  టొమాటో  బేచ్       మాకేందుకయ్య ...
నాటు  కోడి  కాలు ..నా  కాలు  పట్టుకు  లాగేసే  వాడే  కావాలి ..

ఆఫీసు  లో  OT లే   చేసే వాడోద్దె
పడకింట్లో  ఓవర్   టైం  డ్యూటీ  చెయ్యాలే ..
నా  దేవత  నువ్వంటూ ..పూజించే  వాడొద్దు
ఆ  రంభ  ఊర్వశి  నువ్వేనంటు  మీదడిపోయే  రకమే  కావలె ....

వుయ్  లవ్  బాడ్  బోయ్స్  ........

ఇదండీ.. వారి పైత్యం. 

32 వ్యాఖ్యలు:

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ చెప్పారు...

పూరి జగన్నాథ్ సినిమాల్లో ఉండే పైత్యమే ఇది. కథానాయికను నాయకుడు ఒసేయ్, ఏమే,రాయే అని పొగరుగా పిలవటం ఇడియట్ సినిమా తోనే మొదలయ్యిందనే చెప్పాలి. ఇప్పుడది ఫ్యాషనైపోయింది. మీరు ఐటెం సాంగ్స్ వరకూ వెళ్ళారు. హాస్యం కూడా అలానే ఏడ్చింది(ఉదాహరణకు చిరుతలో ఆలీ పాత్ర).నీతులు చెప్పే సినిమాలు అవార్డులు సాధిస్తున్నాయేమో కానీ డబ్బులు వెనకేసుకోవటం లేదు. కాంపిటీషన్ ఎక్కువైపోయి కొత్తదనం పేరుతో అందరూ రకరకల మార్గాలు వెదుక్కుంటున్నారు. యువత కూడా అటువంటి వాటికి త్వరగా ఆకర్షితులవుతున్నట్లే ఉంది. బిజినెస్‌మ్యాన్ లాంటి తలా తోకా లేని బూతు సినిమాలని జనం ఆదరిస్తున్నంత కాలం ఈ బెడద తప్పదు.

జ్యోతిర్మయి చెప్పారు...

వనజగారూ ఆ పాట ఎంత దరిద్రంగా ఉందండీ...ఒక్కసారి సంస్కారం ముసుగు తీసి ఎదురుగా అనేస్తే కాని మనకు ఈ ఛండాలం తప్పదేమో...ఈ రాతలన్నీ బ్లాగులకూ పత్రికలకూ పరిమితం కాకుండా ఏదైనా చెయ్యాల్సిన రోజు వచ్చిందేమో అన్పిస్తోంది..మీ ధైర్యానికి మెచ్చుకోవాలి.

@ శ్రీకాంత్ గారూ బాగా చెప్పారండీ.. కాని యువత గురించి మాట్లాడితే ఇరవై ఏళ్ళవాళ్ళకు ఆవేశం తప్ప ఆలోచన ఉంటుందంటారా...వాళ్ళనడ్డం పెట్టుకుని అటువంటి సినిమాలు తీయ్యడం ఎంత తప్పు..

అజ్ఞాత చెప్పారు...

బాగా చెప్పేరు. ఇంకా చెప్పాలని ఉంది... చెప్పలేను.

Zilebi చెప్పారు...

వనజ వనమాలీ గారు,

ఆహా ఏమి 'సద్సాహిత్యం' ! అంత మంచి సాహిత్యాన్ని భాస్కర భట్ల గారు ఆవిష్కరించారు ! అలా వారిని కించపరచటం తప్పుకాదు సుమటండీ !

ప్రజలు ఏది కోరుతున్నారో అదే మేము ఇస్తున్నాము అని ఆ మధ్య పూరీ వారు వేడి పకోడీలు వేసారు సుమీ !!

చీర్స్
జిలేబి.

రాజి చెప్పారు...

"వనజవనమాలి" గారూ.. మంచి ప్రయత్నమండీ..
జనాలకి ఇలాంటి పాటలు నచ్చేనేమో సినిమా
అంత హిట్ అయింది..

వనజవనమాలి చెప్పారు...

శ్రీ కాంత్ గారు.. స్పందించి నందుకు ధన్యవాదములు.

నిజంగా ఇలాటి సంసృతిని.. చూస్తుంటే.. విపరీతమైన కోపం వస్తుంది..

డబ్బు వెదజల్లి క్రొత్త క్రొత్త తారల్ని దిగుమతి చేసుకుని..(శ్వేతా భరద్వాజ్) అలా పచ్చిగా జనాలకి పరిచయం చేయడం లో ఏమన్నా అర్ధం ఉందా చెప్పండి. పైగా ఈ పాటకి కొరియోగ్రాఫర్ మహిళామణి కూడాను. అరేయ్,ఒరేయ్ కూడా మన చెవుల తుప్పు వదిలిస్తున్నాయి. ఏం చేయాలి చెప్పండి. ?

@ జ్యోతిర్మయి గారు.. ఇలాటి పాటల సాహిత్యం వింటుంటే.. ఆడవాలగా ఎందుకు పుట్టాం రా బాబు..అనిపిస్తుంటుంది. పదునైదు ప్రాయం ఉన్న కుర్రవాడు కూడా తల్లి వయసున్న ఆడవాళ్ళని చూసి ఈ పాట పాడటం చూసి ,,ఆ పిల్లవాడిని కొట్టాలనిపించింది.

ఇంతకు ముందు అంగాంగ వర్ణనలు. ఇప్పుడు మనోభావాలని దెబ్బతీసే వర్ణనలు. అసలు సెన్సార్ సర్టిఫికేట్ ఎలా ఇస్తారో!? అసలు సినిమాలనే బేన్ చేయాలండీ బాబూ..

వనజవనమాలి చెప్పారు...

కష్టే ఫలే గారు.. ఇలాటప్పుడు మనం ఏం చేయలేమా అనిపిస్తుంది? చాప క్రింద నీరులా..రక రకాల పైత్యాలు ఇలా వట వృక్షాలై.. పాతుకు పోతుంటే.. ఆడవాళ్ళు నడిరోడ్డుపై నడవగల్గుతారా?

తన ప్రపంచాన్ని జనం మీదకి విసిరే దర్శక నిర్మాతల భాద్యతారాహిత్యాన్ని నిరసించడమే నా ఈ పోస్ట్.

@ జిలేబీ.. మొండివాడు,మూర్కుడు,కీర్తి కండూక కాంక్ష ఉన్నవాడు..తన నూతిలో కప్పు జీవితాన్ని వదలలేనివాడు ముఖ్యంగా స్త్రీల కి కనీస గౌరవం ని ఇవ్వలేకపోతే..ఇలాటి సాహిత్యం ఏమిటీ..విజయోత్సవ సభలల్లో దేశమంతటా న్యూడ్ స్త్రీకింగ్ .. పెట్టిన్చినా ఆశ్చర్యం లేదు.

@ రాజీ గారు.. పై పై విజయాలు ఎందుకండీ!? ఆ సినిమా చూసిన కాస్త చదువుకున్న అమ్మాయిని అడిగితే..అది యెంత చెత్త సినిమానో చెపుతారు.

శ్యామలీయం చెప్పారు...

పరిస్థితి బాధాకరం గానే ఉంది.
డబ్బు కోసమే నిర్మాత సినిమాతీసేది, ఆ నిర్మాణంలో రకరకాల వ్యక్తులు పాలుపంచుకునేదీ కూడా. అయితే డబ్బుకోసం విలువలూ వలువలూ వదలుకోవటం మొదలు పెట్టాక యీ సినీకళ యింకా యెన్ని విచిత్రమైన పోకడలు పోతుందో పరమాత్ముడి కెరుక.
వింతవింత పాటలు గిలకటమే కాకుండా, ఆ పాటల రచయితలు అవి యెంత ఆలోచించి కష్టపడి బాగా వ్రాసినదీ డప్పుకొట్టుకొంటూ పత్రికలలో వ్యాసాలు కూడా వ్రాస్తున్నారు.

చిన్నప్పుడు చలనచిత్రములు, రేడియో వగైరా విషయాలపై వ్యాసాలు వ్రాసేవాళ్ళం పరీక్షల్లో - వాటి వల్ల సమాజానికి గల మేళ్ళను గురించి. అప్పట్లో TVలేదు లెండి. ప్రస్తుతం వీటి వల్ల జరుగుతున్నా కాలుష్యం గురించి తలుచుకోవటానికే భయంగా ఉంది.

Praveen Mandangi చెప్పారు...

NTR సినిమాలలో కూడా అశ్లీలత ఉండేది. ఈ పాట చూడండి: http://www.youtube.com/watch?v=vJ7gtnWq2SY&feature=relmfu అప్పట్లో జయమాలిని, జ్యోతిలక్ష్ములు మాత్రమే ఐటెమ్ సాంగ్స్‌లో నటించేవాళ్ళు. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్‌లు కూడా నటిస్తున్నారు. అదే తేడా.

రాజీవ్ రాఘవ్ చెప్పారు...

మీరందరూ అనుకున్నట్టుగా యూత్ మొత్తం అటువంటి సాహిత్యంను ఇష్టపడటం లేదని నేను చెప్పగలను. నేనే కాకుండా నా ప్రెండ్స్ సర్కిల్స్ లో
ఎవరూ కూడా అటువంటి సాహిత్యమును ఇష్టపడడం లేదు. ఇంకా చెప్పాలంటే బిజినెస్ మెన్ సినిమానే పెద్ద వేస్ట్ సినిమా.... కాని ఇలాంటి సాంగ్స్ ఉండడం వలన, మరియు అటువంటి పాటలనే టి.వి.లోనే విపరీతంగా ఇవ్వడం వలన.. ఆ సినిమా ఏదో పెద్ద హిట్ ఆయిపోయునట్టు ఫీల్ అవుతున్నారు.
వాస్తవానికి వీటన్నిటికి మహరాజపోషకులు పల్లెటూరి వాళ్ళండి.( మొత్తమందరిని అనడం లేదు) (మేజర్ పార్ట్ వాళ్ళే)... మా ఊళ్ళో నాకు తెలిసి చాలా మంది టీచర్స్ గా జాబ్ సంపాదించారు. వాళ్ళంతా హయ్యర్ ఎడ్యుకేటేడ్ ఆయి యుండి కేవలం ఇలాంటి సాంగ్స్ కోసము రెండు, మూడు సార్లు చూసిన సందర్బాలున్నాయి. చెపితే నమ్మారు.. పల్లెట్టుళ్ళో కొంత మంది ఆడోళ్ళు కూడా ఇలాంటి సాంగ్స్ ని ఎటువంటి సంకోచం లేకుండా చూసేస్తున్నారు.... అశ్లీల సాహిత్య తిరస్కరణ అనేది ముందుగా మన జనాల్లో ఉండాలని నా అభిప్రాయం... మాస్ అదరిస్తున్నారు కాబట్టే ఇటువంటి సాహిత్యంను సినిమాల్లో ఉంచడానికి విలువల్లేని డైరెక్టర్లు, రైటర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టి.వి.లో వేసే చిన్నపిల్లల ఆశ్లీల డాన్సు సెప్టులు పల్లెల్లో ఆడ, మగ తేడా లేకుండా అస్వాదిస్తున్నరనే విషయము మీకు తెలిస్తే ఇంకా ఫీలవుతారు. నేను చెప్పేది నిజం... వీటన్నిటికి కారణం పల్లెల్లో అరోగ్యకరమైన వాతావరణం లేకపోవడమే.....

రసజ్ఞ చెప్పారు...

అసలు ఇప్పటిదాకా ఈ పాట వినను కూడా లేదు నేను! ఇహ ఐటెం సాంగ్స్ విషయానికి వస్తే నాకు బాగా నచ్చే ఐటెం సాంగ్స్ చాంగురే బంగారు రాజా, జాణవులే, రాజశేఖరా నీపై మోజు తీరలేదురా ఈ మూడూ నచ్చుతాయి. వినేవారు ఉంటే రాసేవారు రాస్తూనే ఉంటారండీ! వాళ్ళు అంతగా ఆలోచించరు మన పాట ఎంత మంది వింటున్నారు ఎంతమంది పాడుతున్నారు అన్నది చూసుకుని మురిసి ముక్కలవ్వటం తప్ప ఇవేం వాళ్లకి పట్టవు!

రాజీవ్ రాఘవ్ చెప్పారు...

నా పై వ్యాఖ్య ద్వారా ఎవరి మనోభవాలైన గాయపరిచి ఉంటే క్షమించమని కోరుకుంటున్నాను

Zilebi చెప్పారు...

వనజ వనమాలీ గారు,

ఫాస్ట్ backward!

ఇప్పుడే ఘంటసాల మాష్టారి పాట టపా వినివస్తున్నా !

కొంత comparison కి బాగుంటుందని !!...

" జగదేక రంభయే అగుగాక మగువకు అణకువే మాయని అందమమ్మా
చదువులలోన శారదయైన చెలువకు శీలమే సంస్కృతి చిహ్నమమ్మ
అల కుబేరుని పుత్రియైనను రమణికి పతిసేవయే మహాభాగ్యమమ్మ
దేవాదిదేవుని దేవియైనను స్త్రీకి త్యాగమే తారకయోగమమ్మ
భక్తి, వినయ వివేక సంపత్తి త్యాగశక్తి గల అన్నుమిన్నయే జగములోన
మగని రంజించి ప్రేమ సామ్రాజ్య సీమలేలెనో సత్యభామ భామాలలామ"

courtesy:

http://vulimirighantasala.blogspot.com/2012/03/blog-post_14.html

cheers
zilebi.

వనజవనమాలి చెప్పారు...

శ్యామలీయం గారు.. నా బ్లాగ్ కి విచ్చేసినందుకు ధన్యవాదములు.
మీరన్నట్లు సినిమా వ్యాపారమే! కానీ అది ప్రేక్షకులపై చూపే ప్రభావం చాలా ఉంటుంది. ఒక వస్తువు యొక్క నాణ్యత ప్రమాణాలు తగ్గితే..రెండో సారి ఆ వస్తువు కొనడం మానేస్తాం. సినిమా వస్తువు కాదు కదండీ.పాత్రలని ప్రవేశపెట్టి.. మనలని మనం చూసుకునే ఇమాజినేషన్. అక్కడ విలువలు మృగ్యమై తప్పుదారిని పట్టించే.. దృశ్య ప్రభావం మనసులపై బాగా ఉంటుంది. కాబట్టే కదండీ.. మనం నిత్యం చాలా అవాంచనీయ ఘటనలు చూడాల్సి వస్తుంది. ఏదైనా చిత్రీకరణ లో మార్పు రావాల్సి ఉంది.
@ ప్రవీణ్ గారు.. అశ్లీలత ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఖండించాల్సిన విషయమే కదండీ ! ఇప్పుడు ఉన్నంత తీవ్రంగా అప్పుడు లేకపోవడం వల్ల అందరి దృష్టికి రాక పోవచ్చును. విషయం తెలియజేసినందులకు ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

@ రాజీవ్..యువతరం ప్రతినిధిగా ..అలాటి సినిమాలు,సాహిత్యం నచ్చలేదని చెప్పినందుకు చాలాసంతోషం. వల్గారిటి ఇష్టపడటం,ఇష్టపడక పోవడం అన్నది వ్యక్తిగత విషయం. కానీ సినిమా మాధ్యమం " U " సర్టిఫికేట్ ఇచ్చాక .అందరు చూడదగినప్పుడు.. ఆ సినిమాకి వెళ్ళిన వాళ్లకి.. నచ్చకపోతే దియేటర్ వారికి,సినిమా తీసినవారికి నష్టం లేదు.
కావాల్సినంత అశ్లీలతని, చెత్తని మోసుకువచ్చుకునే.. వారి సంగతి ఏమిటీ?
మీ వ్యాఖ్య ఎవరిని ఇబ్బంది,బాధ పెట్టదు . మీరు చూసినది చెప్పారు. ధన్యవాదములు.


ఇంకొక విషయం మీకు అర్ధం కాలేదు. అక్కడ అమ్మాయిల భావాలని విశృంఖలంగా తెలిపి వాళ్ళు గొప్పగా మురిసిపోతున్నారు కానీ.. బాడ్ బోయ్స్ కాకుండా.. శ్రీరామ చంద్రుడు లాంటి మగవాళ్ళకి కూడా కోపం రావాలి.కూడా.. బికిని లు వేసి బీచ్ లో వదలమని అన్నందుకు. శ్రీరామచంద్రులు పనికి రారు అన్నందుకు. అందరు తొందరగా బాడ్ బోయ్స్ గా మారిపోండి . లేకపోతె అమ్మాయిలకి మీరు నచ్చరు..అని ఫలానా దర్శకుడు,నిర్మాత చెప్పారు కదా అని అనాల్సి ఉంటుందేమో!

వనజవనమాలి చెప్పారు...

రసజ్ఞ ..ఈ పాట హిట్ సాంగ్ అంట. విని చూడు. గీతామాధురి కర్ణకఠోరం గా పాడింది.

వనజవనమాలి చెప్పారు...

జిలేబి గారు.. ధన్యవాదములు మంచి పాట లింక్ ఇచ్చి.. రివర్స్ లో.. చూసుకునే వీలు కల్గించారు.
ఎప్పుడు..ఈ పురుష ప్రపంచం ..ఆడవారిని అర్ధం చేసుకునేది?

శ్యామలీయం చెప్పారు...

చెత్తసినిమాలు యెప్పుడూ ఉన్నాయి.
అలాగే చెత్త సినిమాపాటలుకూడా యెప్పుడూ ఉన్నాయి
అయితే పూర్వం వాటి శాతం చాలా తక్కువ.
ప్రస్తుతం సభ్యతగల సినిమాలూ, సినిమాపాటలూ చాలా తక్కువ.

గీతామాధురి కర్ణకఠోరంగా పాడటం విశేషం కాదు. ప్రస్తుతం దుర్భరగాత్రం గాయకుల ప్రత్యేకత అయిపోయింది. డొక్కశుధ్ధి లేని వాళ్ళు రచయితలు గానూ, స్వరజ్ఞానంకూడా సరిగాలేని వాళ్ళూ సంగీతదర్శకులుగానూ చెలామణిలోనికి వచ్చేస్తున్నారు.

ఒకప్పటి A సర్టిఫికేట్ సినిమాలకన్నా నేటి U సర్టిఫికేట్ సినిమాలే పరమ అసభ్యంగా ఉంటున్నాయి.

ఒకప్పటి సినిమాలో ప్రపంచంలో కనిపించే మనుషులకు చాలా చాలా దగ్గరగా ఉండే పాత్రలే ఉండేవి. ఈ రోజుల్లో సినిమాలలో యే పాత్రకూడా ప్రపంచంలోనించి కాక వికారబుధ్ధిలోనుంచి పుట్టిన వింతజీవులే. ఈ రోజుల్లో సినిమాలలో నాయికలు వేసుకుంటున్న చేతిరుమాలు సైజు బట్టలు పాత రోజుల్లో వాంప్ పాత్రలు వేసిన అమ్మాయిలుకూడా వేసుకోలేదు! ఇంక సినిమాల్లో వినిపిస్తున్న తెలుగుభాషను వింటుంటే ఇంకా యెందుకు బ్రతికి ఉన్నానా అని బాధవేస్తుంది!

సుభ/subha చెప్పారు...

అసలు ఐటం సాంగ్స్ లో నటించే పేరొందిన తారలకి అసలు సిగ్గే లేదు.

సిగ్గా???? అసలు వాళ్ళకి ఆ భాష ఏంటో తెలుసా అసలు? ఆ పాటల్లో డాన్స్ చేసేవాళ్ళందరూ దాదాపూ ఏ ముంబై నుంచి వచ్చిన వాళ్ళో అయ్యుంటారు..ఇంక చెప్పేదేముంటుంది?తెలుగు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారనుకోండి..కానీ ఎక్కువగా మన దర్శకులు వాళ్ళనే ఎంచుకుంటారు.
ఇంతకు ముందు ఆ పాటలు పాడే వాళ్ళలో కూడా వేరే భాష వాళ్ళే పాడితే మన తెలుగు వాళ్ళు కాదులే అని సరిపెట్టుకుంటే ఇప్పుడు తెలుగు తెలిసినవాళ్ళు కూడా మంచి జోరు మీద ఉన్నారన్నమాట.
అసలు జనాలు ఇలాంటి సినిమాలే చూస్తున్నారు అందుకు ఇలాంటివే తీస్తున్నాం అని జనాల మీద నెపం పెట్టేవాళ్ళకి ఏమి చెప్పినా వినపడదండి..

Praveen Mandangi చెప్పారు...

నాకు తెలిసి అశ్లీల గీతాలు పాడను అన్న ఏకైక గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఒక్కడే. అతను పాడకపోయినా అవకాశాల కోసం పాడడానికి సిద్ధపడే గాయకులు ఎప్పుడూ దొరుకుతారు నిర్మాతలకి.

శ్యామలీయం చెప్పారు...

ప్రవీణ్ శర్మ చెప్పినది అక్షరాలా నిజం.

అవకాశాలకోసం యెంత ఏబ్రాసి పాటైనా పాడటానికి అమ్మాయిలూ అబ్బాయిలూ రెడిగా దొరుకుతున్నారు. నిర్మాతలు అదే అవకాశంగా ఎప్పుడూ fresh singers నే ఎంచుకో గలుగుతున్నారు పైసా ఖర్చు లేకుండా.

అనేక పిచ్చిపిచ్చి పాటలు పాడెసి SPB విసుగొచ్చి విరమించు కున్నాడు అదేదో 'వృధ్దనారీ పతివ్రతా' అన్నట్లుగా.

ప్రస్తుతం - తెలుగు ఉఛ్ఛారణ దరిద్రంగా ఉండటం, గొంతు ఛండాలంగా ఉండటం, అస్సలు సిగ్గూయెగ్గూ లేకపోవటం, పరమవెకిలి అరుపులు అరవగలగటం యిలాంటివి వర్థమాన ఔత్సాహిక గాయకుల ముఖ్య అర్హతలు!

వనజవనమాలి చెప్పారు...

శ్యామలీయం గారు..మీరు,ప్రవీణ్ గారు చెప్పినవి .. మంచి విషయాలు.. నిజాలు.
వివరాణత్మకంగా .. మీరు అందించిన విషయాలకి ధన్యవాదములు.
@ సుభ గారు.. ధన్యవాదములు. ప్రతి ఒక విషయాన్నిప్రేక్షక జనం మీదకు నెట్టడం సినిమా వాళ్లకి అలవాటే కదా!

పల్లా కొండల రావు చెప్పారు...

@ వనజవనమాలి గారూ ! మంచి పోస్టు వ్రాశారు. అభినందనలు.

పూరీ జగన్నాధా! ఇంకొకడా అనేది పక్కనబెటితే ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నది ఎలా దీనిని అరికట్టాల్నా? అనేది ముఖ్యం.

సినిమా హిట్ కాగానే పూరీ లాంటి వాళ్లు ఏ మాత్రం సిగ్గు పడకుండా తామేదో ఫిలాసఫర్ల మన్నట్లు తమ జీవితానుభవాలతో ఈ పంచ్ డైలాగులు రాస్తున్నట్లు తెగ ఫోజు పెడుతున్నారు ఇంటర్వ్యూలలో .

వనజ గారు భాస్కరభట్లని బాగానే అ(క)డిగారు. పూరీ అయినా , భారతీయ సంస్కృతిని నాశనం చేసే ఇలాంటివి ప్రోత్సహించే ఏ వెధవ అయినా వాళ్ల ఇళ్లలో ఆడవాళ్లు అలా కోరిన అనుభవం తో ఇవి చేస్తున్నారా ? వీళ్లు వాళ్ల కు సంబంధించిన ఆడవాళ్లను ఇలాగే ఉండమంటారా ? స్త్రీ స్వేచ్చ అక్కడే వర్ధిల్లుతుందా ?

పూరీ స్టైల్ లో చెప్పాలంటే ... ఈ ఎదవలు గమనించాల్సిందేమిటంటే వీళ్ల ఈ బూతుల సెటైర్లతో ... హీరోయిన్లను ఇలా ఏమే , ఒసే అంటూ .. చూపే సన్నివేశాలు ఒక ఫేషన్‌ గా ఇదే స్టైల్ అనుకుని పసిపిల్లలు కూడా అనుకరిస్తున్నారు. వీళ్ల ఇంట్లో ఆడపిల్లలు బజారుకెల్లినా వాళ్లను ఇదే కామెంట్లు చేస్తారు. అపుడర్ధమవుతాదేమో కొడుకులకి ఈ డైలాగులు ఎందుకు రాశామా? అని. డబ్బు కోసం వీళ్లు ఇవన్నీ పట్టించుకోరేమో !

డబ్బు కోసం సినిమాలు తీస్తుంటే , హిట్ల కోసం నంబర్ వన్‌ స్థానాల కోసం హీరోలు ఆరాట పడుతున్నారు. మహేష్ తన సినిమాలో స్మోకింగ్ సీన్లు ఉండవనీ ఓ బుక్ చదివి జ్నానోదయమైందనీ తాను తాగననీ చెప్పాడు. బాగుంది.

మరి ఈ అశ్లీలాన్ని మహేష్ ఇంట్లో సిగరెట్ లాగానే పోల్చుకుని ఆలోచించాలి. మిగతా హీరోలకంటే కనీసం మహేష్ ను ఇందుకు అభినందించాలి. కానీ మహేష్ తో సహా హీరోలందరికీ దమ్ము , సిగ్గు ఉంటే ఈ విషయం లో పోటీ పడండి. కథలో దమ్ము ఉంటే శంకరాభరణం తో విశ్వనాధ్ గారు హిట్ కొట్టలేదా ? హీరోలూ మీలో దమ్ము పై మీకు నమ్మకం లేకనే బూతుల పైనా , వెధవ డైలాగుల పైనా , హీరోయిన్‌ ఒంపులపైనా ఆధారపడుతున్నారా?

సెన్‌సార్ సభ్యులును నోట్ల కట్టలతో కట్టేస్తున్నారు. వాళ్లు కబోధులుగా మారి కాసులకోసం కాచుకు కూర్చున్నారు. ఇందులో మహిళా సభ్యులు కూడా ఉండీ ఏమి చేస్తున్నారో వాళ్లే చెప్పాలి. ఎక్కువ మాట్లడితే బాగోదు మరి.

మనిషి అవసరాల కోసం సృష్టించిన రూపాయి మనిషిని ఇలా చేస్తున్నది. విలువ (డబ్బు) కు విలువనిస్తూ విలువలను (నైతిక విలువలను) పతనం చేస్తున్నారు. రోజులు ఎపుడూ ఇలాగే ఉండవు.

జ్యోతిర్మయి గారు చెప్పినట్లు ఈ రాతలన్నీ బ్లాగులకూ పత్రికలకూ పరిమితం కాకుండా ఏదైనా చెయ్యాల్సిన రోజు వచ్చిందేమో అన్పిస్తోంది. వనజ గారు ప్రారంభించారు . అందరం కలసి దీనిని ముందుకు తీసుకుపోవాలి . ఈ వెధవలని ఎంత తెగిడితే (మంచిభాషలోనే) అంత వెనుకకు తగ్గుతారు. అందుకు మనకు ఆయుధం బ్లాగులు ఉన్నాయి కదా! బ్లాగుల నుండి ఆరంభమయింది బజారుకెక్కి తీరుతుంది.

బాలసుబ్రహ్మణ్యం గురించి శ్యామలీయం గారి కామెట్ బాగుంది.

రాజీవ్ రాఘవ్ గారూ ! మీ కామెంట్ చాలా దుర్మార్గంగా ఉంది. నొప్పిస్తే క్షమించండి కాదు దయచేసి మీరు దానిని వెనుకకు తీసుకోండి. మీరన్నట్లు నేటి యువత అందరూ అలా లేరన్నది మాత్రం నిజం. రచయితలలో మన 'సిరి'వెన్నెల లాంటి వాళ్లు లేరు. మంచి సినిమాలూ వస్తూనే ఉన్నాయి.

వనజవనమాలి చెప్పారు...

కొండలరావు గారు..నేను ఎందుకు ఈ పొస్ట్ వ్రాసానో అది మీరు బాగా అర్ధం చేసుకున్నారు. ధన్యవాదములు.

@ నేను రాజీవ్ వ్యాఖ్యని ఖండించలేదు .ఎందుకంటే వారి వారి అభిప్రాయాలని చెప్పుకునే స్వేచ్చ ఇచ్చి..ప్రతి విషయాన్ని నెగిటివ్ గా చూసే తీరు మార్చుకుని వేరొకరి కోణంలొ పాజిటివ్ గా చూడటం కి అవకాశం ఉంటుందని భావించి..మౌనం గా ఉంటాను. మంచి విషయం కొసం,మంచి ఫలితాలు కోసం వేచిచూడాలని నా ఉద్దేశ్యం కూడాను.

నిజంగానే 'సిరివెన్నెల" గారి పాటలు ఉండటం లెదా.. ఆ ఫాటల సాహిత్యం ఇలాగే ఉంటుందా? అది గమనిచుకోవాలి.
ధన్యవాదములు.

పల్లా కొండల రావు చెప్పారు...

రాజీవ్ గారి కామెంట్ లో పల్లెటూరి వాళ్ల లో (అందరూ కాదని ముక్తాయించినా )పార్ట్ వరకూ మాత్రమే నేను తప్పు పట్టేది. మిగతా ఆయన కామెంట్ పాజిటివ్ గానే ఉంది. సాపేక్షంగా చూస్తే మాస్ లో ఉన్న సంస్కారం క్లాసులో (?) ఉండదు. మాస్ అనేది మనసుని బట్టి చూడాలి.ఆకారాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టీ కాదు. సినిమా వాళ్లు క్లాసా ? మాసా ?

పల్లా కొండల రావు చెప్పారు...

ఈ పోస్టు చూడండి. ఇలాంటి సాహిత్యం నేడూ ఉంది.
http://www.janavijayam.com/2012/03/blog-post_02.html

జలతారువెన్నెల చెప్పారు...

దర్శకుడు,పాటల రచయితలు,గాయకులు అందరూ కూడా సమాజం పట్ల ఒక social responsibility తో విలువలు లేకుండా ఉండటం మన దురద్రుష్ట్టం. వాళ్ళు కూడా అనేది ఏంటి అంటే ఎలాంటి సినెమా అయినా చూసి విజయవంతం చెసేది,audio sales పెంచేది ప్రేక్షకులే.100% audience should reject bad films.అలా కాకుండా ఈనాడు వచ్చే సినెమాలు మనం చూసినంత కాలం పాటల సాహిత్యం లో కాని, సినెమాలో మంచి విలువలున్న కథలు కాని
రావడం అసంభవం.మా అబ్బాయికి/అమ్మయికి మహేష్ బాబు ఇష్ట్టం అని, సినెమా బాలేదని తెలిసినా వెళ్ళాము అని చెప్పినవారు నాకు తెలిసినవారిలో ఎందరో ఉన్నారు.

వనజవనమాలి చెప్పారు...

కొండల రావు గారు.. మీరు ఇచ్చిన లింక్ ఆనందం కల్గించింది.ఎన్ని సార్లు విన్నా మరొకసారి విని..ఆలోచనలకి పదనుపెట్టుకోవచ్చు. ధన్యవాదములు.
సినిమా వాళ్ళు క్లాసా!మాసా?అన్నారు.వాళ్ళని మాస్ లో క్లాస్స్ (పైకి) మాస్ లోఇంకా పచ్చి మాస్.(లోపల)

@జలతారు వెన్నెల గారు.. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. ధన్యవాదములు.

Shabbu చెప్పారు...

అవును , మీరన్నట్లు ఈ మధ్య సినిమాలలో ఈ మాట ఖచ్చితంగా వినిపిస్తుంది. సినిమాలలోని పాటలను ఎంత లైట్ గా తీసుకున్నా,,,,,,,, అది కొందరిని ఇబ్బంది పెట్టేదిగా అన్పిస్తుంది. వీడియోలైతే మరి అద్వాన్నం, ఇక ఈ విషయంపై నేను ఎక్కువగా మాట్లాడదలచుకోలేదు.

శ్యామలీయం చెప్పారు...

పిచ్చితలలు వేస్తున్న సినిమా సంస్కృతిని చూసి అప్పుడప్పుడు గాభరాగా ఉంటున్నది.

ఒకసారి యేదో family functionలో ఉన్నాం. ఒక పిల్లవాడు వచ్చి నాతోటీ, మా ఆవిడతోటీ complaint చేసాడు, అతడి కంటే చిన్నవాడైన మరొక పిల్లవాడు తనని గూర్చి అన్నమాటలపైన. ఇంతకీ ఆ చిన్నపిల్లవాదు అన్నమాటలుః
.... 'వీడు చాలా ఎగస్త్రాలు చేస్తున్నాడురా! వీణ్ణి లేపెయ్యండి'...

ఈ సినిమాలు మన పసివాళ్ళని యేం చేస్తున్నాయి?
చూస్తూ చూస్తూ మనం యేం చేస్తున్నాం?

సామాన్య చెప్పారు...

వనజ గారూ పోస్ట్ చాలా బాగుంది .పొద్దుటే చదివాము ఇద్దరమూ ...మాకింకా ప్రజా సాహితీ అందనే లేదు చూద్దామంటే ...

హితైషి చెప్పారు...

నాకు శ్రీరామ చంద్రుడు లాంటి భర్తే కావాలి.ఏంటండి ఆ రచయిత అంత అసహ్యంగా రాసారు.నేను అయితే ఆ పాటని ప్లే చేయకుండా రెడ్ మార్క్ పెట్టేస్తాను. నేను డ్యూటిలో ఉండగా ఒక్కసారి కూడా ప్లే చేయను.( ఐ యాం ఏ ఆర్.జే)కానీ లిజనర్స్ చాయిస్ ఉంటే ప్లే చేయక తప్పని పరిస్థితులు.
వనజ గారు చాలా మంచి విషయాన్ని బాగా గుర్తించేటట్లు వ్రాసారు. అభినందనలు