ఛీ ఛీ .. ఏం మనుషులో ...? మరీ ప్రేమ కి మొహం కి కామం కి తేడా తెలియకుండా బ్రతుకుతున్నారు
అని తిట్టు కుంటున్నాను . అంతలోనే ఊడి పడింది నా స్నేహితురాలు రమ .
ఏమిటి అన్ని ఛీ లు .. చీత్కారాలు ? రోజూ అలాంటివి మాములేగా! అంది
రోజూ ఏమిటి ?
అదే న్యూస్ పేపర్ లో విషయాలు .అంది
న్యూస్ పేపర్ పేరెత్తకు ..నాకు చిరాకు అన్నాను . మరి నీ చిరాకు ఎవరి మీదమ్మా ?
ఎవరి మీద కాదు తల్లీ .. కవిత్వం మీద అన్నాను
కవిత్వానికి ఏమైంది మీ బ్లాగులలో, పేస్ బుక్ లలో బాగానే వర్ధిల్లుతుంది కదా ! అంది .
అందుకే .. నా ఛీ చీలు చీత్కారాలు అని చెప్పాను
ఎందుకో ? మళ్ళీ ప్రశ్న
కవిత్వమా కాకరకాయా ? జనం పైత్యం అంతా వెళ్ళగ్రక్కుతున్నారు నాతొ సహా అన్నాను నాకు కూడా నా మీద కోపమే ! అసలు కవిత్వం రాయకపోతే ఏమిటి నష్టం ? అనుకుంటున్నాను చెప్పాను
నీకు ఏమిటో అయింది ఆత్మానందస్వామి ఆవహించాడు అంది అనుమానంగా నన్ను చూస్తూ
కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అనుకుంటూ కాస్త ఆ కళ అబ్బిన వారిని అందులో జీవం నింపగల్గిన వారిని ప్రోత్సహిస్తే పొయ్యేది ఏముందిలే .. కాస్త కీ బోర్డ్ అరగడం తప్ప అని అనుకుంటాను
మంచి కవిత్వం చదివినప్పుడు మాటలురాక స్పందన తెలుప మాటలు రాక మౌనంగా ఉండిపోతాను .ఇంకాస్త మంచి కవిత్వం చదివినప్పుడు మరణం అంటూ లేకుండా కవిత్వం చదువుతూనే ఉండాలనుకుంటాను ఇది నా పైత్యం
అలాంటిది నాకు విరక్తి కల్గుతుంది చెప్పాను ఏడుపు ముఖం తో ..
ప్రసూతి వైరాగ్యం లాగా నీకు కవిత్వ వైరాగ్యం బాగానే పట్టుకుందే!? అంది
కవిత్వం కి వస్తువు , అభివ్యక్తం, భాష ,శైలి, రూపం ఇవన్నీ లక్షణాలు
భావ సంపత్తిలో మునిగి తేలిపోతూ అందులో మమేక మయ్యేవాడే కవి
తనలో కలిగే రసానుభూతికి జీవితానుభూతిని అనుభవాన్ని కూడా జత పరచి కవిత్వం వ్రాస్తే దానికి అందం చందం విశ్వతోముఖత్వం అయిన కవిత్వం ని ఆస్వాదించగల్గి నప్పుడే దానికి విలువ పెరుగుతుంది
ఆస్వాదన లేకుండా అసహ్యం కల్గె కవిత్వం వ్రాయడం ఎంత వరకు సమంజసం ? కమిట్మెంట్ ఉండాలి
అలా కాకుండా మనలో కల్గిన వికారాలన్నిటి కి కవిత్వమని పేరు పెట్టి వక్రీకరించి వాంతి కల్గించకూడదు
ఏదైనా గుప్పిట మూసి ఉంచితేనే అందం. కావ్యాలలో ఉన్న అందం ఇప్పటి కవిత్వంకి రాదు లవ్ కి లస్ట్ కి తేడా తెలియని భావ ప్రకటన ని చీత్కరించుకుంటున్నాను అందుకే .. అన్నాను
నీకు చీత్కారం అయితే ఇంకొకరికి ఆనందం కావచ్చు . అలా వ్రాసి మమేకం అయ్యే వాళ్ళ సృష్టిని మార్చలేం నీ దృష్టి నే మార్చుకో తల్లీ నీకసలే ఆవేశం ఎక్కువ . ఇప్పుడు వాళ్ళు నీ కళ్ళ ముందు ఉంటే పొడిచి చంపేసే టట్లు ఉన్నావు కాస్త శాంతించు అని అనునయంగా చెప్పింది
ఒక చల్లని నీళ్ళ బాటిల్ తెచ్చి నా ముందు పెట్టింది గట గట త్రాగేసి కాస్త శాంతపడ్డాను
మన రాతలే, ఇంకా చెప్పాలంటే మన మాటలే మనకి విలువ తెచ్చి పెడతాయి. గుండెల్లో దైర్యం ఉంది కదా అని బట్టలు విప్పేసుకుని తిరగరు. మనసైన వాడి పై మనసు ఉంది కదా అని అనువుకాని చోట విప్పేసుకోకూడదు. మోహం ఉంది కదా అని మోహమాట పడకుండా పచ్చిగా వ్యక్తీకరించ తగదు
అమ్మని అయి ఉంటె నాలుగు పీకేదాన్ని, గురువు ని అయి ఉంటే మంచిమాటలతో తప్పు తెలియజేసి ఉండేదాన్ని
చెలిని అయ్యి ఉంటె మంద లించే దాన్ని. ఏమి కానందుకు బాధపడుతున్నాను చెప్పాను విచారంగా
"లోకంలో మంచి చెడు అన్నీ నీకే కావాలి .. నువ్వు మారవు" అంది రమ
అవును నాకే కావాలి కనీసం ఒక మనిషి అయినా మారాలి. ఆ మార్పుని నేను నా కళ్ళారా చూడాలి అది నా కోరిక .. అని చెప్పాను
ఇంకా ఏమి లేవా .అని అడిగింది
ఎందుకు లేవు ఇలా వ్రాసినందుకు కొందరికి కడుపు మంట ఖాయం . నా మీద దండయాత్ర చేసినా ఆశ్చర్యపోను అన్నాను .
ఈ మద్య పేస్ బుక్ లో ఎవరో బాదపెట్టారు అన్నావు జాగ్రత్త ! అని చెప్పింది
నేను ఊరుకుంటానా? అప్పుడు నాకు తివిక్రమ్ శ్రీనివాస్ గుర్తొచ్చాడు అన్నాను
ఆయనెందుకు మధ్యలో అంది
చెప్తా విను .. అని
ఇలా చెప్పాను నన్ను బాధపెట్టినవారికి
"బోల్డ్ గా ఉన్నానని కేరెక్టర్ లూస్ అనుకోకు .. నా జోలికి వస్తే తోక్కిపడేస్తాను , జాగ్రత్త " అని
వామ్మో ! నీ జోలికి నేను రాను అంది భయంగా రమ
నవ్వేసాను హాయిగా ...
(నేను మాత్రం ఎవరి జోలికి రాలేదండొయ్ ! కవిత్వం అన్నది భ్రష్టు పట్టడం చూసి కుమిలి కుమిలి కునారిల్లిపోతూ ఏదో ఇలా వ్రాసుకున్నాను .అంతే నండీ అంతే !!)
వ్రాయలేకుండా ఉండటం ఒక వ్యసనం కదా ! మంచిదో -చెడ్డదో!?
మన్నించుమా .. పాట అప్రయత్నంగా గుర్తుకు వచ్చింది ఈ మేటర్ కి ఆ పాట కి ఏదో లింక్ ఉందని నా మనసు చెపుతుంది మరి ఆ రెండు హృదయాలకి అర్ధమైతే చాలును .