అయ్యబాబోయి.. నిజమేనండీ! నమ్మరాదు కొంతమంది పనివారలని,మోసకారి పనివారాలని అనుకుంటూనే ఉంటానా!?
కానీ ఎప్పుడూ టపీ మని బోల్తా పడుతూనే ఉంటాను.
అసలు మా ప్రాంతంలో ఇంటి పనికి పనివారలు దొరకడం చాలా కష్టం .ఎందుకంటే.. ఆంధ్రావారికి అత్యంత ప్రియమైన పచ్చళ్ళు "విన్నాను లే ప్రియా.. కనుగొన్నానులే ప్రియా అంటూ పచ్చళ్ళ ప్రియాని వివిధభారతి వాణిజ్య ప్రకటనలు వింటూ తీరా ఆ పచ్చళ్ళ కంపెనీ ప్రక్కనే చేరాం.అక్కడ ఒక్క పని పురుగు దొరకరు. ఎందుకనగా
పాపం స్త్రీ జాతిని మూడు షిప్ట్ లల్లో.. ఏళ్ళతరబడి తాత్కాలిక సిబ్బంది పేరుతొ..అరగరుద్ది పనిచేయించుకుంటున్న
ప్రియ పచ్చళ్ళ వారు..మా ప్రాంతపు గృహిణులందరికి చాలా "అప్రియ"మైనవారు. అందుకే మా మహిళా లంతా ప్రియ పచ్చళ్ళు కొనుక్కోం. వారి కన్నా బాగా పట్టుకుని నిల్వ ఉంచుకుంటాం.
అయ్యయ్యో! విషయం సైడ్ ట్రాక్ పై వెళ్ళింది కదండీ.. అలా ఇంట్లో పని చేసేవారాలకి ఇక్కడ బోలెడంత ఇబ్బంది. అయితే ఏమిటీ మా ఇంట్లో పని మేమే చేసుకోలేమా ?అనుకుంటూ..కష్టపడి పోయి పనంతా చేసుకుని..కాస్తంత బొద్దుగా లేకుండా ఆరోగ్యంగా ఉంటారు అందుకు..ప్రియాకి బోలెడన్ని కృతజ్ఞతలు అంటాను నేను.
ఇక మాఇంట ఇంకోరకం పనివారలు.
మా ఇల్లు దుకాణం కాని దుకాణం.ఇల్లు కాని ఇల్లు.అది అంతే లెండి. ఉదయం తొమ్మిది నుండి రాత్రి ఎనిమిది వరకు దుకాణం. ఈ మధ్య సమయమంతా..కళా ఖండాలు తయారవుతాయి. అందమైన పట్టు చీరలపై అవని పై పూయని అందమైన పూవులు,లతలతో పాటు ప్రాణం పోసారా అన్నట్టు ఉండే మయూరాలు,చిలుకలు,సీతాకోక చిలుకలు.. అందమైన అమ్మాయిలూ,నాట్యకత్తెలు,అందరూ తయారవుతారు. కస్టమర్ల అభిరుచి మేరకు మంచి మంచి డిజైన్ లు తయారుచేసి ఇవ్వడం మా ఇంట పని. దాదాపు పదేళ్ళగా చేసే ఆ పనిలో ఓవందమంది పనివారలు వారి వారి నైపుణ్యం లని చూపి నాకు మాత్రం భలే అందమైన టోపీ పెట్టి వెళ్ళేవారు.
తమిళ్ సోదరసోదరీమణులు,కేరళ కుట్టీలు,కన్నడ కస్తూరిలు,బీహారి లు,లక్నోవాలాలు, బెంగాలీ బాబులు..కూడాను. ఇక ప్రింటింగ్ లు డై యింగ్లు, పేచ్ వర్క్ లు మామూలే!
ఎంతైనా నా దగ్గర పెట్టుబడికి కావలసినంత డబ్బు ఉంది కదండీ! మరి పని నైపుణ్యం లేకపోయే! అందుకని నా మంచి ముఖం (నేను అనుకోలేదండి వాళ్ళే అనేవారు)చూసి ఈ మేడం తప్పకుండా అడ్వాన్స్ ఇస్తారు అనుకునేవారంట, మేడం మేము ఇప్పుడే కదా..ఇక్కడికి వర్క్ కి వస్తా అంతకు ముందు చేసేవారికి బాకీ పడ్డాము, మీరు అడ్వాన్స్ ఇస్తే..ఆ డబ్బు అక్కడ కట్టేసి ఇక్కడికి పనికి వచ్చేస్తాం అనేవారు.
మంచి పనివారలు దొరికారు కదా అనే ఆనందంతో..నేను అడిగినంత అడ్వాన్స్ ఇవ్వడం..నా అడ్వాన్స్ డబ్బు జమ చేయకుండానే..పని చేసిన దానికన్నా ఎక్కువ తీసుకోవడం.. ఏదో ఒక నాడు.. కండ్ల నీళ్ళతో మేడం ఇండ్ల వాళ్లకి తబీద్ అచ్చా నహీ మేడం. మే క్యాకరో? మీరు పైసా ఇస్తే ఇండ్లకి వెళ్లి మల్ల వస్తం..అని సగం తెలుగు హిందీ..తమిళ్..అన్నీ కలగలిపి చెప్పి నా మైండ్ ఖరాబ్ చేసి..కొన్నాళ్ళు నాకు ఏ బాష పూర్తిగా రాకుండా యధాశక్తి సహాయం చేయడంతో పాటు భారీ నగదుకి కాళ్ళొచ్చి వాళ్ళ వెంట నడచి వెళ్లి పోయేయి.
ఏమైనా మన పనివారలు, పాపం మనం కాకుంటే ఎవరు ఇస్తారు..అనుకుని జాలి పడి అప్పటి కప్పుడు అప్పోసోప్పో జేసి.. వాళ్ళ కళ్ళనీళ్ళు తుడిచి ఏం అవదులే ..! మీ ఇండ్లవాల్లకి ఆరోగ్యం తప్పకుండా బాగుంటుంది లే కానీ ఇండ్ల వాళ్ళు అని నిజంగా రెండో..మూడో..ఇండ్లు పెట్టకు, వారందరినీ నేను సాకలేను. ఒకే ఒక ఇల్లు ముద్దు అనేదాన్ని ఏడ్వలేక..నవ్వుతూ..
పోయి వస్తం మేడమ్ అంటూ పోవడమే కానీ రావడమే లేదు.
అలా రెండు మూడు అనుభవాలు అయ్యాక కాస్త రాటుదేలాననుకున్నాను. మరి కొన్నాళ్ళకి రాయి రప్పని కానే కాను,మామూలు మనిషిని నేను అంటూ కాస్త ఉదారం ప్రవహించి నా మొబైల్ పోన్ తో పోనులు చేసుకోనివ్వడం రూం రెంట్ లు,కరంటు బిల్లులు కట్టడం అన్నీ భరించాను వాళ్ళ పిల్లలకి పీజులుకి డబ్బులు పంపడం..ఇచ్చేటప్పుడు..అప్పుగానే..లెండి.అవి రావు అని తీర్మానించుకున్నాక మాత్రం.. పేద పిల్లల చదువు సహాయార్ధం ఇచ్చిన డబ్బుకి వడ్డీలతో సహా కట్టాల్సి రావడం అన్నమాట. మరి పనివారాల పిల్లల చదువులు ఊరికే ఉందా ఏమిటీ చెప్పండి.!?
పనివారలకి..ఓ..నాలుగు రేడియోలు ఏర్పాటు చేయాలి.ఒకటి వినరండీ..భిన్నత్వంలో ఏకత్వం మాకు వద్దు.మేము రొంబ ఇష్టపదిన్ పాటల వినవలె.. మీ హిందీ గిందీ మాకు వద్దు అంటే..హిందీ వాళ్ళు తెలుగు పాటలు వినవలె అనేవారు.ఇవన్నీ వద్దు..మా బెంగాలి సినిమాలే వినాలని వాళ్ళు.. మొత్తానికి రోడ్డుపై వెళ్ళేవాళ్ళు కాస్త ఆగి మా ఇంటి వైపు ఓ..సారి అనుమానంగా చూసి..భిన్నత్వం ఏకత్వం అయి నిలిచిన మా పలురకాల శబ్దగృహమున్ గాంచి వెర్రి ఎక్కి పారిపోయేవాళ్ళు.
హే భగవాన్..అని తలుచుకుంటూ.. ఆయనకీ పెట్టిన రెండు పండ్లో,ఫలమో.. ముక్కులో పోక్కంత ఎవరికి రాదు గనుక ప్రసాద రూపేణా ఓ రెండు డజన్ల కాయలు..అందరికి పంచి పెట్టడం,గంట గంట కొకసారి ఇష్టానుసారములుగా కాఫీలు,టీలు ఇవ్వడం నాకు తీరికలేని పని. టీలు,కాఫీలు తాగారా..వాటిని శుభ్రపరుచుకోవడం నా వంతు అన్నమాట. కొందరు సంస్కారవంతులు మాత్రం వారే శుభ్రం చేసి ఒకచోట పెట్టేవారు. ఒకోసారి మా అత్తమ్మ విసుక్కునేవారు. వాళ్ళని కడిగి పెట్టమని చెప్పవే! వాళ్ళు తాగినవి మనం కడగాలా?అని.
మా ఇంట పనివారు ఉండరు కదండీ.. గొప్పగా పుట్టి పెరిగిన మాఇంట మహిళ పనివారలు తాగిన కప్పులు కడిగే స్థాయికి వచ్చినందుకు ఒకోసారి బాధ పడేవారు. ఆమెకి ఆ భాద ఎందుకని వాళ్ళు ఎప్పుడు తాగడం పూర్తి చేస్తారా.. కడిగి లోపల పెట్టాలా అన్నట్లు చూసేదాన్ని. నేనే..కడిగి పెట్టేదాన్ని. మరి ఏం చేస్తాం చెప్పండి? . రోట్లో తలపెట్టాక రోకలి పోటుకు భయపడితే..యెట్లా కుదురుతుంది చెప్పండి. పనివారలు..అతిధులు. కప్ లు కడగమని చెపుతామా?
ఈ అవమాన చర్యలకి తల ఒగ్గలేక..డిస్పోజబుల్ గ్లాస్ లు తెచ్చి పెట్టి..అందులో పోసి ఇవ్వడం చేస్తూ పాపం రోజూ ఇలా త్రాగితే..వాళ్ళ ఆరోగ్యంకి హాని కదా అనుకుని జాలి పడేదాన్ని.
ఇక బెంగాలీ బాబులు అయితే..మధ్యాహ్నం లంచ్ బాక్స్ తెచ్చుకోకుండానే ఉదయం అరగంట ఆలస్యంగా రావడం పని ముగింపు వేళ కన్నా ముందే లేవడం...అలా చేయసాగాడు.అతని పేరు..రాజ్. బెంగాలీ . ఎప్పుడూ.. ఏదో బుగ్గనపెట్టుకుని..ఏది అడిగినా తల నిలుగానో అడ్డంగానో..ఊపుతాడు తప్ప..నోరు విప్పడు.
మొదట్లో వచ్చిన కొత్తల్లో..కాఫీ ఇచ్చినా ,టీ ఇచ్చినా తీసుకుని చక్కగా థాంక్స్ మేడం అని చెప్పేవాడు. మా దగ్గర పనిచేసే అమ్మాయిలకి పెళ్లి కాలేదని చెప్పేవాడు. కానీ అతనిది లవ్ మేరేజ్. వాళ్ళ ఇంట్లో ఇతర కులస్థుల అమ్మాయి అని పెళ్ళికి ఒప్పుకోక పోతే బయటకి వచ్చేసి..ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని..మా వద్దకు వర్క్ కి వస్తే మెచ్చుకుని పని ఇచ్చాను. నలుగురు బిడ్డలకి తండ్రి అయినా మొగ పిల్లవాడు కావాలని పుత్ర వ్యామోహం. పెద్ద పిల్ల ఉదయం పూట "మదర్సా"కి బడి వేళలలో బెంగాలి బడికి వెళ్ళేంత అయింది. కానీ ఏనాడు ఇన్నేళ్ళలో లంచ్ బాక్స్ తెచ్చుకోడు. మేము పంక్షన్స్ కి వెళ్ళినా అతనికి వంట చేసి వెళ్ళాలి. తప్పదు లేకపోతే ..మన పని వాడు - ఆకలి.
పంచభక్ష్యాలు వడ్డించిన విస్తరి ముందు కూర్చున్నా వాడి ఆకలి గుర్తుకు వస్తుంది. అలా నాతొ..రోజు వంట చేయిస్తాడు అన్నమాట . అతనికి పని కూడా బాగా రాదు. కొత్త వర్క్స్ నేర్చుకోడు. వచ్చిన పనిని శ్రద్దగా చేయడు. వచ్చిన డబ్బుని రక రకాల మొబైల్ మోడల్ పోన్ కొనడానికి ఖర్చు పెడతాడు.వర్క్ చేస్తూ..వీడియో సాంగ్స్ చూస్తుంటాడు. మళ్ళీ అతనికి నేనే,,మెమరీ కార్డు లోకి సేలేక్టేడ్ సాంగ్స్ వెతికి డౌన్లోడ్ చేసి మార్చి ఇవ్వాలి. ఎప్పుడూ..బోలెడంత బాకీ నే ఉంటుంది. డబ్బు ఇవ్వకపోతే.. "మేడం.. బచ్చోంకి భూక్" అంటాడు.
భగవంతుడా !ఎందుకయ్యా ఇంత..దయార్ద్ర హృదయం ఇచ్చావు అనుకుని నేను దేవుడిని తిట్టుకుని..(లెంపలు వేసుకుంటాను లెండి) వాడికి మాత్రం..మా మేడం అంత మంచి మేడమ్ ఎక్కడా ఉండదు అనిపించుకుని.. ఆ తృప్తి అలవాటు పడిపోయాను. ఈ మధ్యే..విసుగు వచ్చి నాకు నీ పని వద్దు ఏం వద్దు పో అన్నాను . మిగతా వాళ్ళు..మీరే వద్దంటే ఎలా మేడమ్ ? పిల్లలు ఆకలి..అని జాలిగా చెపుతారు.వాళ్ళ పైసా డబ్బు జారనివ్వకుండా ఎన్నో జాలి కబుర్లు.
మా వద్ద పని మానిపించాక..నాలుగు రోజులు బయట ఎక్కడో చేసి.. వాళ్లకి నచ్చక పెట్టాబెడా సర్దేసి వెళ్లిపోయాడని చెప్పినప్పుడు కొంచెం జాలి కలిగింది కానీ నేను మాత్రం ఈ సారి పాషాణ హృదయంగా మారిపోయాను . అప్పుడప్పుడు అనుకుంటాను ..ఇన్నాళ్ళు అతనిని నేను ఎందుకు భరించాను అని.
ఇంకొంతమంది.. మన పనివాళ్ళే కదా..అని ఫ్రీగా ఉండనిస్తే.. ఇంట్లో మనతో పాటు కూర్చోంటారు.
ఒకసారి..బీహారీ..సుషీల్.. అని మంచి పనితనం.కానీ.. మాతో సమానంగా ఉండాలనుకుంటాడు. మేము భోజనం చేస్తూ..భోజనం చేయి సుషీల్ కూర్చోఅంటే ఎంతమంది అతిధులు ఉన్నా వారితో పాటే డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటాడు. మా అబ్బాయి రూమ్లోకి వెళ్లి తన బెడ్ మీద కూర్చుంటాడు. అది మా ఇంట్లోవాళ్ళకి నచ్చక అతనిని సున్నితంగా వర్క్ లేదని చెప్పి మాన్పించాల్సి వచ్చింది.
ఉదాహరణకి మా వారు ఒకటి చెప్పేవారు. యెంత బెంజ్ కారు తోలినా.. నేనే కదా తోలేది అనుకుంటాడట..డ్రైవర్ యజమాని యెంత గొప్పవాడైనా నా ప్రక్కన కూర్చోక ఏంచేస్తాడు..అన్నట్లు ఉండేది అతని ప్రవర్తన. కారు ఆగిన తర్వాత ముందు దిగి..కారు డోర్ తీసి పట్టుకునేది లగేజ్ లు లోపల పెట్టేది డ్రై వర్ యే అన్న సంగతి మర్చిపోతే..యెట్లా..అని మా వారు అంటారు.
ఏది ఏమైనా పనివారాలకి మనిషిగా విలువ ఇవ్వాలి. వారి శ్రమకి విలువ ఇవ్వాలి. కానీ వారిని మన ఇంట్లోవారిగా చూస్తే..చాలా ఇబ్బందులు,నష్టాలు ఉన్నాయి. అవి మర్చిపోకూడదు. (ఇతరుల అనుభవాలు-నా అనుభవాలు కూడా) నా స్వయం ఉపాది కల్పనలో.. ఎన్నో అనుభవాలు ఉన్నాయి. వాళ్ళు నాకు ఊతమిచ్చారో..లేదా వారిని వారి కుటుంబాలకి నేను ఊతం అయ్యానో తెలియదు కానీ నెలకి నలబై నుండి ఏబై వేల ఆదాయం కళ్ళజూచిన రోజులని నేను మర్చిపోను. ఇప్పటికి నాకు అన్ సీజన్లో కూడా ఇరవయ్యి వేలు నిలకడైన ఆదాయం ఇచ్చే వర్కర్ ల పట్ల చిన్న చూపు లేదు కానీ..
యజమానికి యజమాని అన్న అహంకారం ఎలా ఉండకూడదో..పని వారాలకి యజమాని పట్ల అంతే గౌరవభావం,పని పట్ల అంకితభావం ఉండాలి అని చెప్పడమే నా ఉద్దేశ్యం
నా ఇంట్లో ఉన్న దుకాణం కి నేను యజమానిని, వర్కర్స్ లో వర్కర్ ని కూడా. "శ్రమ యేవ జయతే"..
ఇంకా కొన్ని నష్టాలు,కష్టాలు,అవన్నీ మరొక పోస్ట్ లో.