3, మార్చి 2012, శనివారం

సలహా చెప్పండి...

మగవాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకోవాలి పోస్ట్ చూసి.. ఓ.. మిత్రుడు ఒక మెయిల్ ద్వారా  నా  సలహా కొరకు ఈ విషయం  ని  దృ ష్టికి తెచ్చారు. ఇదేమిటో చూడండి.

  సలహా చెప్పండి...

మీ బ్లాగ్ చూసి అక్కడ పోస్ట్ చేయలేక ఇక్కడ మెయిల్ చేస్తున్నా... ఈ విషయం లో మీరు ఏమి చెప్పుతారు.. నా స్నేహితుడు లాస్ట్ ఇయర్ పెళ్లి చేసుకున్నాడు.. అమ్మాయికి తల్లి తండ్రి లేరు అన్నయ ఉన్నాడు... వాళ్ళని వాళ్ళ మామ చదివించాడు.. అమ్మాయి  బాగానే చదివింది.. ఇప్పుడు పెళ్లి అయింది అబ్బాయికి అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి.. హైదరాబాద్ లో మంచి ఐ టి జాబు చేస్తున్నాడు.. పెళ్లి చేసుకొని కాపురం పెట్టాక కొన్నిరోజులకు ప్రోబ్లమ్స్ స్టార్ట్ అయినాయి.. ఆ అమ్మాయి అమెరికా  వెళ్ళాలి అని.. అంటూ ఉంటుంది. ఏదో సరదాగా అంటుంది ఏమో  లే అనుకున్నాడు.. కాని రాను రాను టార్చర్ పెరిగిపోయింది.  నన్ను మోసం చేశావు నేను అమెరికా  వెళ్ళేదాన్ని నా జీవితం నాశనం చేశావు అని స్టార్ట్ చేసింది.. అమ్మాయికి హై  లెవల్ లో బ్రతకాలి అని బాగా మైండ్ లో పిక్స్  అయిపొయింది.. ఎలా అంటే టీవీ కొందాం అని షాప్ కి వెళ్తే మాములుగా మనం ఎలా టీవీ కొంటాం..  ఏదో 20k r 30k చూస్తాం కాని తను లక్షన్నర టీవీ చూసి ఇది కొను లేకపోతె లేదు అని హోం కి తీసుకోని వచ్చింది.. ఇతను రోజు ఆఫీసు వెళ్లి సాయంత్రం వస్తాడు రాగానే రోజు ఏదో ఒకటి  అంటూనే ఉంటుంది. సరే వాళ్ళ మామ అన్నయ్య లకి  చెప్పాడు..

వాళ్ళ మాటని ఆమె  అసలు పట్టించుకోదు , ఎవడి మాట వినదు.. పండుగకి పిలిస్తే వాడి ఇంటికి పోయేది ఏమిటి అని వాళ్ళ మామనే అంటే ఇంక ఆ అమ్మాయికి  ఎవరు ఏమి చెప్పగలరు..? అబ్బాయి అమ్మా నాన్న వస్తే మన ఇంటికి ఎవరు రావద్దు మనం ఎవరి ఇంటికి వెళ్ళవద్దు అంటుంది అంట. ఈ మద్యనే పాప పుట్టింది మొదటి కాన్పుకి పుట్టింట్లో జరగటం మన ఆనవాయితి వాళ్ళ అన్నయ్య వచ్చి తీసుకోని వెళ్ళాడు ఇంక 2moths కూడా కాలేదు అనుకుంటాను ఇక్కడనుంచి తీసుకొని వెళ్ళు అని కాల్స్..

ఇతను మంచిగా ఉంటావా ? రోజుకొకలా ఇలా ప్రోబ్లమ్స్ చేయను అంటే తీసుకోని వెళతానూ  అని చెప్పాడు.. నేను నీ మీద కేసు పెడుతా అని స్టార్ట్ చేసింది .నువ్వు మీ అమ్మా నాన్న నన్ను టార్చర్ పెడుతున్నారు అని కేసు పెడుతా అని బెదిరిస్తుంది..  పాపని  నాకు ఇచ్చేసి నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పాడు..

నేను చెప్పాను ఆమెకోసం అయినా  నువ్వు అమెరికా కి  వెళ్ళు అని . అతను చెప్పాడు అక్కడ వెళ్ళినా  అలా  రెండురోజులే! మళ్ళి ఇంక ఏదో స్టార్ట్ చేస్తది అని. ఇప్పుడు ఈ అబ్బాయి పరిస్తితి ఏమిటి  ఆ అమ్మాయి మారదు ఈ అబ్బాయికి  సంతోషం లేదు ఇలా లైఫ్ లాంగ్ బ్రతకాలా! లేక విడాకులు తీసుకోని విడిపోవాలా? ?

10 వ్యాఖ్యలు:

వనజవనమాలి చెప్పారు...

ఈ జంట విషయం లో నాకు రెండు సందేహాలు ఉన్నాయి.

పెళ్ళికి ముందు.. అబ్బాయి కానీ అబ్బాయి తరపు వారు కానీ అబ్బాయి విదేశాలు వెళ్లి అక్కడ ఉద్యోగం చేసుకుంటాడు అని చెప్పి ఉన్నారా?

అమ్మాయి కూడా బాగా చదువుకుని ఉంది అంటున్నారు. బహుశా ఆ అమ్మాయికి విదేశాలలో ఉద్యోగం చేయడం లగ్జరీగా జీవితం గడపాలని ఆమె మనసులో ఉంది ఉంటే అది ఆమె కోణంలో చూస్తే తప్పు కాక పోవచ్చు. అందుకనే ఆ అమ్మాయి విదేశాలలో ఉద్యోగం చేయడానికి అర్హతలు ఉన్న ఈ అబ్బాయిని వివాహం చేసుకోవడానికి అంగీకరిచ వచ్చు. పెళ్లి అయిన తర్వాత ..విదేశాలు వెళ్ళే ఆలోచన లేకపోవడం పట్ల అసంతృప్తి పెరిగి .. అలా ప్రవర్తించ వచ్చు
ఇక రెండవ సందేహం.

అమ్మాయి కోరిక ప్రకారం విదేశాలు వెళ్ళాలన్న ఆ ప్రయత్నాలు కి

పరిస్థితులు అనుకూలం గా లేకపోయినా, లేదా అక్కడ కి వెళ్ళాక పరిస్థితులు అనుకూలంగా లేకుంటే.. అయినా మళ్ళీ స్వదేశంలో ఉద్యోగం చేసుకోక తప్పదు కదా! అది ఆ అమ్మాయికి అర్ధం కాకుండా ఉంటుందంటారా?

ఈ కాలం లో చదువుకున్న అమ్మాయిలు.. ప్రతి చిన్న విషయానికి చట్టాన్ని అడ్డు పెట్టుకోవడం చూస్తున్నాం.

ఆ అమ్మాయికి విదేశాలు వెళ్లాలని ఉంటే, విదేశాలకి వెళ్ళడం ఇష్టం లేని. ఒక వేళ కుదరని ఈ అబ్బాయితో జీవితం సరిగా సాగుతుందా?
అబ్బాయిలు ని కని.. విద్యాబుద్దులు చెప్పించి పెంచిన తల్లిదండ్రులకి ఎన్ని కష్టాలు.?

పెరిగిన చదువులు, మితిమీరిన ఆత్మ విశ్వాసాలు.. విలాసంగా బ్రతకాలనుకునే కోరికలు.. జీవితం ని ఏ వైపు నడిపిస్తాయో తెలియని తనం తో ..తమకి ఏం కావాలో నిర్ణయించుకోలేని తనంలో.. ఆడ పిల్లా .. నీ అడుగులు ఎటు వైపు?
భర్త అంటే..అతను సంపాదించే సంపాదనే కాదు. అతని సర్వస్వం,అతని కుటుంబం అంతా కూడా నాది అనే భావనలో చూడగల్గితే.. నీ వైపు నుండి నీవు మంచిగా ఉన్నట్లు లెక్క అని అమ్మాయిలకి చెప్పాలి.

రాజి చెప్పారు...

వనజ వనమాలి గారూ మీకు మైల్ లో వచ్చిన సందేహం ఇప్పటి రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యేనండీ..

మనం ఆడవాళ్ళం కాబట్టి ఆడవాళ్ళని అన్ని విషయాల్లో సపోర్ట్ చెయ్యలేము.భర్తని,అతని కుటుంబాన్ని వేధించే కొందరు ఆడవాళ్ళ ప్రవర్తన భరించలేనంతగా ఉంటుందనేది మనందరం ఒప్పుకుని తీరాల్సిందే..
మీరన్నట్లు "భర్త అంటే..అతను సంపాదించే సంపాదనే కాదు. అతని సర్వస్వం,అతని కుటుంబం అంతా కూడా నాది అనే భావనలో చూడగల్గితే.."
ఏ సమస్యా లేదు..

కోరికలు ఉండొచ్చు... కానీ వాటిని సాధించటానికి చట్టాన్ని దుర్వినియోగం చేసే ఆడవాళ్ళు ఇప్పుడు ఎక్కువగానే ఉన్నారు.
నా అభిప్రాయం ఐతే కేస్ పెడతాను అని బెదిరించి,కొర్టుకి,పొలీస్ స్టేషన్లకి భర్తని అతని కుటుంబాన్ని లాగిన తర్వాత ఏ భర్తా ఆ భార్యతో ఇంతకుముందులాగా కలిసి ఉండలేడు.
అందుకే ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయమేమిటంటే భర్త నిజంగా హింసిస్తే భరించలేక విడిపోవాలని నిర్ణయం తీసుకుంటేనే కోర్టులు,కేసుల దాకా వెళ్ళాలి.

కేసుల పేరుతొ బెదిరిస్తే కాపురం చక్కబడకపోగా బంధం ఖచ్చితంగా తెగిపోయే ప్రమాదం ఉంది.

Zilebi చెప్పారు...

లైఫ్ లాంగ్ బతక వలెను.
కాని విడాకులు తీసుకుని.

నో చీర్స్
జిలేబి.

buddha murali చెప్పారు...

వనజవనమాలి గారు ఇందులో ఒకరిని తప్పు పట్టాలనే ఉద్దేశం కాదు కానీ . పెళ్ళికి ముందే అన్ని సాష్టాంగ మాట్లదోకోవాలి. నేను తల్లి తండ్రులతో కలిసి ఉంటాని అని అబ్బాయి అమ్మాయికి ముందే చెప్పాలి . ఆ నిర్ణయానికి ఇద్దరూ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోవాలి. అలానే అమ్మాయి ఉద్దేశం అత్తమామలతో కలిసి ఉండడం ఇష్టం లేక పోయినా .. అమెరికాలో ఉండదలిచినా ఆ విషయం ముందే చెప్పాలి . అలా అంగీకరించే వారినే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి తరువాత ఇలాంటి సమస్యలు ఇద్దరి జీవితాలని నరకల ప్రాయం చేస్తాయి . ఆడయినా , మగయిన పిల్లలను బాగా చదివించడమే కాదు కుటుంబ విలువల గురించి చెప్పడం పెద్దల బాద్యత

జయ చెప్పారు...

ఆడవారు ఎందుకు పెళ్ళి చేసుకుంటారో మగవారు కూడా అందుకే పెళ్ళి చేసుకోవాలి. లాభాల పట్టిక చూడటానికి ఇదేమన్నా వ్యాపారమా? లోపాలన్నవి ఇద్దరిలోనూ ఉంటాయి. లోపం పెళ్ళిలో లేదు, మారిపోతూ వస్తున్న ఆలోచనా విధానంలో ఉంది. ఈ రోజుల్లో ఉన్న విపరీతమైన సమస్యల్లో, ఎదుటివారిలో తప్పులెంచేకన్నా, తప్పులెన్నువారు తమతప్పులెరుగరు అని ఆలోచించుకుంటే...ఏ సమస్యకైనా పరిష్కారం కనిపించకపోదు. మగవారు పెళ్ళిచేసుకోపోతే సమస్యలు ఉండవా? వాటి పరిష్కారానికి ఆలొచించరా? ఎన్నో ఇతర సమస్యల లాగే 'పెళ్ళి సమస్య' కూడా ఛేదించాలి కాని, పారిపోతారా? జీవితమంతా ఒంటరిగా గడిపే ఏ మగవారైనా ఏ సమస్యా లేకుండా ఎంతో ఆనందంగా చివరిదాకా జీవితం గడిపేస్తారని అనగలమా? ఇది నాది, నా 'స్వంతం' అనే అభిమానం, అనురాగం, అధికారం పెళ్ళితోనే స్థిరపడుతుంది. చివరిదాకా ఉండే తోడు పెళ్ళే స్థిరపరుస్తుంది. ఎక్కడికక్కడ తెంచుకుపోతే ఏ బంధంలోనూ అనుబంధం ఉండదు. ఎప్పటికైనా ఒంటరి హృదయం దెయ్యమే...జంట హృదయాలే దైవత్వాన్ని కలిగిస్తాయి. అసలైన తృప్తిని జీవితం లో చూపిస్తాయి. భవసాగరాలు ఈదటమే కదా జీవితం!

జిలేబి గారు,ఇదా మీరిచ్చే సలహా!!!

వనజవనమాలి చెప్పారు...

జయ గారు.. మీ అభిప్రాయం బాగుంది.
కానీ ఈ పోస్ట్ లో అతిగా ప్రవర్తించే అమ్మాయితో..అబ్బాయి విసిగిపోతున్నాప్పుడు..వారి మధ్య సయోధ్య సాధ్యం అంటారా!? ఆ అమ్మాయికి ముందు మంచి కౌన్సిలింగ్ కావాలి. భర్త తల్లిదండ్రులే వద్దన్న అమ్మాయి రేపు భర్తని బిడ్డని కాదని అనగలదు.అందుకేనేమో..జిలేబి గారు అలా సలహా చెప్పారు. అనిపించింది. మీ అభిప్రాయానికి,స్పందనకి ధన్యవాదములు.
మీ అభిప్రాయం బాగుంది మురళీ గారు. నిజంగానే అన్ని ఒప్పందాలు జరిగే పెళ్లి చేసుకోవాలేమో! పెద్దలు నేర్పలేని విలువలకు.. యువత జీవితాలు విచ్చిన్నం. కదండీ! ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

రాజీ.. మీ అభిప్రాయమే..నా అభిప్రాయం కూడా.
బెదిరింపులు ,కేసులు,కోర్ట్లు..వైవాహిక బంధాన్ని విచ్చిన్నం చేస్తాయి. అమ్మాయిల ఆలోచనా ధోరణి లో..కొన్ని వైపరీత్యాలు ఇవి. ఏమిటో..ఆడవాళ్ళు ఆలోచనలు మంచికి పోటీ పడాలి కానీ.. చెడు వైపు పరుగులు పెడుతుంది

@జిలేబీ.. జీవితం ముఖ్యం కదా.. సెప్టిక్ అయితే.. ఇంజెక్షన్ ఇస్తాం. దానికి నయం కాకపొతే.. ఆ భాగం నే తొలగిస్తామంటారు డాక్టర్లు. జీవితంలో పెళ్లి ఓ..భాగం కాబట్టి..జీవితం అంతా పాడవకుండా.. తొలగించుకోవడమే..మార్గం కదా. .మీరు చెప్పింది ..ఈ కోణం లో నూటికినూరు శాతం కరక్టూ!!! చీర్స్.. జిలేబీ!!!!

జయ చెప్పారు...

నేనన్నది కూడా కౌన్సిలింగ్ గురించేనండి. పిల్లలంటు ఉన్న తరువాత వారి భవిష్యత్ కోసం తప్పదు. మనం కోరుకున్నంత ఆధునికత్వం ఇంకా రాలేదు.ఈ సమస్య ఇద్దరికీ సంబంధించిందే. విడాకులు తీసుకుంటే ఈ సమస్య తీరిపోతుందనే అనుకోవాలా? ఇలాంటి సమస్యలకు ఓపిక చాలా ముఖ్యం. ఆ అమ్మాయికి ఎన్నో విధాల నచ్చచెప్పి మార్పు తేవటానికి చాలా సమయమే పట్టవచ్చు. ఇదే సమస్య మగవారినుంచి ఆడవారికి కూడా రావచ్చు. అప్పుడు ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది. ఏదైనా వద్దనుకోటం ఎంతసేపండి. నిలబెట్టుకోటంలోనే ఉంది అన్నది నా అభిప్రాయం.

Pavani చెప్పారు...

....ఇదిగో సరిగ్గా ఇలాంటి కథలే మేమిక్కడ మా కమ్యూనిటీ లో ప్రతి ఆరు నెలల ఒకసారి వింటుంటాం. నమ్మూ నమ్మక పోండి...కొత్తల్లో అందరం అబ్బాయల్నే ఆడిపోసుకునే వాళ్ళం. నాజూగ్గా express చెయ్యలేకపోవటం, చిటుకు చిటుకున ఏడవలేకపోవటం వాళ్ళకి శాపమై కూర్చుంది. ఆ విషయం కాస్త అర్ధమయ్యాకా తరిచి చూస్తే దాదాపు ప్రతి విషయంలో పెద్ద తప్పు అమ్మాయిది వాళ్ళని మూర్ఖంగా వెనకేసుకొచ్చే ఆమే తల్లితండ్రులదే అయ్యేది. ఇప్పుడు ఇలాంటి కేసేదైనా వినిపిస్తే అందరి అభిప్రాయం ఇంచుమించు ఒకటే. పాపం మొగవాళ్ళు.
పిల్లలకి మరీ ముఖ్యంగా ఆడ పిల్లలకి ఇండియాలో పెరిగితే మన సంప్రదాయాలు గట్రా తెలుస్తాయని, కాస్త పెద్ద పిల్లలు (8 and above) ఉన్నవాళ్ళు తితిగి వెళదాం అని అనుకోవటం పరిపాటి. కానీ ఇలాంటి సంఘటనలు, అక్కడి వాళ్ళు culture, tradition లాంటి వాటికైతే ఇక్కడికి రావొద్దు అని చెప్పే మాటలు , వెళ్ళి అక్కడి నిజాల్ని తట్టుకోలేక తిరిగొచ్చిన వాళ్ళని చూసి చాలా మంది వెనక్కి వెళ్ళాలనే ఆలోచన మానుకున్నారు. మాతో సహా. Courtesy to feminists and media. They did to Indian family system what OBL did to freedom and free speech in US.

Jai Gottimukkala చెప్పారు...

వనజ గారూ, ఈ సమస్యకు రెండు మూలాలున్నాయని నాకు తోస్తుంది.

అబ్బాయిలకు అమ్మాయలకు ఇరు వైపు పెద్దలకే కాదు, యావత్ (95%) మధ్య తరగతి ప్రజలకు "అమెరికా పిచ్చి" సోకడం ఒక ఎత్తు. అమెరికా ఒక స్వర్గమనీ అక్కడ ఉన్న మనవారంతా ఇంద్రభోగాలు అనుభవిస్తున్నారనీ అపోహ పడుతున్నవారు ప్రతీ చోటా ఉన్నారు. "వదినా మీవాడికి లోపం ఏమిటి, అమెరికాకు వెళ్ళకుండా ఇక్కడే ఉన్నాడు" అంటూ అమ్మలక్కలు మాట్లుకోవడం పరిపాటి అయిపొయింది. అమెరికాలోని వాస్తవ పరిస్తుతులు (ఉ. ఒంటరితనం, కారు లేకపోతె ఏమీ చేయలేకపోవడం etc.) గురించి సరయిన అవగాహన ఉండదు. అమెరికాలో ఎలా ఉండాలో వాటికి కావలసిన మెలుకువలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు.

సమస్యకు రెండో కోణం మన సమాజంలో పాతుకుపోయిన "జనకాదిపత్యం". ఇది పురుషాధిపత్యానికి ఒక రూపం కావచ్చు. తండ్రి మాటలు ఒప్పుకోలేక ఒకవైపు ఎదిరించలేక మరోవైపు పిల్లలు సతమైతమవుతారు. దానికితోడు పెళ్ళిచూపులకు వివాహానికి మధ్య వ్యవధి లేకపోవడం, అన్ని తంతులూ హడావుడిగా జరగడం లాంటివి జరుగుతాయి.