2, ఆగస్టు 2011, మంగళవారం

1, ఆగస్టు 2011, సోమవారం

ఆడవారికి మాత్రమే ప్రత్యేకం..

గత కొన్ని రోజుల క్రితం  మహిళలు  వస్త్రధారణ పై తమకి స్వేచ్చ ఉండాలని..పురుషుల అణచివేతని సహించ జాలమని ...  మగువలకి  ఇష్టమైన రీతిలో.. వస్ర ధారణ చేసుకుని మరీ ప్రదర్శనలు చేసారు.అప్పుడే నాకు మన సంప్రదాయ మైన చీర గుర్తుకు వచ్చింది.ఈ పాటా గుర్తుకు వచ్చింది    . . 



చీరలోని గొప్పదనం తెలుసుకో..ఆ చీర కట్టి ఆడ తనం పెంచుకో.. చంద్రబోస్ గారు చీర గొప్పదనాన్ని పదాలలో..చెపితే..  కీరవాణి గారు స్వీయ స్వర కల్పనలో..పాడి అంత గోప్పభావం ని..పెంచే భావం.. కల్గించారు.ఈ చిత్రానికి..చంద్రబోస్ భార్య సుచిత్ర చంద్ర బోస్..దర్శ కత్వం.. వహించారు. రాఘవేంద్ర రావు గారి పర్యవేక్షణ లో.. వారి మార్కు చిత్రమే ఇది. 

పల్లకిలో పెళ్లి కూతురు ..లో..చీర పాట  మాత్రమే..వింటూ..మన  దక్షిణాది తారా మణులు కట్టిన చీర్లని చూడండి.  సోదరి మణుల్  ల్లారా!  ..ఆ చీరల అందాలు చూసి సొంతం చేసుకోవాలని షాపింగ్ కి వెళ్లి.. పర్సు బరువు దించుకుని.. ఆనక తిట్లు,మందలింపులు, ఏడుపులు,చీదుళ్ళు..వగైరాల  తర్వాత నన్ను తిట్టుకోకండి.

ఒక టాప్ సీక్రెట్ ఏమిటంటే.. కంజీవరం, ఉప్పాడ చీరలు..  ఖరీదైనవి.  ఎంబ్రాయిడరీ శారీస్ ... యాక్ ఇప్పుడు..అవుట్ అఫ్ ప్యాషన్.

పోలకం బుటీస్ శారీస్..(జార్జెట్) ప్యాషన్.తేలికైనవి,మన్నికైనవి. వయసుని..అయిదారేళ్ళు తగ్గించి,మంచి లుక్ తో..ఉండే శారీస్.. ఖరీదు ఎక్కువే.. వీడియోలో..మొదట వచ్చే చీర..టైపు..అన్న మాట.అలాటి చీరని కొనుక్కోండి. సరేనా !! 

పనిలో పనిగా.. చీర కట్టు ఫై నాకున్న గౌరవం ..అలాగే..చీర..విలువ తెలియని వారి కోసం నేను వ్రాసిన కవిత .. (అవార్డ్ కవిత ) ఈ లింక్ లో..చూడండి.  వనజవనమాలి: దేహాన్ని కప్పండి!!.                 

ఈ పోస్ట్ ఆడవారికి మాత్రమే ప్రత్యేకం. అఫ్కోర్స్ .. పురుషులకి కూడా.. అనుకోండి. 
     

ఈ క్షణం నీది




లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ...అంటూంటారు కదా!

అప్పుడెప్పుడో..  నాకు  బాగా నచ్చి  వ్రాసుకున్న రెండు కొటేషన్స్ గుర్తుకు  వచ్చాయి.

ఆ రెండు కొటేషన్స్ ..ఇవీ ..

ఈ జీవితం ఎంతో విలువైనది.
నీ  కంటూ  ఒక లక్ష్యం ఉండాలి .
ఆ లక్ష్యం కోసం అహర్నిశలు శ్రమించాలి.
లక్ష్యం చేరుకోవాలి ... స్వామీ శంకరానంద.

ఈ అనంత  విశ్వంలో..
ఆది -అంతం ఏమి లేదు
అందుకే ఈ క్షణం నీది.
ఆ క్షణాన్ని సంపూర్తిగా అనుభవించు... ఓషో  

లక్ష్యం కోసం శ్రమించాలా ? 
లేక....
క్షణాల సముదాయం
అయిన జీవితాన్ని ఆస్వాదిస్తూ..బ్రతకాలా? 

రెండూ  పరస్పర భిన్నఅభిప్రాయాలని చెపుతున్నాయి. 
రెండిటిని.. సమన్వయం చేసుకుని..లైఫ్ ఈస్ బ్యూటిఫుల్  లా.. బ్రతకడంలో అర్ధం వుంది  కదా అనుకున్నాను. 

అప్పుడు అస్ఫష్టమైన ఆలోచనలతో.. ఇలా వ్రాసుకున్నాను.  ఏ మార్పు లేకుండా యదాతధంగా యిదిగో...యి లా..   

సముద్రమా ! నీ లోతెంత   అని అడిగితే ..
గాయపడిన హృదయమంత అని..

కారు మేఘమా..నీకంత    నలుపేల  ..అని అడిగితే..
మనసులో ముసిరిన చీకట్లు నుండి అరువు తెచ్చుకున్నాను  ..అని..

సెలయేటి గల గలలుని.. నీకెందుకింత చైతన్య మనిన 
బండ రాళ్ళని అరగదీస్తూ..పరుగులిడుతున్నందుకు ..అని.. 

నిశ్చల సంద్రాన్ని అంత ప్రశాంతత యేల   సాధ్యమని.అడుగగా .
బడబాగ్నులని దాచుకున్నందుకు.. అని.. 

కురిసి కురవని శ్రావణ మేఘాల్నిఅడిగా. ఎందుకింత అలక అని..
కొనకంటి  కన్నీటి చుక్కని చూసి..వేదన చెంది..అని.. 

ప్రకృతిలో ధర్మాలన్నీ.. మనలోనూ  వుంటాయి..

వాటి లోతుల్నిఅనుపానులని తెలుసుకుని..ఆనందం గా జీవించడమే జీవితంలో అందమని.. ఆనందమని..అందులోనే.. సంపూర్ణం  చెందటం అని..

ఇచ్చిన దానితో సంతృప్తి చెందడం నేర్చుకోవాలి కానీ అనుకున్నవన్నీ జరగడం యెలా కుదురుతుందీ. అని

..